![Mercedes Benz Begins Production C Class Sedan In India - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/28/Mercedes%20Benz%20C%20Class.jpg.webp?itok=g612iWNR)
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అయిదవ తరం సి–క్లాస్ సెడాన్ తయారీని భారత్‌లో ప్రారంభించింది. ఈ మోడల్ వచ్చే నెలలో మార్కెట్లో అడుగుపెట్టనుంది. సి200, సి200డి, సి300డి వేరియంట్లలో లభిస్తుంది.
మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న చకన్ వద్ద కంపెనీకి ప్లాంటు ఉంది. 2001లో భారత్‌లో సి–క్లాస్ రంగ ప్రవేశం చేసింది. 37 వేల పైచిలుకు కార్లు రోడ్లపై పరుగెడుతున్నాయి. గతేడాది 43 శాతం అధికంగా అమ్మకాలు సాధించిన ఈ సంస్థ 2022లో రెండంకెల వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2022 జనవరి–మార్చిలో విక్రయాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం అధికమై 4,022 యూనిట్లు నమోదైంది.
ఈ ఏడాది 10 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ధ్యేయం. ఈక్యూఎస్ సెడాన్ ఎలక్ట్రిక్ మోడల్‌ను సైతం కంపెనీ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ నుంచి దేశీయంగా అసెంబుల్ చేయనుంది. 2020 అక్టోబర్ నుంచి పూర్తిగా తయారైన ఈ ఎలక్ట్రిక్ కారును మెర్సిడెస్ భారత్‌కు దిగుమతి చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment