
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఏర్పాటు చేసిన త్రివిధ దళాల డీజీఎంవోల (director general of military operations) మీడియా సమావేశం ముగిసింది.
ఈ సమావేశంలో మాట్లాడిన డీజీఎంవోలు ఆపరేషన్ తీరుతెన్నుల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల డీజీఎంవోలు మాట్లాడుతూ.. ఉగ్రవాదులతోనే మా పోరాటం. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాం. ఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్.కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోంది. ఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తోంది. అందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాం. ఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్‌దే. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్‌తో పాకిస్తాన్‌ను అడ్డుకున్నాం.
#WATCH | Delhi | Air Marshal AK Bharti presents the composite picture of targets engaged by the Indian Air Force during #OperationSindoor pic.twitter.com/hBNJAFyLTD
— ANI (@ANI) May 12, 2025
పాక్ వివిధ రాకల డ్రోన్‌లను వినియోగించింది. మనం దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్‌తో అడ్డుకున్నాం. చైనా తయారు చేసిన పీ-15 మిసైళ్లతో పాక్ భారత్‌పై దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువును అడ్డుకున్నాం. పాకిస్తాన్‌లోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. ఈ దాడిలో నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసమైంది. సైనికులనే కాకుండా యాత్రికులను, భక్తులను టార్గెట్ చేసింది

ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాల్ని మార్చుకుంటున్నారు. లాంగ్ రేంజ్ మిసైళ్లతో శత్రు స్థావరాలపై ప్రయోగించాం. 9,10వ తేదీలలో పాకిస్తాన్ భారత్‌లోని వైమానిక స్థావరాల్ని టార్గెట్ చేసింది. పాకిస్తాన్‌కు సాధ్యం కాలేదు. మనకు ఎలాంటి నష్టం జరగకుండా పక్కా స్ట్రాటజీతో ఎయిర్ డిఫెన్స్‌ను వినియోగించాం. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఓ వైపు పాక్ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేస్తూనే.. మన ఎయిర్ బేస్‌లను సురక్షితంగా ఉండేలా చూసుకున్నాం. ఆపరేషన్ సిందూర్‌ను త్రివిధ దళాలు సమన్వయంతో కలసి పనిచేశాయి. దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారు’ అని వ్యాఖ్యానించారు.