హైదరాబాద్: తెలంగాణలో యాసిడ్, రసాయన పదార్థాల నిల్వలు, అమ్మకాలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ముసాయిదా నిబంధనలను రూపొందించింది. ఫొటో, గుర్తింపు కార్డు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు సేకరించిన తర్వాతే వాటిని విక్రయించాలని స్పష్టంచేసింది.
మార్కెట్‌లో యాసిడ్, కెమికల్స్ ఇష్టానుసారంగా విక్రయిస్తుండటంతో దాడులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటిపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లో వైద్యశాఖ ముఖ్యకార్యదర్శికి తెలియజేయాలని పేర్కొంది.
గుర్తింపు కార్డు చూపితేనే యాసిడ్ అమ్మకం
Published Fri, Oct 10 2014 12:34 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM
Advertisement