సరికొత్త కనిష్టానికి పతనం
4 పైసలు క్షీణించి 85.15 వద్ద క్లోజ్
ముంబై: రూపాయి విలువ రెండో రోజూ జీవితకాల కనిష్టాన్ని తాకింది. డాలర్ మారకంలో 4 పైసలు బలహీనపడి 85.15 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో నెలకొన్న స్తబ్దత, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడటం మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 85.10 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 10 పైసలు పతనమై 85.21 వద్ద సరికొత్త జీవితకాల కనిష్టాన్ని తాకింది.
‘‘నెలాఖరు, సంవత్సరాంతం కావడంతో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఎగసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత భారీ సుంకాలు విధించవచ్చనే భయాలూ నెలకొన్నాయి. మరోవైపు ఫెడ్ కఠిన పాలసీ అంచనాలు, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి’ అని మిరే అసెట్స్ విశ్లేషకుడు అనుజ్ చౌదరి తెలిపారు. కాగా, ట్రంప్ విజయం తర్వాత నుంచి డాలరుతో రూపాయి విలువ 104 పైసలు క్షీణించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment