హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4 ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్‌లో ధర రూ.69.9 లక్షలు. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేసుకుంటోంది. 340 హెచ్‌పీ పవర్‌తో అయిదవ తరం బీఎండబ్ల్యూ ఈ–డ్రైవ్ టెక్నాలజీని వాడారు.
గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలో అందుకుంటుంది. 80.7 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 590 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. దేశంలో ఇతర ఈవీలతో పోలిస్తే ఈ స్థాయిలో ప్రయాణించే సామర్థ్యం ఉండడం ఇదే అత్యధికమని వెల్లడించింది. షాప్.బీఎండబ్ల్యూ.ఇన్ వెబ్‌సైట్‌లో ఐ4 బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు జూలై నుంచి ప్రారంభం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment