Reserves
-
డాలర్లు దండిగా.. కొరతలోనూ చింత లేని బంగ్లాదేశ్!
దేశంలోని బ్యాంకుల్లో నగదు కొరత ఉన్నప్పటికీ బంగ్లాదేశ్‌కు డాలర్ కొరత ఏర్పడలేదు. మనీలాండరింగ్‌ను అరికట్టడం, అవినీతిని తగ్గించడం ద్వారా ఇంటర్‌బ్యాంక్ మార్కెట్లో డాలర్ల సరఫరా గణనీయంగా పెరిగింది.బంగ్లాదేశ్ బ్యాంక్ గత రెండు నెలల్లో 1.5 బిలియన్ డాలర్ల విదేశీ బకాయిలను చెల్లించగలిగింది. అది కూడా తన డాలర్ నిల్వలు ఏ మాత్రం తరిగిపోకుండా. విదేశీ బకాయిల చెల్లింపుల కోసం బంగ్లాదేశ్ బ్యాంక్ ఇంటర్‌బ్యాంక్ మార్కెట్ నుండి డాలర్లను సమీకరించింది.దేశంలో బ్యాంకులు గతంలో డాలర్ కొరతతో ఇబ్బంది పడ్డాయని, అయితే ఇప్పుడు చాలా వరకు డాలర్లు మిగులుతో ఉన్నాయని బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ అహ్సన్ హెచ్ మన్సూర్ వివరించారు. నగదు కొరత ఉన్నప్పటికీ, డాలర్ల సరఫరా మాత్రం స్థిరంగా ఉందని వివరించారు.డాలర్ల నిల్వ ఇలా..ప్రవాసులు ప్రాథమికంగా బ్యాంకులకు డాలర్లలో చెల్లింపులను పంపుతారు. దీంతో పాటు ఎగుమతి ఆదాయాలు కూడా డాలర్లలో జమవుతాయి. దీంతో బ్యాంకుల్లో డాలర్ నిల్వలు పెరుగుతున్నాయి. వీటిపై బ్యాంకులు లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (LC)ని తెరుస్తాయి. లేదా అవసరమైనప్పుడు డాలర్లను బంగ్లాదేశ్ బ్యాంక్‌కి విక్రయిస్తాయి. సెంట్రల్ బ్యాంక్ ఈ డాలర్లను కొనుగోలు చేసి తన నిల్వలకు జోడిస్తుంది. -
మళ్లీ వార్తల్లోకి జార్ఖండ్: ఇక ఆ ఇండస్ట్రీకి తిరుగే లేదు!
Jharkhand Lithium Reserves: ప్రపంచానికి మైకాను ఎగుమతి చేసిన జార్ఖండ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది దేశంలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిల్వలను గుర్తించిన తరువాత తాజాగా జార్ఖండ్‌లో అపారమైన నిల్వలను గుర్తించారు. జమ్మూ కశ్మీర్ , రాజస్థాన్, కర్ణాటకలలో లిథియం నిల్వలు కనుగొన్న కొన్ని నెలల తర్వాత, జార్ఖండ్‌లో కూడా కాస్మిక్ ఖనిజ నిల్వలను గుర్తించడం విశేషం. నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (NMET) జియోలాజికల్ సర్వే నిర్వహించి, జార్ఖండ్‌లో కోడెర్మా , గిరిడిహ్‌లో లిథియం సహా అరుదైన ఖనిజాల నిల్వలున్న ప్రాంతాలుగా గుర్తించింది. ఈ ప్రాంతాలతో పాటు తూర్పు సింగ్భూమ్ ,హజారీబాగ్‌లలో అన్వేషణ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను 30శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం లిథియం కోసం ప్రధానంగా చైనాపైనా ఎక్కువగా ఆధారపడుతోంది. జార్ఖండ్‌లో లిథియం నిల్వల ఆవిష్కరణతో దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దూసుకుపోనుంది. లిథియం ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తే, అది చౌకైన ఎలక్ట్రిక్ బ్యాటరీలకు దారితీస్తుందని , చివరికి ఎలక్ట్రిక్ వాహనాల ధరలను మరింత దిగి వవస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇపపటికే జార్ఖండ్ ప్రభుత్వం లిథియం మైనింగ్ సామర్థ్యాలను అభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభించింది. (స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?) లిథియంను ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు , ఇతర గాడ్జెట్ల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు. కోరలు చాస్తున్న కాలుష్యం, ఉద్గార నిబంధనల కారణంగా ప్రపంచం వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EVలు)వైపు మొగ్గుతున్నాయి. దీంతో లిథియంకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రపంచానికి కనీసం 2 బిలియన్ల (200 కోట్లు) EVలు అవసరమవుతాయి .వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకారం 2025 నాటికి లిథియం కొరత ఏర్పడవచ్చు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే లిథియం నిల్వలున్నాయి. లిథియం మైనింగ్ , ప్రాసెసింగ్‌లో చైనా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ప్రస్తుతం లిథియంలో ఎక్కువ భాగం చైనా, ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా ద్వారా సరఫరా చేయబడుతోంది. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్, బీహార్ , పశ్చిమ బెంగాల్ చుట్టూ ఉన్న తూర్పు రాష్ట్రం ఇప్పటికే యురేనియం, మైకా, బాక్సైట్, గ్రానైట్, బంగారం, వెండి, గ్రాఫైట్, మాగ్నెటైట్, డోలమైట్, ఫైర్‌క్లే, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, బొగ్గు (32 శాతం), ఇనుము, రాగి (భారతదేశంలో 25 శాతం) నిల్వలకు ప్రసిద్ధి చెందింది. -
సంబరంలో దాగిన సంకటం!
వర్తమాన యుగంలో అపురూపమైన, అత్యవసరమైన ఒక ఖనిజం కోసం ప్రపంచవ్యాప్తంగా భూభౌతిక శాస్త్రవేత్తలు నిరంతరాన్వేషణలో తలమునకలైన వేళ ‘నేనున్నాన్నంటూ భారత్‌లోనే అది ప్రత్యక్షం కావటం సంబరం చేసుకోవాల్సిన సందర్భమే. అందుకే జమ్మూ, కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో నాణ్యమైన లిథియం నిక్షేపాలున్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ప్రకటించినప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి లిథియం నిక్షేపాలు మన దేశంలో బయటపడటం ఇది మొదటిసారేమీ కాదు. 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలో కూడా లిథియం ఆచూకీ కనుక్కున్నారు. అయితే ఆ నిల్వలు 1,600 టన్నులు మాత్రమే. ఇప్పుడు బయటపడిన నిక్షేపాలు దాదాపు 60 లక్షల టన్నులు. వర్తమాన ప్రపంచాన్ని నడిపిస్తున్న శిలాజ ఇంధనాలు క్రమేపీ తరిగిపోతున్నాయని, పైగా వాటి వినియోగం కారణంగా పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నదనీ అర్థమయ్యాక ప్రత్యామ్నాయాల కోసం ఆత్రుతపడటం మొదలైంది. ఆ క్రమంలో ‘హరిత ఇంధ నాల’ పేరిట చాలానే ఉనికిలోకొచ్చాయి. అయితే వీటికున్న పరిమితులను అధిగమించటంలో ఇంకా పూర్తి స్థాయి విజయం సాధ్యం కాలేదు. ఈ తరుణంలో లిథియం–అయాన్ బ్యాటరీ రూపకల్పనకు తోడ్పడగల పరిశోధన చేసినందుకు 2019 సంవత్సరానికి ముగ్గురు శాస్త్రవేత్తలకు కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి రావటం ప్రత్యామ్నాయ ఇంధన వెతుకులాటలో కీలక మలుపు. ఆ పరిశోధనల పర్యవసానంగానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల రంగంలో ఊహించని అభివృద్ధి సాధ్యమైంది. 1991లో ఒక జపాన్ ఎలక్ట్రానిక్స్ సంస్థ లిథియం అయాన్ బ్యాటరీ అభివృద్ధి చేశాక కంప్యూటర్ ఎక్కడికైనా తీసుకెళ్లే ఉపకరణమైంది. అప్పుడప్పుడే వస్తున్న డిజిటల్ కెమెరాల సైజు గణనీయంగా తగ్గింది. సెల్ఫోన్ల ఆగమనంలో లిథియం అయాన్ బ్యాటరీ పాత్ర అసాధారణం. గత కొన్నేళ్లుగా విద్యుత్‌తో నడిచే వాహనాల తయారీ కూడా జోరందుకుంది. ఇంకా పేస్మేకర్లకూ, అంతరిక్ష నౌకలకూ, జలాంతర్గాములకూ లిథియం హైడ్రాక్సైడ్ కీలకం. ఇక బైపోలార్ వ్యాధి నివా రణకు తోడ్పడే ఔషధాల ఉత్పత్తిలో లిథియం కార్బొనేట్ ఎంతో అవసరమని ఇటీవల కనుగొన్నారు. 2020లో ప్రపంచ లిథియం వినియోగం కేవలం 56,000 టన్నులైతే అది ఇప్పటికే రెట్టింపు దాటింది. ఏటా ఆ వినియోగం 22 లక్షల టన్నులకు చేరుకోవచ్చని ఒక అంచనా. ‘తెల్ల బంగారం’గా పిలిచే లిథియంపై ఆధారపడటం ఎక్కువవుతున్న తరుణంలో దాని ఖరీదు కూడా పెరుగుతోంది. మన దేశం 2020–21లో రూ. 173 కోట్ల విలువైన లిథియంను దిగుమతి చేసుకోగా, ఆ ఏడాదే మరో 8,811 కోట్ల రూపాయల విలువైన లిథియం అయాన్ బ్యాటరీలు కొనుగోలు చేసింది. నిరుడు ఈ వ్యయం దాదాపు రెట్టింపయింది. రాగల సంవత్సరాల్లో ఇదింకా పెరగటం ఖాయం. కనుకనే లిథియం నిల్వల కోసం అన్వేషణ సాగిస్తూనే ఉంది. గత అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘా లయల్లో 20 ప్రాజెక్టులు ప్రత్యేకించి లిథియం కోసమే పనిచేస్తున్నాయి. ఇవిగాక మూడు ప్రభుత్వ రంగ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో ఖనిజ్ బిదేష్ ఇండియా(కబిల్) పేరిట ఒక సంస్థ ఏర్పడి ఆస్ట్రేలియా, అర్జెంటీనా లిథియం గనుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూ, కశ్మీర్లో అపారంగా లిథియం నిక్షేపాలున్నట్టు వెల్లడికావటం ఉత్సాహాన్నిచ్చేదే. ప్రపంచంలో భారీయెత్తున లిథియం నిల్వలున్న దేశం బొలీవియా అయితే...ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న చిలీ, ఆస్ట్రేలియా, చైనాల తర్వాత మనమే. రాశిలో అమెరికా కన్నా కూడా మనం ఎక్కువే. ఈ నిక్షేపాల నాణ్యతనూ, వాస్తవ వినియోగ సామర్థ్యాన్నీ మరిన్ని పరీ క్షల తర్వాతగానీ పూర్తిగా నిర్ధారించలేమన్నది శాస్త్రవేత్తల మాట. ఇందుకు రెండేళ్ల సమయం పడు తుంది. అంతా సవ్యంగా ఉందనుకున్నాక ఉత్పత్తి మొదలుకావడానికి మరో అయిదారేళ్లు తప్పదు. ఈ ప్రక్రియంతా పర్యావరణ హితంగా జరగటం సాధ్యమేనా? ఎందుకంటే ఇప్పుడు నిక్షేపాలు బయటపడిన ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో ఉంది. పర్యావరణపరంగా వచ్చే ప్రమాదం గురించి శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు చేస్తున్న హెచ్చరికలు బేఖాతరుచేసి దశాబ్దాలుగా జలవిద్యుత్ ప్రాజెక్టులూ, ఇతర నిర్మాణాలూ చేపట్టిన పర్యవసానంగా ఉత్తరాఖండ్‌లోని జోషీ మ పట్టణం ఎలా కుంగిపోతున్నదో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. భూకంప ముప్పు రీత్యా హిమాలయ పర్వత ప్రాంతాలు అత్యంత సున్నితమైనవి. లిథియం నిక్షేపాల వెలికితీత ఆ ముప్పును మరింత పెంచేలా మారకూడదు. ఉక్కు తెరల వెనక కాలక్షేపం చేసే చైనాలో లిథియం వెలికితీత వల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా వెనకబడిన దక్షిణ అమెరికా దేశాల్లో జనం ఎదుర్కొంటున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఒక టన్ను లిథియం ఉత్పత్తికి 22 లక్షల లీటర్ల నీరు అవసరం కావటంతో చిలీ, బొలీవియా, అర్జెంటీనా దేశాల్లో స్థానికంగా ఉన్న జలవన రులన్నీ హరించుకుపోతున్నాయి. నేల, చెట్టూ, చేమా దెబ్బతింటున్నాయి. దాంతో స్థానిక ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. ఇలా పర్యావరణాన్ని కాటేసే లిథియంకు బదులు తక్కువ నష్టం ఉండే ఇనుము, సిలికాన్ వంటి లోహాలపై దృష్టిపెట్టాలన్న డిమాండ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఊపందు కుంది. ఏదేమైనా జమ్మూ, కశ్మీర్ లిథియం నిక్షేపాల విషయంలో ఆచితూచి అడుగేయటం అన్ని విధాలా శ్రేయస్కరం. -
భారత్‌లో అత్యంత విలువైన ఖనిజం.. అమెరికా కంటే మన దగ్గరే అధికం
ఆధునిక యుగంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యం నానాటికీ పెరిగిపోతోంది. సౌర విద్యుదుత్పత్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ప్రపంచ దేశాలు ఎప్పుడో గుర్తించాయి. ఇక స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోతే పొద్దు గడవదు. మరి ఈ అవసరాలన్నీ తీరాలంటే ఏం కావాలో తెలుసా? లిథియం. అత్యంత విలువైన ఈ ఖనిజాన్ని పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం పెద్దగా ఉండదు. ఎందుకంటే 59 లక్షల టన్నుల నాణ్యమైన లిథియం నిల్వలు జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం కొలువైన కొండల దిగువన సలాల్ హైమన గ్రామం వద్ద ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ఇటీవల గుర్తించింది. భారత్‌లో ఈ స్థాయిలో లిథియం నిల్వలు బయటపడడం ఇదే తొలిసారి! తవ్వకాలతో నీటి నిల్వలకు ముప్పు! ఖనిజ తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు తప్పదు. లిథియం తవ్వకాల కారణంగా విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందని, ప్రకృతిపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లిథియం తవ్వకాలు చేపట్టిన ప్రాంతాల్లో నీటి నిల్వలు అంతరించిపోతాయని హెచ్చరిస్తున్నారు. భూమిపై తేమ తగ్గిపోయి, కరువు నేలగా మారుతుందని పేర్కొంటున్నారు. ఒక టన్ను లిథియం కోసం తవ్వకాలు సాగిస్తే ఏకంగా 15 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని సమాచారం. ఒక టన్ను లిథియం తవ్వకానికి దాదాపు రూ.64 లక్షల ఖర్చవుతుంది. లిథియం వెలికితీతకు భారీస్థాయిలో నీరు అవసరం. లిథియం అంటే? తెల్ల బంగారంగా పిలిచే లిథియం అనే పదం గ్రీక్ భాషలోని లిథోస్ (రాయి) నుంచి పుట్టింది. ఇది ఆల్కలీ మెటల్ గ్రూప్‌కు చెందినది. తేలికగా, మృదువుగా, తెల్లటి రంగులో వెండిలాగా మెరిసే లోహం. పీరియాడిక్ గ్రూప్ 1(ఐఏ)లో లిథియంను చేర్చారు. ఇది భూగోళంపై సహజంగా ఏర్పడింది కాదు. అంతరిక్షంలో సంభవించిన పేలుళ్ల వల్ల ఏర్పడినట్లు గుర్తించారు. బిగ్‌బ్యాంగ్ వల్ల విశ్వం పుట్టిన తొలినాళ్లలో భూగోళంపై లిథియం నిల్వలు మొదలైనట్లు తేల్చారు. ఇతర గ్రహాలపైనా లిథియం ఉంది. 500 పీపీఎం నాణ్యత సాధారణ లిథియం నాణ్యత 220 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటుంది. కానీ కశ్మీర్లో కనుగొన్న లిథియం నాణ్యత ఏకంగా 500 పీపీఎంగా ఉండటం విశేషం. లిథియంను ఇతర లోహాలతో కలిపి మిశ్రమ లోహాలను తయారు చేస్తారు. విద్యుత్‌తో నడిచే వాహనాల బ్యాటరీల తయారీకి లిథియం కీలకం. ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర విద్యుత్ పరికరాల బ్యాటరీల తయారీలోనూ ఉపయోగిస్తారు. గాజు, సెరామిక్ పరిశ్రమల్లో లిథియం వాడకం అధికంగా ఉంది. పవన, సౌర విద్యుత్‌ను నిల్వచేసే బ్యాటరీలు లిథియంతో తయారవుతాయి. రీచార్జి చేయడానికి వీల్లేని బ్యాటరీల్లోనూ వాడుతారు. పేస్మేకర్లు, బొమ్మలు, గడియారాల్లోని బ్యాటరీల్లో లిథియం ఉంటుంది. 2030 నాటికి మన దేశంలో 27 గిగావాట్ల గ్రిడ్–స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ కావాలని అంచనా. అంటే రానున్న రోజుల్లో లిథియం అవసరం ఎన్నో రెట్లు పెరిగిపోనుంది. అంతర్జాతీయంగా లిథియం మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2008 నుంచి 2018 నాటికి దీనికి వార్షిక ఉత్పత్తి 25,400 టన్నుల నుంచి 85,000 టన్నులకు చేరింది. ఐదో స్థానంలో భారత్ 3.9 కోట్ల టన్నులతో బొలీవియా ప్రపంచంలో తొలిస్థానంలో ఉంది. చిలీ, ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, అర్జెంటీనా తదితర దేశాల్లో కోట్ట టన్నుల నిల్వలున్నట్లు కనిపెట్టారు. భారత్‌లో కర్నాటకలోని మండ్యా జిల్లాలో 1,600 టన్నుల లిథియం ఉన్నట్లు రెండేళ్ల క్రితం గుర్తించారు. తాజాగా కశ్మీర్లో బయట పడ్డ 59 లక్షల టన్నులతో కలిపితే ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో నిలుస్తోంది. అమెరికాలో కంటే భారత్‌లోనే అధిక నిల్వలున్నాయి. ఉత్పత్తి, ఎగుమతుల్లో ఆస్ట్రేలియా, చిలీ, చైనా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా నుంచి భారత్ లిథియంను దిగుమతి చేసుకుంటోంది. ముడి లిథియంను శుద్ధి చేసి, బ్యాటరీల తయారీకి అనువైన లోహంగా మార్చడం కఠినమైన ప్రక్రియ. ఇందులో సాధించేదాకా మరో రెండేళ్లపాటు దిగుమతులపై ఆధారపడక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఏ దేశంలో ఎన్ని నిల్వలు(టన్నుల్లో) దేశం లిథియం నిల్వలు బొలీవియా 3,90,00,000 చిలీ 1,99,03,332 ఆస్ట్రేలియా 77,17,776 చైనా 66,90,180 భారత్ 59,00,000 అమెరికా 57,62,917 – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫారెక్స్.. ‘డౌన్’ టర్న్
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్) మూడు వారాల అప్‌ట్రెండ్ తర్వాత మళ్లీ దిగువముఖంగా పయనించాయి. ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 1.49 బిలియన్ డాలర్లు తగ్గి, 575.267 బిలియన్ డాలర్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా చూసే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ భారీగా డాలర్లు వ్యయం చేయడంతో గరిష్ట స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లుకుపైగా పడిపోయాయి. అయితే ఫిబ్రవరి 3కు ముందు వారానికి ముందు 21 రోజల్లో పురోగతి బాటన పయనించాయి. విభాగాల వారీగా చూస్తే.. డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసిన వారంలో 1.3 బిలియన్ డాలర్లు తగ్గి, 508 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 246 మిలియన్ డాలర్లు తగ్గి 43.781 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 66 మిలియన్ డాలర్లు పెరిగి, 18.544 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ఐఎంఎఫ్ వద్ద భారత్ రిజర్వ్స్ పరిస్థితి 9 మిలియన్ డాలర్లు పెరిగి, 5.247 బిలియన్ డాలర్లకు చేరింది. -
అడుగంటిన విదేశీ మారక నిల్వలు
ఇస్లామాబాద్: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంతో అష్టకష్టాలు పడుతున్న పాకిస్తాన్‌కు విదేశీ రుణాలు సైతం దొరకడం లేదు. 2022లో జూలై నుంచి డిసెంబర్ వరకు కేవలం 5.6 బిలియన్ డాలర్ల రుణాలు లభించాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) రుణ కార్యక్రమాన్ని పునరుద్ధరించే విషయంలో సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు. విదేశీ మారక నిల్వలు 3.1 బిలియన్ డాలర్లకు అడుగంటాయి. కొత్త అప్పులు పుట్టడం లేదు. తీసుకున్న అప్పులపై వడ్డీలు భారీగా పెరిగిపోతున్నాయి. వాటి చెల్లింపుకూ అప్పులే గతి! క్రెడిట్ రేటింగ్ దెబ్బ పాకిస్తాన్‌కు డిసెంబర్లో 532 మిలియన్ డాలర్ల రుణం లభించింది. ఇందులో 44 శాతం అంటే.. 231 మిలియన్ డాలర్లను ఆసియన్ అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) రుణంగా ఇచ్చింది. పాక్ ప్రభుత్వం చాలా దేశాలకు చెల్లింపులు చేయాల్సి ఉంది. గత ఏడు రోజుల్లో చైనా ఆర్థిక సంస్థలకు 828 మిలియన్ డాలర్లు చెల్లించింది. -
ఆర్బీఐ నుంచి రూ లక్ష కోట్లు రానున్నాయ్..
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంక్ మిగులు నిల్వల నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ లక్ష కోట్లు బదలాయించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్బీఐ బోర్డు భేటీలో ఈ దిశగా కసరత్తు సాగిందని, ఆ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్‌పై కమిటీని ఏర్పాటు చేసిందని మెరిల్ లించ్ వెల్లడించిన నోట్ పేర్కొంది. ఈ కమిటీ ఆర్బీఐలో రూ లక్ష నుంచి రూ మూడు లక్షల కోట్ల మిగులు నిల్వలను గుర్తించి తదనుగుణంగా కేంద్రానికి బదలాయించే మొత్తాన్ని నిర్ణయిస్తుందని తెలిపింది. ఎన్నికల నేపథ్యంలో అదనపు నగదు కోసం వేచిచూస్తున్న ప్రభుత్వం ఆర్బీఐ మిగులు నిధులపై కన్నేసిందని గత కొంత కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే ఆరునెలల్లో ప్రభుత్వానికి ఆర్బీఐ నిధుల అవసరమేమీ లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నా ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. జీఎస్టీ వసూళ్లు తగ్గడం, రుణాలు, ఇతర వనరుల ద్వారా నగదు సమీకరణ అవకాశాలు తగ్గడంతో ఆర్బీఐ మిగులు నిల్వలపై కేంద్రం భారీ ఆశలే పెట్టుకుందని భావిస్తున్నారు. మరోవైపు ఆర్బీఐ నగదు నిల్వలను బదలాయించడం ద్వారా తిరిగి ఆర్బీఐకి ప్రభుత్వం బాండ్లు జారీ చేస్తుందని ఫలితంగా ద్రవ్య లోటు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
'నీట్' పై ముగిసిన వాదనలు
ఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో దేశవ్యాప్త ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్ నుంచి తమను మినహాయించాలని కోరుతూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు వైద్య కళాశాలలు దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. న్యాయస్థానం సోమవారం సాయంత్రం వెబ్సైట్లో తీర్పును అప్లోడ్ చేయనుంది. ఈ ఏడాదికి రాష్ట్రాలకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. -
కర్నాటకలో ‘ఆపరేషన్రెడ్’..!
ఎర్రచందనం నిల్వలపై ముప్పేట దాడి చిత్తూరు (అర్బన్): ఆపరేషన్‌రెడ్‌లో భాగంగా చిత్తూరు పోలీసులు కర్నాటకలోని ఎర్ర చందనం నిల్వలపై దాడులు చేశారు. ఈ ఆపరేషన్‌లో కటిగనహళ్లికు చెందిన ఇర్ఫాన్‌ఖాన్ (22), సయ్యద్ ముబారక్ (22) అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఆరు టన్నుల ఎర్రచందనం దుంగలను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నుంచి పోలీసులు కర్నాటకలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. బెంగళూరు సమీపంలోని గిడ్డప్పన్హళ్లిలోని ఫాసీ అనే వ్యక్తికి చెందిన గోదాములో 6 టన్నుల దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా ప్రధాన స్మగర్లకు సహాయకులుగా ఉన్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
పప్పులు, నూనెలపై ‘నియంత్రణ’ పెంపు
ఏడాది పెంపునకు కేబినెట్ నిర్ణయం: రవిశంకర్ వెల్లడి * అక్రమ వ్యాపారం, నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు ఆస్కారం * రిజిస్టర్డ్ గోదాముల్లో పప్పులు, నూనెల నిల్వలపైనా పరిమితులు న్యూఢిల్లీ: పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజల అక్రమ వ్యాపారం, అక్రమ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వాలు నిరోధించేందుకు చర్యలు తీసుకునే వీలు కల్పిస్తూ నిత్యావసర సరుకుల చట్టం కింద జారీ చేసిన నియంత్రణ ఉత్తర్వు గడువును మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. పప్పుధాన్యాలు, వంట నూనెలు, వంట నూనె గింజల కొరత దృష్ట్యా.. వాటిని వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూసేందుకు వాటిని నియంత్రణ ఉత్తర్వు కిందకు తీసుకురావాలని 2014లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఉత్తర్వు గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ నియంత్రణ ఉత్తర్వు గడువును ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి 2016 సెప్టెంబర్ 30వ తేదీ వరకూ పొడిగించినట్లు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ అనంతరం టెలికం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ విలేకరులకు తెలిపారు. పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజలకు సంబంధించి.. రిజిస్టర్ చేసుకున్న గోదాముల్లో నిల్వపై పరిమితులు పెట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. నియంత్రణ ఉత్తర్వు గడువు పెంపు వల్ల.. ఆయా సరుకుల అక్రమ వ్యాపారం, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిల్వలపై పరిమితులు విధించటం, లెసైన్సు నిబంధనలు కఠినం చేయటం వంటి చర్యలు చేపట్టవచ్చునని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. తద్వారా అంతర్గత మార్కెట్లలో ఆయా సరుకులు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు ధరలు కూడా నియంత్రణలో ఉండేలా చూడవచ్చునని పేర్కొంది. నిత్యావసర సరుకులు, వాటి ధరలు.. ప్రత్యేకించి పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చూసేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపింది. ‘కందులు, మినుములు వంటి పప్పుధాన్యాలపై ఫ్యూచర్ ట్రేడింగ్‌ను ఇప్పటికే నిలిపివేశాం. పప్పుధాన్యాల ఎగుమతిని నిషేధించాం. వాటి దిగుమతిపై సుంకం తొలగించాం. దేశీయ మార్కెట్లో పప్పుధాన్యాల లభ్యతను పెంచేందుకు 5,000 టన్నుల కందులు, 5,000 టన్నుల మినుముల దిగుమతికి ఆదేశాలిచ్చాం. ఇవి త్వరలోనే రానున్నాయి. వీటివల్ల ధరల పరి స్థితి కాస్త సరళమవుతుంది’ అని వివరించింది. ఇదిలావుంటే.. పర్యాటక రంగంలో ద్వైపాక్షిక సహకారం కోసం భారత్, కంబోడియా దేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
ధాన్యంపై వేటు... మద్యానికి చోటు !
నరసరావుపేటవెస్ట్: రైతులు పండించిన ధాన్యం, అపరాలతోపాటు ఎరువులు నిల్వ ఉంచే సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లు ఇప్పుడు మద్యం నిల్వలకు చిరునామాగా మారాయి. ఒకవైపు రైతుకు గిట్టుబాటు ధరలేక, ఇళ్ల వద్ద దాచిఉంచే సౌకర్యంలేక మార్కెట్‌యార్డులో నిల్వచేద్దామనుకుంటే ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం మాత్రం మద్యం నిల్వలను దాచి ఉంచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వివరాలను పరిశీలిస్తే... ఆర్టీసీ బస్టాండ్, క్వార్టర్లకు ఎదురుగా గుంటూరు-కర్నూలు రహదారిలో వేర్‌హౌసింగ్ గోడౌన్లు వాటి పక్కనే మార్కెట్ యార్డు ఉంది. వేర్‌హౌసింగ్ గోడౌన్లలో ధాన్యం, లెవీ బియ్యం, ఎరువులు, అపరాలు నిల్వ చేస్తుంటారు. పక్కనే ఉన్న మార్కెట్‌యార్డు గోడౌన్లలో ఆత్మబంధు పథకం కింద ధాన్యం నిల్వ ఉంచుతున్నారు. ఒక గోడౌన్ పౌరసరఫరాల శాఖ ఆధీనంలో ఉంది. ఇటీవల మద్యం నిల్వలు ఉంచే ఏపీ బేవరేజెస్ గోడౌన్లను పన్ను చెల్లించలేదని ఆదాయ పన్నుశాఖ సీజ్ చేసింది. దీంతో వారం రోజుల పాటు బార్లు, మద్యం షాపులకు సరఫరా నిలిచిపోయింది. మద్యం వ్యాపారులతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం గిలగిలలాడింది. ఆదాయ పన్ను చెల్లించకుండానే యుద్ధప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్‌శాఖతో మరో గోడౌన్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేయటంతో వెంటనే వారు వేర్‌హౌసింగ్ గోడౌన్‌ను ఎంపికచేసి అందులో మద్యం నిల్వ ఉంచి వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే గోడౌన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం నిల్వ ఉంచితే టీడీపీ నాయకులు ఎదో అపరాధం జరిగినట్లుగా ఊరూ, వాడా కోడై కూశారు. యార్డులో ధాన్యం దాచుకునేందుకు స్థలమేదీ? ధాన్యానికి ప్రస్తుతం మద్దతు ధరలేకపోవటంతో రైతులు దాచుకునేందుకు యార్డుకు తీసుకొస్తున్నారు. గోదాములు నిండిపోయినందున దాచుకునే అవకాశం లేదని యార్డు అధికారులు తిరస్కరిస్తుండటంతో రైతులు దిగాలుగా వెళ్లిపోతున్నారు. ఎటూ అవకాశంలేని రైతులు యార్డులోని రేకుల షెడ్డుకిందనే ధాన్యం నిల్వచేసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల ప్రయోజనాలను గురించి ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న మద్యం నిల్వలకు మాత్రం గోడౌన్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయటం గమనార్హం. రైతులన్నా, రైతు పండించిన పంటలన్నా తెలుగుదేశం ప్రభ -
రూ.5.98కోట్ల నిల్వలు!
⇒ తాండూరు మార్కెట్ యార్డులో ⇒ పేరుకుపోతున్న పప్పుధాన్యాల ఉత్పత్తులు ⇒ ధరల తగ్గుదలతో విక్రయానికి ఆసక్తి చూపని రైతులు తాండూరు: పప్పుధాన్యాల విక్రయానికి రైతులు ఆసక్తి చూపకపోవడంతో తాండూరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో దాదాపు రూ.5.98 కోట్ల విలువైన నిల్వలు పేరుకుపోయాయి. నిన్నా మొన్నటి వరకు జోరుగా సాగిన ఉత్పత్తుల క్రయవిక్రయాలు పడిపోయాయి. వేరుశనగలకు ధరలు తగ్గటంతో విక్రయాలపై ప్రభావం పడింది. దీంతో కోట్లాది రూపాయల విలువ చేసే కందులు, వేరుశనగల ఉత్పత్తుల నిల్వలు యార్డులో పేరుకుపోయాయి. ముఖ్యంగా వేరుశనగల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. కమీషన్ ఏజెంట్ల సమావేశం, హమాలీల లోడింగ్ వ్యవహారంతో సోమవారం యార్డులో బీట్లు నిలిచిపోయాయి. మంగళవారం బీట్లు ప్రారంభమైనా ధరలు తగ్గటంతో రైతులు ఉత్పత్తుల విక్రయానికి ముందుకురాలేదు. మొన్న రూ.47.15 లక్షల వ్యాపారం శనివారం యార్డులో క్వింటాలు కందులకు గరిష్టంగా రూ.6,210, కనిష్టంగా రూ.5,900, సగటు ధర రూ.6వేలు పలికింది. సగటు ధర రూ.6వేల ప్రకారం సుమారు రూ.30 లక్షల విలువైన కందుల కొనుగోళ్లు జరిగాయి. అదేవిధంగా క్వింటాలు వేరుశనగలకు గరిష్టంగా రూ.5వేలు, కనిష్టంగా రూ.4,700, సగటు ధర రూ.4,900 వచ్చింది. సగటు ధర లెక్కన రూ.17.15 లక్షల విలువైన వేరుశనగల విక్రయాలు జరిగాయి. మొత్తం శనివారం ఒక్క రోజు రూ.47.15 లక్షల పప్పుధాన్యాల వ్యాపారం జరిగింది. ఆదివారం సెలవు, సోమవారం బీట్లు జరగలేదు. రూ.16.98 లక్షల వ్యాపారం మంగళవారం రూ.16.98 లక్షల వ్యాపారమే కావడం గమనార్హం. సోమవారం బీట్లు నిలిచిపోయిన నేపథ్యంలో మంగళవారం ఇంతకు రెట్టింపు విక్రయాలు జరగాల్సి ఉండగా తగ్గాయి. కందులకు సగటు ధర రూ.6వేలు, వేరుశనగలకు రూ.4,800 ధర పలికింది. శనివారం ధరలతో వీటిని పోల్చితే కందుల ధరలో మార్పు లేకపోయినప్పటికీ వేరుశనగల సగటు ధరలో సుమారు రూ.100 తగ్గింది. దీంతో యార్డులో వేరుశనగలు పేరుకుపోయాయి. మంగళవారం పలికిన సగటు ధర ప్రకారం ప్రస్తుతం యార్డులో సుమారు రూ.2.94కోట్ల విలువ చేసే వేరుశనగల నిల్వలు పేరుకుపోయాయని అంచనా. కందులు ఇలా... కందులకు ఇంకా అధిక ధర వస్తుందనే ఆశతో రైతులు విక్రయానికి ఆసక్తి చూపడం లేదు. రూ.6,100-రూ.6,200 ధర పెరుగుతుందనే ఆశతో రైతులు పంటను అమ్మడం లేదు. దీంతో రూ.3కోట్ల విలువ చేసే కందుల నిల్వలు కూడా యార్డులో పేరుకుపోయినట్టు ఓ వ్యాపారి చెప్పారు. కందులకు ఇంకా ధర పెరుగుతుందని, వేరుశనగలకు ధర తగ్గిందనే కారణాలతోనే రైతులు తమ దిగుబడులను అమ్మడం లేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
గుర్తింపు కార్డు చూపితేనే యాసిడ్ అమ్మకం
హైదరాబాద్: తెలంగాణలో యాసిడ్, రసాయన పదార్థాల నిల్వలు, అమ్మకాలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ముసాయిదా నిబంధనలను రూపొందించింది. ఫొటో, గుర్తింపు కార్డు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు సేకరించిన తర్వాతే వాటిని విక్రయించాలని స్పష్టంచేసింది. మార్కెట్లో యాసిడ్, కెమికల్స్ ఇష్టానుసారంగా విక్రయిస్తుండటంతో దాడులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటిపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లో వైద్యశాఖ ముఖ్యకార్యదర్శికి తెలియజేయాలని పేర్కొంది. -
జిల్లాలో 136 డెంగ్యూ కేసులు
డీఎంఓ ప్రసాదరావు తుమ్మపాల: జిల్లాలో 136 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు అన్నారు. మండలంలోని బవులవాడ పంచాయతీ దర్జీనగర్, తుమ్మపాల పీహెచ్‌సీని ఆయన గురువారం పరిశీలించారు. దర్జీనగర్‌లో రెండేళ్ల బాలుడు టి. మోహిత్‌కు డెంగ్యూ నిర్దారణ కావడంతో ఆయన పర్యటించారు. గ్రామంలో నీటి నిల్వలున్న చోట దోమలు వ్యాప్తి చెందుతాయని, నిల్వలు ఉండకుండా జాగ్రత్త పడాలని గ్రామస్తులకు సూచించారు. దోమల మందును ఇంటింటా పిచికారి చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 17 వరకు 136 డెంగ్యూ కేసులు, 57 చికున్ గున్యా, 6,160 మలేరియా కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీంతో అన్ని గ్రామాల్లో అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. డెంగ్యూ నివారణలో ఆరోగ్య శాఖ, పంచాయతీ అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించి ఇళ్లల్లోని గోళాలలో నీటిని ఎప్పటికప్పుడు పొడిగా ఉంచాలన్నారు. చిన్నపిల్లలు దోమకాటుకు గురికాకుండా పూర్తిస్థాయిలో దుస్తులను వేయించాలన్నారు. ఏఎంఓ పి. రామారావు, జిల్లా కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాసరావు తుమ్మపాల పీహెచ్సీ వైద్యాధికారి ఐ. ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. ఉగ్గినపాలెంలో ముగ్గురికి డెంగ్యూ కశింకోట: మండలంలోని ఉగ్గినపాలెంలోనూ ముగ్గురికి డెంగ్యూ వ్యాధి సోకినట్లు నిర్థారణ అయింది. గాలి మంగ, కలగ కనకరత్నం, బుదిరెడ్డి రమణలకు వ్యాధి సోకినట్లు తాళ్లపాలెం పీహెచ్సీ వైద్యాధికారి లూసీ కార్డిలియా తెలిపారు. పది మంది రక్త నమూనాలు విశాఖ కేజీహెచ్‌కు పంపగా ఈ నివేదిక వచ్చిందన్నారు. వైద్య శిబిరంలో ముగ్గురికి, జి.భీమవరం శిబిరంలో పది మందికి జ్వరాలు ఉన్నట్లు తేలిందన్నారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్న పది మందికి పీహెచ్సీలో వైద్యమందించినట్టు తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపమే వ్యాధులకు కారణమన్నారు. అనకాపల్లి వంద పడకల ఆసుపత్రి వైద్యుడు రత్నకుమార్ జి.భీమవరంలో వైద్య సేవలందించారు. -
జలాశయాలు.. కబ్జా!
మొయినాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ మహానగరంతోపాటు జిల్లాలోని మొయినాబాద్ మండలానికి నీరందించే గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ జలాశయాలకు ముప్పు ముంచుకొస్తోంది. వీటిని క్రమంగా అక్రమార్కులు చెరబడుతున్నారు. దీంతో ఈ రెండూ.. రోజురోజుకు కుంచించుకుపోతున్నాయి. దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక ఓ వైపు, ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్- జలాశయం నిండినప్పుడు విస్తరించే భాగం) పరిధి లో రిసార్టులు, ఫాంహౌస్‌ల నిర్మాణాలు జలాశయాల ఉనికికే ప్రమాదం తెస్తున్నాయి. జంట జలాశయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం జారీచేసిన 111 జీఓ అక్రమార్కుల ఆగడాలను నియంత్రించలేకపోతోంది. యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఏమిటి ఆపద? జంట జలాశయాల్లో దశాబ్దాల నుంచి పూడిక తీయలేదు. యేటా వరద నీటితోపాటు పూడిక వచ్చి చేరుతోంది. దీంతో వీటి నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గిపోయింది. గండిపేట జలాశయం నిర్మించినప్పుడు దాని పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 5.5టీఎంసీలు. ప్రస్తుతం అది 3.9టీఎంసీలకు పడిపోయింది. ఇక హిమాయత్‌సాగర్ జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 3.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.9 టీఎంసీలకు తగ్గిపోయింది. కబ్జాల మాటేంటి? జంటజలాశయాల పరిధిలో శిఖం భూమి కబ్జాకు గురవుతోంది. ఇప్పటికే రెండు జలాశయాల పరిధిలో సుమారు 340 ఎకరాల శిఖం భూమి కబ్జాలకు గురైనట్లు తెలుస్తున్నది. జలాశయాల్లో నీళ్లు లేనప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పట్టా భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకోవాలి. కానీ అలాంటి పట్టాభూములను చాలామంది ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందినవారికి అమ్మేశారు. ఆ భూముల్లో వారు రిసార్ట్స్, ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారు. మరికొన్ని భూములు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో జలాశయాల విస్తీర్ణం తగ్గి వాటి రూపురేఖలే మారిపోతున్నాయి. ప్రస్తుతం గండిపేట జలాశయం విస్తీర్ణం 24.74 చదరపు కిలోమీటర్లు కాగా హిమాయత్‌సాగర్ జలాశయం విస్తీర్ణం 28.16 చదరపు కిలోమీటర్లు. 111 జీఓ.. ఏం చెబుతోంది? జంట జలాశయాల పరిరక్షణ కోసం 1996లో ప్రభుత్వం 111 జీఓను జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం జలాశయాల ఎగువ భాగంలోని పరీవాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట కూడదు. కానీ ఈ నిబంధనలను అక్రమార్కులు గాలికి వదిలేశారు. ఇప్పటికే జలాశయాల సమీపంలో వందల సంఖ్యలో విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఫాంహౌస్‌లు, రిసార్టులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి, అక్రమ లేఅవుట్లు, వెంచర్లు జోరుగా సాగుతున్నాయి. అధికారులు ఏం చేస్తున్నారు? గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో శిఖం భూమి కబ్జాకు గురవుతున్నా, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. రిసార్ట్స్‌లు, ఫాంహౌస్‌లు వెలుస్తున్నా ఇటు జలమండలి గానీ, అటు రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. జలాశయాల్లోకి పూర్తిస్థాయిలో నీళ్లు వచ్చినా ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన రిసార్ట్స్‌లు, ఫాంహౌస్‌లలోకి నీళ్లు రాకుండా మట్టి పోసి ఎత్తు పెంచేసుకుంటున్నారు. జలాశయాలను ఆనుకుని జరుగుతున్న నిర్మాణాలన్నీ బడాబాబులవే కావడంతో అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.