న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ తన ఏఎంజీ కార్ల అసెంబ్లింగ్ ప్రక్రియను భారత్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. పుణేలోని చకన్ యూనిట్‌లో అసెంబ్లింగ్‌ను చేపడతామని తెలిపింది. అసెంబ్లింగ్ ద్వారా తయారయ్యే మొదటి ఉత్పత్తి ‘‘ఏఎంజీ జీఎల్‌సీ 43 కూపె’’ మోడల్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా మెర్సిడస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ ... భారత మార్కెట్ల పట్ల మెర్సిడస్ బెంజ్‌కు స్పష్టమైన ప్రణాళిక ఉంది. ధీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఏఎంజీ కార్ల అసెంబ్లింగ్ స్థానికంగానే జరగాలనే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాము, అర్హత కలిగిన కస్టమర్లకు అందరికీ ఏఎంజీను సులభంగా అందుబాటులోకి ఉంచుతాము, ఇక్కడ అసెంబ్లింగ్ అయ్యే మోడళ్లు మా పోర్ట్‌ఫోలియోలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నాము’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment