
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీం కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడించనుంది. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసింది.
రేపు బెయిల్ మంజూరు అయితే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టిన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్ తీర్పును రిజర్వ్ చేసి రేపు (సెప్టెంబర్ 10)న వెల్లడిస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment