Mercedes Benz India
-
ఈ ఏడాది బెంజ్ ఎనిమిది కొత్త మోడళ్లు
లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాది కొత్తగా ఎనిమిది మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. వీటిలో బ్యాటరీ మోడళ్లు కూడా ఉంటాయని తెలిపింది. గతేడాది 14 మోడళ్లను పరిచయం చేసినట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. 2,000 యూనిట్లకుపైగా ఆర్డర్ బుక్‌తో నూతన సంవత్సరం ప్రారంభం అయిందని, ఇది కంపెనీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సంస్థ మొత్తం విక్రయాల్లో 50 శాతం యూనిట్లకు మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రుణం సమకూర్చిందని చెప్పారు. ఇప్పటి వరకు కస్టమర్లకు రూ.10,000 కోట్ల పైచిలుకు రుణాలు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. రెండు కొత్త మోడళ్లు..మెర్సిడెస్ భారత మార్కెట్లో గురువారం రెండు బ్యాటరీ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో ఈక్యూ టెక్నాలజీతో జీ580, అలాగే అయిదు సీట్లతో కూడిన ఈక్యూఎస్ ఎస్యూవీ 450 ఉన్నాయి. ఎక్స్‌షోరూంలో జీ580 ధర రూ.3 కోట్ల నుంచి ప్రారంభం. ఒకసారి చార్జింగ్‌తో 473 కిలోమీటర్లు పరుగెడుతుంది. ఈక్యూఎస్ ఎస్యూవీ 450 ధర రూ.1.28 కోట్లు ఉంది. భారత్ మొబిలిటీ షో వేదికగా మెర్సిడెస్ మైబహ్ ఈక్యూఎస్ ఎస్యూవీ నైట్ సిరీస్ తళుక్కుమనేందుకు రెడీ అవుతోంది.ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరురెండింతలైన ఈవీలు..2024లో సంస్థ దేశవ్యాప్తంగా 19,565 యూనిట్లను విక్రయించింది. 2023తో పోలిస్తే గతేడాది కంపెనీ అమ్మకాల్లో 12.4 శాతం వృద్ధి నమోదైంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ విక్రయాలు దాదాపు రెట్టింపు అయ్యాయని సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా ఏడాదిలో 2.5 నుంచి 2024లో 6 శాతానికి ఎగసింది. ఇక మొత్తం అమ్మకాల్లో రూ.1.5 కోట్లకుపైగా విలువ చేసే టాప్ ఎండ్ కార్ల వాటా 25 శాతం ఉంది. వీటి సేల్స్ 30 శాతం దూసుకెళ్లాయి. ప్రస్తుతం సంస్థకు 50 నగరాల్లో 125 ఔట్లెట్స్ ఉన్నాయి. ఈ ఏడాది మరో 20 లగ్జరీ కేంద్రాలు తోడవనున్నాయి. ఫ్రాంచైజ్ భాగస్వాములు మూడేళ్లలో రూ. 450 కోట్లకుపైగా పెట్టుబడులకు కట్టుబడి ఉన్నారు’ అని అయ్యర్ వెల్లడించారు. భారత్‌లో ఎంట్రీ ఇచి్చన తొలి రెండు దశాబ్దాల్లో 50,000 పైచిలుకు మెర్సిడెస్ కార్లు రోడ్డెక్కాయి. గత 10 ఏళ్లలో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన కార్ల సంఖ్య 1.5 లక్షల యూనిట్లు. ఇదీ భారత మార్కెట్ ప్రస్థానం అని ఆయన వివరించారు. -
భారత్‌లో సరికొత్త జర్మన్ బ్రాండ్ కారు లాంచ్: వివరాలు
మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లో 'జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్' లాంచ్ చేసింది. సంస్థ లాంచ్ చేసిన ఈ లగ్జరీ కారు ధర రూ. 97.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు త్రీ-పాయింటెడ్ స్టార్ ప్యాటర్న్‌తో కూడిన డైమండ్ గ్రిల్, స్పోర్టియర్ ఎయిర్ ఇన్లెట్లు, క్రోమ్ ఇన్సర్ట్ & బ్లాక్ సరౌండ్‌తో మ్యాట్ డార్క్ గ్రేలో పెయింట్ చేసి ఉండటం చూడవచ్చు. ఇందులోని అప్డేటెడ్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 269 హార్స్ పవర్, 550 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 48వీ మైల్డ్-హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్-జెనరేటర్ కూడా పొందుతుంది. ఇది 20 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ అదనంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ గంటకు 230 కిమీ. -
ఫుల్ ఛార్జ్‌తో 560 కిమీ రేంజ్.. సరికొత్త ఎలక్ట్రిక్ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'ఈక్యూఏ' లాంచ్ చేసింది. ఈ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 జనవరి నుంచి ప్రారంభమవుతాయి.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త 'మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ' 250 ప్లస్ అనే ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 66 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ కలిగిన ఈ కారు పోలార్ వైట్, కాస్మోస్ బ్లాక్, మౌంటైన్ గ్రే, హై-టెక్ సిల్వర్, స్పెక్ట్రల్ బ్లూ, పటగోనియా రెడ్ మెటాలిక్, మౌంటైన్ గ్రే మాగ్నో అనే ఏడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మావిగేషన్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ 70.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 560 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 190 హార్స్ పవర్, 385 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కిమీ.ఈక్యూఏ ఎలక్ట్రిక్ కారు 100 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 35 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. స్టాండర్డ్ 11 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి 7:15 గంటకు పడుతుంది. మొత్తం మీద ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.The wait is almost over! We are ready to introduce the new all-electric Mercedes-Benz EQA to India. Get ready for a new generation of electric luxury. #SwitchOnToStandOut#EQA #MercedesBenzIndia pic.twitter.com/50EqWDwKAA— Mercedes-Benz India (@MercedesBenzInd) July 8, 2024 -
లగ్జరీ కార్ల అమ్మకాల్లో జోష్.. పండుగల సీజన్‌పై ఆశలు
న్యూఢిల్లీ: ఖరీదైన లగ్జరీ కార్లకు పండుగల సీజన్లో డిమాండ్ బలంగా ఉంటుందని మెర్సెడెజ్ బెంజ్, ఆడి, లెక్సస్ భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగల సందర్భంగా ఇంతకుముందెన్నడూ లేనంతగా విక్రయాలపై ఆశలు పెట్టుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్ ఎంతో ఆశావహంగా కనిపిస్తున్నట్టు మెర్సెడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘‘ఈ ఏడాది పండుగల సీజన్ నాలుగు నెలల పాటు కొనసాగనుంది. ఈ సీజన్‌ను సానుకూలంగా ప్రారంభించాం. అమ్మకాల పరంగా సానుకూలంగా ఉన్నాం’’అని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన మోడళ్లు ఇందుకు మద్దతుగా నిలుస్తాయన్నారు. ఇక లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోనీ మాట్లాడుతూ.. లగ్జరీ కార్ల మార్కెట్ ఇక ముందూ వృద్ధి నమోదు చేస్తుందన్నారు. డిమాండ్ ఎంతో ఆశాజనకంగా ఉందన్నారు. అధిక ధనవంతులు పెరుగుతుండడం, మిలీనియల్స్, ఖర్చు పెట్టే ఆదాయం పెరగడం, ఆర్థిక వృద్ధి ఇవన్నీ లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధిని నడిపిస్తున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. గతేడాదికి మించి అమ్మకాలు ‘‘2022 అమ్మకాలను మేము ఇప్పటికే దాటేశాం. రెండో త్రైమాసికంలో మాదిరే రానున్న పండుగల్లోనూ మెరుగైన విక్రయాలు కొనసాగుతాయి. తాజా బుకింగ్‌లు బలంగా ఉన్నాయి’’ అని ఆనంద్ సోనీ తెలిపారు. లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కూప్, ఎల్సీ 500 హెచ్‌ను ఈ సంస్థ ఇప్పటికే ప్రవేశపెట్టింది. న్యూ జనరేషన్ ఎల్ఎం మల్టీపర్పస్ వెహికల్‌కు కూడా బుకింగ్‌లు ప్రారంభించనుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెల్లలో 3,474 యూనిట్లను విక్రయించినట్టు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 97 శాతం వృద్ధిగా పేర్కొన్నారు. ‘‘మా ఎస్‌యూవీలు 217 శాతం అధిక అమ్మకాలు నమోదు చేశాయి. కార్ల పనితీరులో 127 శాతం వృద్ధి నెలకొంది. పండుగల సమయంలోనూ ఈ డిమాండ్ కొనసాగుతుందని అనుకుంటున్నాం’’అని సింగ్ వెల్లడించారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ5 మోడళ్లకు డిమాండ్ బలంగా ఉన్నట్టు చెప్పారు. -
లగ్జరీ కార్ల జోరు : అదీ లెక్క
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ 2023 జనవరి-జూన్‌లో భారత్‌లో 8,528 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రూ.1.5 కోట్లకుపైగా ధర కలిగిన టాప్ ఎండ్ వెహికిల్స్ (టీఈవీ) వాటా 25 శాతంపైగా నమోదై 2,000 యూనిట్లకు చేరింది. 2022 జనవరి-జూన్‌తో పోలిస్తే టీఈవీల అమ్మకాలు 54 శాతం పెరిగాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘ఈ ఏడాది టాప్ ఎండ్ వెహికిల్స్ విభాగంలో అయిదు ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. టీఈవీలకు వెయిటింగ్ పీరియడ్ 6-24 నెలలు ఉన్నప్పటికీ విక్రయాలు పెరుగుతున్నాయి. రెండవ అర్ధ భాగంతోపాటు పూర్తి ఏడాదికి మొత్తం అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం. నూతన తరం జీఎల్సీ మోడల్‌ను మూడవ త్రైమాసికంలో పరిచయం చేస్తున్నాం. పండుగల సీజన్‌కు ముందే ఈ కారు రానుంది’ అని వివరించారు. 2022లో భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ నుంచి మొత్తం 15,822 యూనిట్లు రోడ్డెక్కాయి. వీటిలో 69 శాతం వృద్ధితో 3,500 పైచిలుకు టాప్ ఎండ్ వెహికిల్స్ ఉన్నాయి. -
మెర్సిడెస్ టాప్ ఎండ్ రైడ్.. రూ.2.35 కోట్ల కారు విడుదల
ముంబై: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ రూ.1 కోటి కంటే అధిక ధర కలిగిన టాప్ ఎండ్ మోడళ్లను భారత్‌కు తీసుకురానుంది. మెట్రోయేతర నగరాల నుండి కూడా డిమాండ్ వేగంగా పెరుగుతుండడం ఇందుకు కారణమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. టాప్ ఎండ్ వెహికల్స్ (టీఈవీ) వాటా సంస్థ మొత్తం విక్రయాల్లో 25 శాతం ఉందన్నారు. ఏఎంజీ ఎస్ఎల్55 4మేటిక్ ప్లస్ రోడ్‌స్టర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దీని ధర ఎక్స్‌షోరూంలో రూ.2.35 కోట్లు. -
భారత్‌లో విడుదలైన రూ. 3.30 కోట్ల జర్మన్ లగ్జరీ కారు - పూర్తి వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతీయ మార్కెట్లో కొత్త కారు 'ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్' (AMG GT 63 S E Performance) లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్, పర్ఫామెన్స్ వంటి విషయాలతో పాటు ధరల గురించి కూడా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర: దేశీయ విఫణిలో విడుదలైన కొత్త బెంజ్ ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ ధర రూ. 3.30 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది AMG పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫ్లాగ్షిప్ మోడల్‌గా నిలుస్తుంది. ఇది 2021లోనే గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. అయితే ఇప్పటికి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. డిజైన్: కొత్త బెంజ్ ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ చూడగానే ఆకర్శించే అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది కొత్త ఎగ్జాస్ట్ అవుట్లెట్లు కలిగి, రీడిజైన్డ్ ఫ్రంట్ బంపర్ పొందుతుంది. వెనుక భాగంలో ఛార్జింగ్ పోర్ట్ ఉండటం కూడా మీరు గమనించవచ్చు. బ్యాడ్జింగ్ కొత్త ట్విన్ ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్ వంటివి మరింత అట్రాక్టివ్‌గా ఉంటాయి. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?) ఫీచర్స్: ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ డ్యాష్‌బోర్డ్‌లో 12.4 ఇంచెస్ డ్యూయెల్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇందులో బకెట్ సీట్లు, AMG స్టీరింగ్ వీల్, కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్లు వంటి లగ్జరీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలను ఈ డిస్ప్లేల ద్వారా చూడవచ్చు. ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ కారు 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్ పొందుతుంది. ఇది 639 హెచ్‌పి పవర్ అందిస్తుంది. అయితే ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 204 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఈ రెండు కలయికతో 843 హెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే టార్క్ 1,470 ఎన్ఎమ్ వరకు ఉంటుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గంటకు 316 కిలోమీటర్లు. ఈ సూపర్ సెడాన్‌లో 6.1kWh, 400V బ్యాటరీ ప్యాక్‌తో కేవలం 89 కేజీల బరువుతో ఉంటుంది. ఇది మోటారుకు శక్తినిస్తుంది. దీని పరిధి 12 కిమీ వరకు వస్తుంది. కానీ EV మోడ్‌లో గరిష్ట వేగం గంటకు 12 కిలోమీటర్లు. ఇందులో ఏడు డ్రైవ్ మోడ్లు & ఫోర్ లెవెల్ రీజెనరేటివ్ బ్రేకింగ్అందుబాటులో ఉంటుంది. రెండోది కొన్ని పరిస్థితులలో వన్-పెడల్ డ్రైవింగ్‌ను కూడా అనుమతిస్తుంది. -
బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..!
సాక్షి, ముంబై: లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్ మరో కొత్త 'ఈక్యూబి' ఎలక్ట్రిక్ కారుని తీసుకొచ్చింది. ఈక్యూబి పేరుతో భారతీయ మార్కెట్లలో లాంచ్ చేసిన ఈ కారు ధరను రూ. 74.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించింది. బెంజ్ ఈక్యూబి ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్‌లను కూడా షురూ చేసింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు కేవలం రూ. 1.5 లక్షలు చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి 300, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి 350 అనే రెండు వేరియంట్లలో స్మోస్ బ్లాక్, రోజ్ గోల్డ్, డిజిటల్ వైట్, మౌంటైన్ గ్రే , ఇరిడియం సిల్వర్ అనే 5 కలర్ ఆప్సన్స్ లో లభ్యం. దీంతోపాటు జీఎల్బీ త్రి-రో ఎస్‌యూవీని కూడా తీసుకొచ్చింది. దీని ధర రూ. 63.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి, బ్యాటరీ బెంజ్ ఈక్యూబి ఎలక్ట్రిక్ ఎస్‌యువిలో 66.5kWh బ్యాటరీని జోడించింది.ఈ బ్యాటరీ ప్యాక్ 225bhp ,390Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. AC , DC ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే మోడల్, WLTP-సర్టిఫైడ్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 423 కిమీ రేంజ్ అందిస్తుంది.100 కిలో వాట్ DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 32 నిముషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఈ బ్యాటరీ మీద 8 సంవత్సరాల వారంటీని అందిస్తుంది. 11 కిలోవాట్ AC ఛార్జర్ ఉపయోగించి 10 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 6 గంటల 25 నిముషాల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది . డిజైన్, ఫీచర్లు స్వెప్ట్‌బ్యాక్ LED హెడ్‌ల్యాంప్‌లు, బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, స్పిట్ LED టెయిల్ లైట్లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్లెస్ ఛార్జింగ్ USB టైప్-C పోర్ట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, రీప్రొఫైల్డ్ ఫ్రంట్ , రియర్ బంపర్ యాంబియంట్ లైటింగ్‌తో పాటు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్,ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ లాంటి ఫీచర్లు ఇందులో జోడించింది. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఏప్రిల్–జూన్‌లో దేశవ్యాప్తంగా 3,551 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా వృద్ధి సాధించింది. కంపెనీకి ఇప్పటి వరకు అత్యధిక అమ్మకాలు నమోదైన రెండవ త్రైమాసికం కూడా ఇదే. జనవరి–జూన్‌లో 56 శాతం వృద్ధితో 7,573 యూనిట్ల అమ్మకాలను రికార్డు చేసింది. సరఫరా సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఘనత సాధించడం విశేషమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వింక్ తెలిపారు. సెమికండక్టర్ల కొరత మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం 6,000లకుపైగా కార్లకు ఆర్డర్లు ఉన్నాయని వెల్లడించారు. భారతీయ కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న అంతర్జాతీయ మోడళ్లు కొన్ని మూడవ త్రైమాసికంలో అడుగు పెట్టనున్నాయని వివరించారు. -
మెర్సిడెస్ బెంజ్ @ మేడ్ ఇన్ ఇండియా!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అయిదవ తరం సి–క్లాస్ సెడాన్ తయారీని భారత్‌లో ప్రారంభించింది. ఈ మోడల్ వచ్చే నెలలో మార్కెట్లో అడుగుపెట్టనుంది. సి200, సి200డి, సి300డి వేరియంట్లలో లభిస్తుంది. మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న చకన్ వద్ద కంపెనీకి ప్లాంటు ఉంది. 2001లో భారత్‌లో సి–క్లాస్ రంగ ప్రవేశం చేసింది. 37 వేల పైచిలుకు కార్లు రోడ్లపై పరుగెడుతున్నాయి. గతేడాది 43 శాతం అధికంగా అమ్మకాలు సాధించిన ఈ సంస్థ 2022లో రెండంకెల వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2022 జనవరి–మార్చిలో విక్రయాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం అధికమై 4,022 యూనిట్లు నమోదైంది. ఈ ఏడాది 10 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ధ్యేయం. ఈక్యూఎస్ సెడాన్ ఎలక్ట్రిక్ మోడల్‌ను సైతం కంపెనీ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ నుంచి దేశీయంగా అసెంబుల్ చేయనుంది. 2020 అక్టోబర్ నుంచి పూర్తిగా తయారైన ఈ ఎలక్ట్రిక్ కారును మెర్సిడెస్ భారత్‌కు దిగుమతి చేసుకుంటోంది. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది జనవరి–మార్చిలో 4,022 యూనిట్లు విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. సెమికండక్టర్ల కొరత, సరఫరా అడ్డంకులు, ముడి సరుకు, రవాణా వ్యయాలు పెరిగినప్పటికీ ఎస్‌యూవీలు, సెడాన్స్‌కు విపరీత డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది. 4,000 యూనిట్లకు పైగా ఉన్న అత్యధిక ఆర్డర్ బుక్ రాబోయే నెలల్లో సానుకూల దృక్పథానికి దారి తీస్తుందని వివరించింది. అమ్మకాల్లో ఈ–క్లాస్ లాంగ్ వీల్‌బేస్ సెడాన్, జీఎల్సీ, జీఎల్ఏ, జీఎల్ఈ ఎస్‌యూవీలు టాప్‌లో నిలిచాయి. ఏఎంజీ, సూపర్ లగ్జరీ కార్ల విభాగం 35 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం మోడల్‌నుబట్టి వెయిటింగ్ పీరియడ్ అత్యధికంగా 11 నెలల వరకూ ఉంది. చదవండి: యజమానులు ఉద్యోగులకు కార్లు గిప్ట్ గా ఇస్తారా? ఇదిగో ఈయన ఇస్తున్నాడు!! -
టెస్లా ఎలన్ మస్క్.. బెంజ్‌ని చూసి నేర్చుకో..
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మార్కెట్ ఇండియా. ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఉత్సాహపడే కంపెనీలు, ఉబలాటపడే పెట్టుబడిదారులు ఎందరో ? కానీ టెస్లా కంపెనీ, దాని ఓనరు ఎలన్ మస్క్ తీరే వేరు. ఇండియాకి టెస్లా కార్లు తెచ్చే విషయంలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంటుంది అతడి వ్యవహరం. కానీ ఇతర కంపెనీలు భారత్ మార్కెట్‌ని తక్కువగా అంచనా వేయడం లేదు. త్వరత్వరగా నిర్ణయాలు తీసుకుని ఇక్కడి ప్రజలకు మరింతగా చేరువ అవుతున్నాయి. అందులో జర్మనీకి చెందిన మెర్సిడెజ్ బెంజ్ ముందు వరుసలో ఉంది. బరిలో దిగిన మెర్సిడెజ్ బెంజ్ నీతి అయోగ్ లెక్కల ప్రకారం ఇండియాలో ప్రతీ వెయ్యి మందిలో కేవలం 22 మందికే కార్లు ఉన్నాయి. దీంతో ఇండియాలో కార్ల మార్కెట్‌కి భారీ అవకాశాలు ఉన్నాయి. ఎంట్రీ లెవల్ నుంచి లగ్జరీ సెగ్మెంట్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇండియన్ మార్కెట్లో బలమైన ముద్ర వేసేందుకు జర్మనికి చెందిన మెర్సిడెజ్ బెంజ్ రెడీ అయ్యింది. గతేడాది ఆ సంస్థ రిలీజ్ చేసిన ఎస్ సిరీస్ కార్లు ఇండియాలో బాగానే క్లిక్ అయ్యాయి. దీంతో అమ్మకాలు పెంచుకునేందుకు రూ. 2,200 కోట్ల వ్యయంతో పూనేలో కార్ల తయారీ యూనిట్‌ని మెర్సిడెజ్ బెంజ్ ఏర్పాటు చేసింది. Handcrafted luxury meets best-in-class technology. Meet the real stars behind the success and sophistication of the world’s best luxury car. Presenting the new Mercedes-Benz S-Class. Proudly made in India. #NewSClass pic.twitter.com/kcXwLwr0R0 — Mercedes-Benz India (@MercedesBenzInd) October 8, 2021 టెస్లా తీరు ఇక టెస్లా విషయానికి వస్తే ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తున్నాం కాబట్టి దిగుమతి సుంకం తగ్గించాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇండియాలో తయారీ యూనిట్ నెలకొల్పితే ట్యాక్స్ మినహాయింపు అంశం పరిశీలిస్తామంటూ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే టెస్లా దీనిపై నేరుగా స్పందించకుండా.. ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తే ముందుగా ఈవీ కార్ల అమ్మకాలు ప్రారంభిస్తామని, ఆ తర్వాత మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ విషయంలో నిర్ణయం తీసుకుంటాం అనే విధంగా వ్యవహరిస్తోంది. దీంతో టెస్లా కార్లు ఇండియాకు వచ్చే విషయంలో క్లారిటీ రావడం లేదు. తగ్గిన ధర ఇండియాలో కార్ల తయారీ యూనిట్ నెలకొల్ప కార్ల ఉత్పత్తి ప్రారంభించడంతో కేంద్రం విధించి దిగుమతి సుంకం నుంచి మినహాయింపు లభించింది. దీంతో ఒక్కసారిగా బెంజ్ కార్ల ధరలు తగ్గిపోయాయి. మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ 450 4 మ్యాటిక్ ధర రూ. 2.19 కోట్ల నుంచి రూ. 1.62 కోట్లకు తగ్గిపోయింది. ధర తగ్గిపోవడంతో భవిష్యత్తులో కార్ల అమ్మకాలు పెరుగుతాయని మెర్సిడెజ్ బెంజ్ భావిస్తోంది. ఆలస్యం చేస్తే అంతే ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్లో పట్టు సాధించాలంటే ఎలన్ మస్క్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇండస్ట్రీ నిపుణులు సూచిస్తున్నారు. నాన్చుడు ధోరణి కనబరిస్తే మెర్సిడెజ్‌తో పాటు ఆడి వంటి సంస్థలు ఇక్కడ లగ్జరీ కార్లు, ఈవీ కార్ల మార్కెట్లో దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని తేల్చి చెబుతున్నారు. -
మెర్సిడెజ్ బెంజ్.. మేడిన్ ఇండియా.. ధర ఎంతంటే?
Made-in-India Mercedes-Benz S-Class: లగ్జరీ కార్ల విభాగంలో మోస్ట్ పాపులర్ మోడల్ మెర్సిడెజ్ బెంజ్ సెడాన్ ధరలు భారీగా తగ్గాయి. విదేశాల నుంచి దిగుమతికి బదులుగా ఇక్కడే కార్లను తయారు చేస్తుండటంతో వాటి కార్ల ధరల్లో తగ్గుదల సాధ్యమైంది. ఇండియాలో తయారైన కార్లను 2021 అక్టోబరు 7న ఆ సంస్థ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. సక్సెస్ మోడల్ మెర్సిడెజ్ బెంజ్ కార్లకు ఆది నుంచి ఇండియాలో డిమాండ్ ఉంది. సంపన్న వర్గాలు సెడాన్ సెగ్మెంట్లో బెంజ్ కారుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇటీవల మెర్సిడెజ్ బెంజ్ రిలీజ్ చేసిన ఎస్ క్లాస్ కార్లకు మంచి ఆదరణ లభించింది. దీంతో ఇండియన్లకు మరింత చేరువయ్యేలా చర్యలు ప్రారంభించింది జర్మనీకి చెందిన మెర్సిడెజ్ బెంజ్. తగ్గిన ధర ఎక్స్ షోరూమ్‌కి సంబంధించి గతంలో మెర్సిడెజ్ బెంజ్ ఎస్ ధర రూ. 2.17 కోట్లు ఉండగా ఎస్ క్లాస్ 450 4 మ్యాటిక్ ధర రూ. 2.19 కోట్ల రూపాయలుగా ఉండేది. తాజాగా ఈ కార్ల ధరలు తగ్గిపోయాయి. ఎస్ క్లాస్ 450 4 మ్యాటిక్ ప్రారంభ ధర రూ. 1.62 కోట్లకు తగ్గిపోయింది. మరో మోడల్ ఎస్ క్లాస్ 350 డీ ధర రూ. 1.57 కోట్లకు తగ్గింది. కారణం గతంలో జర్మనీలో పూర్తిగా తయారైన కార్లనే (కంప్లీట్ బల్డిండ్ యూనిట్) ఇండియకు దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్మకాలు జరిపే వారు, దీంతో దిగుమతి సుంకం భారం వినియోగదారులపై పడేది. తాజాగా బెంజ్ సంస్థ విడిభాగాలను ఇండియాకు తెప్పించి ఇక్కడే కార్లను (కంప్లీట్ నాక్అవుట్ యూనిట్) తయారు చేస్తోంది. దీంతో దిగుమతి సుంకం భారం లేకుండా పోయింది. ఫలితంగా ధరలు తగ్గాయి. అదే క్వాలిటీ జర్మీలో తయారు చేసినా ఇండియాలో కార్లను రూపొందించినా.. తమదైన నాణ్యతా ప్రమాణాలకు కచ్చితంగా పాటిస్తామని బెంజ్ సంస్థ అంటోంది. ప్రపంచ శ్రేణి కార్ల తరహాలోనే ఇండియన్ మేడ్ కార్లు కూడా ఉన్నాయని వెల్లడించింది. Ranging from top of the class features to comfort and luxury like never before, experience sophistication in the new S-Class. With technology that brings the ultimate Mercedes-Benz experience, enjoy a Star that cares for what matters and is proudly made in India. #NewSClass pic.twitter.com/yodbhmfAue — Mercedes-Benz India (@MercedesBenzInd) October 7, 2021 చదవండి : బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్యువి 700 ఎస్యూవి సరికొత్త రికార్డు -
నీ లుక్ అదిరే సెడాన్, మెర్సిడెస్ నుంచి రెండు లగ్జరీ కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా ఏఎంజీ బ్రాండ్‌లో రెండు సరికొత్త సెడాన్స్‌ను భారత్‌లో గురువారం ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ‘ఈ 53 4మేటిక్ ప్లస్’ ధర రూ.1.02 కోట్లు కాగా ‘ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్’ ధర రూ.1.70 కోట్లు. ఏఎంజీ శ్రేణిలో అత్యంత వేగంగా ప్రయాణించే సెడాన్ ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్ అని కంపెనీ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపారు. 9 స్పీడ్ మల్టీ క్లచ్ ట్రాన్స్మిషన్, 612 హెచ్‌పీ, 850 ఎన్ఎం టార్క్‌తో 4.0 లీటర్ వీ8 బైటర్బో ఇంజిన్‌ను దీనికి పొందుపరిచారు. 3.4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు. 435 హెచ్‌పీ, 520 ఎన్ఎం టార్క్‌తో ట్విన్ టర్బోచార్జింగ్‌తో ఎలక్ట్రిఫైడ్ 3.0 లీటర్ ఇంజిన్‌ను ఈ 53 4మేటిక్ ప్లస్‌కు జోడించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలో చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. వైడ్‌స్క్రీన్ కాక్‌పిట్, ఏఎంజీ పెర్ఫార్మెన్స్ స్టీరింగ్ వీల్, ఎంబక్స్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంస్థకు 94 విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కారును కొనుగోలు చేయవచ్చు. -
soldout: రూ.2.43 కోట్ల కారు.. క్షణాల్లో ఇయర్ స్టాక్ మొత్తం అమ్ముడైంది
ముంబై: కరోనా దెబ్బకు కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ, మందగిస్తున్న ఆర్థిక గమనం వంటి పరిణామాల నేపథ్యంలో ఓ ఖరీదైన అల్ట్రా లగ్జరీ కారు మార్కెట్లోకి వచ్చింది. ఆ కారు ఖరీదు ఎక్స్‌షోరూం ధరనే రూ. 2.43 కోట్ల రూపాయలు. అమ్మకాలు ఎలా అనే సందేహమే లేకుండా క్షణాల్లోనే ఏడాది స్టాక్ అంతా మనవాళ్లు కొనేశారు. మెర్సిడెజా మజాకా లగ్జరీ కార్ల ఉత్పత్తి సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియాలో తాజాగా మైబెక్ జీఎల్ఎస్ 600 సిరీస్‌లో 4 మాటిక్ అల్ట్రామోడ్రన్ లగ్జరీ కారును రిలీజ్ చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూం ధర రూ. 2.43 కోట్లుగా నిర్ణయించింది. ఇలా లాంఛ్ అయ్యిందో లేదో అలా మొత్తం స్టాక్ మొత్తం అమ్ముడైపోయి రికార్డు సృష్టించింది. 500 కార్లు సోల్డ్ అవుట్ ప్రీమియం కేటగిరి లగ్జరీ కారైన మైబెక్ జీఎల్ఎస్ 600 4 మాటిక్ లగ్జరీ కారును ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఏడాదిలో 500 కార్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లాంఛింగ్‌కి ముందే మొత్తం కార్లన్నీ బుక్ అయిపోయాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే బుక్ చేసుకున్న వారికి ఈ కార్లు డెలివరీ చేస్తామని ఆ సంస్థ ఈసీవో మార్టిన్ ప్రకటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : మార్కెట్ లో లంబోర్గిని కొత్త లగ్జరీ కారు -
లగ్జరీ కార్ లవర్స్‌కు మెర్సిడెస్ తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ: లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన వినియోగదారులకు మరింత పారదర్శక ధరలను తీసుకురావాలనే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన డైరెక్ట్-టు-కస్టమర్ అమ్మకాల నమూనాను బుధవారం ప్రకటించింది. డీలర్ల ద్వారా కాకుండా ఆన్లైన్లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా వినియోగదారులకు నేరుగా కార్లను విక్రయిస్తుంది. డైరెక్ట్ ఇన్వెంటరీ ఖర్చును నేరుగా తనపై భరిస్తామని, దేశవ్యాప్తంగా ప్రతి మోడల్‌కు ఒక నిర్దిష్ట ధరను అందిస్తామని మెర్సిడెస్ తెలిపింది. 2021 చివరి త్రైమాసికం నుండి ఈ మోడల్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. తద్వారా మార్కెట్ అభివృద్ధికి, కార్ల అమ్మకాలను సులభతరం చేస్తుందని, డీలర్ లాభదాయకతకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని మెర్సిడెస్ తెలిపింది. దీర్ఘకాలిక వ్యూహాత్మక చర్య మార్కెట్లో రిటైల్ వ్యాపారంలోతమ కస్టమర్ దృష్టిని బలోపేతం చేయడంతో ముందెన్నడూ లేని అనుభవాన్నిఅందిస్తుందని కంపెనీ ప్రకటించింది. తమ కస్టమర్లకు, ఫ్రాంచైజ్ భాగస్వాములకు విన్ విన్ సోల్యూషన్స్ అందిస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు.అయితే 100 డీలర్‌షిప్‌ల ద్వారా కార్ల అమ్మకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇదొక ఆసక్తికరమైన కాన్సెప్ట్ కానీ, బేరమాడే భారతీయ కస్టమర్లకు పెద్దగా రుచించకపోవచ్చని డీలర్లు చెబుతున్నారు. కార్ల ఇన్వాయిస్ నేరుగా కంపెనీ నుండే వస్తాయి. ఆర్డర్‌ను నేరుగా ప్రాసెస్ చేస్తుంది. బెంజ్ తాజా నిర్ణయం కస్టమర్లకు చాలా ఉపశమనం కలిగించవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి వారు ఎలా స్పందిస్తారు, ఎలాంటి ఆఫర్లు లభిస్తాయనేది కీలకమనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు మెర్సిడెస్ బెంజ్ ఇండియా 2021లో 15 మోడళ్లను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో మరో కొత్త ఖరీదైన కారును ప్రవేశపెట్టబోతోంది. మేబాచ్ జిఎల్ఎస్ 600 అల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీని వచ్చే వారంలో దేశీయ మార్కెట్ల విడుదల చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రకటించింది. మెర్సిడెస్-మేబాచ్ లైనప్ నుండి వస్తున్న తొలి ఎస్యూవీ ఈ జీఎల్ఎస్ 600 కావడం విశేషం. ఆల్ట్రా లగ్జరీ కార్ బ్రాండ్, మేబాచ్ పేరుతో బెంజ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన కార్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : Sun Halo: అందమైన రెయిన్బో.. ట్విటర్ ట్రెండింగ్ -
మారుతి కార్ల ధరలకు రెక్కలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఈ ఏప్రిల్ నుంచి తన అన్ని రకాల కార్ల మోడళ్లపై ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ముడి పదార్థాల ధరలు, ఇన్పుట్ వ్యయాలు పెరగటంతో ధరల్ని పెంచక తప్పడం లేదని కంపెనీ చెప్పుకొచ్చింది. అయితే ఏ మోడల్ ఎంత ధర పెరుగుతుందో అనే అంశాన్ని వెల్లడించలేదు. ఇప్పటికే మారుతీ ఈ ఏడాది జనవరిలో కొన్ని కార్ల ధరలను రూ. 34 వేల వరకు పెంచింది. మూడు స్టార్టప్‌ల ఎంపిక.. మొబిలిటీ, ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్ (మెయిల్) ప్రోగ్రాం కింద 3 కొత్త స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు మారుతీ తెలిపింది. నేబుల్ ఐటీ, రెడ్‌బాట్, స్లీవ్ వీటిలో ఉన్నాయి. ఇవి ఇకపై పెయిడ్ ప్రాజెక్టుల్లో భాగం కావచ్చని మారుతీ ఎండీ కెనిచి అయుకావా తెలిపారు. ఫిబ్రవరిలో మారుతి సుజుకి 168,180 వాహనాలను ఉత్పత్తి చేసింది, అంతకు ముందు ఏడాది 140,933 యూనిట్లు. ఇందులో 165,783 ప్యాసింజర్ వాహనాలు, 2,397 లైట్ కమర్షియల్ యుటిలిటీ వాహనాలు ఉన్నాయి.ఇక అమ్మకాల విషయానికొస్తే, కంపెనీ 2021 ఫిబ్రవరిలో 164,469 యూనిట్లను విక్రయించింది, లేదా గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.8 శాతం ఎక్కువ. గత నెలలో 144,761 ప్యాసింజర్ వాహనాలు, 2,722 తేలికపాటి వాణిజ్య వాహనాలు, 5,500 వాహనాలు ఇతర OEM లకు విక్రయించబడ్డాయి మరియు 11,486 ఎగుమతి చేసిన యూనిట్లు ఉన్నాయి. అయితే, 2020-21 ఏప్రిల్-ఫిబ్రవరి అమ్మకాల గణాంకాలు 12.8 శాతం తగ్గి 1,290,847 యూనిట్లకు చేరుకున్నాయి. సాక్షి,సిటీబ్యూరో: నగరంలో సరికొత్త ‘ఈక్లాస్’ మెర్సిడీస్ బెంజ్ సిల్వర్‌స్టార్‌ని లాంచ్ చేశారు. ఈ సిల్వర్ స్టార్‌ని బంజారాహిల్స్‌లోని తాజ్ దక్కన్ హోటల్లో సీఈఓ మహేష్ దేవ్, సేల్స్ లీడ్ సాయిహార్ష కలిసి ఆవిష్కరించారు. ఈ మోడల్లో ఆధునిక సాంకేతను ఉపయోగించి వినూత్నంగా ఎమ్‌బీయూఎక్స్ సిస్టమ్, ట్విన్ డిజిటల్ టచ్ స్క్రీన్, హే మెర్సిడీస్ వాయిస్ కమాండ్స్‌తో రూపొందించామని వారు తెలిపారు. -
మెర్సిడెస్ బెంజ్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ తన ఏఎంజీ కార్ల అసెంబ్లింగ్ ప్రక్రియను భారత్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. పుణేలోని చకన్ యూనిట్లో అసెంబ్లింగ్‌ను చేపడతామని తెలిపింది. అసెంబ్లింగ్ ద్వారా తయారయ్యే మొదటి ఉత్పత్తి ‘‘ఏఎంజీ జీఎల్సీ 43 కూపె’’ మోడల్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా మెర్సిడస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ ... భారత మార్కెట్ల పట్ల మెర్సిడస్ బెంజ్‌కు స్పష్టమైన ప్రణాళిక ఉంది. ధీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఏఎంజీ కార్ల అసెంబ్లింగ్ స్థానికంగానే జరగాలనే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాము, అర్హత కలిగిన కస్టమర్లకు అందరికీ ఏఎంజీను సులభంగా అందుబాటులోకి ఉంచుతాము, ఇక్కడ అసెంబ్లింగ్ అయ్యే మోడళ్లు మా పోర్ట్‌ఫోలియోలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నాము’’ అన్నారు. -
మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఎస్ 63 కుపే
న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ మరో సరికొత్త కారును విడుదల చేసింది. కూపే వేరియంట్లో ఏఎంజీ సిరీస్‌లో ‘ ఏఎంజీ ఎస్ 63 కూపే ’పేరుతో ఖరీదైన కారును దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. రూ. 2.55 కోట్ల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో ఈ కారును ప్రారంభించింది. తద్వారా ఏఎంజీ పోర్ట్‌ఫోలియోను 15కు విస్తరించింది. ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మిచెల్ జోప్ మాట్లాడుతూ మెర్సిడెస్-ఏఎంజీకి భారత్‌లో చాలా అనూహ్యమైన మార్కెట్ ఉందన్నారు. ఇకనుంచి భారత మార్కెట్లోకి విడుదల చేసే ప్రతి డీజిల్ కారు బీఎస్-6ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించనున్నామని చెప్పారు. ట్విన్ టర్బో 5.5లీటర్ల ఇంజీన్‌కు బదులుగా 4లీటర్ల వీ8 బిటుర్బో ఇంజిన్‌తో తయారుచేసిన ఈ కారు కేవలం 3.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది., అలాగే గంటకు 300 కిలోమీటర్ల గరిష్టవేగాన్ని అందిస్తుంది. నాలుగు వైపులా 20-అంగుళాల పరిమాణంలో ఉన్న 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ స్పెషల్ ఎట్రాక్షన్, 9-స్పీడ్ ఏఎమ్‌జి స్పీడ్ షిఫ్ట్ మల్టీ క్లచ్ ట్రాన్స్మిషన్ తోపాటు ఇతర సేఫ్టీ ఫీచర్లను కూడా అమర్చింది. 2015 నాటికి మెర్సిడెస్ అతిపెద్ద విక్రయ లగ్జరీ కార్ బ్రాండ్‌గా పేరు గాంచింది. 2017 లో దేశంలో లగ్జరీ కార్ మార్కెట్లో టాప్ 15,300 యూనిట్లు విక్రయించగా, అందులో బీఎండబ్ల్యూ 9,800 యూనిట్లు, ఆడి 7,876 యూనిట్లు విక్రయాలు నమోదుయ్యాయి. ఈ క్యాలెండర్ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో మెర్సిడెస్ 4556 యూనిట్ల అమ్మకాలు 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది త్రైమాసికంలో కంపెనీ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెస్ 1.33 లక్షల ఏంఎజీ కార్లు అమ్ముడుపోగా ఇండియాలో 400 పైగా యూనిట్లను మాత్రమే విక్రయించింది. -
బయోడీజిల్ వాడకాన్ని తోసిపుచ్చిన బెంజ్
బెంగళూరు : భారత్ లో విక్రయించే కార్లు, ఇతర వాహనాల్లో బయోడీజిల్ వాడకాన్ని జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తోసిపుచ్చింది. తమ వెహికిల్స్ లో బయోడీజిల్ వాడాలనుకోవడం లేదని తెలిపింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి ఈ విషయంపై జర్మన్ లగ్జరీ కారు మేకర్ క్లారిటీ ఇచ్చింది. అటువంటి అవకాశానికి కంపెనీ కట్టుబడి లేదని పేర్కొంది. బయోడీజిల్ తో బెంజ్ కార్లు రూపొందించాలనుకుంటున్నట్టు తాము ఎప్పుడూ రవాణా మంత్రికి చెప్పలేదని మెర్సిడెస్ బెంజ్ టాప్ ఎగ్జిక్యూటివ్ రోనాల్డ్ ఫోల్గర్ స్పష్టంచేశారు. అనేక సందర్భాల్లో తాము కలుసుకున్నామని, భారత్ స్టేజ్-VI వంద శాతం లభ్యత గురించే చర్చించినట్టు.. బయో డీజిల్ వెహికిల్స్ ప్రవేశం గురించి తాము ఎప్పుడూ చర్చించలేదని ఆయన తెలిపారు. 'మై మెర్సిడెస్, మై సర్వీస్' ప్రోగ్రామ్ ను భారత్ లో ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 100 శాతం బయోడీజిల్ ను మెర్సిడెస్ తన కార్లలో, ట్రక్కులో వాడేందుకు కమిట్ అయినట్టు, కంపెనీ తనకు లేఖ పంపినట్టు నితిన్ గడ్కారీ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. తమ కార్లలో 100 శాతం బయోడీజిల్ ను వాడుకుంటామని తెలుపుతూ కంపెనీకి లేఖ రాసినట్టు మంత్రి తెలిపారు. -
5 లక్షలు తగ్గనున్న మెర్సిడెస్ బెంజ్ ధర
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ కంపెనీ లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, జీఎల్-క్లాస్ ధర రూ. 5 లక్షలు తగ్గనున్నది. ఈ ఎస్‌యూవీని పుణే సమీపంలోని చకన్ ప్లాంట్‌లో తయారు చేయడం ప్రారంభించామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సోమవారం తెలిపింది. ఫలితంగా ఈ కారు ధర రూ. 5 లక్షలు దిగిరానున్నది. అమెరికాలోని టస్కలూసా ప్లాంట్ వెలుపల ఈ జీఎల్-క్లాస్ ఎస్‌యూవీని అసెంబుల్ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మేలో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ధరను అప్పుడు రూ.77.5 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఎస్‌యూవీని దేశీయంగా అసెంబుల్ చేస్తుండటంతో దీని ధర రూ. 5 లక్షలు తగ్గి రూ.72.58 లక్షల(ఎక్స్ షోరూమ్,ఢిల్లీ)కు చేరింది.