Rolls Royce Spectre Unveiled: Brand First All Electric Car - Sakshi
Sakshi News home page

Rolls-Royce: అల్ట్రా-లగ్జరీ తొలి ఈవీ స్పెక్టర్‌: షాకింగ్‌ ధర

Published Thu, Oct 20 2022 3:04 PM | Last Updated on Thu, Oct 20 2022 4:06 PM

Rolls Royce Spectre unveiled Brand first all electric car - Sakshi

న్యూఢిల్లీ: బ్రిటన్ కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్  కూడా  ఈవీ మార్కెట్లోకి అడుగు పెట్టింది.ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న  కస్టమర్లకోసం తొలి ఆల్-ఎలక్ట్రిక్ కారు ‘స్పెక్టర్‌’ ను ఆవిష్కరించింది. 2023 చివరికి కస్టమర్లకు వాహనాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ కారు పప్రారంభ ధర సుమారు దాదాపు రూ.3.5 కోట్లుగా ఉండనుంది. 

దాదాపు ఏడాది క్రితం దీనికి సంబంధించిన టీజర్‌ను  విడుదల చేసిన కంపెనీ తాజాగా దీన్ని లాంచ్‌ చేసింది.ఇప్పటికే దాదాపు 300కు పైగా  ఈ లగ్జరీ కారును ప్రీబుకింగ్ అయ్యాయని రోల్స్ రాయిస్ సీఈఓ టోర్స్టన్ ముల్లర్-ఓట్వోస్ వెల్లడించారు. ఈవీ కార్లలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదే కాదు "అల్ట్రా-లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్ కూపే" , ఫాంటమ్ కూపేకి  కొనసాగింపు అని పేర్కొన్నారు. తమ స్పెక్టర్ 3.4 సెకన్లలో 0-100 (కిమీ/గం) వేగం పుంజుకుంటుందని తెలిపారు.

డిజైన్ పరంగా, ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ మెరుగైన ఏరోడైనమిక్ సామర్థ్యం, విశాలమైన గ్రిల్‌ను యాడ్‌ చేసింది. అలాగే బానెట్‌పై కొత్త 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ’ అని పేర్కొంది. కేవలం 2 డోర్లు మాత్రమే   ఉన్న ఈ అతి విలాసవంతమైన కారులోని ఇతర విశేషాలను గమనిస్తే. ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మధ్యలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను అందించింది.అలాగే  స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, హై-మౌంటెడ్ అల్ట్రా-స్లిమ్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్స్), అలాగే ఏరో-ఆప్టిమైజ్ 23 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement