AMG series
-
మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 53
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా పూర్తి ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్–ఏఎంజీ ఈక్యూఎస్ 53 4మ్యాటిక్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 2.45 కోట్ల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు ఒక్కసారి చార్జి చేస్తే 529–586 కి.మీ. వరకూ నడుస్తుంది. 3.4 సెకన్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని పెంచుకునే దిశగా నాలుగు నెలల్లో మూడు విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా వచ్చే నెలలో ఈక్యూఎస్ 580, ఆ తర్వాత నవంబర్‌లో సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈక్యూబీని తేనున్నట్లు వివరించారు. రాబోయే అయిదేళ్లలో తమ వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 25 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు మార్టిన్ చెప్పారు. -
మెర్సిడెస్ బెంజ్ నుంచి కొత్త మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సరికొత్త ‘ఏఎంజీ జీఎల్ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్ కూపే’ కారును ప్రవేశపెట్టింది. ఏఎంజీ శ్రేణిలో ఇది 12వ మోడల్. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.07 కోట్లు. 4 లీటర్ ఇంజన్, 612 హెచ్‌పీ పవర్, అదనంగా 22 హెచ్‌పీ అందించే 48 వోల్ట్ హైబ్రిడ్ సిస్టమ్ పొందుపరిచారు. 3.8 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 280 కిలోమీటర్లు. అన్ని వైపులా ఎయిర్‌బ్యాగ్స్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, 3 స్టేజ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి హంగులు ఉన్నాయి. -
మెర్సిడెస్ బెంజ్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ తన ఏఎంజీ కార్ల అసెంబ్లింగ్ ప్రక్రియను భారత్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. పుణేలోని చకన్ యూనిట్లో అసెంబ్లింగ్‌ను చేపడతామని తెలిపింది. అసెంబ్లింగ్ ద్వారా తయారయ్యే మొదటి ఉత్పత్తి ‘‘ఏఎంజీ జీఎల్సీ 43 కూపె’’ మోడల్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా మెర్సిడస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ ... భారత మార్కెట్ల పట్ల మెర్సిడస్ బెంజ్‌కు స్పష్టమైన ప్రణాళిక ఉంది. ధీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఏఎంజీ కార్ల అసెంబ్లింగ్ స్థానికంగానే జరగాలనే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాము, అర్హత కలిగిన కస్టమర్లకు అందరికీ ఏఎంజీను సులభంగా అందుబాటులోకి ఉంచుతాము, ఇక్కడ అసెంబ్లింగ్ అయ్యే మోడళ్లు మా పోర్ట్‌ఫోలియోలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నాము’’ అన్నారు. -
మెర్సిడెస్ నుంచి ‘ఏఎంజీ ఎస్-63’
బెంగళూరు: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ తాజాగా ఏఎంజీ సిరీస్‌లో సెడాన్ కేటగిరీ కింద ‘ఏఎంజీ ఎస్-63’ అనే మరో కొత్త కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కారులో 585 హర్స్‌పవర్ సామర్థ్యమున్న ఏఎంజీ 5.5 లీటర్ల వీ8 బైటర్బో ఇంజిన్, హెడ్ ఆప్ డిస్ప్లే, నైట్ వ్యూ అసిస్ట్ ప్లస్, మ్యాజిగ్ బాడీ కంట్రోల్, సీట్ కంఫర్ట్ ప్యాకేజ్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.2.53 కోట్లు (ఎక్స్ షోరూమ్ బెంగళూరు)గా ఉంది. డిజైనో ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు ‘ఏఎంజీ ఎస్-63’ కారులో వారికి నచ్చిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.