sedan segment
-
అదరగొట్టేస్తున్న టాటా ఎలక్ట్రిక్ కార్..ఫీచర్లు,ధర ఎంతంటే?
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటామోటార్స్ తన టిగోర్ ఈవీ సెడాన్ కారుకు సరికొత్త హంగులద్ది మార్కెట్లోకి విడుదల చేసింది. కొనుగోలు దారులు ప్రయాణం మరింత సుఖంగా, సౌలభ్యం కోసం న్యూ ఫర్ ఎవర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా టాటా మోటార్స్ తన కార్లను ప్రతి రెండు నెలలు లేదా మూడు నెలలకు ఒకసారి మోడల్స్‌ను అప్డేట్ చేయనుంది. తాజాగా టిగోరో ఈవీ సెడాన్ కారును అలాగే మార్పులు చేసిన మార్కెట్‌కు పరిచయం చేసింది. ప్రీమియం కార్లలో లేటెస్ట్ టెక్నాలజీని జోడిస్తూ టిగోర్ఈవీ రేంజ్ ఎక్స్టెండ్ చేసింది. దీంతో కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు.దీంతో పాటు మల్టీమోడ్ రీజెన్,రిమోట్ సాయంతో కారును లాక్ అన్‌లాక్ చేసేలా జెడ్ కనెక్ట్ టెక్నాలజీ, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ,టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం(ఐటీపీఎంఎస్),టైర్ పంచర్ రిపేర్ కిట్, ఇంకా అడ్వాన్స్డ్ సిస్టం,మెథడ్, డిజైన్ వంటి టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ అనుభూతిని కలిగించేలా ఫీచర్లను అందుబాటులోకి తెచ్చినట్లు టాటామోటార్స్ ప్రతినిధులు తెలిపారు. కారు ఫీచర్లు టిగోర్.ఈవీని అద్భుతమైన ఫీచర్లతో వాహనాదారులకు అందిస్తున్నాం.భద్రత, ఫీచర్లు, పనితీరు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తయారు చేసినట్లు టాటా ప్రతినిధులు వెల్లడించారు. పీక్ పవర్ అవుట్ 55కేడ్ల్యూ,పీక్ టారిక్ 170ఎన్ఎం,26కేడబ్ల్యూహెచ్ లిక్విడ్ కూల్డ్, హై ఎనర్జీ డెన్సిటీ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. బుకింగ్స్ అద్భుతం ఈ సందర్భంగా టాటా పాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటి లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ..అక్టోబర్ 10, 2022న టాటా టిగో ఈవీ వెహికల్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేశాం. ఈ కారుకు ఊహించని విధంగా లాంచ్ చేసిన నాటి నుంచి నెల రోజుల వ్యవధిలో కొనుగోలు దారులు సుమారు 20వేల వెహికల్స్‌ను బుక్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ధర ఎంతంటే? టాటా మోటార్స్ లాంచ్ చేసిన టిగోర్ ఈవీ కార్ల సిరీస్ ఎక్స్ షోరూం ధరలు ఇలా ఉన్నాయి. టిగోర్ ఎక్స్ఈ ధర రూ.12.49లక్షలు,ఎక్స్‌టీ రూ.12.99లక్షలు,ఎక్స్‌జెడ్‌ప్లస్ రూ.13.49 లక్షలు, ఎక్స్జెడ్ ప్లస్ ఎల్యూఎక్స్ ధర రూ.13.75లక్షలుగా ఉంది. చదవండి👉 ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 53
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా పూర్తి ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్–ఏఎంజీ ఈక్యూఎస్ 53 4మ్యాటిక్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 2.45 కోట్ల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు ఒక్కసారి చార్జి చేస్తే 529–586 కి.మీ. వరకూ నడుస్తుంది. 3.4 సెకన్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని పెంచుకునే దిశగా నాలుగు నెలల్లో మూడు విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా వచ్చే నెలలో ఈక్యూఎస్ 580, ఆ తర్వాత నవంబర్‌లో సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈక్యూబీని తేనున్నట్లు వివరించారు. రాబోయే అయిదేళ్లలో తమ వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 25 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు మార్టిన్ చెప్పారు. -
మెర్సిడెస్ బెంజ్ @ మేడ్ ఇన్ ఇండియా!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అయిదవ తరం సి–క్లాస్ సెడాన్ తయారీని భారత్‌లో ప్రారంభించింది. ఈ మోడల్ వచ్చే నెలలో మార్కెట్లో అడుగుపెట్టనుంది. సి200, సి200డి, సి300డి వేరియంట్లలో లభిస్తుంది. మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న చకన్ వద్ద కంపెనీకి ప్లాంటు ఉంది. 2001లో భారత్‌లో సి–క్లాస్ రంగ ప్రవేశం చేసింది. 37 వేల పైచిలుకు కార్లు రోడ్లపై పరుగెడుతున్నాయి. గతేడాది 43 శాతం అధికంగా అమ్మకాలు సాధించిన ఈ సంస్థ 2022లో రెండంకెల వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2022 జనవరి–మార్చిలో విక్రయాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం అధికమై 4,022 యూనిట్లు నమోదైంది. ఈ ఏడాది 10 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ధ్యేయం. ఈక్యూఎస్ సెడాన్ ఎలక్ట్రిక్ మోడల్‌ను సైతం కంపెనీ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ నుంచి దేశీయంగా అసెంబుల్ చేయనుంది. 2020 అక్టోబర్ నుంచి పూర్తిగా తయారైన ఈ ఎలక్ట్రిక్ కారును మెర్సిడెస్ భారత్‌కు దిగుమతి చేసుకుంటోంది. -
స్కోడా నుంచి సరికొత్త స్లావియా
న్యూఢిల్లీ: ప్రీమియం మిడ్–సైజ్ సెడాన్ సెగ్మెంట్లో మరింత పోటీకి తెరతీస్తూ స్కోడా ఆటో ఇండియా తాజాగా సరికొత్త స్లావియా కారును ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 10.69 లక్షల నుంచి రూ. 15.39 లక్షల (ఎక్స్ షోరూం) శ్రేణిలో ఉంటుంది. నెలకు 2,500–3,000 యూనిట్ల విక్రయాన్ని లక్ష్యం గా పెట్టుకున్నట్లు కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హాలిస్ తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో సెగ్మెంట్ లీడరుగా ఎదగాలన్నది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 179 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ బ్రేక్ డిస్క్ క్లీనింగ్, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్, హిల్–హోల్డ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు కొత్త స్లావియాలో ఉంటాయి. -
సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం
Maruti Ciaz Sedan Car: ఇండియన్ మార్కెట్లో తనకు తిరుగు లేదని మరోసారి మారుతి నిరూపించుకుంది. మార్కెట్లో ఇతర కంపెనీల నుంచి తీవ్ర పోటీ నెలకొన్నా మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి మారుతి బ్రాండ్ నుంచి వస్తోన్న కార్లు. తాజాగా సెడాన్ సెగ్మెంట్ అమ్మకాల్లో మారుతి సియాజ్ సంచలనం సృష్టించింది. ఎస్యూవీ పోటీని తట్టుకుని గత దశాబ్ధం కాలంగా ఇండియన్ మార్కెట్లో ఎస్యూవీ వెహికల్స్‌కే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎంట్రీ లెవల్ కార్లను మినహాయిస్తే ఎస్‌యూవీలోనే ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక సెడాన్ సెగ్మెంట్‌కి సంబంధించిన అమ్మకాల్లో ఎలాంటి మెరుపులు ఉండటం లేదు. అలాంటి తరుణంలో మారుతి మిడ్‌రేంజ్ సెడాన్ సియాజ్ సానుకూల ఫలితాలు సాధించింది. అమ్మకాల్లో రికార్డ్ మారుతి సంస్థ 2014లో మిడ్ రేంజ్ సెడాన్‌గా సియాజ్‌ని మార్కెట్లో ప్రవేశ పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా సియాజ్ కార్ల అమ్మకాలు జరిగాయి. పోటీ సంస్థలైన స్కోడా ర్యాపిడ్, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వాగన్ వెంటోల నుంచి పోటీ ఉన్నా తన అధిపత్యాన్ని కొనసాగించింది. డీజిల్ ఆపేసినా మారుతి సంస్థ 2014లో డీజిల్ వెర్షన్లో సియాన్ని మార్కెట్లోకి తెచ్చినప్పుడు భారీగానే అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత డీజిల్ వెర్షన్ ఆపేసి ఇప్పుడు పెట్రోల్ వెర్షన్లోనే సియాజ్‌ను అమ్ముతోంది. ఐనప్పటికీ సేల్స్ బాగానే ఉన్నాయి. ‘సియాజ్ మార్కెట్‌కి వచ్చినప్పటి నుంచి డిజైన్, స్టైల్, కంఫర్ట్ ఇలా అన్ని విభాగాల్లో కస్టమర్ల ఆదరణ చూరగొంది’ అని మారుతి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ అన్నారు. 1.5 పెట్రోల్ ఇంజన్ ప్రస్తుతం మారుతి సియాజ్‌కి కారు 1.5 పెట్రోలు ఇంజన్ వెర్షన్లో లభిస్తోంది. 103 బ్రేక్ హార్స్ పవర్‌తో గరిష్టంగా 138 ఎన్ఎం టార్క్‌ని అందిస్తోంది. స్టాండర్డ్, ఆటోమేటిక్ గేర్ వెర్షన్లలో ఈ కారు మార్కెట్లో అందుబాటులో ఉంది. 510 లీటర్ల బూట్ స్పేస్, 2,650 గ్రౌండ్ క్లియరెన్సులు సియాజ్ ప్రత్యేకతలు. చదవండి : Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు! -
నీ లుక్ అదిరే సెడాన్, మెర్సిడెస్ నుంచి రెండు లగ్జరీ కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా ఏఎంజీ బ్రాండ్‌లో రెండు సరికొత్త సెడాన్స్‌ను భారత్‌లో గురువారం ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ‘ఈ 53 4మేటిక్ ప్లస్’ ధర రూ.1.02 కోట్లు కాగా ‘ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్’ ధర రూ.1.70 కోట్లు. ఏఎంజీ శ్రేణిలో అత్యంత వేగంగా ప్రయాణించే సెడాన్ ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్ అని కంపెనీ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపారు. 9 స్పీడ్ మల్టీ క్లచ్ ట్రాన్స్మిషన్, 612 హెచ్‌పీ, 850 ఎన్ఎం టార్క్‌తో 4.0 లీటర్ వీ8 బైటర్బో ఇంజిన్‌ను దీనికి పొందుపరిచారు. 3.4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు. 435 హెచ్‌పీ, 520 ఎన్ఎం టార్క్‌తో ట్విన్ టర్బోచార్జింగ్‌తో ఎలక్ట్రిఫైడ్ 3.0 లీటర్ ఇంజిన్‌ను ఈ 53 4మేటిక్ ప్లస్‌కు జోడించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలో చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. వైడ్‌స్క్రీన్ కాక్‌పిట్, ఏఎంజీ పెర్ఫార్మెన్స్ స్టీరింగ్ వీల్, ఎంబక్స్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంస్థకు 94 విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కారును కొనుగోలు చేయవచ్చు. -
హోండా ‘సిటీ’.. కొత్త అప్డేటెడ్ వెర్షన్
ప్రారంభ ధర రూ.8.5 లక్షలు న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా’ తాజాగా తన సెడాన్ కారు ‘సిటీ’లో కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.8.5 లక్షలు– రూ.13.58 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ‘కస్టమర్ల అంచనాలను పరిగణనలో ఉంచుకొని, అందుబాటులో ధరల్లో ఈ కారును రూపొందించాం. ఈ కారుతో తిరిగి మేం సెడాన్ విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటాం’ అని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో యోచిరో యునో తెలిపారు. ఈ కొత్త అప్డేటెడ్ సిటీ కారు పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. 1.5 లీటర్ ఇంజిన్‌ను కలిగిన పెట్రోల్ వేరియంట్ ధర రూ. 8.5 లక్షలు–రూ.13.52 లక్షల శ్రేణిలో ఉంటుందని తెలిపారు. అలాగే 1.5 లీటర్ ఇంజిన్ కలిగిన డీజిల్ వేరియంట్ ధర రూ.10.76 లక్షలు–రూ.13.58 లక్షల శ్రేణిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కొత్త వెర్షన్ సిటీలో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. కాగా ఇది మారుతీ సియాజ్‌కు గట్టిపోటీనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.