
DGMO Meeting Updates
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా భారత్-పాక్ దేశాల మధ్య తొలిదశ చర్చలు జరిపాయి. హాట్‌లైన్ ద్వారా జరిపిన చర్చల్లో భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. సుమారు గంటపాటు కొనసాగింది. భారత్ తరపున సమావేశంలో పాల్గొన్న ఇరు దేశాల డీజీఎంవోల సమావేశంలో కాల్పుల విరమణపై విధివిధానాలపై చర్చించారు.
ఉగ్రవాదులతోనే మా పోరాటం:
అంతకుముందుకు ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల డీజీఎంవో (director general of military operations) మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో డీజీఎంవోలు మీడియాతో మాట్లాడారు.
ఉగ్రవాదులతోనే మా పోరాటం
మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాం
ఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్
కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోంది
ఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తోంది
అందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాం
ఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్‌దే
చర్చలు వాయిదా..
భారత్, పాకిస్తాన్ డీజీఎంవోల చర్చలు వాయిదా.
ఈరోజు సాయంత్రం చర్చలు జరిగే అవకాశం.
సాయంత్రం ఐదు గంటలకు ఇరు దేశాల డీజీఎంవోల చర్చలు కొనసాగే అవకాశం ఉంది.
హాట్‌లైన్ ద్వారా రెండు దేశాల డీజీఎంవోలు చర్చలు జరపనున్నారు.
చర్చలు ప్రారంభం..
భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు ప్రారంభం,
హాట్‌లైన్‌లో భారత్, పాక్ డీజీఎంవోల చర్చలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ..
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం
సమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చల నేపథ్యంలో కీలక భేటీ
👉భారత్-పాక్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో కాసేపట్లో(మధ్యాహ్నం 12 గంటలకు) కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO)లు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
👉ఈ చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో గత రాత్రి సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణను పాకిస్తాన్ రేంజర్స్ అతిక్రమించలేదు. ఎలాంటి కవ్వింపు చర్యలకు సైతం పాల్పడలేదు. అయితే, పాకిస్తాన్ నమ్మలేమని.. అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు సూచించాయి.

👉ఇక, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు డీజీఎంవో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై మీడియాకు ఆయన వివరించనున్నారు.
Delhi | Media briefing by Director General Military Operations of All Three Services - Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM
— ANI (@ANI) May 12, 2025
👉ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ డీజీఎంవోతో పాకిస్థాన్ డీజీఎంవో హాట్ లైన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి.. వెంటనే అమలు చేద్దామని కోరారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. కాగా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైన తీవ్రమైన ప్రతిదాడి తప్పదని భారత్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తూటా కాలిస్తే.. భారత్ ఫిరంగి గుండు పేల్చాలని ప్రధాని మోదీ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు.