వైద్య విద్యా కోర్సుల్లో దేశవ్యాప్త ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్ నుంచి తమను మినహాయించాలని కోరుతూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు వైద్య కళాశాలలు దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి.
ఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో దేశవ్యాప్త ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్ నుంచి తమను మినహాయించాలని కోరుతూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు వైద్య కళాశాలలు దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్లో ఉంచింది.
న్యాయస్థానం సోమవారం సాయంత్రం వెబ్సైట్లో తీర్పును అప్లోడ్ చేయనుంది. ఈ ఏడాదికి రాష్ట్రాలకు ఊరటనిచ్చే అవకాశం ఉంది.