హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.66 లక్షలు. కంపెనీ నుంచి చిన్న, అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే. 70.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 560 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది.
గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ఏర్పాటు చేశారు. జీఎల్‌ఏ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ మెర్సిడెస్ నుంచి భారత్‌లో నాల్గవ బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు. 2024 చివరినాటికి మరో రెండు ఈవీలు రానున్నాయి. తొలిసారిగా లగ్జరీ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఎలక్ట్రిక్ ఎంట్రీ–లెవల్ మోడళ్లను కంపెనీ పరిచయం చేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment