sedan car
-
మెర్సిడెస్ బెంజ్‌కు ఏమైంది? హై-ఎండ్ ఎలక్ట్రిక్ కారు క్రాష్ ఫోటో వైరల్
సాక్షి, ముంబై: వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ దుర్మరణం తరువాత మెర్సిడెంజ్ బెంజ్‌కు చెందిన మరో లగ్జరీ కారు ప్రమాదానికి గురి కావడం ఆందోళన రేపుతోంది. సుమారు రూ.1.6 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ ప్రమాదానికి గురైంది. ముంబైలో ప్రమాదానికి గురైన ఈ కారు ఫోటోలను కార్ రివ్యూ సంస్థ టీం బీహెచ్పీ షేర్ చేసింది. ముఖ్యంగా కారు ముందుభాగం, బంపర్ ధ్వంసమైన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏమైంది బెంజ్‌కార్లకు అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హై-ఎండ్ ఎలక్ట్రిక్ కారు ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి. (అమెజాన్‌లో పింక్ స్లిప్స్ కలకలం, వేలమందిపై వేటు!) మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ కారును మెర్సిడెస్-బెంజ్ ఈ ఏడాది కొంత కాలం క్రితం భారత మార్కెట్లో పరిచయం చేసింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతులమీదుగా ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు లాంచ్ అయింది. ఒక్కరోజులోనే భారత మార్కెట్ నుంచి 300 ఆర్డర్లను సాధించింది. జర్మనీ మినహా ఇండియాలో మాత్రమే లభ్యమవుతున్న దీని ధర రూ. 1.55 కోట్లకు పైమాటే. 107.8 kWh బ్యాటరీ సామర్థ్యంతో దేశంలో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకంటే ఎక్కువగా సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 857 కిలోమీటర్ల మైలేజీతో 4.1 సెకన్లలో 100 కిమీ/గం వరకు దూసుకుపోతుందని రిలీజ్ సందర్బంగా బెంజ్ వెల్లడించింది. ఇదీ చదవండి: ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? -
టెస్లాకు షాక్: స్లీక్ అండ్ స్టైలిష్ ఎలక్ట్రిక్ సెడాన్, రేంజ్ ఎంతో తెలిస్తే
Hyundai IONIQ 6: లగ్జరీ కార్ మేకర్ టెస్లాకు షాకిచ్చేలా హ్యుందాయ్ తన తొలి ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ హ్యుందాయ్ ఐయోనిక్ 6ని విడుదల చేసింది. ఐయోనిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 610 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని వాహన తయారీ సంస్థ వెల్లడించింది. ఇదే నిజమైతే లాంగ్-రేంజ్ టెస్లా మోడల్ 3 కంటే మెరుగైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టెస్లా ఆధిపత్యం చలాయిస్తున్న ఈవీ మార్కెట్లో పాగా వేసే లక్ష్యంతో `ఎలక్ట్రిఫైడ్ స్ట్రీమ్‌లైనర్` ఐయోనిక్-6 సెడాన్‌ను తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జ్‌పై 602 కిలోమీటర్లు దూసుకుపోతుంది. 5.1 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. 12 రంగులలో అలరించనున్న హ్యుందాయ్ ఐయోనిక్ 6 కేవలం 18 నిమిషాల్లో 350-kW ఛార్జర్‌తో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. ఈవీ పెర్ఫార్మెన్స్ ట్యూన్-అప్ ఎలక్ట్రిక్ యాక్టివ్ సౌండ్ డిజైన్ (e-ASD) తో అత్యంత ఏరోడైనమిక్ స్టైలింగ్ డ్యూయల్ కలర్, యాంబియంట్ లైటింగ్, స్పీడ్ సింక్ లైటింగ్, అత్యాధునిక ఫీచర్లున్న కారు ఇదేనని హ్యుందాయ్ మోటార్ ప్రెసిడెంట్ , సీఈవో జేహూన్ చాంగ్ తెలిపారు. అల్ట్రా-ఫాస్ట్, మల్టీ-ఛార్జింగ్ సామర్థ్యం, డ్యూయల్ కలర్ యాంబియంట్ లైటింగ్ 64 కలర్స్ స్పెక్ట్రమ్ , స్పెషల్ థీమ్స్, స్పీడ్ సింక్ లైటింగ్ మోడ్, నాలుగు టైప్-సి, ఒక టైప్-ఏ యూఎస్ బీ పోర్ట్‌లు, సిస్టమ్ డ్రైవర్ స్టీరింగ్ ఎఫర్ట్, మోటార్ పవర్, యాక్సిలరేటర్ పెడల్ సెన్సిటివిటీ లాంటివి ఫీచర్లు ఇందులో జోడించినట్టు చెప్పారు. విశాలమైన ఇంటీరియర్, ప్రత్యేకమైన సీట్లు, స్లీక్ అండ్ స్టైలిష్ లుక్‌లో వినియోగదారులు మనసు దోచుకుంటుందని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ డివిజన్ హెడ్ థామస్ స్కీమెరా అన్నారు. ఈ కారును వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమెరికాలో విక్రయించనుంది. అయితే దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అలాగే ఇండియాలో ఎపుడు తీసుకొచ్చేది కూడా స్పష్టత లేదు. -
ఫోక్స్‌వ్యాగన్ సెడాన్ వర్టస్ సంచలనం
హైదరాబాద్: జర్మనీకి చెందిన వాహన తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ మధ్యస్థాయిసెడాన్ వర్టస్ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే 2,000లకుపైగా యూనిట్లు డెలివరీ చేసినట్టు కంపెనీ ప్రకటించింది. లాంచ్ చేసిన దగ్గర్నుంచి ఈ కారు అద్భుతమైన స్పందనతో కస్టమర్ డిమాండ్‌ను సాధించిందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దీని కారణంగా కంపెనీ తన 'బిగ్ బై డెలివరీ', మెగా డెలివరీ ప్రోగ్రామ్‌ను ఇండియా వ్యాప్తంగా ప్రారంభించామని చెప్పింది. ప్రారంభ ఆఫర్లో వర్టస్ ధర ఎక్స్‌షోరూంలో రూ.11.21 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.0 లీటర్, 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ పవర్‌ట్రైన్స్ పొందుపరిచారు. 1.0 లీటర్ ట్రిమ్‌లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటరుకు 19.4 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 18.12 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 1.5 లీటర్ 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ 18.67 కిలోమీటర్ల మైలేజీ ఉంటుందని తెలిపింది. హోండా సిటీ, మారుతీ సియాజ్, హ్యుండై వెర్నా, స్కోడా స్లావియాలకు ఇది పోటీనిస్తుంది. ఎంక్యూబీ ఏ0 ఇండియా ప్లాట్‌ఫామ్‌పై పూణే సమీపంలోని చకన్ ప్లాంటులో ఇది తయారైంది. కాగా ఫోక్స్‌వ్యాగన్ ఇటీవల రిలీజ్ చేసిన వర్టస్ ఇండియాలో ఏ సెడాన్ కారుకు సాధ్యం కాని అరుదైన ఫీట్‌ను సాధించింది. కేరళలోని కొచ్చిలో ఉన్న ఒక షోరూం ఒకేరోజు 150 కార్లను డెలివరీ చేసింది. తద్వారా ఇండియా బుక్ రికార్డ్స్‌లో వర్టస్ చోటు సంపాదించినట్టు కంపెనీ వెల్లడించింది. -
ఈ విషయంలో ఈ కారు రికార్డు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ఫోక్స్‌వ్యాగన్ తాజాగా రిలీజ్ చేసిన వర్చు కారు రికార్డు సృష్టించింది. ఇంత వరకు ఇండియాలో ఏ సెడాన్ కారుకు సాధ్యం అరుదైన ఫీట్‌ను అవలీలాగా సాధించింది. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించింది. జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ ఇటీవల వర్చుస్ పేరుతో సరికొత్త సెడాన్‌ను మార్కెట్లో రిలీజ్ చేసింది. మార్కెటింగ్ స్ట్రాటెజీగా రికార్డ్ మెగా డెలివరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం దేశ వ్యాప్తంగా డీలర్లకు పిలుపునిచ్చింది. ఫోక్స్ వ్యాగన్ మెగా డెలివరీ ప్రోగ్రామ్‌లో భాగంగా కేరళాకు చెందిన ఈవీఎం మోటార్స్ అండ్ వెహికల్స్ అనే డీలర్లు రికార్డు సృష్టించారు. జూన్ 9న కారు మార్కెట్లో రిలీజ్ అవగా అదే రోజు రికార్డు స్థాయిలో ఒకే డీలర్ నుంచి 150 సెడాన్ కార్లు డెలివరీ చేశారు. ఇప్పటి వరకు ఇండియాకు సంబంధించి ఒక సెడాన్ కారు ఒకే డీలర్ నుంచి ఒకే రోజు ఈ స్థాయిలో డెలివరీలు జరగలేదు. దీంతో ఈ ఆరుదైన ఫీట్‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇప్పటి వరకు ఈవీఎం డీలర్లు 200ల వరకు వర్చుస్ కార్లను డెలివరీ చేయగలిగారు. ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ కారు ప్రారంభం ధర రూ.11.21 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. చదవండి: ఆటో విడిభాగాల సంస్థలకు డిమాండ్ ఊతం -
ఫోక్స్ వ్యాగన్ నుంచి సరికొత్త వర్చ్యూ
ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ జర్మన్ కార్‌మేకర్ ఫోక్స్ వ్యాగన్ ఇండియాలో మరో కొత్త కారును ప్రవేశపెట్టింది. సెడాన్ విభాగంలో ఈ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ కారు కనీస ధర రూ. 11.21 లక్షలు ఉండగా హై ఎండ్ మోడల్ ధర రూ.17.92 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఆరు వేరియంట్లలో, ఆరు రంగుల్లో ఈ కారు లభించనుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన 152 షోరూమ్‌లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఫీచర్లు - క్యాబిన్ మరియు బూట్ స్పేస్ 526 లీటర్లు - 20 సెంటీమీటర్ల డిజిటల్ కాక్‌పిట్ - 25.65 స్క్రీన్ ఇన్ఫోంటైన్మెంట్ సిస్టమ్ - యాప్ కనెక్టివిటీ ఫీచర్లు - కీ లెస్ ఇంజన్ స్టార్ట్ , ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ - 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు , 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ మాన్యువల్/ఆటో టార్క్ - వైల్డ్ చెర్రీ రెడ్, కార్బన్ స్టీల్ గ్రే, రిఫ్టెక్స్ సిల్వర్, కుర్కుమా ఎల్లో, క్యాండీ వైట్, రైజింగ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. The New Volkswagen Virtus launched at a starting price of ₹ 11.21 Lakh. The striking, exhilarating, German-engineered marvel will be available in Dynamic and Performance variants.#TheNewVolkswagenVirtus #Sedan2022 #VolkswagenSedan #SedanIndia #VolkswagenIndia #Volkswagen pic.twitter.com/TiUPdEELCD — Volkswagen India (@volkswagenindia) June 9, 2022 లోటు తీరేనా ప్రస్తుతం ఇండియాలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్‌కి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎస్యూవీ, సబ్ ఎస్యూవీ, కాంపాక్ట్ ఎస్యూవీ ఇలా రకరకాలుగా మార్కెట్లోకి ఎస్‌యూవీలు వస్తున్నాయి. ఎస్‌యూవీల తర్వాత మల్టీ పర్పస్ వెహికల్స్ కూడా డిమాండ్ బాగానే ఉంది. దీంతో సెడాన్ విభాగంలో కొత్త మోడళ్ల రాక బాగా తగ్గిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎంట్రీ, మిడ్లెవల్లో ఈ కొరత ఎక్కువగా ఉంది. దీంతో ఫోక్స్‌వ్యాగన్ వర్చ్యూ పేరుతో కొత్త సెడాన్‌ను తెస్తోంది. చదవండి: టాటా మోటార్స్ ‘ఈవీ’ రైడ్ -
భారత్‌లో బీఎండబ్ల్యూ ఐ4
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4 ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్లో ధర రూ.69.9 లక్షలు. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేసుకుంటోంది. 340 హెచ్‌పీ పవర్‌తో అయిదవ తరం బీఎండబ్ల్యూ ఈ–డ్రైవ్ టెక్నాలజీని వాడారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలో అందుకుంటుంది. 80.7 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 590 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. దేశంలో ఇతర ఈవీలతో పోలిస్తే ఈ స్థాయిలో ప్రయాణించే సామర్థ్యం ఉండడం ఇదే అత్యధికమని వెల్లడించింది. షాప్.బీఎండబ్ల్యూ.ఇన్ వెబ్సైట్లో ఐ4 బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు జూలై నుంచి ప్రారంభం అవుతాయి. -
మెర్సిడెస్ బెంజ్ @ మేడ్ ఇన్ ఇండియా!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అయిదవ తరం సి–క్లాస్ సెడాన్ తయారీని భారత్‌లో ప్రారంభించింది. ఈ మోడల్ వచ్చే నెలలో మార్కెట్లో అడుగుపెట్టనుంది. సి200, సి200డి, సి300డి వేరియంట్లలో లభిస్తుంది. మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న చకన్ వద్ద కంపెనీకి ప్లాంటు ఉంది. 2001లో భారత్‌లో సి–క్లాస్ రంగ ప్రవేశం చేసింది. 37 వేల పైచిలుకు కార్లు రోడ్లపై పరుగెడుతున్నాయి. గతేడాది 43 శాతం అధికంగా అమ్మకాలు సాధించిన ఈ సంస్థ 2022లో రెండంకెల వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2022 జనవరి–మార్చిలో విక్రయాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం అధికమై 4,022 యూనిట్లు నమోదైంది. ఈ ఏడాది 10 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ధ్యేయం. ఈక్యూఎస్ సెడాన్ ఎలక్ట్రిక్ మోడల్‌ను సైతం కంపెనీ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ నుంచి దేశీయంగా అసెంబుల్ చేయనుంది. 2020 అక్టోబర్ నుంచి పూర్తిగా తయారైన ఈ ఎలక్ట్రిక్ కారును మెర్సిడెస్ భారత్‌కు దిగుమతి చేసుకుంటోంది. -
ఆడి నయా వర్షన్ అదరహో
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి భారత విపణిలోకి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ సెడాన్ కొత్త వర్షన్‌ను సోమవారం లాంచ్ చేసింది. భారత్‌లో ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్‌ను 2017 లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎస్5 నయా మోడల్ అప్డేటెడ్ వర్షన్‌గా రానుంది. దీని ధర రూ. 79.06 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు మరింత ఆకర్షణీయమైన ఔటర్ డిజైనే కాకుండా, అప్డేట్ చేసిన క్యాబిన్‌తో రానుంది. కార్ ఎక్స్టీరియర్ విషయానికి వస్తే , ప్రస్తుత డిజైన్ స్పోర్టి లూక్‌తో రానుంది. ట్వీక్డ్ ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది, అంతేకాకుండా షార్ప్‌గా కనిపించే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో పాటుగా , డే టైమ్ రన్నింగ్ లైట్లతో( డిఆర్ఎల్) అమర్చారు. క్వాడ్-టిప్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. కారు ఇంటిరియల్స్లో భాగంగా 10 అంగుళాల టచ్ స్క్రీన్ రానుంది. కారుకు 354 హార్స్‌పవర్‌ను అందించగల 3.0-లీటర్ ట్విన్-టర్బో, వి 6 పెట్రోల్ ఇంజన్ తో పాటు వస్తోంది. దీంతో కారుకు 500 ఏన్ఎమ్ గరిష్ట టార్క్ ను అందిస్తోంది. స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌లో భాగంగా 8-స్పీడ్ టిప్ట్రోనిక్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.8 సెకన్లలో అందుకుంటుంది. ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ టాప్ స్పీడ్ 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ కారులో డైనమిక్, కంఫర్ట్, ఎఫిషియెన్సీ, ఆటో, ఇండివిజువల్‌తో సహా ఐదు డ్రైవింగ్ మోడ్‌లను ఏర్పాటు చేశారు. మెర్సిడెస్-ఎఎమ్‌జి సి 43, మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి 43 ఎఎమ్‌జి, బీఎండబ్ల్యూ ఎం 340 ఐ వంటి ఇతర లగ్జరీ కార్లతో ఆడి ఎస్ 5 పోటీపడనుంది. (చదవండి: బెంట్లీ లగ్జరీ కారు నయా వర్షన్.. రేటు ఎంతంటే? ) -
కొత్త ఆడి A4.. జనవరి 5న విడుదల
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాది(2021)లో లగ్జరీ కార్ల విభాగం మరింత వేడెక్కనుంది. ఈ విభాగంలో ఆడి A4 సెడాన్ మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే రూ. 2 లక్షల టోకెన్ అడ్వాన్స్‌తో దేశీయంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆడి డీలర్లు, అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జనవరి 5న ఆడి కొత్త A4 సెడాన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తో్ంది. 2 లీటర్ల పెట్రోల్ టీఎఫ్ఎస్ఐ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారు వేరియంట్స్ రూ. 42-48 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరలలో లభించనున్నట్లు ఆటో వర్గాలు తెలియజేశాయి. నిజానికి ఈ ఏడాది(2020)లో ఆడి పలు మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. A8 L, Q2, Q8, Q8 సెలబ్రేషన్, ఆర్ఎస్ Q8, ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ మోడల్ కార్లతో సందడి చేసింది. చదవండి: (కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా) ఎడ్జస్టబుల్ సీట్స్ కొత్త ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్లలో A4 రూపొందింది. లెడ్ హెడ్‌ల్యాంప్స్, లెడ్ టెయిల్ ల్యాంప్స్‌తోపాటు బంపర్‌ను సైతం అప్డేట్ చేసింది. కేబిన్‌లో 10.1 అంగుళాల ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసుకునేందుకు వీలయ్యే సీట్లు, 3 జోన్ క్లయిమేట్ కంట్రోల్, వర్చువల్ కాక్‌పిట్, యాంబియెంట్ లైటింగ్, వైర్లెస్ చార్జింగ్, సన్‌రూఫ్‌తోపాటు 8 ఎయిర్‌బ్యాగ్స్‌తో A4 సెడాన్ వెలువడనున్నట్లు ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. గరిష్టంగా 190 బీహెచ్పీ పవర్‌ను అందుకోగల, 7స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమాటిక్ ఫీచర్స్‌తో వెలువడనుంది. 7.3 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్నిఅందుకోగలదని అంచనా. కాగా.. లగ్జరీ సెడాన్ విభాగంలో మెర్సిడీస్ బెంజ్ C-క్లాస్, బీఎండబ్ల్యూ 3 సిరీస్, జాగ్వార్ ఎక్స్ఈలతో A4 పోటీ పడగలదని ఆటో నిపుణులు పేర్కొన్నారు. కొత్తగా విడుదలకానున్న వోల్వో S60కు సైతం పోటీగా నిలిచే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
విడుదలైన నిమిషాల్లోనే..
లిమిటెడ్ ఎడిషన్‌గా లాంచ్ అయిన వోల్వో సరికొత్త సెడాన్ కారు నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోయింది. ఈ కార్ల బుకింగ్ ప్రారంభమైన 39 నిమిషాల్లోనే మొత్తం యూనిట్లు అమ్ముడయ్యాయట. లిమిటెడ్‌గా తీసుకొచ్చిన మొత్తం 20 యూనిట్లు ప్రీ బుకింగ్‌లో బుక్ అయ్యాయనీ, అమెరికాలో ఈ రికార్డు విక్రయాలు నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. దీని ధర రూ. 45.04 లక్షలు(ఆన్ రోడ్, న్యూఢిల్లీ) . స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తుల సంస్థ వోల్వో ఇటీవల ఎస్60 మోడల్లో ప్రత్యేక ఎడిషన్ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే . అయితే అమెరికా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ కారు ను వోల్వో యాప్ ద్వారా శుక్రవారం విక్రయాలను ప్రారంభించారు. కారు ధర, లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రకటించిన తర్వాత 39 నిమిషాల్లోనే కార్లన్నీ బుక్ అయిపోయాయని వోల్వో తెలిపింది. 2019లో ఈ కారును కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది. పోలెస్టార్ ఇంజనీర్డ్ వెర్షన్ ఎస్ 60 సెడాన్ వోల్వో యాప్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపింది. 415బీహెచ్ పవర్, 669ఎన్ఎం టార్క్, ఓహిలిన్స్ సస్పెన్షన్, బ్రెంబో బ్రేక్స్, తదితర అధునాతన ఫీచర్స్ ఈ సెడాన్ సొంతం. -
ఆడి ‘ఏ6 మ్యాట్రిక్స్’లో పెట్రోల్ వేరియంట్
ధర రూ.52.75 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ తన ‘ఏ6 మ్యాట్రిక్స్ 35 టీఎఫ్ఎస్ఐ’ సెడాన్ కారు మోడల్లో తాజాగా పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.52.75 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇందులో 1.8 లీటర్ పెట్రోల్ ఇం జిన్, 7 స్పీడ్ ట్రాన్స్మిషన్, అడ్వాన్స్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 8 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలేషన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ డిస్ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది.