నరసరావుపేటవెస్ట్: రైతులు పండించిన ధాన్యం, అపరాలతోపాటు ఎరువులు నిల్వ ఉంచే సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లు ఇప్పుడు మద్యం నిల్వలకు చిరునామాగా మారాయి. ఒకవైపు రైతుకు గిట్టుబాటు ధరలేక, ఇళ్ల వద్ద దాచిఉంచే సౌకర్యంలేక మార్కెట్‌యార్డులో నిల్వచేద్దామనుకుంటే ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం మాత్రం మద్యం నిల్వలను దాచి ఉంచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
వివరాలను పరిశీలిస్తే...
ఆర్టీసీ బస్టాండ్, క్వార్టర్లకు ఎదురుగా గుంటూరు-కర్నూలు రహదారిలో వేర్‌హౌసింగ్ గోడౌన్లు వాటి పక్కనే మార్కెట్ యార్డు ఉంది. వేర్‌హౌసింగ్ గోడౌన్లలో ధాన్యం, లెవీ బియ్యం, ఎరువులు, అపరాలు నిల్వ చేస్తుంటారు. పక్కనే ఉన్న మార్కెట్‌యార్డు గోడౌన్లలో ఆత్మబంధు పథకం కింద ధాన్యం నిల్వ ఉంచుతున్నారు. ఒక గోడౌన్ పౌరసరఫరాల శాఖ ఆధీనంలో ఉంది. ఇటీవల మద్యం నిల్వలు ఉంచే ఏపీ బేవరేజెస్ గోడౌన్లను పన్ను చెల్లించలేదని ఆదాయ పన్నుశాఖ సీజ్ చేసింది.
దీంతో వారం రోజుల పాటు బార్లు, మద్యం షాపులకు సరఫరా నిలిచిపోయింది. మద్యం వ్యాపారులతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం గిలగిలలాడింది. ఆదాయ పన్ను చెల్లించకుండానే యుద్ధప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్‌శాఖతో మరో గోడౌన్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేయటంతో వెంటనే వారు వేర్‌హౌసింగ్ గోడౌన్‌ను ఎంపికచేసి అందులో మద్యం నిల్వ ఉంచి వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే గోడౌన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం నిల్వ ఉంచితే టీడీపీ నాయకులు ఎదో అపరాధం జరిగినట్లుగా ఊరూ, వాడా కోడై కూశారు.
యార్డులో ధాన్యం దాచుకునేందుకు స్థలమేదీ?
ధాన్యానికి ప్రస్తుతం మద్దతు ధరలేకపోవటంతో రైతులు దాచుకునేందుకు యార్డుకు తీసుకొస్తున్నారు. గోదాములు నిండిపోయినందున దాచుకునే అవకాశం లేదని యార్డు అధికారులు తిరస్కరిస్తుండటంతో రైతులు దిగాలుగా వెళ్లిపోతున్నారు. ఎటూ అవకాశంలేని రైతులు యార్డులోని రేకుల షెడ్డుకిందనే ధాన్యం నిల్వచేసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల ప్రయోజనాలను గురించి ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న మద్యం నిల్వలకు మాత్రం గోడౌన్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయటం గమనార్హం. రైతులన్నా, రైతు పండించిన పంటలన్నా తెలుగుదేశం ప్రభ
ధాన్యంపై వేటు... మద్యానికి చోటు !
Published Mon, Mar 23 2015 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM
Advertisement
Advertisement