doller
-
డాలర్లు దండిగా.. కొరతలోనూ చింత లేని బంగ్లాదేశ్!
దేశంలోని బ్యాంకుల్లో నగదు కొరత ఉన్నప్పటికీ బంగ్లాదేశ్‌కు డాలర్ కొరత ఏర్పడలేదు. మనీలాండరింగ్‌ను అరికట్టడం, అవినీతిని తగ్గించడం ద్వారా ఇంటర్‌బ్యాంక్ మార్కెట్లో డాలర్ల సరఫరా గణనీయంగా పెరిగింది.బంగ్లాదేశ్ బ్యాంక్ గత రెండు నెలల్లో 1.5 బిలియన్ డాలర్ల విదేశీ బకాయిలను చెల్లించగలిగింది. అది కూడా తన డాలర్ నిల్వలు ఏ మాత్రం తరిగిపోకుండా. విదేశీ బకాయిల చెల్లింపుల కోసం బంగ్లాదేశ్ బ్యాంక్ ఇంటర్‌బ్యాంక్ మార్కెట్ నుండి డాలర్లను సమీకరించింది.దేశంలో బ్యాంకులు గతంలో డాలర్ కొరతతో ఇబ్బంది పడ్డాయని, అయితే ఇప్పుడు చాలా వరకు డాలర్లు మిగులుతో ఉన్నాయని బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ అహ్సన్ హెచ్ మన్సూర్ వివరించారు. నగదు కొరత ఉన్నప్పటికీ, డాలర్ల సరఫరా మాత్రం స్థిరంగా ఉందని వివరించారు.డాలర్ల నిల్వ ఇలా..ప్రవాసులు ప్రాథమికంగా బ్యాంకులకు డాలర్లలో చెల్లింపులను పంపుతారు. దీంతో పాటు ఎగుమతి ఆదాయాలు కూడా డాలర్లలో జమవుతాయి. దీంతో బ్యాంకుల్లో డాలర్ నిల్వలు పెరుగుతున్నాయి. వీటిపై బ్యాంకులు లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (LC)ని తెరుస్తాయి. లేదా అవసరమైనప్పుడు డాలర్లను బంగ్లాదేశ్ బ్యాంక్‌కి విక్రయిస్తాయి. సెంట్రల్ బ్యాంక్ ఈ డాలర్లను కొనుగోలు చేసి తన నిల్వలకు జోడిస్తుంది. -
ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్10 కరెన్సీలు ఇవే..
కరెన్సీ విలువ దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తోంది. దాని విలువ పెరుగుతున్న కొద్దీ దేశం బలమైన ఆర్థికశక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. విలువతోపాటు వాణిజ్యానికి అనువైన కరెన్సీ చలామణిలో ఉంటే ఆ దేశపురోగతే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని 180 కరెన్సీలను అధికారికంగా గుర్తించింది. ఆయా దేశాల ఎగుమతులు, దిగుమతులు, ఫారెక్స్ రిజర్వ్‌లు, బంగారు నిల్వలు, రోజువారీ వాణిజ్యం ఆధారంగా నిత్యం కరెన్సీ విలువ మారుతోంది. తాజాగా ప్రపంచంలోనే అధిక విలువైన కరెన్సీ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. అత్యంత విలువైన కరెన్సీ అనగానే యూఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో వంటివి మన మదిలో మెదులుతాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్ విలువ రూ.270.23కు చేరింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం వల్లే కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోందని తెలిసింది. విలువైన కరెన్సీలు.. రూపాయిల్లో.. 1. కువైట్ దినార్: రూ.270.23 2. బహ్రెయిన్ దినార్ రూ.220.4 3. ఒమానీ రియాల్ రూ.215.84 4. జోర్డానియన్ దినార్ రూ.117.10 5. జిబ్రాల్టర్ పౌండ్ రూ.105.52 6. బ్రిటిష్ పౌండ్ రూ.105.54 7. కేమ్యాన్ ఐలాండ్ పౌండ్ రూ.99.76 8. స్విస్ ఫ్రాంక్ రూ.97.54 9. యూరో రూ.90.80 10. యూఎస్ డాలర్ రూ.83.10 ఇదీ చదవండి: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా! అమెరికా డాలర్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా యూఎస్ డాలర్లలో అత్యంత విస్తృతంగా వాణిజ్యం జరుగుతోంది. -
మన రూ.100కు ఏ దేశంలో ఎంత విలువ?
ప్రపంచంలోని ప్రతీదేశానికి సొంత కరెన్సీ ఉంది. దానికి విలువ ఉండటంతో పాటు, ఇతర దేశాలలోనూ తగినంత గుర్తింపు ఉంటుంది. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా డాలర్‌ను పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ చెల్లింపులు అత్యధికంగా డాలర్లలోనే జరుగుతుంటాయి. ఇక భారత కరెన్సీ విషయానికొస్తే దీని విలువ కొన్ని దేశాల్లో తక్కువగానూ, కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగానూ ఉంటుంది. భారత కరెన్సీ విలువ స్థానిక కరెన్సీ కంటే చాలా రెట్లు అధికంగా ఉన్న దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. దీనితో ప్రయోజనం ఏమిటంటే, భారతీయులు ఆయా దేశాలను సందర్శించడానికి వెళితే తక్కువ డబ్బుతో ఎంజాయ్ చేయవచ్చు. భారతదేశ కరెన్సీ ప్రపంచంలో 38వ స్థానంలో ఉంది. ప్రజాదరణపరంగా ఇది నాల్గవ స్థానంలో ఉంది. వియత్నాం చాలా అందమైన దేశంగా పేరొందింది. భారతీయులు వియత్నాం సందర్శించాలనుకుంటే, తక్కువ డబ్బుతోనే ఎంజాయ్ చేయవచ్చు. వియత్నాంలో భారతీయ కరెన్సీ రూ.100 విలువ 31,765 వియత్నామీస్ డాంగ్. నేపాల్లోనూ భారత కరెన్సీ విలువ ఎక్కువే. నేపాల్‌లో భారత రూ. 100.. 159 నేపాల్ రూపాయలకు సమానం. శ్రీలంకలో మన 100 రూపాయల విలువ 277 రూపాయలు. దీని ప్రకారం చూస్తే శ్రీలంక, నేపాల్‌లను సందర్శించడం భారతీయులకు అత్యంత చౌకైనది. ఇండోనేషియా స్థానిక సాంస్కృతిక వారసత్వం, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇండోనేషియాను సందర్శించాలనుకునే భారతీయులు తమ జేబుపై అధిక భారం పడకుండా ఆ దేశాన్ని సందర్శించవచ్చు. పాకిస్తాన్లో కూడా భారత కరెన్సీ విలువ అధికంగానే ఉంది. పాకిస్తాన్లో భారత రూ.100 విలువ రూ.210గా ఉంది. -
పెరుగుతున్న రూపాయి మారక విలువ.. కారణం ఇదేనా..
ఇటీవల రూపాయి విలువ జీవన కాల కనిష్ఠానికి చేరింది. గతవారం స్టాక్‌మార్కెట్లు పుంజుకుంటున్న నేపథ్యంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మెరుగవుతుంది. విదేశాల నుంచి మూలధన పెట్టుబడులు దేశీయ మార్కెట్లోకి రావడం, అంతర్జాతీయంగా అమెరికన్ కరెన్సీ బలాన్ని కోల్పోవడం ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. అన్నిటికంటే మించి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం సెంటిమెంటును పుంజుకునేలా చేశాయని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపించడంతో రూపాయికి బలం చేకూరిందని ఫారెక్స్ ట్రేడర్లు అంటున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం భారీగా కోలుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన రికార్డుస్థాయి లాభాలు, విదేశీ మదుపరుల నుంచి కొనసాగుతున్న పెట్టుబడులు, ఇతరత్రా ఫారిన్ ఫండ్స్‌తో ఫారెక్స్ మార్కెట్లో రూపీ ఆకర్షణీయంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక్కరోజే ఏకంగా 27 పైసలు ఎగిసి 83.03 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లలో సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు.. రూపీ సెంటిమెంట్‌ను బలపర్చాయని ఫారెక్స్ డీలర్లు చెప్తున్నారు. కాగా, శుక్రవారం ఉదయం ఆరంభంలో 83.30 వద్ద మొదలైన రూపాయి మారకం విలువ.. ఒక దశలో 83.32 స్థాయికి నష్టపోయింది. అలాగే మరొక దశలో 82.94 స్థాయికి పుంజుకుంది. ఈ క్రమంలోనే చివరకు 83.03 వద్ద నిలిచింది. ఇక ఈ వారం మొత్తంగా రూపీ 37 పైసలు పుంజుకుంది. అమెరికా డాలర్ ఇండెక్స్ క్రితం ముగింపుతో పోల్చితే దాదాపు స్థిరంగా 101.01 వద్దే ఉంది. వచ్చే ఏడాది వడ్డీరేట్లను తగ్గిస్తామంటూ ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఫెడ్ రిజర్వ్ ఇచ్చిన సంకేతాలు.. గురువారం పదేళ్ల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ను 4 శాతం దిగువకు కుంగాయి. ఇదీ చదవండి: ఏజెంట్లకు భారీగా గ్రాట్యుటీ పెంచిన ఎల్ఐసీ.. ఎంతంటే.. -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాల తర్వాత లాభాల్లో దేశీయ మార్కెట్లు
వరుస నష్టాల తర్వాత దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 634 పాయింట్లు లాభపడి 63782 వద్దకు చేరింది. నిఫ్టీ 190 పాయింట్లు ర్యాలీ అయి 19047 వద్ద స్థిరపడింది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మరకపు విలువ రూ.83.234కు చేరింది. సెన్సెక్స్ 30లోని యాక్సిక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, విప్రో, భారతీ ఎయిర్టెల్ భారీగా లాభపడ్డాయి. ఆల్ట్రాటెక్ సెమెంట్, ఐటీసీలు స్పల్ప నష్టాలతో ట్రేడయ్యాయి. దేశీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో భారత రూపాయి శుక్రవారం స్వల్పంగా 2 పైసలు పెరిగింది. డాలర్ బలపడడం, ముడి చమురు ధరలు పెరగడం వంటివి రూపాయిపై స్వల్ప ప్రతికూల ప్రభావాన్ని కలిగించాయి. విదేశీ సంస్థగత పెట్టుబడుల తరలింపు, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం కూడా రూపాయిపై ఒత్తిడిని కలిగించాయి. సిరియాలో యూఎస్ మిలిటరీ, ఇరాన్‌లమధ్య అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో రానున్నరోజుల్లో రూపాయి కొంత దిగువ స్థాయుల్లోకి వెళ్లనుందనే అంచనాలు ఉన్నాయి. -
రూపాయి పతనానికి కారణాలు ఇవేనా..?
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 83.2625 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా మాట్లాడుతూ..ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయన్నారు. రూపాయి మారకపు విలువ కనిష్ఠస్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊటరనిచ్చే అంశం. ఎక్స్ఛేంజీ మార్కెట్లో అమెరికా కరెన్సీని విక్రయించి రూపాయికి మద్దతును పలకవచ్చు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ప్రస్తుతం 83.2625 వద్ద ట్రేడవుతుంది. రూపాయి ధర 83.25కు చేరగానే ఆర్బీఐ జోక్యం చేసుకుని.. అంతకు దిగజారకుండా చర్యలు తీసుకుంటుందని అంచనా. బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్లు శుక్రవారం దాదాపు 6శాతం పెరిగాయి. మిడిల్ఈస్ట్ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల బ్యారెల్ ముడిచమురు ధర 91 యూఎస్ డాలర్లకు చేరింది. ప్రభావం ఇలా.. రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురుకు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్‌లో ఊగిసలాటలు తగ్గుతాయి. అంతే తప్ప విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది. ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..! కారణాలివే.. 1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. 2. ముడిచమురు ధర 91 డాలర్ల పైకి చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ పైపైకి ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది. 3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. 4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించుకొని అమెరికా, ఇతర ఐరోపా బ్యాంకులకు తరలిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ యుద్ధం, ఇతర కారణాలతో సమీప భవిష్యత్తులో ముడిచమురు ధర, మన దిగుమతి బిల్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటేనే, రూపాయి పతనం ఆగుతుంది. -
ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు..
History Of The Indian Rupee: భారతదేశానికి స్వాతంత్యం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. అయితే 1947 నుంచి ఇండియన్ రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఎలా ఉండేది? ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్‌తో రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ. 3.30గా ఉండేది. అయితే ఈ విలువ క్రమంగా ప్రతి సంవత్సరం పడిపోతూ వచ్చింది. ఇప్పుడు అమెరికన్ డాలర్ విలువ ఏకంగా 82.73 రూపాయలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే మన కరెన్సీ విలువ ఎంతగా తగ్గిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. కాగా 1949 నుంచి 1966 వరకు USD-INR ఎక్సేంజ్ రేటు రూ. 4.76 వద్ద కొనసాగింది. ఆ తరువాత క్రమంగా పడిపోతూ వచ్చింది. 1947 నుంచి 2023 వరకు ఇండియన్ రూపాయి హిస్టరీ.. సంవత్సరం - ఎక్సేంజ్ రేట్(USD/INR) 1947 3.30 1949 4.76 1966 7.50 1975 8.39 1980 7.86 1985 12.38 1990 17.01 1995 32.427 2000 43.50 2005 (జనవరి) 43.47 2006 (జనవరి) 45.19 2007 (జనవరి) 39.42 2008 (అక్టోబర్) 48.88 2009 (అక్టోబర్) 46.37 2010 (జనవరి) 46.21 2011 (ఏప్రిల్) 44.17 2011 (సెప్టెంబర్) 48.24 2011 (నవంబర్) 55.39 2012 (జూన్) 57.15 2013 (మే) 54.73 2013 (సెప్టెంబర్) 62.92 2014 (మే) 59.44 2014 (సెప్టెంబర్) 60.95 2015 (ఏప్రిల్) 62.30 2015 (మే) 64.22 2015 (సెప్టెంబర్) 65.87 2015(నవంబర్) 66.79 2016(జనవరి) 68.01 2016(జనవరి) 67.63 2016(ఫిబ్రవరి) 68.82 2016 (ఏప్రిల్) 66.56 2016 (సెప్టెంబర్) 67.02 2016 (నవంబర్) 67.63 2017 (మార్చి) 65.04 2017 (ఏప్రిల్) 64.27 2017 (మే) 64.05 2017 (ఆగస్టు) 64.13 2017 (అక్టోబర్) 64.94 2018 (మే) 64.80 2018 (అక్టోబర్) 74.00 2019 (అక్టోబర్) 70.85 2020 (జనవరి) 70.96 2020 (డిసెంబర్) 73.78 2021 (జనవరి) 73.78 2021 (డిసెంబర్) 73.78 2022 (జనవరి) 75.50 2022 (డిసెంబర్) 81.32 2023 (జనవరి) 82.81 2023 (జూన్) 83.94 నిజానికి 1950 లలో ఒక రూపాయికి 16 అణాలు, 64 పైసలుగా విభజించారు. ఆ తరువాత 1 రూపాయికి 100 పైసలుగా ఫిక్స్ చేశారు. కాలక్రమంలో రూపాయి మాదిరిగానే అమెరికన్ డాలర్ కూడా ద్రవ్యోల్భణ ప్రభావానికి గురైంది. కొన్ని నివేదికల ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో రూపాయి & డాలర్ రెండూ సమానమే అని నమ్మేవాళ్ళు. దీనిపైనా అనేక వాదనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో మెట్రిక్ సిస్టం వంటివి లేదు కాబట్టి అన్ని కరెన్సీలు ఒక విలువను కలిగి ఉండేవని భావించేవారు. అధికారిక రికార్డుల ప్రకారం ఇది ఎప్పటికి సమానం కాదని తెలుస్తోంది. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా.. 1947కి ముందు భారతదేశం బ్రిటిష్ పాలిత రాష్ట్రంగా ఉండేది, కాబట్టి పౌండ్ విలువ ఎక్కువగా ఉన్నందున INR విలువ ఎక్కువగా ఉండేది. ఇక్కడ 1947లో 1 పౌండ్ 13.37 రూపాయలకు సమానమని నమ్మేవారు. 1944లో బ్రిటన్ వుడ్స్ ఒప్పందాన్ని ఆమోదించినప్పటి నుంచి చరిత్ర ప్రధానంగా ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందం ప్రపంచంలోని ప్రతి కరెన్సీ విలువను నిర్ణయించింది. -
బంగారం కొనుగోళ్లకు డాలర్‌కు సంబంధమేంటి?
‘అంతర్జాతీయ డబ్బు సంబంధిత వ్యవహారాల్లో నిన్న మొన్నటి వరకూ తిరుగులేని రాజైన అమెరికా డాలర్ నెమ్మదిగా తన పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. 2022 మార్చి నాటికి ప్రపంచ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా దాదాపు 58 శాతానికి పడిపోయింది. ఇది 1994 నుంచీ అత్యంత కనిష్ఠం. ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సెంట్రల్ (కేంద్రీయ) బ్యాంకులు పాత ఆనవాయితీకి విరుద్ధంగా డాలర్లకు బదులు తమ బంగారం నిల్వలను విపరీతంగా పెంచుకుంటున్నాయి. ఒక్క 2022 సంవత్సరంలోనే ఈ సెంట్రల్ బ్యాంకులు తమ ఖజానాలకు అదనంగా 1126 టన్నుల బంగారాన్ని కొని తరలించాయి. 1950 తర్వాత ఇంత మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేయడం ఇదే మొదటిసారి. ఇంతకన్నా మరో ఆశ్చర్యకర విషయం ఏమంటే, అనేక దేశాలు తమ మధ్య వాణిజ్యాన్ని, పెట్టుబడులను తమ సొంత లేదా థర్డ్ పార్టీ కరెన్సీలతో నిర్వహించుకుంటున్నాయి,’ ఈ తరహా వార్తలు గడచిన మూడు నాలుగు నెలలుగా మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ మారకం కరెన్సీగా డాలర్ భవితవ్యంపై అమెరికా కాని, ఇతర ధనిక, పారిశ్రామిక దేశాలు గాని ఎక్కువగా దిగులు పడడంలేదు. అమెరికా 21వ శతాబ్దంలో తనకు అవసరమైనప్పుడల్లా తన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు పెంచడానికి ఎడాపెడా తన కరెన్సీని ప్రింట్ చేసి విడుదల చేస్తోందనీ, దీని వల్ల ఇతర ఆర్థిక వ్యవస్థలు ముఖ్యంగా వర్ధమాన దేశాలపై వ్యతిరేక ప్రభావం పడుతోందనేది కొందరు అంతర్జాతీయ నిపుణులు, కొన్ని పారిశ్రామిక దేశాల ఆరోపణ. అత్యవసర పరిస్థితుల్లో ఏ దేశమైనా తన సొంత కరెన్సీని తాత్కాలికంగా పరిమితికి మించి ప్రింట్ చేయడం తప్పేమీ కాదనే సిద్ధాంతం కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఎప్పటిలాగానే అంతర్జాతీయ ఆర్థిక వ్యవహరాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ కథ 1944లో మొదలైంది ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత పాత మారకపు కరెన్సీ అయిన బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ స్థానంలో అమెరికా డాలర్ ఎలా వచ్చిందీ ఓసారి గుర్తుచేసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1944లో అమెరికాలో బ్రెటన్ వుడ్స్లో జరిగిన అనేక దేశాల అంతర్జాతీయ సమావేశం నిర్ణయాల ఫలితంగా బ్రిటిష్ పౌండు స్థానంలో అమెరికా డాలర్ అంతర్జాతీయ మారకపు కరెన్సీగా వేగంగా అవతరించింది. ఈ యుద్ధంలో ఇంగ్లండ్ సహా అనేక ఐరోపా దేశాలు ఆర్థికంగా దివాలా స్థితికి రావడంతో డాలర్ ప్రపంచ వాణిజ్య యవనికపై దర్శనమిచ్చి అప్పటి నుంచి అలా నిలిచిపోయింది. మధ్యలో కొన్నిసార్లు అమెరికా ఆర్థిక ఇబ్బందుల వల్ల డాలర్ బలహీనపడిన మాట నిజమే గాని ప్రతిసారీ అది పుంజుకుని తన పూర్వ స్థానం నిలబెట్టుకుంటూనే ఉంది. మరో ముఖ్య విషయం ఏమంటే.. బంగారానికి (ఈ లోహానికి ఉన్న అనేక సుగుణాల వల్ల) ప్రపంచవ్యాప్తంగా ప్రాచీనకాలం నుంచీ విలువ ఉంది. కాలంతో పాటు మనుషులకు ఈ లోహంపై మోజు మరీ పెరిగిపోతోంది. డాలర్ మారకం విలువ తగ్గినప్పుడల్లా బంగారం కొనుగోలు ధర పెరుగుతుంది. ఈ కారణంగా ప్రపంచంలో బంగారం కొనుగోళ్లు విపరీతంగా జరిగినప్పుడల్లా డాలర్ పని ఇక అయిపోయిందనే మాటలు, పుకార్లు వినిపిస్తాయి. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో అత్యంత ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీతోపాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో అమెరికాకు ఉన్న ఆధిపత్యం కారణంగా ఈ దేశానికి ఆర్థిక సంక్షోభాలు తాత్కాలికమేనని, మారకద్రవ్యంగా డాలర్‌కు ఉన్న ప్రాధాన్యానికి ఎదురయ్యే సవాళ్లు కొన్ని మాసాలకు మాత్రమే పరిమితమని గడచిన దాదాపు 75 ఏళ్ల చరిత్ర చెబుతోంది. ప్రసిద్ధ ఆర్థికవేత్తలు సైతం ఇప్పట్లో అమెరికా డాలర్ అంతర్జాతీయ మారకపు కరెన్సీగా తన హోదాను కోల్పోయే ప్రమాదమేమీ లేదని గట్టిగా వాదిస్తున్నారు. అనేక ఇతర కారణాల వల్ల బంగారానికి డిమాండు పెరగడానికి, దాని ధర కూడా పైకి ఎగబాకడానికి అవకాశాలున్నాయి గాని అమెరికా డాలర్ పతనం నిరంతరాయంగా జరగదని పలువురు ఆర్థిక శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (రూపాయి సింబల్ ₹, డాలర్ $, పౌండ్ £...వీటి వెనుక కథ ఏమిటంటే...) -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
టాప్ ఎంఎన్సీల్లో సీఈవోలు.. కానీ జీతం ఒక డాలరే.. ఎందుకో తెలుసా?
కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే సీఈవోల వార్షిక వేతనం రూ. కోట్లలో ఉండటం సహజమే. దిగ్గజ సంస్థల్లో పనిచేసే కొందరైతే రూ. వందల కోట్లు కూడా ఆర్జిస్తుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎంఎన్సీల్లో పనిచేసే సీఈవోల్లో చాలా మంది కేవలం ఒక డాలర్ వేతనాన్నే ఎందుకు తీసుకుంటున్నారు? తమ తెలివితేటలతో ఆయా సంస్థలను అగ్రపథాన నడిపిస్తున్నప్పటికీ వారు ఇలా నామమాత్ర జీతాన్ని అందుకోవడానికి కారణమేంటి? ఇది నిజంగా వారు చేస్తున్న త్యాగమా? లేక దీని వెనక ఏమైనా గిమ్మిక్కు దాగి ఉందా? చరిత్రను పరిశీలిస్తే... ► బడా సంస్థల సీఈవోలు కేవలం ఒక డాలర్ వేతనాన్ని తీసుకొనే సంప్రదాయం రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే మొదలైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ అప్పట్లో చాలా మంది ఈ నిర్ణయం తీసుకున్నారు. ► చాలా మంది ఎగ్జిక్యూటివ్‌లు అమెరికా ప్రభుత్వానికి ఉచితంగా తమ సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. అయితే జీతం ఇవ్వకుండా పనిచేయించుకోవడం చట్టప్రకారం నిషిద్ధం కావడంతో అలా ముందుకొచ్చిన వారికి ఒక డాలర్ వేతనాన్ని ఆఫర్ చేశారు. ► అలా నామమాత్ర జీతం అందుకున్న వారు ‘డాలర్–ఎ–ఇయర్–మెన్’గా పేరుగాంచారు. చదవండి: పంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే! త్యాగధనులు అనిపించుకోవడానికి... ► అమెరికాలోని టాప్–3 ఆటోమొబైల్ తయారీ సంస్థల్లో ఒకటైన క్రిస్లర్ 1980లో కుప్పకూలే స్థితికి చేరుకున్నప్పుడు అప్పటి సీఈవో లీ ఇయాకోకా ప్రభుత్వం నుంచి 1.5 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ సాధించి సంస్థను గట్టెక్కించారు. అదే సమయంలో సంస్థలోని కార్మికులు, డీలర్లు, సరఫరాదారులు వారికి రావాల్సిన బకాయిలను స్వచ్ఛందంగా వదులుకొనేలా ఒప్పించారు. ► సంస్థను తిరిగి గాడినపెట్టేందుకు తాను కృషి చేస్తున్నట్లు చాటిచెప్పేందుకు తన వేతనాన్ని ఒక డాలర్‌కు తగ్గించుకున్నారు. వాటాదారులకు సంఘీభావం తెలిపేలా... ►ఏడాదికి కేవలం ఒక డాలర్ వేతనాన్ని అందుకుంటున్నట్లు చూపడం ఓ రకంగా ప్రతీకాత్మకమే.. సంస్థ గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నట్లు చెప్పడానికి సీఈవోలు ఇలా వ్యవహరిస్తుంటారు. ► ఏటా కేవలం ఒక డాలర్ వేతనాన్ని అందుకొనే సీఈవోలు నిజానికి సంస్థ స్టాక్‌లు, ఆప్షన్లు, బోనస్‌లను పనితీరు ఆధారిత పరిహారం కింద అందుకుంటుంటారు. చదవండి: సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే! బయటకు కనిపించేంత నిస్వార్థపరులేం కాదు..! ► పనితీరు ఆధారిత చెల్లింపుల కింద సీఈవోలు పొందే భారీ మొత్తాలపై చాలా వరకు తక్కువ పన్ను రేటే వర్తిస్తుంది. ► సీఈవోలకు చేసే ఈ తరహా చెల్లింపులను సంస్థ పన్ను ఆదాయంలోంచి కోతపెట్టేందుకు 1993లో అమెరికా చేసిన చట్టం అనుమతిస్తుంది. అంటే ఓ రకంగా చూస్తే సీఈవోలు పొందే భారీ మొత్తాలకు పన్ను చెల్లింపుదారులు సబ్సిడీ ఇస్తున్నట్లే లెక్క. ► కేవలం ఒక డాలర్ వార్షిక వేతనం అందుకొనే టెస్లా సీఈవో ఎలన్ మస్క్ 2018లో ఫెడరల్ ఆదాయ పన్నుల కింద దమ్మిడీ కూడా చెల్లించలేదట! ఒక అధ్యయనంలో తేలింది ఏమిటంటే... ► 2011లో 50 మంది సీఈవో లపై చేపట్టిన ఓ సర్వే గణాంకాలను (2019 ద్రవ్యోల్బణ విలువలకు సరిదిద్దాక) పరిశీలిస్తే ఒక డాలర్ వార్షిక వేతనం అందుకొనే సీఈవోలు సగటున జీతం కింద 6.10 లక్షల డాలర్లను వదలుకుంటున్నట్లు వెల్లడైంది. కానీ అదే సమయంలో వారు బయటకు ఎవరికీ పెద్దగా కనపించని ఈక్విటీ ఆధారిత పరిహారం కింద 20 లక్షల డాలర్ల మేర లబ్ధి పొందుతున్నట్లు తేలింది! చదవండి: పిండి, కోడి గుడ్లు.. ఇలాంటి తమాషా యుద్ధం ఎప్పుడైనా చూశారా? 100 రెట్లకుపైగా... ► 2019లో జరిగిన మరో అధ్యయనం ప్రకారం... అమెరికాలోని 500 బడా కంపెనీల సీఈవోల్లో 80 శాతం మంది తమ సంస్థల్లో పనిచేసే ఓ మధ్యశ్రేణి ఉద్యోగి వేతనానికి 100 రెట్లకుపైగా ఆర్జిస్తున్నారు. అసమానతల దృష్టి మళ్లించేందుకే... ► గత కొన్ని దశాబ్దాలుగా సీఈవో–ఉద్యోగి మధ్య వేతన వ్యత్యాసం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ►ఆర్థిక అసమానతలపై ఉద్యోగ సంఘాల దృష్టి మళ్లించేందుకు సీఈవోల నామమాత్ర వేతనం ఒక మార్గంగా మారినట్లు ఓ పరిశోధన గుర్తించింది. ►బాగా శక్తిమంతమైన సీఈవోలు ఒక డాలర్ జీతం విధానాన్నే ఎంచుకుంటారని, తద్వారా సంస్థ నుంచి వారు పొందే మొత్తం పరిహారంపై ఎక్కడా గగ్గోలు చెలరేగకుండా చూసుకుంటారని ఆ పరిశోధనలో వెల్లడైంది. చదవండి: గాల్లో తాడుపై నడిచాడు.. ఇది మామూలు రికార్డు కాదు! తిరగబడ్డ తెలివి... ► ఒక డాలర్ వార్షిక వేతనంగా పొందే సీఈవోలు ప్రాతినిధ్యం వహించే సంస్థలు తమ ఆస్తులు, రాబడులపై నెలకు ఆర్జించే సొమ్ము... మార్కెట్ రేటు వేతనాలు పొందే సీఈవోలు ఉన్న కంపెనీలతో పోలిస్తే ఒక శాతం తక్కువని 2014లో జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. ► ఒక డాలర్ వేతనం పొందే సీఈవోల అతివిశ్వాసం లేదా తమ కొలువుకు ఢోకా ఉండదన్న వైఖరి వల్ల ఆయా సంస్థల్లో ఇలా ‘పనితీరు తగ్గుదల’కనిపించినట్లు సర్వే వివరించింది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
సెన్సెక్స్ 279 పాయింట్లు అప్
అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇటీవలి పతనం కారణంగా ధరలు పడిపోయి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరగడమే దీనికి కారణం. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కూడా కలసి వచ్చింది. చివరి గంటలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 279 పాయింట్లు పెరిగి 37,393 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 100 పాయింట్లు ఎగసి 11,257 పాయింట్ల వద్దకు చేరింది. ఐటీ, ఆర్థిక, లోహ రంగ షేర్లు రాణించాయి. ఫార్మా షేర్లు పడిపోయాయి. ఈ నెలలో స్టాక్ మార్కెట్ లాభపడటం ఇది రెండో రోజు మాత్రమే. 23 వరకూ ఒడిదుడుకులు... చైనా టెలికం దిగ్గజం హువాయ్‌పై అమెరికా ఆంక్షలు విధించడం... చైనా– అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై, లాభాల్లో ముగిశాయి. ఇటీవలి తొమ్మిది రోజుల పతనం కారణంగా బ్లూ చిప్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండటంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైనా, మధ్యాహ్నం 2 గంటల వరకూ స్తబ్దుగా కొనసాగింది. చివరి గంటన్నరలో షార్ట్ కవరింగ్‌కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 63 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 404 పాయింట్ల వరకూ పెరిగింది. మొత్తం మీద రోజంతా 467 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఎన్నికల ఫలితాలు వెలువడే ఈ నెల 23 వరకూ స్టాక్మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ► టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బేవరేజేస్‌ల బ్రాండెడ్ ఫుడ్ వ్యాపారాన్ని విలీనం చేస్తుండటంతో ఈ రెండు షేర్లు 8–10 శాతం రేంజ్లో పెరిగాయి. ► యస్‌బ్యాంక్ నష్టాలు కొనసాగాయి. ఈ షేర్ 4 శాతం పతనమై రూ.138 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ లాభపడినా, 300కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, యస్‌బ్యాంక్, అరవింద్, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్, క్యాడిలా హెల్త్‌కేర్ తదితర షేర్లు వీటిలో ఉన్నాయి. ► మూడు రోజుల నష్టాల నుంచి జెట్ ఎయిర్వేస్ కోలుకుంది. 2.5 శాతం లాభంతో రూ.127 వద్ద ముగిసింది. ఎగిసిన రూపాయి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ గురువారం దేశీ ఈక్విటీ మార్కెట్లు ఆఖర్లో కోలుకోవడంతో రూపాయి పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే 31 పైసలు పెరిగి 70.03 వద్ద క్లోజయ్యింది. రూపాయి బలపడటం ఇది వరుసగా మూడో రోజు. ఈ మూడు రోజుల్లో దేశీ కరెన్సీ 48 పైసల మేర పెరిగింది. పెరుగుతున్న చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి లాభాలకు కొంత మేర అడ్డుకట్ట పడిందని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. -
రూపాయి 76పైసలు డౌన్
ముంబై: మూడు రోజుల రూపాయి లాభాలకు గురువారం బ్రేక్ పడింది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించినప్పటికీ, తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించడంతో రూపాయి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 76 పైసలు క్షీణించి 69.17కు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే డాలర్ బలపడటం.. రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. వరుసగా రెండో పాలసీలో కీలక రేట్లలో ఆర్బీఐ కోత విధించింది. దీంతో రూపాయి, బాండ్ల ధరలు పడిపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసల నష్టంతో 68.56 వద్ద ఆరంభమైంది. ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. బుధవారం రూపాయి 33 పైసలు లాభపడిన విషయం తెలిసిందే. -
పసిడికి బలాన్నిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి!
అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర శుక్రవారం (22వ తేదీ)తో ముగిసిన వారంలో 17 డాలర్లు పెరిగి 1,319 డాలర్లకు చేరింది. రేటు (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) పెంచని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రిజర్వ్, అమెరికా వృద్ధి ధోరణి మందగమనంలో ఉందని విశ్లేషణ, డాలర్ ఇండెక్స్ బలహీనత (96), దీనికితోడు కొనసాగుతున్న అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ తీవ్రత, దీనితో ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై వీడని అనిశ్చితి వంటి అంశాలు పసిడి బలానికి తోడవుతున్నాయి. నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) 1,200 డాలర్ల నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, తిరిగి రెండు వారాల నుంచి ఆ పటిష్ట మద్దతుపైనే కొనసాగుతోంది. సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందన్నది నిపుణుల విశ్లేషణ. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. దేశంలో 32–33 వేల మధ్య స్థిరీకరణ ... కాగా డాలర్ మారకంలో రూపాయి (22వ తేదీ ముగింపు 68.95) ఒడిదుడుకులు, డాలర్ కదలికలపై అనిశ్చితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయంగా పసిడి 10 గ్రాముల ధర రూ.32,000–33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 32,140 వద్ద ముగిసింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,810, రూ.31,250 వద్ద ముగిశాయి. అంతర్జాతీయంగా పసిడి భారీగా పెరిగినా, దేశీయంగా వారంవారీగా ధరలు దాదాపు అక్కడక్కడే ఉన్నాయి. రూపాయి బలోపేత ధోరణి దీనికి కారణం. -
నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
బ్యాంక్ షేర్ల పతనానికి... అంతంతమాత్రంగానే ఉన్న అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒక ఒప్పందం కుదరగలదన్న ఆశలు తగ్గుముఖం పట్టడం, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశజనకంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. బ్యారెల్బ్రెంట్ చమురు ధరలు మళ్లీ 60 డాలర్లపైకి ఎగియడంతో రూపాయి పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కీలక కంపెనీల క్యూ3 ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 106 పాయింట్లు పతనమై 36,107 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 34 పాయింట్లు క్షీణించి 10,822 పాయింట్ల వద్ద ముగిశాయి. 198 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. అయితే ఆసియా మార్కెట్ల బలహీనతతో నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత కోలుకొని మళ్లీ లాభాల్లోకి వచ్చినా, మళ్లీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. ట్రేడింగ్ ముగిసేదాకా ఈ నష్టాలు కొనసాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 56 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 142 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 198 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్యాంక్ షేర్లకు నష్టాలు లాభాల స్వీకరణ కారణంగా బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐలు 2 శాతం వరకూ నష్టపోయాయి. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ స్వల్పంగా లాభపడగా, ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. ∙వాటెక్ వాబాగ్ షేర్ 15 శాతం ఎగసి రూ.321 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ షేర్ 26 శాతం ఎగసింది. ఈ నెల మొదటి వారంలో నోర్జేస్ బ్యాంక్ 3.31 లక్షల షేర్లను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినప్పటికీ, నాలుగు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా), లిండే ఇండియా, టొరెంట్ ఫార్మా షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ముడి చమురు ధరలు ఎగియడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 1–2 శాతం రేంజ్లో నష్టపోయాయి. -
సమీప భవిష్యత్‌లో అప్‌ట్రెండే!
వృద్ధికి సంబంధించి అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనలు సమీప కాలంలో పసిడి డిమాండ్‌కు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు, రాబడులపై మాత్రం సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సద్దుమణగని ధోరణి, డాలర్ బలహీన పరిస్థితి, అమెరికా వడ్డీరేట్ల పెంపుదలకు సంబంధించి స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ నుంచే వస్తున్న వ్యతిరేకత, ఈక్విటీ మార్కెట్ల నష్టాలు వంటివి సమీప భవిష్యత్తులో బంగారం ధర పెరుగుదలకు దోహదపడతాయని వారి అభిప్రాయం. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతమైన వృద్ధి బాటలోనే పయనిస్తున్నా... ఇంకా ఇబ్బందులు పొంచివున్నాయని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ డల్లాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొనడం పసిడి కదలికకు సంబంధించి చర్చనీయాంశం అవుతోంది. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర శుక్రవారంతో ముగిసిన వారంలో ఒకశాతం పెరిగి 1,223 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్ ఇండెక్స్ 96.31 వద్ద ముగిసింది. వచ్చేవారం అమెరికా హౌసింగ్ మార్కెట్ గణాంకాలు రాబోతుండటం పసిడి కదలికలను కొంతమేర నిర్దేశిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లడానికి సంబంధించిన అంశాలు కూడా ప్రపంచ ఆర్థిక పరిస్జితుల అనిశ్చితికి దారితీస్తున్న సంగతి గమనార్హం. 1,200 డాలర్ల వద్ద స్థిరం... సమీప కాలంలో నైమెక్స్‌లో ధర 1,200 డాలర్ల స్థాయి కిందకు జారే అవకాశం లేదని, ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనా వెంటనే ఆ పైకి చేరుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 1,200 డాలర్లు పసిడికి ‘‘స్వీట్ స్టాప్’’ వంటిదని వారు అభిప్రాయపడుతున్నారు. ఆ లోపునకు ధర పడితే, ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర లేక ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని, అదే జరిగితే మళ్లీ ధర 1,200 డాలర్ల ఎగువకు పెరగడం ఖాయమన్న వాదన వినబడుతోంది. ఇక వీటన్నింటికీ తోడు కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకుల నుంచి కూడా పసిడి కొనుగోళ్లు జరుగుతున్న సంగతి గమనార్హం. అయితే 1,250 డాలర్ల స్థాయిలో పసిడికి గట్టి నిరోధం ఉందని, ఈ స్థాయి దాటితే అది సాంకేతికంగా పటిష్ట ధోరణిగానే భావించాలని, అయితే, తిరిగి బుల్లిష్ బాటలోకి ప్రవేశించడానికి 1,300 డాలర్లపైకి పసిడి కదలిక అవసరం అనీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని వారి విశ్లేషణ. దేశీయంగా స్థిర ధోరణి... అంతర్జాతీయ మద్దతుకు తోడు దేశీయంగా డిమాండ్ పరిస్థితులు, డాలర్ మారకంలో రూపాయి బలహీన పరిస్థితి భారత్‌లో పసిడిని 10 గ్రాములకు రూ.30,000 పైనే నిలబెడుతున్నాయి. శుక్రవారంతో ముగిసిన వారంలో ముంబై స్పాట్ మార్కెట్లో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు 10 గ్రాములకు వరుసగా రూ. 32,090, రూ. 30,560 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ.40,000గా ఉంది. డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయ మార్కెట్లో 71.78 వద్ద ముగిసింది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో 10 గ్రాముల ధర రూ. 31,011 వద్ద ముగిసింది. -
30 బిలియన్ డాలర్లు కావాలి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ రికవరీకి ఇండియా రేటింగ్స్ గురువారం కీలక సూచనలు చేసింది. ఇందుకుగాను ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నుంచి కనీసం 30 బిలియన్ డాలర్లను సమీకరించాలన్నది ఇండియా రేటింగ్స్ విశ్లేషణ. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో రూపాయి విలువను సగటున 69.79కి తీసుకుని రావచ్చని పేర్కొంది. 2013లో ఇలాంటి చర్యలే తీసుకున్న విషయాన్ని కూడా తన తాజా నివేదికలో ప్రస్తావించింది. రూపాయి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దాదాపు 8.3% పతనమైన నేపథ్యంలో విడుదలైన నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... ♦ గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే, రూపాయి విలువ 15 శాతం పతనమయింది. గడచిన ఆరు నెలల్లో పతనం 8.3 శాతంగా ఉంది. ఆరు నెలల్లో డాలర్ మారకంలో సగటు విలువ 68.57గా ఉంది. ఇతర దేశాల కరెన్సీలూ బలహీనమయినా, రూపాయి అంతకుమించి పతనమవడం గమనార్హం. ♦ దువ్వూరి సుబ్బారావు నుంచి ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రఘురామ్ రాజన్ 2013లో అప్పట్లో రూపాయిని నిలబెట్టడానికి ఎన్ఆర్ఐల నుంచి 25 బిలియన్ డాలర్ల సమీకరణ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ♦ 2015–2019 మధ్య రూపాయి పతనం 3 శాతమే. 20 ఏళ్ల సగటు చూసినా (1999–2018) వార్షిక పతనం దాదాపు 3 శాతంగానే ఉంది. ♦ డాలర్ బలోపేతం, కమోడిటీ ధరలు ప్రత్యేకించి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అమెరికాలో వడ్డీరేట్ల పెరుగుదల, దీనితో దేశం నుంచి తరలుతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, ద్రవ్యలోటుపై ఆందోళనలు వంటి పలు అంశాలు రూపాయి బలహీనతకు కారణాలు. ♦ ఒక దేశ కరెన్సీ బలహీనపడితే, ఆ దేశ ఎగుమతులు పెరిగే అవకాశం ఉండటం సహజమే. అయితే రూపాయికన్నా ఎక్కువగా ఇతర దేశాల కరెన్సీలు బలహీనపడుతుండటం వల్ల తాజా పరిస్థితి (రూపాయి పతనం) నుంచి భారత్ ప్రయోజనం పొందలేకపోతోంది. పైగా ముడి చమురు సహా కొన్ని ఉత్పత్తులను భారత్ తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ♦ ఐదు నెలల తర్వాత మొదటిసారి సెప్టెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా, –2.15 శాతం క్షీణత నమోదుకావడం మరో అంశం. ఇదే సమయంలో దిగుమతులు 10.45 శాతం (41.9 బిలియన్ డాలర్లు) పెరిగాయి. 73.27 వద్ద రూపాయి... డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 11 పైసలు బలహీనపడింది. 73.27 వద్ద ముగిసింది. విదేశీ నిధులు వెనక్కు మళ్లడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దిగుమతి దారుల నుంచి డాలర్లకు డిమాండ్ వంటి అంశాలు ఫారెక్స్ మార్కెట్ల రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని డీలర్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత ఒడిదుడుకులతోసాగి బుధవారం 41పైసలు లాభంతో మూడు వారాల గరిష్టం 73.16కు చేరింది. ఆరేళ్ల గరిష్టానికి పసిడి పండుగలు, రూపాయి బలహీనత నేపథ్యం న్యూఢిల్లీ: పసిడి ధర ఇక్కడి స్పాట్ మార్కెట్లో ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకింది. 99.99, 99.5 స్వచ్ఛత ధరలు 10 గ్రాములకు రూ.125 చొప్పున పెరిగి, వరుసగా రూ. 32,625, రూ.32,475కు చేరాయి. 2012 నవంబర్ 29 తర్వాత ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. అప్పట్లో 99.99 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.32.940ని తాకింది. మూడు రోజుల్లో న్యూఢిల్లీలో పసిడి దాదాపు రూ.405 పెరిగింది. ఒకపక్క పండుగల సీజన్, మరోవైపు డాలర్ మారకంలో రూపాయి బలహీనత పసిడి ధరను పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్స్‌కు (31.1గ్రా) 1,250 డాలర్లలోపు ఉన్నా, రూపాయి బలహీనతలు బంగారం దిగుమతులపై మరింత భారాన్ని పెంచుతోంది. ఈక్విటీల బలహీనతలు, డాలర్ ఇండెక్స్ బలోపేతంపై అనిశ్చితి, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ ఇన్వెస్టర్లు పసిడివైపు చూడ్డం ప్రారంభించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వార్తరాసే రాత్రి 10 గంటల సమాయానికి అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో పసిడి ఔన్స్ ధర 1,234 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో రూ.31,911 వద్ద ట్రేడవుతోంది. -
ఇప్పటికీ ‘పసిడి’ బలహీనమే!
నైమెక్స్‌లో వరుసగా ఆరవనెలా సెప్టెంబర్‌లోనూ పసిడి బలహీనంగానే ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఫెడ్ ఫండ్ రేటు పెంపు, డాలర్ పటిష్ట ధోరణి దీనికి నేపథ్యం. ఆరు నెలల్లో డాలర్ ఇప్పటి వరకూ దాదాపు 12 శాతం తగ్గింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పసిడి మరోసారి ఆగస్టు కనిష్ట స్థాయి (1,160 డాలర్లు) తాకే అవకాశం ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఎగువ స్థాయిలో 1,216, 1,236 డాలర్లు నిరోధ స్థాయిలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే భారత్ విషయానికి వచ్చే సరికి దేశంలో పెద్దగా ధర తగ్గే అవకాశం లేదన్నది వారి వాదన. డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి దీనికి కారణం. ఇక వారంలో నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర 9 డాలర్లు తగ్గి, 1,196 డాలర్లకు పడింది. డాలర్ ఇండెక్స్ డాలర్ పెరుగుదలతో 94.80కి చేరింది. ఎంసీఎక్స్‌లో ధర వారంలో కేవలం రూ.74 తగ్గి రూ.30,508కి చేరింది. 99.9, 99.5 స్వచ్చత 10 గ్రాముల ధర రూ.390 చొప్పున తగ్గి, రూ.30,450, రూ.30,300 వద్ద ముగిశాయి. -
పడిపోతూనే ఉన్న రూపాయి..
ముంబై: ఆరో రోజూ రూపాయి నేల చూపులే చూసింది. డాలర్‌తో బుధవారం మరో 17 పైసలు ఆవిరై 71.75 వద్ద స్థిరపడింది. కనిష్టంలో ఇది మరో రికార్డు. వరుసగా ఆరు రోజుల్లో రూపాయి 165 పైసల మేర తన విలువను కోల్పోయింది. ఇంట్రాడేలో రూపాయి నూతన రికార్డు కనిష్టాన్ని 71.97 వద్ద నమోదు చేసింది. ఆ తర్వాత కాస్త రికవరీ అయింది. ఆర్బీఐ రంగంలోకి దిగి రూపాయి పతనాన్ని కొంత వరకు నిలువరించిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ప్రధానంగా ముడి చమురు ధరలు, వాణిజ్య యుద్ధాలే రూపాయిని పడేస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు కూడా ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించాయి. ద్రవ్యలోటు, కరెంటు ఖాతాల లోటుతో దేశ ఆర్థిక రంగానికి సమస్యలు పొంచి ఉన్నాయని ఓ ఫారెక్స్ డీలర్ పేర్కొన్నారు. డాలర్ బలపడిందంతే...: జైట్లీ ‘‘రూపాయి విలువ క్షీణించడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణం. దేశీయ ఆర్థిక పరిస్థితి చూడండి. అలాగే, అంతర్జాతీయ పరిస్థితులనూ చూడండి. ఇందుకు దేశీయ కారణాలు ఎంత మాత్రం కాదు. వర్ధమాన దేశాల్లో ప్రతీ కరెన్సీతోనూ డాలర్ బలపడింది. రూపాయి బలహీనపడలేదు. పౌండ్, యూరో తదితర కరెన్సీలతో రూపాయి బలపడింది’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. -
రేట్లకు రెక్కలు!!
న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో వినియోగవస్తువుల నుంచి ఫోన్లు మొదలైన ఉత్పత్తుల దాకా అన్నింటి ధరలు పెరగనున్నాయి. దేశీ కరెన్సీ పతనం ఇదే తీరుగా కొనసాగితే ..ముడి చమురు దిగుమతుల బిల్లు పెరిగిపోయి, పెట్రోల్, డీజిల్ మొదలుకుని వంట గ్యాస్ దాకా అన్నింటి రేట్లు ఎగియనున్నాయి. దిగుమతుల భారం పెరిగిపోతుండటంతో.. కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు పండుగ సీజన్ ప్రారంభం కావడానికి ముందుగానే రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి మారకం పతన ప్రభావాలను పరిశీలిస్తున్నట్లు సోనీ, పానాసోనిక్, గోద్రెజ్ వంటి సంస్థలు తెలిపాయి. ‘డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70 స్థాయిని దాటేయడం ముడివస్తువుల వ్యయాలపై మరింతగా ఒత్తిడి పెంచుతోంది. ఈ ప్రభావాలన్నింటినీ పరిశీలిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే.. సమీప భవిష్యత్‌లో రేట్లు పెంచక తప్పక పోవచ్చు’ అని గోద్రెజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్, ఈవీపీ కమల్ నంది వెల్లడించారు. ఒకవేళ 70 స్థాయి దాటి రూపాయి కొనసాగితే.. పండుగలకు ముందే రేట్లను పెంచవచ్చని, ఆగస్టు ఆఖర్లోగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. అటు పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే వినియోగ ఉత్పత్తుల రేట్లపై ఒత్తిడి తప్పదన్నారు. ప్రస్తుతానికి దేశీ కరెన్సీ తీరును పరిశీలిస్తున్నామని, టీవీల రేట్ల పెంపుపై ఇంకా నిర్ణయాలేమీ తీసుకోలేదని సోనీ ఇండియా హెడ్ ఆఫ్ సేల్స్ సతీష్ పద్మనాభన్ చెప్పారు. కొన్ని ఉత్పత్తుల రేట్లను పెంచే అవకాశాలు ఉండొచ్చని, ఇందుకు మరికాస్త సమయం పట్టొచ్చని హాయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ఎంట్రీ లెవెల్ ఫోన్లపై ప్రభావం.. రూపాయి పతనం కొనసాగితే ముడివస్తువుల ధరలూ పెరుగుతాయని, ఫలితంగా మొబైల్ ఫోన్లు.. ముఖ్యంగా ఎంట్రీలెవెల్ వేరియంట్స్ రేట్లు పెరగవచ్చని హ్యాండ్సెట్ తయారీ సంస్థలు వెల్లడించాయి. ‘డాలర్ మరింత బలపడే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో మొబైల్స్ తయారీ వ్యయాలూ పెరుగుతాయి. ఫలితంగా హ్యాండ్సెట్స్ రేట్లూ పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని ఇంటెక్స్ టెక్నాలజీస్ (ఇండియా) డైరెక్టర్ నిధి మార్కండేయ చెప్పారు. కస్టమ్స్ సుంకాలు, ముడివస్తువుల రేట్ల పెరుగుదలతో హ్యాండ్సెట్స్ పరిశ్రమ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని.. కోమియో ఇండియా సీఈవో సంజయ్ కలిరోనా తెలిపారు. రూపాయి పతనం ప్రభావాలను సమీక్షిస్తున్నామని, రేట్లపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎంట్రీ లెవెల్ మొబైల్స్‌పై నేరుగా ప్రభావం పడొచ్చని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహీంద్రూ తెలిపారు. అయితే ఈ విభాగంలో తీవ్ర పోటీ నెలకొనడంతో రేట్ల పెంపుపై నిర్ణయం చాలా కష్టమైన వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. పెరిగే చమురు బిల్లు .. రూపాయి కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతుండటం చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల ముడిచమురు దిగుమతుల భారం ఈ ఆర్థిక సంవత్సరం ఏకంగా 26 బిలియన్ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముడిచమురు దిగుమతుల భారం పెరిగితే.. తత్ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులే ఉంటున్నాయి. 2017–18లో 220.43 మిలియన్ టన్నుల క్రూడాయిల్ కోసం 87.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరం దిగుమతులు 227 మిలియన్ టన్నుల మేర ఉంటాయని అంచనా. ‘ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో డాలర్‌తో రూపాయి మారకం రేటు 65 స్థాయిలో, ముడిచమురు బ్యారెల్ రేటు 65 డాలర్లుగా ఉంటుందనే అంచనాలతో.. దిగుమతుల బిల్లు 108 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాం. కానీ ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూపాయి పతనం వల్ల పూర్తి ప్రభావాలు ఈ నెలాఖరులోనే కనిపించే అవకాశాలు ఉన్నాయి. రూపాయి పతనంతో ఎగుమతి సంస్థలతో పాటు దేశీయంగా చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్జీసీ మొదలైన వాటికీ ప్రయోజనం చేకూరుతుంది. అయితే, ఇవి డాలర్ల మారకంలో బిల్లింగ్ చేయడం వల్ల వాటి నుంచి ఇంధనాలు కొనుగోలు చేసి విక్రయించే రిటైల్ సంస్థలు రేట్లను పెంచాల్సి వస్తుంది. ఒకవేళ చమురు రేట్లు ప్రస్తుత స్థాయిలోనే ఉండి, రూపాయి 70 స్థాయిలోనే కొనసాగిన పక్షంలో ఇంధన ధరలు లీటరుకు 50–60 పైసల మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. రూపాయి మరింత పతనం తొలిసారిగా 70కి దిగువన క్లోజింగ్ 26 పైసలు డౌన్ ముంబై: రూపాయి విలువ శరవేగంగా కరిగిపోతోంది. రోజురోజుకూ కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే గురువారం రూపాయి మారకం విలువ మరింత క్షీణించి కీలకమైన 70 మార్కు దిగువన తొలిసారిగా క్లోజయ్యింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే మరో 26 పైసలు తగ్గి 70.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో చరిత్రాత్మక కనిష్ట స్థాయి 70.40ని కూడా తాకడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో రూపాయి పతనానికి కొంతైనా అడ్డుకట్ట పడిందని కరెన్సీ ట్రేడర్లు పేర్కొన్నారు. క్రితం ముగింపు 69.89తో పోలిస్తే గురువారం ఫారెక్స్ మార్కెట్లో గ్యాప్ డౌన్‌తో ఏకంగా 70.19 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక దశలో 70.40 స్థాయికి కూడా పడిపోయి చివరికి కొంత కోలుకుని 70.15 వద్ద క్లోజయ్యింది. పెరిగిపోతున్న ద్రవ్య లోటు, క్రూడాయిల్ ధరల పెరుగుదల, అమెరికా–చైనా మధ్య వాణిజ్య భయాలపై ఆందోళనలు, డాలర్‌కు డిమాండ్ తదితర అంశాల నేపథ్యంలో దేశీ కరెన్సీ విలువ ఈ ఏడాది ఇప్పటిదాకా 10.5 శాతం మేర క్షీణించింది. వర్ధమాన దేశాల కరెన్సీల పతనానికి కారకమైన టర్కీ లీరా విలువ మాత్రం పెరిగింది. టర్కీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా 15 బిలియన్ డాలర్లు అందిస్తామంటూ కతార్ ముందుకు రావడంతో లీరా ర్యాలీ కొనసాగింది. మరోవైపు, రూపాయి క్షీణతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. గత మూడేళ్లుగా 17 శాతం మేర పెరిగిన రూపాయి మారకం ప్రస్తుతం మళ్లీ సహజ స్థాయికి వస్తోందని పేర్కొన్నారు. -
కోలుకున్న రూపాయి
ముంబై: డాలర్‌కు అమ్మకాల ఒత్తిడి ఎదురు కావడంతో రూపాయి పుంజుకుంది. ఫారెక్స్ మార్కెట్లో బుధవారం 30 పైసలు బలపడి 68.08 వద్ద క్లోజయింది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలకు మొగ్గుచూపారు. అదే సమయంలో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ తగ్గడంతో రూపాయి కోలుకోవడానికి దోహదపడింది. యూరో, పౌండ్, యెన్లతోనూ రూపాయి బలపడడం గమనార్హం. మంగళవారం నెల రోజుల కనిష్ట స్థాయి 68.38వద్ద క్లోజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆసియా కరెన్సీలు చాలా వరకు రికవరీ అయ్యాయి. -
56 పైసలు బలపడిన రూపాయి
ముంబై: బలహీనపడుతూ వస్తున్న రూపాయి శుక్రవారం కొంత కోలుకుంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో ఒకేరోజు 56 పైసలు బలపడి 67.78 వద్ద ముగిసింది. రూపాయి ఒకేరోజు ఇంత బలపడ్డం ఈ ఏడాది ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు (10 రోజుల క్రితం 4 ఏళ్ల గరిష్ట స్థాయిలో 80.5 డాలర్లకు చేరిన బ్రెంట్ బేరల్ ధర ఈ వార్త రాసే సమయం రాత్రి 9 గంటల సమయానికి 76.19 స్థాయి వద్ద ట్రేడవుతోంది.) కొంత ఉపశమించడం, ఈక్విటీ మార్కెట్ లాభపడటం రూపాయి బలానికి కారణం. మే 31న విడుదలయ్యే జీడీపీ ఫలితాలు బాగుంటాయన్న అంచనాలు, వర్షాలు బాగుండి, ధరలు తగ్గుతాయన్న విశ్లేషణలు రూపాయికి తక్షణ బలాన్ని తెచ్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ విశ్లేషకుడు ఆనంద్ జేమ్స్ చెప్పారు. -
మళ్లీ రూపాయి 68 దిగువకు...
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం మళ్లీ కిందకు జారింది. వివరాల్లోకి వెళితే, ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం రూపాయి విలువ 16 నెలల కనిష్టస్థాయి 68.15 స్థాయికి చేరింది. అయితే బుధ, గురు వారాల్లో తిరిగి కొంత బలపడుతూ 67.70కి చేరింది. కాగా శుక్రవారం అనూహ్యంగా తిరిగి 30 పైసలు కనిష్టానికి పడింది. 68 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్లకు డిమాండ్, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, దేశంలో కరెంట్ అకౌంట్ లోటు పెరుగుదల భయాలు వంటి అంశాలు రూపాయి పతనానికి కారణాల్లో కొన్ని. డాలర్ విలువ పెరుగుదల వల్ల ప్రభుత్వ ఆయిల్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ భారీగా పెరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్బీఐ, అధికారులు రూపాయి తీవ్రంగా బలహీనపడకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, దేశం నుంచి భారీ క్యాపిటల్ అవుట్‌ఫ్లోస్ వల్ల దేశీయ కరెన్సీ బలహీనబాట ఆగడం లేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. గత వారం మొత్తంమీద రూపాయి 67 పైసలు నష్టపోయింది. ఇదిలాఉండగా, భారత్ కరెంట్ అకౌంట్ (క్యాడ్)పై క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ప్రభావం పడే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ విశ్లేషించింది. 2018–19లో 2.4 శాతంగా క్యాడ్ నమోదుకావచ్చని అభిప్రాయపడింది. -
దేశంలో బంగారానికి రూపాయి మెరుపు
ముంబై/న్యూయార్క్: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర దాదాపు అక్కడక్కడే ఉన్నా, దేశంలోమాత్రం ఉరుకులు పెట్టింది. డాలర్ మారకంలో రూపాయి విలువ వారంలో దాదాపు 60 పైసలు పతనం కావడమే దీనికి కారణం. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర 11వ తేదీతో ముగిసిన వారంలో 1,316 డాలర్ల నుంచి 1,318 డాలర్లకు పెరిగింది (వారం మధ్యలో ఒక దశలో 1,328 స్థాయిని చూసింది). అయితే ఇదే కాలంలో భారత్ ఫ్యూచర్స్ మార్కెట్స్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ.404 పెరిగి రూ. 31,518కి ఎగసింది. ఇక ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.455 ఎగసి వరుసగా రూ. 31,615, రూ.31,465 వద్ద ముగిశాయి. కాగా వెండి కేజీ ధర రూ.1,110 పెరిగి రూ. 40,290కి చేరింది. డాలర్ మారకంలో రూపాయి విలువ ఈ వారంలో దాదాపు 60 పైసలు బలహీనపడి 67.40ని చూడ్డం ఆయా అంశాలకు నేపథ్యం. ఫెడ్ రేటు పెంపు ప్రభావం... అంతర్జాతీయంగా బంగారం ధర మరింత పెరిగి, రూపాయి బలహీనత కొనసాగితే దేశంలో యల్లో మెటల్‌కు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. రూపాయికి 67.50 వద్ద గట్టి నిరోధం ఉండగా, గడచిన ఐదు నెలలుగా అంతర్జాతీయంగా పసిడి 1,365 డాలర్ల వద్ద నిరోధం – 1,300 డాలర్ల వద్ద మద్దతు మధ్య నిర్దిష్ట శ్రేణిలో తిరుగుతోంది. అయితే డాలర్ ర్యాలీ కొనసాగి, బంగారం ధర అంతర్జాతీయంగా పడిపోతే, దేశీయంగా పసిడి ధర సమీప కాలంలో రూ.32,500 దాటకపోవచ్చు. జూన్‌లో అమెరికా ఫెడ్ వడ్డీరేటు పెంపుపై తీసుకునే నిర్ణయ ప్రభావాలు డాలర్, బంగారం కదలికలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
డాలర్ ర్యాలీతో పసిడి పరుగు కష్టమే
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ పరుగు కొనసాగితే పసిడి వెనక్కు తగ్గడం ఖాయమని ఆర్జేఓ ఫ్యూచర్స్‌లో సీనియర్ మార్కెట్ విశ్లేషకులు ఫిల్ స్ట్రిబ్లీ అభిప్రాయపడ్డారు. గతవారం పసిడికి సంబంధించి రెండు ప్రధాన అంశాలు చూస్తే... ♦ ఒకటి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 1.50–1.75 శాతం శ్రేణి)లో ఎలాంటి మార్పు చేయలేదు. ♦ 18 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో అమెరికా నిరుద్యోగిత 3.9 శాతంగా నమోదయ్యింది. ఈ రెండు అంశాల నేపథ్యంలో వారంలో పసిడి న్యూయార్క్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్ ఔన్స్ (31.1గ్రా) ధర 9 డాలర్లు తగ్గి 1,316 డాలర్లకు పడింది. కేవలం నెలరోజుల వ్యవధిలో 1,368 డాలర్ల స్థాయి నుంచి పసిడి ప్రస్తుత స్థాయికి పడుతూ వచ్చింది. అయితే ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 89.10 కనిష్ట స్థాయిల నుంచి 4వ తేదీతో ముగిసిన శుక్రవారం నాటికి 92.42 స్థాయికి చేరింది. ఫిల్ స్ట్రిబ్లీ అభిప్రాయం ప్రకారం– జూన్‌లో ఫెడ్‌రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో డాలర్ ఇండెక్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారంపై తీవ్ర ఒత్తిడిని పెంచే అంశం ఇది. ఇక అంతర్జాతీయ ఉద్రిక్తతలూ తీవ్ర రూపం దాల్చే అవకాశాలు తక్కువే. ఉత్తరకొరియా విషయంలో ఇప్పటికే ఈ విషయం స్పష్టమైంది. సంబంధిత అంశాలన్నీ పసిడి ధరను తగ్గించే అవకాశాలే ఉన్నాయి. ‘‘ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ ఒక స్థిర స్థాయిలో తిరుగుతోంది. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు అవకాశాలు కనిపిస్తున్నాయి. గత గరిష్టస్థాయిలు 95ను తాకవచ్చన్నది మా అంచనా. గత నవంబర్‌లో డాలర్ ఇండెక్స్ ఇదే స్థాయిలో ఉంది. అప్పుడు పసిడి స్థాయి 1,275 డాలర్లు. ఇప్పుడు డాలర్ ర్యాలీ జరిగితే పసిడి 1,300 డాలర్ల స్థాయి దిగువకు పడిపోవచ్చు’’ అని ఫిల్ స్ట్రిబ్లీ అభిప్రాయపడ్డారు. అయితే 1,300 డాలర్లు పటిష్ట మద్దతు స్థాయని ఆయన అంచనావేస్తున్నారు. ఇక ఎగువ స్థాయిలో 1,370 డాలర్ల వద్ద పసిడికి పటిష్టం నిరోధం కనిపిస్తోంది. ఈ ఏడాది చివరి నుంచీ ఇదే శ్రేణిలో తిరిగిన పసిడి సమీప కాలంలో తన బాటను మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణుల విశ్లేషణ. అమెరికా వృద్ధి సంబంధ అంశాలు ఇందుకు ప్రధానంగా దోహదపడతాయని భావిస్తున్నారు. దేశీయంగా స్వల్ప నష్టాలు... డాలర్ మారకంలో రూపాయి బలహీనత (4వ తేదీతో ముగిసిన వారంలో 20 పైసలు నష్టంతో 66.82), అంతర్జాతీయంగా ప్రతికూలతల నేపథ్యంలో గడచిన వారంలో పసిడి స్వల్పంగా నష్టపోయింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర రూ.103 తగ్గి రూ.31,114వద్ద ముగిసింది. ఇక ముంబై ప్రధాన మార్కెట్లో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.170 చొప్పున తగ్గి రూ.31,160, రూ.31,010 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ.90 తగ్గి రూ.39,180 వద్ద ముగిసింది. -
అంతర్జాతీయంగా పడినా... దేశీయంగా పరుగు
అంతర్జాతీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గినా, భారత్‌లో మాత్రం పెరిగింది. దీనికి డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత ప్రధాన కారణం. వివరాల్లోకి వెళితే.. పసిడి అంతర్జాతీయ మార్కెట్– నైమెక్స్‌లో శుక్రవారం (20వ తేదీ)తో ముగిసిన వారంలో ఔన్స్ (31.1గ్రా) 10 డాలర్లు తగ్గి, 1,337 డాలర్లకు చేరింది. వారం మధ్యలో ఒక దశలో 1,357 డాలర్ల గరిష్ట స్థాయిని చూసింది. వాణిజ్య యుద్ధ భయాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, మరోదఫా ఫెడ్ ఫండ్ రేటు పెంపు ఊహాగానాలు, డాలర్ ఒడిదుడుకులు పసిడిపై ప్రభావం చూపాయి. 10 రోజుల క్రితం 1,369 డాలర్లను తాకి, కిందకు జారిన బాటలో 1,332 డాలర్ల వద్ద గట్టి మద్దతు లభించింది. తాజా పరిణామాలు పసిడి బుల్లిష్ ట్రెండ్‌లోనే కొనసాగుతుందనడానికి సూచికగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొంతకాలం 1,270 –1,370 డాలర్ల మధ్య శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని అంచనా. ఇక వారంలో డాలర్ ఇండెక్స్ స్వల్పంగా బలపడి 89.51 నుంచి 90.08కి చేరింది. దేశీయంగా మూడు వారాల్లో రూ.1,300 పెరుగుదల ఇక దేశీయంగా చూస్తే.. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజీ (ఎంసీఎక్స్)లో పసిడి ధర 10 గ్రాములకు 20వ తేదీతో ముగిసిన వారంలో రూ.314 ఎగసి, రూ.31,432కు చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర దాదాపు రూ.1,300 ఎగిసింది. అంతర్జాతీయంగా ధర తగ్గినప్పటికీ, దేశీయంగా పెరుగుదలకు డాలర్ మారకంలో రూపాయి బలహీనపడటం కారణం. అంతర్జాతీయంగా రూపాయి విలువ వారంలో 65.21 నుంచి 66.22కు పనతమైంది. ఒకదశలో 66.30పైకి క్షీణించడం గమనార్హం. ముంబై స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు 20వ తేదీతో ముగిసిన వారంలో రూ.495 చొప్పున పెరిగి రూ.31,465, రూ.31,315 వద్ద ముగిశాయి. రెండు వారాల్లో పసిడి పెరుగుదల రూ.1,000. ఇక వెండి కేజీ ధర భారీగా రూ.1,680 ఎగసి రూ.40,160కి చేరింది. -
రూపాయికి చమురు సెగ!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వేగంగా కిందకు జారుతోంది. శుక్రవారం ఏకంగా 32 పైసలు బలహీనపడింది. 66.12 వద్ద ముగిసింది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయికి రూపాయి పతనం ఇదే తొలిసారి. వరుసగా ఐదు రోజుల నుంచీ రూపాయి పతనం కొనసాగుతోంది. గురువారం రూపాయి ముగింపు 65.80. శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్‌లో ట్రేడింగ్ ప్రారంభంతోనే గ్యాప్‌డౌన్‌తో 66.06 వద్ద ప్రారంభమైంది. ఏప్రిల్‌లో ఇప్పటికి రూపాయి దాదాపు ఒక శాతం పతనమయ్యింది. కదలికలు ఇలా... 2016 నవంబర్‌లో 68.60 స్థాయికి పతనమైన రూపాయి, అందరి అంచనాలకూ భిన్నంగా భారత్ ఆర్థిక వ్యవస్థపై ఆశావహ పరిస్థితి, డాలర్ బలహీనత అంశాల నేపథ్యంలో... వేగంగా బలపడుతూ వచ్చింది. ఈ ఏడాది మొదటి నెల్లో 63.24ను చూసింది. అయితే అటు తర్వాత ఆర్థిక అనిశ్చితులతో దాదాపు మూడు నెలలు ఒడిదుడుకులతో బలహీనపడుతూ, క్రమంగా 65కు చేరింది. అటు తర్వాత కేవలం వారం రోజల్లో (0.88 శాతం పతనం) ప్రస్తుత స్థాయి 66.12కు చేరింది. ఈ వార్త రాస్తున్న సమయం రాత్రి 8.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మరింత బలహీనపడి 66.30 వద్ద ట్రేడవుతోంది. ఇదే తీరున ముగిస్తే, సోమవారం దాదాపు మరో 20పైసలు గ్యాప్‌డౌన్‌తో రూపాయి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బలహీనతకు కారణాలు... అంతర్జాతీయంగా క్రూడ్ ధరల అప్‌ట్రెండ్ తాజా పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ బ్రెంట్ ధర బేరల్‌కు గురువారం మూడేళ్ల గరిష్టస్థాయి 77.75 డాలర్లను తాకింది. మధ్య ప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు, అమెరికాలో పెరిగిన క్రూడ్ డిమాండ్, క్రూడ్ 100 డాలర్లకు చేరాలని సౌదీ అరేబియా భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఈ కమోడిటీ పరుగుకు దారితీస్తున్నాయి. తన చమురు అవసరాల్లో 80 శాతం భారత్ దిగుమతులపై ఆధారపడుతోంది. క్రూడ్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎగుమతులు–దిగుమతులకు మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు, తద్వారా క్యాడ్ (ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) ప్రతికూలతలు దేశానికి తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం సవాళ్లూ పొంచి ఉన్నాయి. ఆయా అంశాలు స్టాక్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి పరిస్థితులను సృష్టిస్తున్నాయి. దీనితో రూపాయి బలహీనత సమస్య తీవ్రమవుతోంది. జూన్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటును పెంచుతుందన్న అంచనాలూ రూపాయి బలహీనతకు దారితీస్తోంది. దేశానికి ఎఫ్‌డీఐల ప్రవాహం, రికార్డు స్థాయిలో (ప్రస్తుతం 424 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు కొనసాగింపు వంటి అంశాలు రూపాయి ఒడిదుడుకులను నియంత్రించే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. లైఫ్ టైమ్ గరిష్టంలో ఫారెక్స్ నిల్వలు 426 బిలియన్ డాలర్లకు చేరిక ముంబై: భారత విదేశీ మారక నిల్వలు లైఫ్ టైమ్ గరిష్టానికి చేరాయి. ఏప్రిల్ 13తో ముగిసిన వారాంతానికి 1.217 బిలియన్ డాలర్లు పెరిగి 426.082 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ నిల్వలు గణనీయంగా పెరగడం ఇందుకు తోడ్పడినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. విదేశీ కరెన్సీ అసెట్స్ 1.202 బిలియన్ డాలర్లు పెరిగి 400.978 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు యధాతథంగా 21.484 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతకు ముందు వారంలో ఫారెక్స్ నిల్వలు 503.6 మిలియన్ డాలర్లు పెరిగి 424.864 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది సెప్టెంబర్ 8న తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును దాటిన విదేశీ మారక నిల్వలు అప్పట్నుంచీ హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తున్నాయి.