దేశంలోని బ్యాంకుల్లో నగదు కొరత ఉన్నప్పటికీ బంగ్లాదేశ్‌కు డాలర్ కొరత ఏర్పడలేదు. మనీలాండరింగ్‌ను అరికట్టడం, అవినీతిని తగ్గించడం ద్వారా ఇంటర్‌బ్యాంక్ మార్కెట్‌లో డాలర్ల సరఫరా గణనీయంగా పెరిగింది.
బంగ్లాదేశ్ బ్యాంక్ గత రెండు నెలల్లో 1.5 బిలియన్ డాలర్ల విదేశీ బకాయిలను చెల్లించగలిగింది. అది కూడా తన డాలర్ నిల్వలు ఏ మాత్రం తరిగిపోకుండా. విదేశీ బకాయిల చెల్లింపుల కోసం బంగ్లాదేశ్ బ్యాంక్ ఇంటర్‌బ్యాంక్ మార్కెట్ నుండి డాలర్లను సమీకరించింది.
దేశంలో బ్యాంకులు గతంలో డాలర్ కొరతతో ఇబ్బంది పడ్డాయని, అయితే ఇప్పుడు చాలా వరకు డాలర్లు మిగులుతో ఉన్నాయని బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ అహ్సన్ హెచ్ మన్సూర్ వివరించారు. నగదు కొరత ఉన్నప్పటికీ, డాలర్ల సరఫరా మాత్రం స్థిరంగా ఉందని వివరించారు.
డాలర్ల నిల్వ ఇలా..
ప్రవాసులు ప్రాథమికంగా బ్యాంకులకు డాలర్లలో చెల్లింపులను పంపుతారు. దీంతో పాటు ఎగుమతి ఆదాయాలు కూడా డాలర్లలో జమవుతాయి. దీంతో బ్యాంకుల్లో డాలర్ నిల్వలు పెరుగుతున్నాయి. వీటిపై బ్యాంకులు లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (LC)ని తెరుస్తాయి. లేదా అవసరమైనప్పుడు డాలర్లను బంగ్లాదేశ్ బ్యాంక్‌కి విక్రయిస్తాయి. సెంట్రల్ బ్యాంక్ ఈ డాలర్లను కొనుగోలు చేసి తన నిల్వలకు జోడిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment