జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'ఈక్యూఏ' లాంచ్ చేసింది. ఈ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 జనవరి నుంచి ప్రారంభమవుతాయి.
దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త 'మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ' 250 ప్లస్ అనే ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 66 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ కలిగిన ఈ కారు పోలార్ వైట్, కాస్మోస్ బ్లాక్, మౌంటైన్ గ్రే, హై-టెక్ సిల్వర్, స్పెక్ట్రల్ బ్లూ, పటగోనియా రెడ్ మెటాలిక్, మౌంటైన్ గ్రే మాగ్నో అనే ఏడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది.
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మావిగేషన్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ 70.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 560 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 190 హార్స్ పవర్, 385 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కిమీ.
ఈక్యూఏ ఎలక్ట్రిక్ కారు 100 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 35 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. స్టాండర్డ్ 11 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి 7:15 గంటకు పడుతుంది. మొత్తం మీద ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.
The wait is almost over! We are ready to introduce the new all-electric Mercedes-Benz EQA to India. Get ready for a new generation of electric luxury. #SwitchOnToStandOut#EQA #MercedesBenzIndia pic.twitter.com/50EqWDwKAA
— Mercedes-Benz India (@MercedesBenzInd) July 8, 2024
Comments
Please login to add a commentAdd a comment