Jharkhand Lithium Reserves: ప్రపంచానికి మైకాను ఎగుమతి చేసిన జార్ఖండ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది దేశంలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిల్వలను గుర్తించిన తరువాత తాజాగా జార్ఖండ్‌లో అపారమైన నిల్వలను గుర్తించారు. జమ్మూ కశ్మీర్ , రాజస్థాన్, కర్ణాటకలలో లిథియం నిల్వలు కనుగొన్న కొన్ని నెలల తర్వాత, జార్ఖండ్‌లో కూడా కాస్మిక్ ఖనిజ నిల్వలను గుర్తించడం విశేషం. నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (NMET) జియోలాజికల్ సర్వే నిర్వహించి, జార్ఖండ్‌లో కోడెర్మా , గిరిడిహ్‌లో లిథియం సహా అరుదైన ఖనిజాల నిల్వలున్న ప్రాంతాలుగా గుర్తించింది. ఈ ప్రాంతాలతో పాటు తూర్పు సింగ్‌భూమ్ ,హజారీబాగ్‌లలో అన్వేషణ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపింది.
2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను 30శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం లిథియం కోసం ప్రధానంగా చైనాపైనా ఎక్కువగా ఆధారపడుతోంది. జార్ఖండ్‌లో లిథియం నిల్వల ఆవిష్కరణతో దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దూసుకుపోనుంది. లిథియం ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తే, అది చౌకైన ఎలక్ట్రిక్ బ్యాటరీలకు దారితీస్తుందని , చివరికి ఎలక్ట్రిక్ వాహనాల ధరలను మరింత దిగి వవస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇపపటికే జార్ఖండ్ ప్రభుత్వం లిథియం మైనింగ్ సామర్థ్యాలను అభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభించింది. (స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?)
లిథియంను ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు , ఇతర గాడ్జెట్‌ల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు. కోరలు చాస్తున్న కాలుష్యం, ఉద్గార నిబంధనల కారణంగా ప్రపంచం వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EVలు)వైపు మొగ్గుతున్నాయి. దీంతో లిథియంకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రపంచానికి కనీసం 2 బిలియన్ల (200 కోట్లు) EVలు అవసరమవుతాయి .వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకారం 2025 నాటికి లిథియం కొరత ఏర్పడవచ్చు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే లిథియం నిల్వలున్నాయి. లిథియం మైనింగ్ , ప్రాసెసింగ్‌లో చైనా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ప్రస్తుతం లిథియంలో ఎక్కువ భాగం చైనా, ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా ద్వారా సరఫరా చేయబడుతోంది. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్, బీహార్ , పశ్చిమ బెంగాల్ చుట్టూ ఉన్న తూర్పు రాష్ట్రం ఇప్పటికే యురేనియం, మైకా, బాక్సైట్, గ్రానైట్, బంగారం, వెండి, గ్రాఫైట్, మాగ్నెటైట్, డోలమైట్, ఫైర్‌క్లే, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, బొగ్గు (32 శాతం), ఇనుము, రాగి (భారతదేశంలో 25 శాతం) నిల్వలకు ప్రసిద్ధి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment