లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాది కొత్తగా ఎనిమిది మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. వీటిలో బ్యాటరీ మోడళ్లు కూడా ఉంటాయని తెలిపింది. గతేడాది 14 మోడళ్లను పరిచయం చేసినట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. 2,000 యూనిట్లకుపైగా ఆర్డర్ బుక్‌తో నూతన సంవత్సరం ప్రారంభం అయిందని, ఇది కంపెనీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సంస్థ మొత్తం విక్రయాల్లో 50 శాతం యూనిట్లకు మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రుణం సమకూర్చిందని చెప్పారు. ఇప్పటి వరకు కస్టమర్లకు రూ.10,000 కోట్ల పైచిలుకు రుణాలు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.
రెండు కొత్త మోడళ్లు..
మెర్సిడెస్ భారత మార్కెట్లో గురువారం రెండు బ్యాటరీ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో ఈక్యూ టెక్నాలజీతో జీ580, అలాగే అయిదు సీట్లతో కూడిన ఈక్యూఎస్ ఎస్‌యూవీ 450 ఉన్నాయి. ఎక్స్‌షోరూంలో జీ580 ధర రూ.3 కోట్ల నుంచి ప్రారంభం. ఒకసారి చార్జింగ్‌తో 473 కిలోమీటర్లు పరుగెడుతుంది. ఈక్యూఎస్ ఎస్‌యూవీ 450 ధర రూ.1.28 కోట్లు ఉంది. భారత్ మొబిలిటీ షో వేదికగా మెర్సిడెస్ మైబహ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ నైట్ సిరీస్ తళుక్కుమనేందుకు రెడీ అవుతోంది.
ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరు
రెండింతలైన ఈవీలు..
2024లో సంస్థ దేశవ్యాప్తంగా 19,565 యూనిట్లను విక్రయించింది. 2023తో పోలిస్తే గతేడాది కంపెనీ అమ్మకాల్లో 12.4 శాతం వృద్ధి నమోదైంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ విక్రయాలు దాదాపు రెట్టింపు అయ్యాయని సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా ఏడాదిలో 2.5 నుంచి 2024లో 6 శాతానికి ఎగసింది. ఇక మొత్తం అమ్మకాల్లో రూ.1.5 కోట్లకుపైగా విలువ చేసే టాప్ ఎండ్ కార్ల వాటా 25 శాతం ఉంది. వీటి సేల్స్ 30 శాతం దూసుకెళ్లాయి. ప్రస్తుతం సంస్థకు 50 నగరాల్లో 125 ఔట్‌లెట్స్ ఉన్నాయి. ఈ ఏడాది మరో 20 లగ్జరీ కేంద్రాలు తోడవనున్నాయి. ఫ్రాంచైజ్ భాగస్వాములు మూడేళ్లలో రూ. 450 కోట్లకుపైగా పెట్టుబడులకు కట్టుబడి ఉన్నారు’ అని అయ్యర్ వెల్లడించారు. భారత్‌లో ఎంట్రీ ఇచి్చన తొలి రెండు దశాబ్దాల్లో 50,000 పైచిలుకు మెర్సిడెస్ కార్లు రోడ్డెక్కాయి. గత 10 ఏళ్లలో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన కార్ల సంఖ్య 1.5 లక్షల యూనిట్లు. ఇదీ భారత మార్కెట్ ప్రస్థానం అని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment