ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా పూర్తి ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్–ఏఎంజీ ఈక్యూఎస్ 53 4మ్యాటిక్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 2.45 కోట్ల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు ఒక్కసారి చార్జి చేస్తే 529–586 కి.మీ. వరకూ నడుస్తుంది. 3.4 సెకన్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
భారత్‌లో తమ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని పెంచుకునే దిశగా నాలుగు నెలల్లో మూడు విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా వచ్చే నెలలో ఈక్యూఎస్ 580, ఆ తర్వాత నవంబర్‌లో సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈక్యూబీని తేనున్నట్లు వివరించారు. రాబోయే అయిదేళ్లలో తమ వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 25 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు మార్టిన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment