Tata Motors Launches Tigor EV In India: Know Price Details And Special Features - Sakshi
Sakshi News home page

Tata Motors Tigor EV: అదరగొట్టేస్తున్న టాటా ఎలక్ట్రిక్‌ కార్‌..ఫీచర్లు,ధర ఎంతంటే?

Published Wed, Nov 23 2022 3:29 PM | Last Updated on Wed, Nov 23 2022 7:38 PM

Tata Motors Launches Tigor Ev With An Extended Range Of 315 Km - Sakshi

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ టాటామోటార్స్‌ తన టిగోర్‌ ఈవీ సెడాన్‌ కారుకు సరికొత్త హంగులద్ది మార్కెట్‌లోకి విడుదల చేసింది. కొనుగోలు దారులు ప్రయాణం మరింత సుఖంగా, సౌలభ్యం కోసం న్యూ ఫర్‌ ఎవర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా టాటా మోటార్స్‌ తన కార్లను ప్రతి రెండు నెలలు లేదా మూడు నెలలకు ఒకసారి మోడల్స్‌ను అప్‌డేట్‌ చేయనుంది. తాజాగా టిగోరో ఈవీ సెడాన్‌ కారును అలాగే మార్పులు చేసిన మార్కెట్‌కు పరిచయం చేసింది. 

ప్రీమియం కార్లలో లేటెస్ట్‌ టెక్నాలజీని జోడిస్తూ టిగోర్‌ఈవీ రేంజ్‌ ఎక్స్‌టెండ్‌ చేసింది. దీంతో కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 315కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు.దీంతో పాటు మల్టీమోడ్‌ రీజెన్‌,రిమోట్‌ సాయంతో కారును లాక్‌ అన్‌లాక్‌ చేసేలా జెడ్‌ కనెక్ట్‌ టెక్నాలజీ, స్మార్ట్‌ వాచ్‌ కనెక్టివిటీ,టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టం(ఐటీపీఎంఎస్‌),టైర్‌ పంచర్‌ రిపేర్‌ కిట్, ఇంకా అడ్వాన్స్‌డ్‌ సిస్టం,మెథడ్‌, డిజైన్‌ వంటి టెక్నాలజికల్లీ అడ్వాన్స్‌డ్‌ అనుభూతిని కలిగించేలా ఫీచర్లను అందుబాటులోకి తెచ్చినట్లు టాటామోటార్స్‌ ప్రతినిధులు తెలిపారు. 

కారు ఫీచర్లు
టిగోర్‌.ఈవీని అద్భుతమైన ఫీచర్లతో వాహనాదారులకు అందిస్తున్నాం.భద్రత, ఫీచర్లు, పనితీరు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తయారు చేసినట్లు టాటా ప్రతినిధులు వెల్లడించారు. పీక్‌ పవర్‌ అవుట్‌ 55కేడ్ల్యూ,పీక్‌ టారిక్‌ 170ఎన్‌ఎం,26కేడబ్ల్యూహెచ్‌ లిక్విడ్‌ కూల్డ్‌, హై ఎనర్జీ డెన్సిటీ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. 

బుకింగ్స్‌ అద్భుతం
ఈ సందర్భంగా టాటా పాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటి లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర మాట్లాడుతూ..అక్టోబర్‌ 10, 2022న టాటా టిగో ఈవీ వెహికల్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్‌ చేశాం. ఈ కారుకు ఊహించని విధంగా లాంచ్‌ చేసిన నాటి నుంచి నెల రోజుల వ్యవధిలో కొనుగోలు దారులు సుమారు 20వేల వెహికల్స్‌ను బుక్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది.

ధర ఎంతంటే?
టాటా మోటార్స్‌ లాంచ్‌ చేసిన టిగోర్‌ ఈవీ కార్ల సిరీస్‌ ఎక్స్‌ షోరూం ధరలు ఇలా ఉన్నాయి. టిగోర్‌ ఎక్స్‌ఈ ధర రూ.12.49లక్షలు,ఎక్స్‌టీ రూ.12.99లక్షలు,ఎక్స్‌జెడ్‌ప్లస్‌ రూ.13.49 లక్షలు, ఎక్స్‌జెడ్‌ ప్లస్‌ ఎల్‌యూఎక్స్‌ ధర రూ.13.75లక్షలుగా ఉంది. 

చదవండి👉 ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement