సాక్షి,ముంబై: జమ్మూ కశ్మీర్‌లో అపారమైన లిథియం నిక్షేపాలను కనుగొనడంపై పారిశశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇక సందేహం లేదు, భారతదేశం భవిష్యత్తు అంతా ఎలక్ట్రి ఫైయింగే అంటూ ట్విట్ చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో అత్యంత కీలకమైంది లిథియం, ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్ర భవిష్యత్తులో ఈ-వాహనాల్లో భారత్ దూసుకుపోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు తగ్గాయా? ఎందుకు?)
దేశంలో తొలిసారిగా లిథియం నిల్వలను గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. లిథియం నిక్షేపాల ఆవిష్కరణతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధర మరింత దిగిరానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో మొత్తం 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు కేంద్ర గనుల శాఖ పేర్కొంది. నాన్-ఫెర్రస్ ఖనిజమైన లిథియం..ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వాడే కీలకమైన మూలకం. భారీగా లిథియం నిల్వలగుర్తింపుతో, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని, ఫలితంగా డీజిల్, పెట్రోల్‌పై ఆధారపడడం ఇకపై మరింత తగ్గుతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. (మహీంద్రా నుంచి రానున్న నయా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే..)
కాగా ఈవీ కార్ల బ్యాటరీల ఉత్పత్తిలో ఉపయోగించే ప్రాథమిక పదార్థాలలో లిథియం ఒకటి. ముఖ్యంగా భారతదేశంలో ఈవీ బ్యాటరీలో ఉత్పత్తిపై చైనా వంటి దేశాల దిగుమతులపై ఆధారపడుతోంది ఇండియా. తాజా పరిణామంతో ఈవీల ఉత్పత్తి ఖర్చు ఖచ్చితంగా తగ్గుంనుందని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. కార్బన్ ఉద్గారాలు, మండుతున్న ఇంధన ధరల నేపథ్యంలో గ్లోబల్‌గా ఈవీ కార్లకు ఆదరణ పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment