New model
-
బజాజ్ పల్సర్ ఎన్125
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో కొత్తగా ఎన్125 ప్రవేశపెట్టింది. 124.59 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ స్పార్క్, 2 వాల్వ్ ఇంజన్ పొందుపరిచారు. 8,500 ఆర్పీఎం వద్ద 12 పీఎస్ పవర్, 6,000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. ఎల్ఈడీ డిస్క్ బీటీ, ఎల్ఈడీ డిస్క్ వేరియంట్లలో లభిస్తుంది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.98,707 ఉంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ ఎల్సీడీ స్పీడోమీటర్, మోనోషాక్ సస్పెన్షన్, ఐఎస్జీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు జోడించారు. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.5 లీటర్లు. -
ఐఫోన్ 16 వచ్చిందోచ్ (ఫొటోలు)
-
ప్యూర్ ఈవీ నుంచి ఎకోడ్రిఫ్ట్ బైక్
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ప్యూర్ ఈవీ తమ కొత్త మోటార్ సైకిల్ వేరియంట్ ఎకోడ్రిఫ్ట్ 350ని ఆవిష్కరించింది. దీన్ని ఒక్కసారి చార్జి చేస్తే 171 కి.మీ. వరకు ప్రయాణించగలదు. ప్రతి రోజూ ఎక్కువ దూరాలు ప్రయాణించే వినియోగదారులకు ఇది ఎంతో అనువుగా ఉంటుందని సంస్థ తెలిపింది. దీనితో నెలవారీగా రూ. 7,000 పైచిలుకు ఆదా కాగలదని వివరించింది. దీని ధర రూ. 1,29,999గా ఉంటుందని ప్యూర్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ వదేరా తెలిపారు. సులభతరమైన ఈఎంఐ సదుపాయం రూ. 4,000 నుంచి ఉంటుందని పేర్కొన్నారు. 110 సీసీ సెగ్మెంట్లో హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి మోటార్‌సైకిల్స్‌తో దీటుగా పోటీపడగలిగేలా దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. ఇందులో రివర్స్ మోడ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 75 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. -
హోండా ఎలివేట్ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లోకి మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్ ప్రవేశపెట్టింది. ఎలివేట్‌కు భారత్ తొలి మార్కెట్ కాగా, ఈ మోడల్ ద్వారా కంపెనీ మధ్యస్థాయి ఎస్‌యూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.10.99–15.99 లక్షలు ఉంది. 121 పీఎస్ పవర్, 145 ఎన్ఎం టార్క్‌తో 6–స్పీడ్ మాన్యువల్, 7–స్పీడ్ సీవీటీ ట్రిమ్స్‌లో 1.5 లీటర్ ఐ–వీటీఈసీ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. లీటరుకు మైలేజీ మాన్యువల్ ట్రిమ్ 15.31, సీవీటీ 16.92 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, లేన్ వాచ్ కెమెరా, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ, ట్రాక్షన్ కంట్రోల్‌తో వెహికిల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, మల్టీ యాంగిల్ రేర్ వ్యూ కెమెరా, 458 లీటర్ల కార్గో స్పేస్, 7 అంగుళాల హెచ్డీ ఫుల్ కలర్ టీఎఫ్టీ మీటర్ క్లస్టర్, 10.25 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ ఎల్సీడీ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆడియో, డ్రైవ్ వ్యూ రికార్డింగ్ వంటి హంగులు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్‌కు పోటీనిస్తుంది. అయిదు ఎస్‌యూవీలు: భారత్‌లో 2030 నాటికి అయిదు ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుముర తెలిపారు. ‘భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఎస్‌యూవీల వాటా ఏడాదిలో 43 నుంచి 48 శాతానికి చేరింది. ఈ విభాగం కంపెనీకి చాలా కీలకం కానుంది. ఎలివేట్ చేరికతో కంపెనీకి కొత్త కస్టమర్లు తోడు కానున్నారు. ఎస్యూవీ విభాగంలో లేకపోవడంతో చాలా కోల్పోయాం. అందుకే ఎలివేట్‌ను పరిచయం చేయడం గొప్పగా భావిస్తున్నాం’ అని వివరించారు. రాజస్తాన్‌లోని ప్లాంటు సామర్థ్యాన్ని పెంచామని, ప్రస్తుతం రోజుకు 660 యూనిట్లు ఉత్పత్తి చేయగలమని చెప్పారు. జూలై నుంచి ఎలివేట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. -
ట్రెసా నుంచి వీ0.1 ఎలక్ట్రిక్ ట్రక్
హైదరాబాద్: ట్రెసా మోటార్స్ తన తొలి ఎలక్ట్రిక్ ట్రక్ ‘వీ0.1’ మోడల్‌ను ఆవిష్కరించింది. యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ ప్లాట్ ఫామ్: ఫ్లక్స్350పై దీన్ని అభివృద్ధి చేసినట్టు సంస్థ ప్రకటించింది. దీన్ని ప్రపంచ మార్కెట్ కోసం డిజైన్ చేసినట్టు తెలిపింది. భవిష్యత్ కోసం ఉద్దేశించిన సుస్థిర రవాణా పరిష్కారాలను అందించాలన్న సంస్థ అంకిత భావానికి ఈ ఉత్పత్తి నిదర్శనంగా ఉంటుందని పేర్కొంది. ట్రెసా ఎలక్ట్రిక్ ట్రక్ ‘వీ0.1’లో 350 కిలోవాట్ పవర్‌ను అందించే మోటార్ ఉంటుంది. ఈ తరహా పవర్‌ను అందించే తొలి భారత ఓఈఎం తమదేనని ట్రెసా మోటార్స్ ప్రకటించింది. యాక్సియల్ ఫ్లక్స్ మోటార్‌ను పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినట్టు తెలిపింది. ‘‘దేశంలో 28 లక్షల ట్రక్కులు ఉన్నాయి. ఇవి 60 శాతం కాలుష్యానికి కారణమవుతున్నాయి. కనుక మధ్య స్థాయి నుంచి, భారీ తరహా ట్రక్కులు సున్నా ఉద్గార ఇంధనాల వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. 2024లో రానున్న వాహన తుక్కు విధానం, పెరుగుతున్న ఇంధన ధరలు ఎలక్ట్రిక్ ట్రక్కులకు అనుకూలించనున్నాయి. సురక్షిత, వినూత్న, పర్యావరణ పరిష్కారాలతో ఈ పరివర్తనాన్ని ట్రెసా ముందుండి నడిపిస్తుంది’’అని సంస్థ పేర్కొంది. -
రెండు ఇంధనాలతో మహీంద్రా వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా రెండు రకాల ఇంధనాలతో నడిచే వాహన విభాగంలోకి ప్రవేశించింది. సుప్రో సీఎన్జీ డువో పేరుతో మోడల్‌ను విడుదల చేసింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.6.32 లక్షలు. ఈ తేలికపాటి వాణిజ్య వాహనం సీఎన్జీ, పెట్రోల్‌తో నడుస్తుంది. 750 కిలోల బరువు మోయగలదు. 75 లీటర్ల సీఎన్జీ ట్యాంక్, 5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి సామర్థ్యంతో 325 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మైలేజీ కిలోకు 23.35 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ‘సీఎన్జీ వాహనాల డిమాండ్ నాలుగేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. సీఎన్జీ అవసరాన్ని ఇది సూచిస్తుంది. దేశవ్యాప్తంగా 2 టన్నులలోపు సామర్థ్యం గల తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు నెలకు 16,000 యూనిట్లు. ఇందులో సీఎన్జీ వాటా సుమారు 5,000 యూనిట్లు’ అని మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ బానేశ్వర్ బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. సుప్రో సీఎన్జీ డువో రాకతో నెలవారీ అమ్మకాలు రెండింతలు అవుతాయని సంస్థ భావిస్తోంది. 1.5తోపాటు 2 టన్నుల విభాగంలోనూ రెండు రకాల ఇంధనాలతో నడిచే మోడళ్లను తేనున్నట్టు వెల్లడించింది. -
తక్కువ ధరలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ భారతదేశంలో కొత్త ఏథర్ 450ఎస్‌ను విడుదల చేసింది. ఫేమ్-II సబ్సిడీ కోతతో ఈవీల ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ఏథర్ 450ఎస్ పేరుతో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,29,999గా నిర్ణయించింది. బుకింగ్‌లను కూడా షురూ చేసింది. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) తమ 450 ఎస్ IDC (ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్) 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో పరిధి 115 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. గంటకు 90 కి.మీవేగంతో అత్యుత్తమ సాంకేతికత, పనితీరును అందిస్తుందని ఏథర్ఎనర్జీ కో-ఫౌండర్, సీఈవో తరుణ్ మెహతా తెలిపారు. ఫేమ్-IIఫ్రేమ్‌వర్క్ కింద తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ 450 ఎక్స్ కొత్త ధరలను కూడా ప్రకటించింది. మునుపటి ధరతో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ. 1,65,000 (ఎక్స్-షోరూమ్ బెంగుళూరు)కి అందుబాటులో ఉంటుంది. టాప్ వేరియంట్ ప్రో ప్యాక్ ఏథర్ 450 ఎక్స్ రూ. 1.45 లక్షల నుండి రూ. 1.65 లక్షల వరకు ఉంటుంది. పాత ధరలతో పోలిస్తే దాదాపు రూ. 32,000 వరకు పెరిగింది. -
లెక్సస్ కారు @ రూ.2.39 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ లెక్సస్.. తాజాగా భారత్‌లో కొత్త ఎల్సీ 500హెచ్ మోడల్‌ను పరిచయం చేసింది. నాలుగు సీట్లు ఉన్న ఈ లగ్జరీ కూపే ధర రూ.2.39 కోట్లు. గ్లాస్ బ్లాక్ మెటాలిక్ ఫినిష్, 3డీ మెషీన్డ్ టెక్స్చర్తో అలాయ్ వీల్స్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, 3.5 లీటర్, 6 సిలిండర్, మల్టీ స్టేజ్ హైబ్రిడ్, లీటరుకు 12.3 కిలోమీటర్ల మైలేజీ, 264 కిలోవాట్ పవర్ ఏర్పాటు ఉంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇదీ చదవండి: ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకన్లలోనే చేరుకుంటుంది. పనోరమిక్ వ్యూ మానిటర్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, 10 ఎయిర్‌బ్యాగ్స్, కార్బన్ ఫైబర్ రీ–ఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ రూఫ్, డైనమిక్ హ్యాండ్లింగ్ సిస్టమ్, వేరియేబుల్ గేర్ రేషియో స్టీరింగ్, డ్రైవ్ స్టార్ట్ కంట్రోల్, వెహికిల్ డైనమిక్స్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్, ఈబీడీతో ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. భారత్‌లో హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో లెక్సస్ షోరూంలు ఉన్నాయి. (వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో) లగ్జరీ కార్లు, స్మార్ట్ఫోన్లు, ఈవీల పై తాజా సమాచారం కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
హోండా నుంచి ఏటా కొత్త కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఏటా ఒక కొత్త మోడల్ లేదా వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మార్కెట్లో కంపెనీ వాటాను పెంచుకోవడం లక్ష్యంగా వచ్చే 3–5 ఏళ్లపాటు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. హోండా వాటా ప్రస్తుతం 2.5 శాతం మాత్రమే. 2023 సెప్టెంబర్‌లోగా ఒక ఎస్‌యూవీని పరిచయం చేయనున్నట్టు హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు. హైబ్రిడ్ మోడల్ ఒకటి రానుందని చెప్పారు. అలాగే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ మోడల్ సైతం రంగ ప్రవేశం చేయనుందని వెల్లడించారు. 2022–23లో 8 శాతం వృద్ధితో దేశీయంగా 92,000 యూనిట్ల అమ్మకాలను కంపెనీ ఆశిస్తోంది. అలాగే 25 శాతం వృద్ధితో ఎగుమతులు 23,000 యూనిట్లు నమోదు కానున్నాయి. రాజస్థాన్‌లోని ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 1.8 లక్షల యూనిట్లు. -
2024 మారుతి డిజైర్: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో, అతి తక్కువ ధరలో!
సాక్షి, ముంబై: మారుతి సుజుకి తన పాపులర్మోడల్ కారు నెక్ట్స్ జెనరేషన్ మారుతి డిజైర్ సరికొత్త హైబ్రిడ్ ఇంజీన్‌తో లాంచ్ చేయనుంది. తాజాగా నివేదికల ప్రకారం కొత్త డిజైన్, కొత్త అప్డేట్స్తో 2024 మారుతి సుజుకి డిజైర్‌ను లాంచ్ చేయనుంది. హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో లాంచ్ చేయనున్న బ్రాండ్ లైనప్‌లో డిజైర్ మొదటి కాంపాక్ట్ సెడాన్ కానుంది. 2024 ప్రథమార్థంలో భారత మార్కెట్లో కొత్త డిజైర్‌ను విడుదల చేయాలని భావిస్తోంది కంపెనీ. రానున్న న్యూజెన్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ భారతీయ మార్కెట్లో అత్యంత ఇంధన-సమర్థవంతమైన కార్లలో ఒకటిగా ఉంటుందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. ఇది హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు గట్టిపోటీగా మార్కట్లోకి ప్రవేశించనుంది. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ లీటరుకు 35కి.మీకంటే ఎక్కువ ఇంధన సామర్థ్యంతో దేశంలో అతి తక్కువ ఖరీదుతో బలమైన-హైబ్రిడ్ వాహనం డిజైర్ కానుందని అంచనా. మూడు ఇంజీన్ వేరియంట్లు 2024 డిజైర్ మూడు ఇంజన్ ఎంపికలతో లాంచ్ కానుంది. 1.2L NA పెట్రోల్ ఇంజీన్, 1.2L స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజీన్ , 1.2 లీటర్ల సీఎన్జీ (Z12E)ఇంజీన్ ఉన్నాయి. ఫీచర్లు ఎక్స్టీరియర్గా పునర్నిర్మించిన ఫ్రంట్ ఫాసియాతో పాటు, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, భారీ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ LED హెడ్లైట్లు, LED టెయిల్ లైట్లు, మెషిన్-కట్ అల్లాయ్ వీల్స్ ఇతర ఫీచర్లు ప్రధానంగా ఉండనున్నాయి. అలాగే సౌకర్యవంతమైన క్యాబిన్, బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హెడ్స్-అప్ డిస్ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ కూల్డ్ స్టోరేజ్ కన్సోల్ ప్రధానంగా ఉండనున్నాయి.మొబైల్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు సరికొత్త సుజుకి కనెక్ట్ టెక్నాలజీని కూడా ఇందులో పొందుపర్చనుంది. మారుతి అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులోకి రానున్న ఈ కారు ప్రస్తుత మోడల్ పోలిస్తే రూ. 80వేలు లేదా రూ. 1 లక్ష ఎఎక్కువ ధరనిర్ణయించవచ్చని భావిస్తున్నారు. మారుతి డిజైర్ బేస్ మోడల్ ధర రూ. 6.44 లక్షలు -
ఏటా ఒక కొత్త హోండా కారు
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా భారత మార్కెట్లో ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి సారించి ఏటా ఒక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. పెట్రోల్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్స్‌లో రూ.10 లక్షలు, ఆపై ధరలో వీటిని పరిచయం చేయనున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుమురా తెలిపారు. ‘ప్యాసింజర్ వాహన రంగంలో 40 శాతం వాటా రూ.10 లక్షల పైచిలుకు మోడళ్లదే. ఈ విభాగం వాటా మరింత పెరగనుంది. అమేజ్, సిటీ మోడళ్ల టాప్ ట్రిమ్స్ 60 శాతం పైగా వాటా కైవసం చేసుకున్నాయి. విదేశాల్లో విక్రయిస్తున్న మోడళ్లను సైతం ఇక్కడ ప్రవేశపెడతాం. రూ.260 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా సేల్స్ నెట్‌వర్క్‌ను పునరుద్ధరిస్తున్నాం’ అని వివరించారు. వృద్ధిపై దృష్టిపెట్టాం.. : అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆధారిత మోడళ్లపై ఫోకస్ చేయాలని నిర్ణయించామని సుమురా చెప్పారు. ‘ఈ ప్రణాళికలో భారత్ కూడా ఉంది. అయితే మౌలిక వసతులనుబట్టి ఒక్కో మార్కెట్ ఒక్కోలా ఉంటుంది. అంతర్జాతీయ పోకడలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లో డీజిల్ మోడళ్లను నిలివేశాం. చిప్ కొరత ప్రభావం ఇప్పటికీ కంపెనీపై ఉంది. రాజస్థాన్ ప్లాంటులో ఏటా 1.3 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాం. కొత్త మోడళ్ల రాకతో ప్లాంటు వినియోగం పెరుగుతుంది. ప్లాంటు పూర్తి సామర్థ్యం ఏటా 1.8 లక్షల యూనిట్లు. దీనిని 2.2 లక్షల యూనిట్లకు విస్తరించవచ్చు. వ్యయ నియంత్రణ చర్యలతో రెండేళ్లుగా భారత్‌లో లాభాలు గడిస్తున్నాం. ఈ ఏడాది రానున్న ఎస్‌యూవీతో అమ్మకాలు అధికం అవుతాయి’ అని తెలిపారు. కొత్త వెర్షన్స్‌లో సిటీ.. సిటీ కొత్త వెర్షన్స్‌ను కంపెనీ గురువారం ప్రవేశపెట్టింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఇది తయారైంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభం. మైలేజీ వర్షన్నుబట్టి లీటరుకు 17.8–18.4 కిలోమీటర్లు. స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్ (ఈహెచ్ఈవీ) ధర రూ.18.89 లక్షల నుంచి మొదలు. మైలేజీ లీటరుకు 27.13 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. రానున్న రోజుల్లో సిటీ అమ్మకాల్లో 15 శాతం వాటా ఈహెచ్ఈవీ నుంచి ఉంటుందని హోండా భావిస్తోంది. -
Xiaomi AR Smart Glass: కళ్ళముందున్న ప్రపంచాన్ని చేతితో..
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన వైర్లెస్ AR గ్లాస్ డిస్కవరీ ఎడిషన్ ప్రోటోటైప్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో ప్రదర్శించింది. ఇది ఏఆర్ హెడ్సెట్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ఆర్2 జెన్ 1 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది వైర్‌లెస్‌గానే మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది. వైర్లెస్ ఏఆర్ గ్లాసెస్ చూడటానికి సింపుల్‌గా ఉండటమే కాకుండా, చాలా తేలికగా కూడా ఉంటుంది. కంపెనీ ఇందులో కార్బన్ ఫైబర్, మెగ్నీషియం టైటానియం వంటి మిశ్రమాలను ఉపయోగించింది. దీని బరువు కేవలం 126 గ్రాములు మాత్రమే. ఇది కస్టమ్ సిలికాన్-ఆక్సిజన్ యానోడ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. షియోమీ ఏఆర్ గ్లాసెస్ తేలికగా ఉండటమే కాకుండా ఒక జత మైక్రో OLED స్క్రీన్లను కలిగి ఉండటం వల్ల లైట్ గైడింగ్ ప్రిజమ్లకి కనెక్ట్ చేయబడతాయి. ఇది 12 నకిల్స్ ఫంక్షన్‌కి సపోర్ట్ చేస్తుంది. చైనీస్ నైన్-కీ ఇన్పుట్ మాదిరిగా ఇది వినియోగదారుల థంబ్ ద్వారా టెక్స్ట్ ఇన్పుట్ చేయడానికి అనుమతిస్తుంది. ఏఆర్ గ్లాస్లో లెన్స్‌లు ఎలెక్ట్రోక్రోమిక్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి, కావున ఆన్ చేయడం ఆఫ్ చేయడం రెండు సులభంగా ఉంటాయి. ఇది కేవలం స్ట్రీమింగ్కు మాత్రమే కాకుండా అంతకు మించిన ఉపయోగాలను వినియోగదారులకు అందిస్తుంది. ఇందులో హ్యాండ్ ట్రాకింగ్ టెక్నాలజీ కూడా ఉంది. షియోమీ విడుదల చేయనున్న లేటెస్ట్ ఏఆర్ గ్లాసెస్ చాలా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అయితే కంపెనీ దీనిని ఎప్పుడు లాంచ్ చేస్తుంది, ధరలు ఎలా ఉంటాయనేది తెలియాలి. అయితే కంపెనీ దీనిని త్వరలోనే మార్కెట్లో విడుదల చేయడానికి కావలసిన అన్ని సన్నాహాలు చేస్తోంది. Boasting a retina-level near-eye display for AR glasses, Xiaomi Wireless AR Glass Discovery Edition delivers a truly immersive visual experience. Moreover, our self-developed Xiaomi AR Gesture Control empowers effortless control between virtual and real space. pic.twitter.com/EipqBWxkpW — Lei Jun (@leijun) February 27, 2023 -
ఆల్-న్యూ హాట్ & టెక్కీ బ్రెజ్జా, ఒక సూపర్ సర్ప్రైజ్ కూడా
సాక్షి, ముంబై: మారుతి సుజుకి కొత్త వెర్షన్ బ్రెజ్జాను తీసుకురానుంది. 2022 మారుతి సుజుకి బ్రెజ్జా సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. అలాగే మారుతి సుజుకి పేరు నుండి 'వితారా' అనే పదాన్ని తొలగిస్తోంది. కేవలం బ్రెజ్జా అని పిలుస్తోంది.ఈ మేరకు మొదటి టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది కొత్త 2022 బ్రెజ్జా జూన్ 30నుంచి కస్టమర్లు అరేనా షోరూమ్‌లో లేదా ఆన్లైన్లో 11 వేలకు ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీకి స్టైలింగ్, ఫీచర్లు టెక్ పరంగా బారీ మేక్ఓవర్‌ను అందిస్తోంది. ముఖ్యంగా కొత్త బ్రెజ్జా తొలి సన్‌రూఫ్ కారుగా రావడం స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.ఇంకా కార్ టెక్ కనెక్ట్ , ప్యాడిల్ షిఫ్టర్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లేదా ESPతో అప్డేట్ చేయబడిన ఇంజీన్‌ను జోడించింది. 5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 102బీహెచ్పీ వద్ద 35 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. సీఎస్జీ వెర్షన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. కేవలం 6 సంవత్సరాలలో 7.5 లక్షల యూనిట్ల అమ్మకాలతో, దేశంలోని కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో బ్రెజ్జా బలమైన మార్కెట్ మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు సరికొత్త టెక్ ఫీచర్లు, కమాండింగ్ డ్రైవింగ్ ఫీచర్స్‌తో మారుతి కొత్త బ్రెజ్జా నెక్స్ట్-జెన్ స్మార్ట్ హైబ్రిడ్ కె-సిరీస్ ఇంజన్‌తో వస్తుందని, న్యూహాట్, టెక్కీ బ్రెజ్జాను పరిచయం చేస్తున్నామన్నారు. Feel the breeze while cruising through the city! Introducing Electric Sunroof in the All New #HotAndTechyBrezza.#BookingsOpen #AllNewBrezza #MarutiSuzukiArena #MSArena #MarutiSuzuki pic.twitter.com/ipJI67BbCA — Maruti Suzuki Arena (@MSArenaOfficial) June 20, 2022 -
భారత్‌లో బీఎండబ్ల్యూ ఐ4
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4 ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్లో ధర రూ.69.9 లక్షలు. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేసుకుంటోంది. 340 హెచ్‌పీ పవర్‌తో అయిదవ తరం బీఎండబ్ల్యూ ఈ–డ్రైవ్ టెక్నాలజీని వాడారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలో అందుకుంటుంది. 80.7 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 590 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. దేశంలో ఇతర ఈవీలతో పోలిస్తే ఈ స్థాయిలో ప్రయాణించే సామర్థ్యం ఉండడం ఇదే అత్యధికమని వెల్లడించింది. షాప్.బీఎండబ్ల్యూ.ఇన్ వెబ్సైట్లో ఐ4 బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు జూలై నుంచి ప్రారంభం అవుతాయి. -
స్కోడా నుంచి సరికొత్త స్లావియా
న్యూఢిల్లీ: ప్రీమియం మిడ్–సైజ్ సెడాన్ సెగ్మెంట్లో మరింత పోటీకి తెరతీస్తూ స్కోడా ఆటో ఇండియా తాజాగా సరికొత్త స్లావియా కారును ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 10.69 లక్షల నుంచి రూ. 15.39 లక్షల (ఎక్స్ షోరూం) శ్రేణిలో ఉంటుంది. నెలకు 2,500–3,000 యూనిట్ల విక్రయాన్ని లక్ష్యం గా పెట్టుకున్నట్లు కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హాలిస్ తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో సెగ్మెంట్ లీడరుగా ఎదగాలన్నది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 179 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ బ్రేక్ డిస్క్ క్లీనింగ్, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్, హిల్–హోల్డ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు కొత్త స్లావియాలో ఉంటాయి. -
5జీ మొబైల్స్.. ఈ ఫీచర్స్‌తో ఈ మోడలే చాలా చీప్ అంట!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ మోటరోలా తాజాగా మోటో జీ51 5జీ మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ధర రూ.14,999 ఉంది. 12 రకాల 5జీ బ్యాండ్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. రూ.15 వేల లోపు ధరల విభాగంలో దేశంలో ఈ స్థాయి మోడల్ ఇదొక్కటేనని కంపెనీ తెలిపింది. భారత్‌లో తొలిసారిగా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5జీ ప్రాసెసర్‌తో తయారైంది. 120 హెట్జ్ 6.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే, బిజినెస్ గ్రేడ్ సెక్యూరిటీ సొల్యూషన్ థింక్‌షీల్డ్, 50 ఎంపీ క్వాడ్ కెమెరా, 20 వాట్ టర్బోపవర్ చార్జర్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి హంగులు ఉన్నాయి. వేగవంతమైన ఇంటర్నెట్ కోసం 4జీ4 మిమో, 3 క్యారియర్ అగ్రిగేషన్ సాంకేతికత జోడించారు. ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 16 నుంచి లభిస్తుంది. చదవండి:ఐఫోన్ 13 ఉచితం ! ఎక్కడ? ఎప్పుడు? ఎలా? -
యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తాజాగా యాక్టివా 125 స్కూటర్ ప్రీమియం ఎడిషన్‌ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర డ్రమ్ బ్రేక్స్ రూ.78,725, డిస్క్ బ్రేక్ వేరియంట్ రూ.82,280 ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్, సెమి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఏసీజీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఐడ్లింగ్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్, బ్లాక్ ఇంజన్, బ్లాక్ ఫ్రంట్ సస్పెన్షన్ వంటి హంగులు ఉన్నాయి. ప్రీమియం గ్రాఫిక్స్, లుక్ కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. -
డుకాటీ నుంచి స్క్రాంబ్లర్ లిమిటెడ్ ఎడిషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటాలియన్ సూపర్‌బైక్స్ తయారీ సంస్థ డుకాటీ తాజాగా లిమిటెడ్ ఎడిషన్ స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ ఫాస్ట్హౌజ్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.10.99 లక్షలు. డుకాటీ స్క్రాంబ్లర్, అమెరికన్ క్లోతింగ్ బ్రాండ్ ఫాస్ట్హౌజ్ సహకారాన్ని వేడుక చేసుకోవడంలో భాగంగా కొత్త మోడల్‌కు రూపకల్పన చేశారు. అంతర్జాతీయంగా 800 యూనిట్లు మాత్రమే తయారు చేశారు. -
మెర్సిడెస్ బెంజ్ నుంచి కొత్త మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సరికొత్త ‘ఏఎంజీ జీఎల్ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్ కూపే’ కారును ప్రవేశపెట్టింది. ఏఎంజీ శ్రేణిలో ఇది 12వ మోడల్. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.07 కోట్లు. 4 లీటర్ ఇంజన్, 612 హెచ్‌పీ పవర్, అదనంగా 22 హెచ్‌పీ అందించే 48 వోల్ట్ హైబ్రిడ్ సిస్టమ్ పొందుపరిచారు. 3.8 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 280 కిలోమీటర్లు. అన్ని వైపులా ఎయిర్‌బ్యాగ్స్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, 3 స్టేజ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి హంగులు ఉన్నాయి. -
మహీంద్రా ఎక్స్‌యూవీ700 @ రూ.11.99 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి కొత్త ఎస్యూవీ ఎక్స్‌యూవీ700 మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభం. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్స్‌తో 5, 7 సీట్ల సామర్థ్యంతో వాహనాన్ని రూపొందించారు. వేరియంట్‌నుబట్టి స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, స్కైరూఫ్, కర్టెయిన్ ఎయిర్‌బ్యాగ్స్, డ్రైవర్ డ్రౌజినెస్ అలర్ట్, స్మార్ట్ క్లీన్ జోన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, సైడ్ ఎయిర్‌బ్యాగ్స్, మెమరీతో 6–వే పవర్ సీట్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, ఎల్రక్టానిక్ పార్క్ బ్రేక్, వైర్లెస్ చార్జింగ్, 360 సరౌండ్ వ్యూ వంటి హంగులు ఉన్నాయి. -
ఆడి ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం ఆడి తాజాగా భారత్‌లో ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.1.04 కోట్లు. 450 హెచ్‌పీ పవర్‌తో 2.9 లీటర్ వీ6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, 3 జోన్ ఎయిర్కండీషనింగ్, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్ వంటివి పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. కంపెనీ పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తోంది. -
Micromax in 2b: అదిరిపోయే ఫీచర్లు... అతి తక్కువ ధరలో..
దేశీ బ్రాండ్‌గా ఒకప్పుడు ఇండియా మార్కెట్లో హవా చెలాయించిన మైక్రోమ్యాక్స్ మళ్లీ పట్టు కోసం ప్రయత్నిస్తోంది. తనదైన శైలిలో అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఫోన్ తెస్తోంది. హ్యాంగ్ ఫ్రీ గతేడాది మైక్రోమాక్స్ ఐఎన్ 1బీ మోడల్ని మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ విడుదల చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మైక్రోమ్యాక్స్ ఐన్ 2బీని రిలీజ్ చేస్తోంది. ఐఎన్ 2బీ ఫోన్ పెర్ఫామెన్స్ స్మూత్‌గా ఉంటుందని, హ్యంగ్ ఫ్రీ ఫోన్ అంటూ మైక్రోమ్యాక్స్ క్లయిమ్ చేసుకుంటోంది. ఈ మొబైల్లో యూనిసాక్ టీఎ610 చిప్సెట్ని మైక్రోమ్యాక్స్ ఉపయోగిస్తోంది. ధర ఆడ్రాంయిడ్ 11 వెర్షన్‌పై ఐన్ 2బీ మోడల్ ఫోన్ పని చేస్తుంది. ఈ మొబైల్‌ను 4 జీబీ, 6 జీబీ ర్యామ్‌లు 64 జీబీ స్టోరేజీ వేరియంట్లుగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో 4 జీబీ వేరియంట్ మొబైల్ ధర రూ. 7,000లు ఉండగా 6 జీబీ ర్యామ్ మొబైల్ ధర రూ. 8,999లుగా ఉంది. ఆగస్టు 4న ఫ్లిప్‌కార్ట్ వేదికగా 2బీ మొబైల్ లాంచ్ చేయనుంది మైక్రోమ్యాక్స్. బిగ్ బ్యాటరీ మైక్రోమ్యాక్స్ 2బీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీంతో 15 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్, 20 గంటల బ్రౌజింగ్ టైమ్‌ని అందిస్తోంది మైక్రోమ్యాక్స్. అంతేకాదు ఈ సెగ్మెంట్లో ఫాస్టెస్ట్ ఫింగర్ ప్రింట్స్కానర్ ఈ మొబైల్లో పొందు పరిచారు. బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్లలో ఈ మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది. ఇందులో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్‌కెమెరా, వెనుక వైపు 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు రెండు అమర్చారు. 6.5 అంగులాల వాటర్ డ్రాప్ నాచ్ హెడ్డీ డిస్ప్లేని అమర్చింది. -
జేఎల్ఆర్ డిఫెండర్ 90 అమ్మకాలు షురూ, ధర ఎంతంటే..
Jaguar Land Rover Defender 90 ముంబై: జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన ఎస్యూవీ డిఫెండర్ 90 విక్రయాలను ప్రారంభించింది. గురువారం నుంచి అమ్మకాలు మొదలుపెట్టినట్లు ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది. కారు ధర రూ.76.57 లక్షలుగా ఉంది. ఈ ఎస్యూవీ మూడు ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. ఆరు సీట్ల సామర్థ్యం ఉంది. ‘‘గతేడాది మార్కెట్లోకి వచ్చిన డిఫెండర్ 110 మోడల్‌కు డిమాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు డిఫెండర్ 90 విడుదలతో ల్యాండ్ రోవర్ బ్రాండ్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది’’ అని జేఎల్ఆర్ విభాగపు ఎండీ రోహిత్ తెలిపారు. -
BMW : ఎం5 కాంపిటీషన్... ఓన్లీ ఆన్లైన్ బుకింగ్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ ఆధునీకరించిన ఎం5 కాంపిటీషన్ సెడాన్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.1.62 కోట్లు. 4.4 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజన్ 625 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. 3.3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఫీచర్స్ ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, మిర్రర్ క్యాప్స్, లేజర్ లైట్స్, ఆటోమేటిక్ టెయిల్ గేట్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్ అడ్జస్టేబుల్ సీట్స్, కొత్త షాక్ అబ్సార్బర్స్, ట్రాక్ మోడ్, సెంట్రలైజ్డ్ ఇంటెలిజెంట్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి హంగులు ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఎం5 కాంపిటీషన్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చదవండి : సెప్టెంబర్ నుంచి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్ డెలివరీలు -
ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్, అందరి దృష్టి దానిపైనే
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఈసారి అందరి దృష్టి ఇన్ఫినిక్స్ కాన్సెప్ట్ 2021 ఫోన్‌పై పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ ఫోన్లో ఫీచర్స్‌ని ఇన్ఫినిక్స్ చేర్చింది. రంగులు మార్చేస్తుంది డ్యూయల్ కలర్ ఛేంజింగ్ బ్యాక్ కవర్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఇన్ఫినిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ కలర్ మారుతుందని ఇన్ఫినిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ జెస్సీ ఝాంగ్ తెలిపారు. గతంలో ఈ తరహా ఫీచర్‌తో ఏ ఫోన్ రాలేదు. ఒక రకంగా ఈ ఫోన్ ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తుంది. క్రేజీ ఫీచర్లు యువతను ఆకట్టుకునేలా అనేక ఫీచర్లను ఇన్ఫినిక్స్ తన రాబోయే ఫోన్లో జోడించనుంది. అందులో కలర్ ఛేంజింగ్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు 4000 mAh బ్యాటరీ అందివ్వనుంది దీనికి తోడుగా 160 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం వల్ల 10 నిమిషాల్లోనే ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అందివ్వనుంది. 3డీ గ్లాస్ కవరింగ్, 60 ఎక్స్ జూమ్ వంటి ఫీచర్లు అందించింది. అంతేకాదు ఫోన్ ఎక్కువగా వాడుతున్నా... ఛార్జింగ్ చేసే సమయంలో వేడెక్కకుండా ఉండే టెక్నాలజిని ఉపయోగిస్తున్నట్టు ఇన్ఫినిక్స్ తెలిపింది. చదవండి : Gravton Quanta EV: రూ.80కే.. 800 కిలోమీటర్లు ప్రయాణం -
ఒక్కసారి ఈ సైకిల్ చూస్తే... కొనకుండా ఉండలేరు
ఇప్పుడిప్పుడే ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఊపందుకుంటోంది. మార్కెట్లోకి కొత్తగా ఈవీ కార్లు, బైకులు, స్కూటర్లను కంపెనీలు ప్రవేశపెడుత్నున్నాయి. మరోవైపు వెస్ట్రన్ కంట్రీలు మరో అడుగు ముందుకు వేసి వింటేజ్ లుక్‌తో ఎలక్ట్రికల్ సైకిళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఈ మోడ్రన్ సైకిల్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఐవీ, ఏస్ ఇటలీకి చెంది వెలోరెటి కొత్తగా ఐవీ, ఏస్ పేర్లతో రెండు కొత్త సైకిళ్లను మార్కెట్లోకి తెస్తోంది. పూర్తిగా వింటేజ్ లుక్‌తో రూపొందించిన ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇట్టే ఆకర్షించేలా ఉన్నాయి. ఐవీ, ఏస్‌ల మోడళ్లను ఒకే టెక్నాలజీతో రూపొందించారు. కేవలం ఫ్రేమ్స్ తేడా చూపించారు. ఈ సైకిళ్లలో 510 Wh బ్యాటరీలను అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేసే 60 నుంచి 120 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయోచ్చు. హైడ్రాలిక్ బ్రేక్స్, ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్, బ్యాక్ లైట్లను అమర్చారు. ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ సిస్టమ్‌తో ఈ సైకిళ్లు రూపొందాయి. ఫుల్ క్రేజ్ వింటేజ్ లుక్‌తో లేటెస్ట్ టెక్నాలజీ మిక్స్ చేసి వాలోరెటీ రూపొందించిన ఐవీ, ఏస్ మోడళ్లకు యూరప్‌లో క్రేజ్ ఏర్పడింది. దీంతో భారీ ఎత్తున సైకిళ్లు తయారు చేసే పనిలో ఉంది వెలోరెటి. యూరప్‌లో ఎక్కడికికైనా సరే పది రోజుల్లో డెలివరీ ఇస్తామంటూ హామీ ఇస్తోంది. ఈ సైకిల్ క్రేజ్ చూసిన తర్వాత .. త్వరలోనే మన దగ్గర కూడా ఇలాంటి సైకిళ్లు వస్తే బాగుండు అనుకుంటున్నారు నెటిజన్లు. చదవండి : సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే.. -
స్కోడా ‘కుషాక్’ వచ్చింది..
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ స్కోడా తాజాగా కుషాక్ మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద రూపొందించిన ఈ తొలి మోడల్ ద్వారా కంపెనీ మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. వేరియంట్‌నుబట్టి ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.10.5 లక్షల నుంచి రూ.17.6 లక్షల వరకు ఉంది. 1 లీటర్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్లతో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్తోపాటు 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ రకాలతో వాహనం తయారైంది. హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్, ఆరు వరకు ఎయిర్‌బ్యాగ్స్ వంటివి అదనపు హంగులు. జూలై 12 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది 30,000, వచ్చే సంవత్సరం 60,000 యూనిట్ల అమ్మకం లక్ష్యంగా చేసకున్నట్టు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. -
హ్యుందాయ్ కెట్రాలో కొత్త మోడల్... తగ్గిన ధర
ఇండియా ఆటోమొబైల్ సెక్టార్లో స్పొర్ట్ప్ యూటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో గట్టి పోటీ నెలకొంది. ఈ పోటీని తట్టుకునేందుకు కొత్త ఫీచర్లను జోడిస్తునే ధర తగ్గించి సంచలన నిర్ణయం తీసుకుంది హ్యుందాయ్. అధునాతన ఫీచర్లు, తక్కువ ధరతో క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను సైలెంట్‌గా మార్కెట్లోకి తెచ్చింది. క్రెటా ఎగ్జిక్యూటివ్ ఎంట్రీ లెవల్ ఎస్యూవీ మార్కెట్లో తిరుగులేదని ఆధిపత్యం చలాయిస్తోంది హ్యుందాయ్ క్రెటా మోడల్. క్రెటా ఎస్, హైఎండ్‌లో క్రెటా ఎస్ఎక్స్ వేరియంట్ల అమ్మకాలు జోరుమీదున్నాయి. అయితే ఇతర కంపెనీల నుంచి పోటీ ఎక్కువ కావడంతో మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చింది హ్యుందాయ్. క్రెటా ఎస్, కెట్రా ఎస్ఎక్స్ వేరియంట్ల కలయికతో క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్‌ని హంగు ఆర్భాటం లేకుండా ప్రవేశపెట్టింది. పైగా క్రెటా ఎస్‌ఎక్స్‌తో పోల్చితే ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ కారు ఎక్స్ షోరూం ధరలో రూ. 78,000 తక్కువకే ఇది లభిస్తోంది. లేటెస్ట్ ఫీచర్స్ క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్లో యాంటెన్నా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, బ్లూటూత్ మైక్, యూఎస్బీ పోర్టులు వంటి ఫీచర్లు అందించింది. అయితే మ్యూజిక్ సిస్టమ్‌ని ఇన్‌బిల్ట్‌గా కాకుండా యాక్సెసరీగా అందివ్వనుంది. మరోవైపు ఎస్ఎక్స్ వేరియంట్లలో ఉన్న డోర్ హ్యాండిల్ క్రోమ్, రియర్ వ్యూ మానిటర్, వాయిస్ కంట్రోల్ సిస్టమ్, బర్గ్లర్ అలారమ్ వంటి ఫీచర్లు ఎగ్జిక్యూటివ్‌లో లేవు. అయితే ఎక్కువ మంది ఇష్టపడే సన్‌రూఫ్, వైర్లెస్ సేవలు అందించే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ వంటి ఆటో ఫీచర్లు అందించింది. క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్లో 1.5 లీటర్ పెట్రోలు / డీజిల్ ఇంజన్ అమర్చారు. చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ -
డుకాటి పనిగలే V 4, ధర ఎంతో తెలుసా?
వెబ్‌డెస్క్ : బైక్ లవర్స్‌కి శుభవార్త ! డుకాటి ఫ్లాగ్షిప్ మోడల్ డుకాటి ఇండియాలో అడుగు పెట్టింది. సపర్ స్టైలిష్ లుక్‌తో సాటి లేని ఇంజన్ సామర్థ్యంతో భారత్ రోడ్లపై పరుగులు పెట్టేందుకు డుకాటి పనిగలే వీ4, వీ4 ఎస్ మోడళ్లు రెడీ అయ్యాయి. ధర డుకాటి పనిగలే వీ4 ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ ధర రూ.23.50 లక్షలు ఉండగా. దీని తర్వాతి వెర్షన్, మోర్ ప్రీమియం మోడల్ అయిన డుకాటి పనిగలే వీ4 ఎస్ ధర రూ. 28.40 లక్షలుగా ఉంది. లేటెస్ట్ ఫీచర్స్ డుకాటిలో ప్రీమియం మోడలైన పనగలే వీ మోడళ్లకు 2020 చివరిసారి డిజైన్, ఇంజన్లో మార్పులు చేర్పులు చేశారు. దాని ప్రకారం న్యూ ఎయిరోడైనమిక్ ప్యాకేజీ, స్మాల్ ఇంజన్ ట్వీక్స్, హార్డ్‌వేర్ డిజైన్‌లో చేంజేస్ వచ్చాయి. భద్రత ఈ బైక్‌పై రివ్వుమని దూసుకుపోయే రైడర్ భద్రత దృష్ట్యా కార్నరింగ్ ఏబీఎస్, వీలీ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కార్నర్స్‌లో బ్రేక్ హ్యాండ్లింగ్ మరింత మెరుగ్గా డిజైన్ చేశారు. V4 S ప్రత్యేకతలు అల్యుమినియం వీల్స్, లిథియం అయాన్ బ్యాటరీ, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు డుకాటి పనగలే వీ 4 ఎస్‌లో ఉన్నాయి. ఈ ఫీచర్లు పనగలే వీ 4లో లేవు. పవర్ఫుల్ కాటీ పనగలే వీ 4 ఇంజన్ సామర్థ్యం 1103 సీసీ. త్వరలోనే డుకాటి సంస్థ క్రూజర్ బైక్‌ని ఇండియా మార్కెట్లోకి తేనుంది. చదవండి: మార్కెట్ లో లంబోర్గిని కొత్త లగ్జరీ కారు -
POCO: పోకో నుంచి 5 జీ స్మార్ట్‌ఫోన్
5 జీ నెట్వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే వరుసగా 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. తాజాగా తక్కువ ధరలో హై ఎండ్ ఫోన్లు అందించే పోకో సైతం కొత్త మోడల్‌ను సిద్ధం చేసింది. పోకో ఎం 3 ప్రో పేరుతో కొత్త మొబైల్‌ని రేపు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు చేయనుంది. జూన్ 8న పోకో ఎం 3 పప్రోను తొలుత ఇండియా మార్కెట్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కోవిడ్ కల్లోకం కారణంగా రద్దయ్యింది. గత వారమే ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది. జూన్ 8న ఉదయం 11:30 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయి. ఆకట్టుకునే ఫీచర్లు కష్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఫీచర్లను జత చేసింది పోకో సంస్థ. ఫోన్ వెనుక వైపు కర్వ్డ్ త్రీడీ గ్లాసీ ఫినిష్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది. ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ను యాడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే మూడు కెమెరాలను వెనుక వైపు ఇచ్చారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. 18 వాట్ స్పీడ్ ఛార్జర్‌తో వచ్చే ఈ ఫోన్ బ్యాటరీ రెండు రోజుల వరకు డ్రైయిన్ అవదని పోకో హామీ ఇస్తోంది. -
వచ్చేస్తోంది.. స్కోడా ఒక్టావియా
వెబ్‌డెస్క్: క్వాలిటీ, లగ్జరీ, డ్యూరబులిటీలకు మరో పేరైన స్కోడా నుంచి మరో కొత్త కారు మార్కెట్లోకి వస్తుంది. ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్‌గా విజయవంతమైన ఒక్టావియా ఫోర్త్ జనరేషన్ కారు లాంఛింగ్‌కి రెడీ అయ్యింది స్కోడా జూన్ 10న కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కార్ల అమ్మకాల్లో జోరు తగ్గినప్పటికీ... కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ ఫుల్ మోడల్ ఒక్టావియాలో ఫోర్త్ జనరేషన్ కారును మార్కెట్లోకి తెస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమైతే మేలోనే ఈ కారు మార్కెట్లోకి రావాల్సింది. కానీ లాక్డౌన్ కారణంగా జూన్ 10కి వాయిదా పడింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న స్కోడా యూనిట్లో ఈ కార్లు తయారవుతున్నాయి. ఓన్లీ పెట్రోల్ వెర్షన్ స్కోడా ఒక్టావియా ఫోర్త్ జనరేషన్ ఓన్లీ పెట్రోల్ వెర్షన్లోనే లభిస్తోంది. ఈ కారులో అమర్చిన 2 లీటర్ యూనిట్ పెట్రోల్ ఇంజన్ 188 బీహెచ్పీ శక్తిని అందిస్తుంది. పాత కారుతో పోల్చితే సైజ్‌లో కొంచెం పెద్దదిగా డిజైన్ చేశారు. పొడవులో 19 మిల్లీమీటర్లు, వెడల్పులో 15 మిల్లీమీటర్లు పెద్దదిగా ఉంటుంది. కారు ముందు భాగంలో ఆప్షనల్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, హారిజంటల్ ఫాగ్‌ల్యాంప్స్ ఇవ్వగా వెనుక వైపు టైల్‌ల్యాంప్ డిజైన్లోనూ మార్పులు చేశారు. స్కోడా మార్క్‌ని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. ఒక్టావియా మోడల్ మార్కెట్‌కి వచ్చి 20 ఏళ్లు దాటగా ఇప్పటి వరకు లక్షకు పైగా కార్లు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. -
లగ్జరీ కార్ లవర్స్‌కు మెర్సిడెస్ తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ: లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన వినియోగదారులకు మరింత పారదర్శక ధరలను తీసుకురావాలనే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన డైరెక్ట్-టు-కస్టమర్ అమ్మకాల నమూనాను బుధవారం ప్రకటించింది. డీలర్ల ద్వారా కాకుండా ఆన్లైన్లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా వినియోగదారులకు నేరుగా కార్లను విక్రయిస్తుంది. డైరెక్ట్ ఇన్వెంటరీ ఖర్చును నేరుగా తనపై భరిస్తామని, దేశవ్యాప్తంగా ప్రతి మోడల్‌కు ఒక నిర్దిష్ట ధరను అందిస్తామని మెర్సిడెస్ తెలిపింది. 2021 చివరి త్రైమాసికం నుండి ఈ మోడల్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. తద్వారా మార్కెట్ అభివృద్ధికి, కార్ల అమ్మకాలను సులభతరం చేస్తుందని, డీలర్ లాభదాయకతకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని మెర్సిడెస్ తెలిపింది. దీర్ఘకాలిక వ్యూహాత్మక చర్య మార్కెట్లో రిటైల్ వ్యాపారంలోతమ కస్టమర్ దృష్టిని బలోపేతం చేయడంతో ముందెన్నడూ లేని అనుభవాన్నిఅందిస్తుందని కంపెనీ ప్రకటించింది. తమ కస్టమర్లకు, ఫ్రాంచైజ్ భాగస్వాములకు విన్ విన్ సోల్యూషన్స్ అందిస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు.అయితే 100 డీలర్‌షిప్‌ల ద్వారా కార్ల అమ్మకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇదొక ఆసక్తికరమైన కాన్సెప్ట్ కానీ, బేరమాడే భారతీయ కస్టమర్లకు పెద్దగా రుచించకపోవచ్చని డీలర్లు చెబుతున్నారు. కార్ల ఇన్వాయిస్ నేరుగా కంపెనీ నుండే వస్తాయి. ఆర్డర్‌ను నేరుగా ప్రాసెస్ చేస్తుంది. బెంజ్ తాజా నిర్ణయం కస్టమర్లకు చాలా ఉపశమనం కలిగించవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి వారు ఎలా స్పందిస్తారు, ఎలాంటి ఆఫర్లు లభిస్తాయనేది కీలకమనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు మెర్సిడెస్ బెంజ్ ఇండియా 2021లో 15 మోడళ్లను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో మరో కొత్త ఖరీదైన కారును ప్రవేశపెట్టబోతోంది. మేబాచ్ జిఎల్ఎస్ 600 అల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీని వచ్చే వారంలో దేశీయ మార్కెట్ల విడుదల చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రకటించింది. మెర్సిడెస్-మేబాచ్ లైనప్ నుండి వస్తున్న తొలి ఎస్యూవీ ఈ జీఎల్ఎస్ 600 కావడం విశేషం. ఆల్ట్రా లగ్జరీ కార్ బ్రాండ్, మేబాచ్ పేరుతో బెంజ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన కార్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : Sun Halo: అందమైన రెయిన్బో.. ట్విటర్ ట్రెండింగ్ -
మారుతి కార్ల ధరలకు రెక్కలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఈ ఏప్రిల్ నుంచి తన అన్ని రకాల కార్ల మోడళ్లపై ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ముడి పదార్థాల ధరలు, ఇన్పుట్ వ్యయాలు పెరగటంతో ధరల్ని పెంచక తప్పడం లేదని కంపెనీ చెప్పుకొచ్చింది. అయితే ఏ మోడల్ ఎంత ధర పెరుగుతుందో అనే అంశాన్ని వెల్లడించలేదు. ఇప్పటికే మారుతీ ఈ ఏడాది జనవరిలో కొన్ని కార్ల ధరలను రూ. 34 వేల వరకు పెంచింది. మూడు స్టార్టప్‌ల ఎంపిక.. మొబిలిటీ, ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్ (మెయిల్) ప్రోగ్రాం కింద 3 కొత్త స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు మారుతీ తెలిపింది. నేబుల్ ఐటీ, రెడ్‌బాట్, స్లీవ్ వీటిలో ఉన్నాయి. ఇవి ఇకపై పెయిడ్ ప్రాజెక్టుల్లో భాగం కావచ్చని మారుతీ ఎండీ కెనిచి అయుకావా తెలిపారు. ఫిబ్రవరిలో మారుతి సుజుకి 168,180 వాహనాలను ఉత్పత్తి చేసింది, అంతకు ముందు ఏడాది 140,933 యూనిట్లు. ఇందులో 165,783 ప్యాసింజర్ వాహనాలు, 2,397 లైట్ కమర్షియల్ యుటిలిటీ వాహనాలు ఉన్నాయి.ఇక అమ్మకాల విషయానికొస్తే, కంపెనీ 2021 ఫిబ్రవరిలో 164,469 యూనిట్లను విక్రయించింది, లేదా గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.8 శాతం ఎక్కువ. గత నెలలో 144,761 ప్యాసింజర్ వాహనాలు, 2,722 తేలికపాటి వాణిజ్య వాహనాలు, 5,500 వాహనాలు ఇతర OEM లకు విక్రయించబడ్డాయి మరియు 11,486 ఎగుమతి చేసిన యూనిట్లు ఉన్నాయి. అయితే, 2020-21 ఏప్రిల్-ఫిబ్రవరి అమ్మకాల గణాంకాలు 12.8 శాతం తగ్గి 1,290,847 యూనిట్లకు చేరుకున్నాయి. సాక్షి,సిటీబ్యూరో: నగరంలో సరికొత్త ‘ఈక్లాస్’ మెర్సిడీస్ బెంజ్ సిల్వర్‌స్టార్‌ని లాంచ్ చేశారు. ఈ సిల్వర్ స్టార్‌ని బంజారాహిల్స్‌లోని తాజ్ దక్కన్ హోటల్లో సీఈఓ మహేష్ దేవ్, సేల్స్ లీడ్ సాయిహార్ష కలిసి ఆవిష్కరించారు. ఈ మోడల్లో ఆధునిక సాంకేతను ఉపయోగించి వినూత్నంగా ఎమ్‌బీయూఎక్స్ సిస్టమ్, ట్విన్ డిజిటల్ టచ్ స్క్రీన్, హే మెర్సిడీస్ వాయిస్ కమాండ్స్‌తో రూపొందించామని వారు తెలిపారు. -
కొత్త నమూనాలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కొత్త నమూనాలో నిర్వహించనున్నారు. కోవిడ్ వల్ల విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లిష్, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్సు, బయోలజీ పేపర్లను 50 మార్కులకు వేర్వేరుగా నిర్వహించనున్నారు. ఇంతకు ముందు సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో ఒక్కోసబ్జెక్ట్‌లో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించి, మిగిలిన 20 మార్కులను అంతర్గత (ఇంటర్నల్) మార్కుల నుంచి తీసుకొని కలిపేవారు. 2021 మార్చి పరీక్షలకు ఈ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా 100 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ మేరకు ప్రశ్నపత్రం నమూనాలో స్వల్ప మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం జీవో విడుదల చేసింది. దీని ప్రకారం ప్రశ్నపత్రాల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, అతి స్వల్ప సమాధానాల ప్రశ్నలు, స్వల్ప సమాధానాల ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలను అడగనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 2.30 గంటల సమయం కేటాయిస్తున్నారు. ప్రశ్నపత్రం చదివేందుకు 15 నిమిషాల పాటు అదనపు సమయం ఇస్తారు. చదవండి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల నిర్మాణం కూలిన ‘దేశం’ కంచు కోటలు -
మెర్సిడెస్ బెంజ్ న్యూ మోడల్ : ప్రత్యేకత ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ బుధవారం తన ఎస్యూవీ విభాగంలో ‘‘2021 జీఎల్సీ’’ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.57.40 లక్షలుగా ఉండే ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. జీఎల్సీ 200 పెట్రోల్ వేరియంట్ ధర రూ.57.40 లక్షలుండగా, జీఎల్సీ 200డి డీజిల్ వేరియంట్ ధర రూ. 63.15 లక్షలుగా ఉంది. అలెక్సా హోమ్, గూగుల్ హోమ్, 360 డిగ్రీ కెమెరా, నావిగేషన్ సిస్టమ్‌తో పాటు పార్కింగ్ లొకేషన్లు కనుకొనే ‘‘మెర్సిడెస్ మీ కనెక్ట్’’ అనే అధునాతన ఫీచర్లు కలిగిన యాప్‌ను పొందుపరిచారు. రిమోట్ సాయంతో ఇంజిన్‌ను ప్రారంభించే సదుపాయం ఉంది. ఇందులో ఫ్రంట్ సీట్లను మసాజ్ ఫంక్షన్‌తో తయారు చేశారు. మెర్సిడెస్ బెంజ్ భారత ఉత్పత్తుల లైన్అప్లో ఈ తరహా సదుపాయాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ‘‘బెంజ్ ఎస్యూవీ విభాగంలో జీఎల్సీ మోడల్ మూలస్తంభంగా నిలిచింది. గతేడాది మా పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది’’ అని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వెంక్ ఈ సందర్బంగా తెలిపారు. -
ఆకట్టుకునేలా అయోధ్య రామాలయ నమూనా
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్ధాపన జరగనుండగా ఆలయ నమూనాను అయోధ్య ట్రస్ట్ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. 161 అడుగుల ఎత్తైన మూడంతస్తుల రామ మందిరంగా నమూనాకు రూపకల్పన చేశారు. భారత వాస్తు శిల్పాకళా నైపుణ్యాన్ని చాటేలా ఆలయ డిజైన్ ఆకట్టుకుంటోంది. తొలుత అనుకున్న పరిమాణం కంటే దాదాపు రెట్టింపుగా నూతన నమూనాను అభివృద్ధి చేశారని ఆర్కిటెక్ట్ వెల్లడించారు. భారీ డోమ్‌తో పాటు ఇంటీరియర్స్‌ను ఆకర్షణీయంగా మలిచారు. ఆలయ ఆర్కిటెక్టుల కుటుంబానికి చెందని ఆర్కిటెక్ట్ చంద్రకాత్ సొంపురను 30 ఏళ్ల కిందట రామాలయం డిజైన్ కోసం సంప్రదించారు. ఆయన తండ్రి ప్రభాశంకర్ సొంపుర సోమ్‌నాథ్ ఆలయ డిజైన్‌ను రూపొందించడంతో పాటు ఆలయ పునర్మిర్మాణ పనులను పర్యవేక్షించారు. నగారా పద్ధతిలో రామాలయ ఆర్కిటెక్చర్‌కు తుదిరూపు ఇచ్చినట్టు సొంపుర (77) తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మూడేళ్ల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. ఇక బుధవారం జరిగే మందిర నిర్మాణ భూమిపూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సహా 200 మంది వరకూ ప్రముఖులు, రామమందిర ఉద్యమ నేతలు పాల్గొంటారు. చదవండి : 'శ్రీరామ్' టాటూ వేయించుకున్న ముస్లిం యువతి -
ఆకట్టుకునేలా అయోధ్య రామాలయ నమూనా
-
మార్కెట్లోకి కొత్త పల్సర్ బైక్
ముంబై: పల్సర్ బైక్స్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా పల్సర్ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్ పేరుతో గురువారం బజాజ్ ఆటో మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ బైక్ సింగిల్ సిట్ డ్రమ్ వేరియంట్ కలిగిన అత్యున్నత టెక్నాలజీతో రూపొందించామని సంస్థ తెలిపింది. ఈ బైక్‌లో కొన్ని అదనపు ఫీచర్లు వినిమోగదారులను ఆకర్శిస్తాయని సంస్థ పేర్కొంది. బైక్‌లో రెగ్యులర్ మోడల్ సింగిల్ యూనిట్‌కు బదులుగా స్పోర్టి బెల్లీ పాన్, స్పిట్ గ్రాబ్ రైల్స్ వంటి కొన్ని అదనపు ఫీచర్లతో ఈ బైక్ అలరించనుంది. కాగా పల్సర్ 125 బైక్ కలర్ విషయానికి వస్తే బ్లాక్ సిల్వర్, బ్లాక్ రెడ్, నియాన్ గ్రీన్ కలర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. అత్యాధునిక ఫీచర్లతో అలరించనున్న పల్సర్ 125 వేరియంట్ బైక్ ధర రూ.79,091గా సంస్థ నిర్ణయించింది. పల్సర్ 125 వేరియంట్ బైక్‌ను వినియోగదారులకు అందించడం పట్ల బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే హర్షం వ్యక్తం చేశారు. సారంగ్ కనడే స్పందిస్తూ.. గత సంవత్సరం విడుదల చేసిన పల్సర్ 125 బైక్ కేవలం ఆరు నెలల్లోనే లక్ష బైకులను కస్టమర్లు కొనుగోలు చేశారని అన్నారు. స్పోర్ట్స్ బైక్‌ను ఇష్టపడే వారికి సరికొత్త స్టైల్, థ్రిల్‌తో ఈ బైక్ అలరిస్తుందని తెలిపారు. చదవండి: బజాజ్ ఆటో కొత్త బైక్ : రూ.38 వేలు -
బటన్ మాస్క్‌తో దానికి పరిష్కారం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్ మాస్క్‌లు ధరించడం అత్యవసరం అయినప్పటికీ ఎక్కువసేపు ధరించడం వల్ల ముఖ్యంగా చెవులు నొప్పి పెడతాయి. చెవిపైన మచ్చలు ఏర్పడే అవకాశమూ ఉంది. ఎలాస్టిక్ లూప్స్, కాటన్ లూప్స్ వల్ల చర్మం బాగా రాపిడికి లోనై ఇలా చెవి నొప్పి వచ్చే అవకాశం ఉంది. దీంతో మాస్క్ ధరించడానికి ఇష్టపడరు. మాస్క్ సౌకర్యవంతంగా ఉండటానికి చాలా మంది సరళమైన మార్పులు చేస్తున్నారు. వాటిలో సౌలభ్యంగా ఉన్నది ఈ బటన్ మాస్క్. ఎలాస్టిక్ లూప్స్ లేదా ఇతర లూప్స్ వల్ల చెవులకు దురద ఇతర ఇరిటేషన్ సమస్య రాకుండా ఉండటానికి చెన్నైకి చెందిన రతీష్ ఈ బటన్ మోడల్ మాస్క్‌ను ఆవిష్కరించారు. ప్రకృతి ప్రొడక్ట్స్‌ను తయారు చేసే సంస్థ వ్యవస్థాపకుడు రతీష్. ‘నేను గంటల పాటు మాస్క్‌ను ధరించినప్పుడు ఆ నొప్పిని అనుభవించాను. అలాంటప్పుడు ఫ్రంట్‌లైన్ కార్మికుల బాధ ఎంత ధారుణంగా ఉంటుందో ఊహించాను. దీంతో ఇంటర్నెట్ అంతా జల్లెడ పడితే చాలా రకాల మోడల్స్ కనిపించాయి. కానీ, పర్యావరణ అనుకూలమైనవి అందించాలనుకున్నాను. దీంతో ఈ ఆలోచన చేశాను. కాటన్ బెల్ట్‌లాంటిది ఏర్పాటు చేసి, రెండు బటన్స్ కుట్టించాను. రెండు లూప్స్ చెవులకు బదులు ఇలా ఈ బటన్స్‌కి తగిలిస్తే చెవులకు అసౌకర్యంగా ఉండదు. పనిలోనూ సౌలభ్యంగా ఉంటుంది. వీటిని ఉతికి తిరిగి వాడుకోవచ్చు’ అని దీని ఉపయోగం వివరించాడు రతీష్. -
మార్కెట్లోకి మెర్సిడెస్ ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్ఈ’
ముంబై: దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్–బెంజ్ ఇండియా’ తన ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోలోని లాంగ్ వీల్ బేస్ (ఎల్‌డబ్ల్యూబీ) జీఎల్‌ఈలో రెండు నూతన వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటిలో ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్ఈ 300 డీ’ ధర రూ. 73.70 లక్షలు కాగా.. హిప్–హాప్ వేరియంట్‌గా కంపెనీ వ్యవహరిస్తున్న ‘ఎల్‌డబ్ల్యూబీ జీఎల్ఈ 400 డీ’ ధర రూ. 1.25 కోట్లు. ఎంట్రీ లెవెల్ మోడల్లో 2.0 లీటర్ల 4–సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను.. హిప్–హాప్లో 3.0 లీటర్ల 6–సిలిండర్ డీజిల్ ఇంజిన్ అమర్చింది. జీఎల్ఈ మోడల్ 7.2 సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, గరిష్టంగా గంటకు 225 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని సంస్థ వెల్లడించింది. లగ్జరీ ఎస్యూవీ విభాగంలో జీఎల్ఈ మోడల్ అత్యధిక అమ్మకాలను నమోదుచే సిందని సంస్థ సీఈఓ మార్టిన్ ష్వెంక్ అన్నారు. -
మార్కెట్లోకి ‘హోండా యాక్టివా 6జీ’
ముంబై: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ).. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరో స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘యాక్టివా 6జీ’ పేరిట విడుదలైన ఈ అధునాతన స్కూటర్ స్టాండర్డ్, డీలక్స్ వేరియంట్లలో లభిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ. 63,912– 65,412 (ఎక్స్–షోరూం, ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. మును పటి మోడలైన స్టాండర్డ్ 5జీతో పోల్చితే నూతన స్కూటర్ ధర రూ.7,978 అధికం కాగా, డీలక్స్ ధర రూ. 7,613 ఎక్కువగా ఉంది. ‘బీఎస్–6 నూతన ఉద్గార ప్రమాణాలతో కూడిన మూడవ యాక్టివా ఇది. ఈ నెలాఖరుకు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఇది అందుబాటులోకి వస్తుంది’ అని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్ గులేరియా తెలిపారు. -
షావొమీ ‘గోల్డ్’ ఫోన్ @ 4.8 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం ఫీచర్లతో తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్న చైనా టెక్నాలజీ కంపెనీ షావొమీ.. మరో సంచలనానికి సిద్ధమైంది. ‘రెడ్మీ కె20 ప్రో’ మోడల్ ఆధారంగా లిమిటెడ్ ఎడిషన్‌లో అత్యంత ఖరీదైన వేరియంట్ తయారీకి శ్రీకారం చుట్టింది. దీని ఖరీదు రూ.4.8 లక్షలు. బంగారంతో తయారైన బ్యాక్ ప్యానెల్‌తో ఇది రూపుదిద్దుకుంది. 100 గ్రాముల పసిడి వాడారు. ప్యానెల్ వైపు ‘కె’ అనే అక్షరంపై 20 వజ్రాలను పొదిగారు. కేవలం 20 పీసులను మాత్రమే తయారు చేస్తారు. విశేషమేమంటే ఇవి భారత్‌లో తయారవుతున్నాయి. అంతేకాదు భారత్‌కు మాత్రమే ప్రత్యేకం. ఫోన్ నుంచి ప్యానెల్‌ను విడదీయడానికి వీలుకాకుండా డిజైన్ చేశారు. చారిటీకి వినియోగిస్తాం.. ఈ వేరియంట్‌ను విక్రయించాలా వద్దా అన్న విషయం ఇంకా నిర్ణయించలేదని షావొమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఇన్విటేషన్ ద్వారా విక్రయించాలా, బహుమతిగా ఇవ్వడమా, వేలం వేయడమా అన్నది ఇంకా తేల్చలేదు. వీటి విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తాం. కె20 గుర్తుగా బ్యాక్ ప్యానెల్‌పై ‘కె’ అని ముద్రించాం. ఇప్పటికే ఆసక్తి కనబరిచిన కస్టమర్లు ‘కె’ బదులు, తమ పేరులోని మొదటి అక్షరాన్ని ముద్రించాలని కోరారు’ అని వివరించారు. కస్టమైజ్ చేయాల్సిందే.. చైనాలో షావొమీ విస్తృత శ్రేణిలో పలు ఉత్పత్తులను రూపొందించి విక్రయిస్తోందని, వీటిని భారత్‌లో ప్రవేశపెట్టాలంటే ప్రతి ఉత్పాదనలో మార్పులు చేయాల్సి ఉంటుందని మను కుమార్ వెల్లడించారు. దశలవారీగా వీటిని ఇక్కడ పరిచయం చేస్తామన్నారు. షావొమీ కోసం షూస్, టీ–షర్ట్స్, ఫిట్నెస్ బ్యాండ్స్ తయారీకై దేశంలోని పలు మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్‌ఫోన్లకై సంస్థకు దేశంలో నాలుగు ప్రాంతాల్లో ఏడు తయారీ కేంద్రాలున్నాయి. సెకనుకు మూడు ఫోన్లు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. -
టాప్ స్కర్ట్
చూస్తే రెగ్యులర్ టాప్‌కి భిన్నంధరిస్తే స్కర్ట్ టాప్ అయిన చందంపేరు ఫ్లెయిర్ పాంచో మరో పేరు ఫ్లెయిర్ కేప్.సమ్మర్‌కి సరైన స్టైలిష్ ఎంపికఈ స్కర్ట్ మోడల్ టాప్‌ని అటు జీన్స్ ఇటు స్కర్ట్ మీదకూ ధరించవచ్చు. సూపర్ స్టైలిష్ కితాబులు పొందవచ్చు. రెగ్యులర్ టాప్‌లతో బోర్ కొడితేగౌనులా ఉండే ఈ మోడల్ టాప్‌ని ఇప్పుడే ధరించవచ్చు. ►అందమైన ఎంబ్రాయిడరీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ డార్జిలింగ్ లేస్‌లు, 3డి ఫ్లవర్స్, కుచ్చుల అంచులు.. కొత్త మోడల్లో ముస్తాబు అయిన ఈ నయా టాప్స్ అతివలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ►ఇవి నూటికి నూరు శాతం ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన టాప్స్. సమ్మర్‌కి కూల్ ఎఫెక్ట్‌ని ఇస్తాయి. ఈవెనింగ్ పార్టీకి కలర్‌ఫుల్ లుక్‌నిస్తాయి. -
స్టయిలిష్‌గా కొత్త రెనాల్ట్ క్విడ్
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ కొత్త కారును లాంచ్ చేసింది. తన ఎంట్రీ లెవల్ కారు రెనాల్ట్ క్విడ్ లో కొత్త కారును సోమవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.2.67-4.63 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది, మెరుగైన భద్రతా ఫీచర్స్‌తో దీన్ని భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని రెనాల్ట్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 0.8 లీటర్, 1లీటరు పెట్రోల్ ఇంజిన్లలో మాన్యువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో కొత్త క్విడ్ లభించనుంది. అత్యాధునిక భద్రత నిబంధనలతోపాటు, పాదచారుల భద్రతకు అనుగుణంగా తమ కొత్తకారు ఉంటుందనీ, ముఖ్యంగా ఏబీఎస్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ లాంటి ఫీచర్లను ఇందులో జోడించినట్టు కంపెనీ తెలిపింది. అలాగే స్పీడ్, ఎయిర్‌బ్యాగ్ రిమైండర్ ఫీచర్, 17.64 సెం.మీ టచ్ స్క్రీన్ మీడియా, నావిగేషన్ సిస్టం, కెపాసిటివ్ టచ్‌స్క్రీన్‌తోపాటు ఆండ్రాయిడ్ , ఆపిల్ కార్ ప్లేలకు అనుగుణంగా ఫుష్ టు టాక్ ఫీచర్ అందించినట్టు తెలిపింది. కాగా 2.75లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలతో భారత్ మార్కెట్లో రెనాల్ట్కు క్విడ్ విజయవంతమైన కారుగా నిలిచింది. Presenting the #Stylish #FeatureLoaded #RenaultKWID with a host of best-in-class safety features that ensure every ride is safe, comfortable and convenient. Know more: https://t.co/9gTCUKaJQA pic.twitter.com/TqrvkqdVLN — Renault India (@RenaultIndia) February 2, 2019 -
బీఎండబ్ల్యూ ఎక్స్4 లాంచ్
జర్మనీ కార్ మేకర్ బీఎండబ్ల్యూ కొత్త కారును లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లు, హంగులతో చెన్నై ప్లాంట్‌లో రూపొందించిన సరికొత్త స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే మోడల్‌ను విడుదల చేసింది. ఒక పెట్రోల్, రెండు డీజిల్ వేరియంట్లలో తీసుకొచ్చింది. డీజిల్ వేరియంట్ బీఎండబ్ల్యూ ఎక్స్4 ధరలు వరుసగా రూ. 60.6లక్షలు, రూ. 65.9లక్షలుగా నిర్ణయించింది. పెట్రోలు వేరియంట్ ధరను రూ.63.5లక్షలుగా ఉంది. సరికొత్తగా భారత మార్కెట్లో లాంచ్ చేసిన ఇవి దేశవ్యాప్తంగా నేటి నుంచే విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. దేశీయంగా స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ సెగ్మెంట్‌ను విస్తరించామనీ, ఈ విభాగంలో తమ తాజా ఎక్స్ 4 ద్వారా ఎం స్పోర్ట్స్ డిజైన్ ప్యాకేజ్‌ను తొలిసారిగా పరిచయం చేస్తున్నామని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ హాన్స్ క్రిస్టియన్ బార్ట్‌లెస్ ప్రకటించారు. -
సరికొత్త ప్లాటినా 110
బజాజ్ ఆటో నుంచి నూతన వెర్షన్ ప్లాటినా 110 సీసీ బైక్ సోమవారం మార్కెట్లో విడుదలైంది. యాంటీ–స్కిడ్ బ్రేకింగ్ వ్యవస్థ, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి అధునాత ఫీచర్లను కలిగిన ఈ బైక్ ధర రూ.49,197 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. రోడ్లపై గతుకుల ఇబ్బంది అంతగా తెలియకుండా ఉండేలా అత్యాధునిక షాక్ అబ్జార్బర్స్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. బైక్ విడుదల సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ (మోటార్ సైకిల్ బిజినెస్) ఎరిక్ వాస్ మాట్లాడుతూ.. ‘విజయవంతంగా ప్రయాణిస్తున్న ప్లాటినా 100 ఈఎస్ ప్రయాణానికి తాజాగా మరో బైక్ తోడయింది. 100 సీసీ విభాగంలో ప్రీమియం మోడల్‌ను కొరుకునే వినియోగదారులకు ఈ బైక్ ఒక మంచి ఆప్షన్‌గా నిలవనుంది.’ అని వ్యాఖ్యానించారు. -
ఎంత సక్కగున్నవే.. కత్తి.. ఖతర్నాక్!
దీని స్టైల్ చూశారూ.. కత్తి.. ఖతర్నాక్ కదా.. ఇది రెనాల్ట్ కంపెనీకి చెందిన ఈజెడ్–అల్టిమో కాన్సెప్ట్ కారు.. ఇటీవల దీన్ని ప్యారిస్ ఆటోషోలో ప్రదర్శించారు. చూసినోళ్లంతా ఫిదా అయిపోయారంటే నమ్మండి. విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడమే ఈ కాన్సెప్ట్ కారు తాలూకు లక్ష్యమని రెనాల్ట్ ప్రతినిధులు తెలిపారు. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. అంటే డ్రైవర్‌తో పనిలేదన్నమాట. పైగా పర్యావరణానికి హాని చేయని రీతిలో ఇది ఎలక్ట్రిక్ కారు కూడా. మొబైల్లో లోడ్ చేసిన ప్రత్యేకమైన యాప్‌లో మనం వెళ్లాల్సిన ప్రాంతం తాలూకు వివరాలు ఫీడ్ చేస్తే.. దాని ప్రకారం కారు వెళ్లిపోతుంది. అందుకు అనుగుణంగా ఇందులో కెమెరాలు, రాడార్లు, సెన్సర్లు ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఈ వాహనం 19 అడుగుల పొడవు ఉంటుంది. లోపల చూశారుగా.. హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంటుంది. ఇంటీరియర్ అంతా లెదర్, మార్బుల్, చెక్కతో చేశారు. సీటు అటూ ఇటూ కదిలేలా ఏర్పాటు చేశారు. వ్యక్తిగత అవసరాల కోసమే కాకుండా.. పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్లు.. కార్పొరేట్ సంస్థలు తమ క్లయింట్లను ఎయిర్‌పోర్టు నుంచి తేవడానికి, బిజినెస్ మీటింగుల కోసం దీన్ని తప్పక కొనుగోలు చేస్తాయని రెనాల్ట్ నమ్ముతోంది. మార్కెట్లోకి ఎప్పుడొస్తుంది.. ధర ఎంత ఉండొచ్చన్న వివరాలను రెనాల్ట్ వెల్లడించలేదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బైక్
బెంగళూరు: రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కొత్త మోడల్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. క్లాసిక్ సిగ్నల్స్ 350 పేరుతో అందిస్తున్న ఈ బైక్ ధర రూ.1,58,861గా (ఎక్స్ షోరూమ్, బెంగళూరు) నిర్ణయించినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ బిజినెస్ హెడ్ (ఇండియా) షాజి కోషే చెప్పారు. ఈ కొత్త బైక్ రెండు రంగుల్లో లభ్యమవుతుందని చెప్పారాయన. స్టీల్ ఇంజిన్ గార్డ్స్ వంటి 40 ప్రత్యేక యాక్సెసరీలతో ఈ బైక్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ బైక్‌ను 346 సీసీ ఎయిర్–కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రూపొందించామని, 5 గేర్లు, క్రాష్ గార్డ్స్, పెద్ద విండ్స్క్రీన్లు వంటి ప్రత్యేకతలున్నాయని చెప్పారు. ఐదేళ్లలో 50 శాతానికి మించిన వృద్ధి... ‘‘గత ఐదేళ్లలో 50%కి మించిన వృద్ధిని సాధించాం. అంతర్జాతీయ మిడ్–సైజ్ మోటార్ సైకిల్ మార్కెట్లో ప్రధాన కంపెనీగా ఎదిగాం. కంపెనీ నిర్వహణలో ఉన్న 17 షోరూమ్‌లతో పాటు 705కు పైగా డీలర్ల ద్వారా విక్రయాలు జరుపుతున్నాం. అమెరికా, ఇంగ్లాండ్, యూరప్, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలతో సహా మొత్తం 50కు పైగా దేశాలకు బైక్‌లు ఎగుమతి చేస్తున్నాం’’ అని షాజీ కోషే వివరించారు. 1950 నుంచి భారత సైనిక దళాలకు ఈ బైక్‌ల సరఫరాలను ప్రారంభించామని, భారత సైన్యానికి అత్యధిక బైక్‌లను సరఫరా చేసిన ఘనత తమదేనని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ తెలిపారు. -
బార్బీతో కోడింగ్ పాఠాలు...!
బార్బీ.. అమ్మాయిల మనసు దోచుకునే ఓ బొమ్మ మాత్రమే కాదు.. అందం, ఆత్మవిశ్వాసాల కలయిక. బార్బీ కేవలం ఆడుకోవడానికే కాదు సరికొత్త పాఠాలు నేర్పేందుకు న్యూలుక్లో మార్కెట్లోకి వచ్చేసింది. వినోదంతో పాటు విఙ్ఞానాన్ని అందించేందుకు ‘రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీ’ని మంగళవారం లాంచ్ చేసినట్లు బొమ్మల తయారీ సంస్థ మటెల్ తెలిపింది. ఏడేళ్ల ప్రాయం నుంచే అమ్మాయిల్లో ఇంజనీరింగ్, కోడింగ్ నైపుణ్యాలు పెంపొందించేందుకు రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీని రూపొందించినట్లు పేర్కొంది. కిడ్స్ బేస్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామింగ్ ప్లాట్‌ఫాం ‘టింకర్’ భాగస్వామ్యం వల్లే రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీని రూపొందించడం సాధ్యమైందని మటెల్ తెలిపింది. సరికొత్త రూపంలో... జీన్స్, గ్రాఫిక్ టీ- షర్ట్‌పై డెనిమ్ జాకెట్, కళ్లకు సేఫ్టీ గ్లాసెస్‌తో న్యూలుక్లో అందుబాటులోకి వచ్చిన రోబోటిక్స్ బార్బీలో ఆరు కోడింగ్ పాఠాలను చేర్చినట్లు ‘టింకర్’ సహ వ్యవస్థాపకుడు కృష్ణ వడాటి తెలిపారు. ఈ బార్బీతో ఆడుకుంటూనే.. లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడ్ బిల్డింగ్ బ్లాక్స్ వంటి కోడింగ్ నైపుణ్యాలను సులభంగా నేర్చుకోవచ్చన్నారు. అమెరికా కామర్స్ డిపార్ట్మెంట్ 2017 గణాంకాల ప్రకారం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ (స్టెమ్) తదితర రంగాల్లో మహిళల భాగస్వామ్యం కేవలం 24 శాతమే ఉంది. ఈ నేపథ్యంలో ‘బార్బీ’తో జతకట్టడం ద్వారా చిన్ననాటి నుంచే అమ్మాయిల్లో కోడింగ్ నైపుణ్యాలు పెంపొందించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్తరకం బార్బీతో ఆన్‌లైన్‌తో పాటు, ఆఫ్‌లైన్‌లో కూడా గేమ్స్ ఆడటం వీలవుతుందని తెలిపారు. బార్బీ నేపథ్యం... పేపర్ బొమ్మలతో ఆడుకుంటున్న తన కూతురు బార్బరా కోసం రూత్ హ్యాండ్లర్ అనే అమెరికన్ మహిళ 1959లో ఒక సరికొత్త బొమ్మను రూపొందించారు. జర్మన్ డాల్ ‘బిల్డ్ లిల్లీ డాల్’ స్ఫూర్తితో రూపొందించిన బొమ్మకు తన కూతురి పేరు మీదుగా బార్బీ అని ఆమె నామకరణం చేశారు. బార్బీ పరంపరలో ఇప్పటి వరకు 200 మోడళ్లతో బార్బీ డాల్స్ అందుబాటులోకి వచ్చాయి. బార్బీ ప్రెసిడెంట్, బార్బీ డాక్టర్, బార్బీ ఆస్ట్రోనాట్, బార్బీ ఫైర్‌ఫైటర్, బార్బీ ఫిల్మ్‌స్టార్, బార్బీ పాప్ సింగర్, బార్బీ పైలట్ వంటివి బార్బీ మోడళ్లలో ముఖ్యమైనవి. -
వోల్వో కార్స్ నుంచి న్యూ ఎక్స్‌సి 60
కొరుక్కుపేట: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం వోల్వో కార్స్ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో కూడిన న్యూ ఎక్స్‌సి 60 కారును మార్కెట్లోకి విడుదల చేసింది. సౌకర్యవంతంగాను, సేఫ్టీ ఫ్యూచర్లతో, అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో రూపుదిద్దుకున్న న్యూ ఎక్స్‌సి 60ని చెన్నై మార్కెట్లో అందుబాటులోకి తెచ్చినట్లు వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రాంప్ తెలిపారు. చెన్నైలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఎక్స్ సి 60 వోల్వో కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని ధర రూ.55.9 లక్షలుగా నిర్ణయించామన్నారు. పవర్ ప్లస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కలిగిన రోబస్ట్ డీజిల్ ఇంజిన్‌ను పొందుపరిచామని తెలిపారు. భారతీయ రహదారులపై అత్యంత వేగంగా ఈ కారు దూసుకుపోతోందన్నారు. -
మారుతి స్విఫ్ట్ 2017 ఇదే!
బాలెనో, బ్రెజా మోడళ్లు భారత్ లో సక్సెస్ కావడంతో కొత్త తరహా స్విఫ్ట్ మోడల్ ను ప్రవేశపెట్టేందుకు మారుతీ సుజుకీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తాజాగా ఆన్ లైన్ లో మారుతీ సుజుకీ 2017 మోడల్ ఇదేనంటూ కొత్త డిజైన్, న్యూ లుక్ తో స్విఫ్ట్ దర్శనమిస్తోంది. కాగా, వచ్చే ఏడాది మారుతీ దీనిని విడుదల చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలెనో లానే కొద్ది మార్పులతో స్విఫ్ట్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్లాన్ ను సిద్ధంచేసుకున్నట్లు సమాచారం. పాత మోడల్ లో కంటే కొత్త మోడల్ దాదాపు 100 కేజీల బరువు తగ్గనుంది. దీంతో మైలేజ్ కూడా గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం.. 2017లో స్విఫ్ట్ ఎలా ఉండబోతోందో. -
మార్కెట్లోకి ఆడీ క్యూ 7 కొత్త కార్
-
గాజుల కలెక్షన్స్‌ను లాంచ్ చేసిన రిలయన్స్ జుయెల్స్
-
ప్రణాళిక సంఘానికి కొత్త రూపు
కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్న ప్రధాని ముఖ్యమంత్రులతో విస్తృతంగా చర్చిస్తానని లోక్‌సభలో వెల్లడి న్యూఢిల్లీ: మారుతున్న కాలానికి తగ్గట్టు ప్రణాళిక సంఘాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో వెల్లడించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల్లోలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రణాళిక సంఘం పునర్నిర్మాణానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మేధావులను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ‘ఆదివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నాను. వారితో విస్తృతంగా చర్చిస్తాను. మార్పులపై ప్రణాళిక సంఘంలోనూ ఇదివరకే చర్చలు జరిగాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపడతాం’ అని తెలిపారు. అంతకుముందు ప్రణాళిక శాఖ మంత్రి ఇందర్‌జీత్‌సింగ్ మాట్లాడుతూ.. పేదలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సంస్కరణలకు తగినట్లుగా దేశంలో ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందని, ఈ దిశగా ప్లానింగ్ కమిషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కీలక రంగాల్లో విదేశీ నిధులను అనుమతిస్తున్న తరుణంలో ప్రణాళికలను తరచూ సమీక్షించాల్సి ఉంటుందని, భారత్ గొప్ప ఆర్థికశక్తిగా ఎదుగుతున్నందున ప్రణాళికల్లోనూ మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. ‘జాతీయాభివృద్ధిలో రాష్ట్రాలూ కీలకం. అభివృద్ధికి అవే చోదకాలు. వాటినీ దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలను రూపొందించా’లన్నారు. ప్రణాళిక సంఘంలో మార్పులపై కేంద్ర ం ఇప్పటికే విస్తృత మంతనాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆర్థిక రంగం ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రచించేలా.. ఆర్థికాభివృద్ధిలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించేలా కొత్త ప్రణాళిక వ్యవస్థ రూపుదిద్దుకోవాలన్నారు. -
స్కార్పియో కొత్తమోడల్ 25న విడుదల
ఎప్పటినుంచో అందరూ ఎదురుచూస్తున్న మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ కొత్త ఎడిషన్ వచ్చేస్తోంది. శరన్నవరాత్రుల ప్రారంభం రోజైన సెప్టెంబర్ 25న దీన్ని విడుదల చేయనున్నారు. ఆటోమొబైల్ ప్రేమికులు ఇప్పటినుంచే ఈ వాహనానికి ప్రీబుకింగ్స్ చేసేస్తున్నారు. వాళ్లలో ఇప్పటికే స్కార్పియో వాహనం ఉన్నవాళ్లకు ముందు ప్రాధాన్యం ఇస్తామని డీలర్లు చెబుతున్నారు. భారతీయ ఎస్యూవీ మార్కెట్లో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న స్కార్పియో కొత్త మోడల్ ఉత్పాదన ఆగస్టు ఒకటోతేదీ నుంచి మొదలైంది. దీని లాంచింగ్ మొదలుపెట్టడానికి ముందే కనీసం 5వేల వాహనాలు సిద్ధం చేసుకోవాలని మహీంద్రా భావిస్తోంది. కొత్త మోడల్ స్కార్పియోలో.. ముందు లుక్ చాలా బాగుంటుందని కంపెనీ వర్గాలు అంటున్నాయి. దీంతోపాటు కొత్త హెడ్ ల్యాంపులు, ముందు బంపర్, గ్రిల్ కూడా రూపురేఖలు మారిపోతాయి. మామూలు బల్బులకు బదులు హెచ్ఐడీ/ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు ఉండొచ్చు. అయితే పక్కనుంచి చూస్తే మాత్రం ఇది మామూలు స్కార్పియోలాగే ఉంటుంది. కొత్త స్కార్పియోకు అన్నీ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. కేబిన్‌లో చాలా మార్పులు ఉండబోతున్నాయి. దీని డాష్‌బోర్డు, కొత్త స్టీరింగ్ వీల్, రీ డిజైన్ చేసిన ఏసీ వెంట్లు.. వీటన్నింటితో సరికొత్త స్కార్పియో.. ఆటోమొబైల్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. అయితే ఇంజన్ పరంగా చూసుకుంటే మాత్రం పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. 2.2 లీటర్ల ఎంహాక్ డీజిల్ ఇంజన్ ఉంటుందని చెబుతున్నారు. -
సెల్కాన్ కేంపస్ సిరీస్‌లో కొత్త మోడల్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ కంపెనీ సెల్కాన్, కేంపస్ సిరీస్‌లో సరికొత్త మోడల్, కేంపస్ ఏ 125ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటి వరకూ కేంపస్ సిరీస్‌లో 9 మోడళ్లను అందించామని, ఇవన్నీ రూ.6,000 లోపు ధర ఉన్న మోబైల్ ఫోన్లని సెల్కాన్ సీఎండీ, వై. గురు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంపస్ ఏ 125ను ఫ్లిప్ కవర్‌తో సహా రూ.6,399కే అందిస్తున్నామని వివరించారు. 4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ 1.3 గిగా డ్యుయల్ కోర్ ప్రాసెసర్ సామర్థ్యంతో పనిచేస్తుందని పేర్కొన్నారు. 4 జీబీ ఇంటర్నల్ మెమెరీ ఉన్న ఈ ఫోన్లో ఫ్లాష్‌తో కూడిన 5 మెగా పిక్సెల్ కెమెరా, 3జీ వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. షేక్ అండ్ షేర్, మల్టీ ప్లేయర్ గేమింగ్, డూడ్లింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు తమ మాతృభాషలో మెసెజ్‌లు పంపుకునేందుకు వీలుగా 9 భాషల మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ప్రత్యేక ఆకర్షణ అని గురు వివరించారు. -
హోండా సిటీ.. డీజిల్ వేరియంట్
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన హోండా కంపెనీ సిటీ మోడల్లో ఫోర్త్ జనరేషన్ వేరియంట్లను సోమవారం ఆవిష్కరించింది. తొలిసారిగా సిటీ మోడల్లో డీజిల్ వేరియంట్‌ను అందిస్తోంది. జనవరి నుంచి ఈ ఫోర్త్ జనరేషన్ సిటీ మోడల్ (పెట్రోల్, డీజిల్ వేరియంట్ల) విక్రయాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రెసిడెంట్ అండ్ సీఈవో హిరొనొరి కనయమ చెప్పారు. ఈ కొత్త మోడల్‌కు ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు. ధర వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ, ఈ కారు ధరలు రూ.7.50-రూ.11.50 లక్షల రేంజ్లో ఉంటాయనేది పరిశ్రమవర్గాల అంచనా. ఈ కారు హ్యుందాయ్ వెర్నా, రేనాల్ట్ స్కేలా, నిస్సాన్ సన్నీ, మారుతీ సుజుకి ఎస్ఎక్స్4, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, ఫోర్డ్ ఫియస్టా, షెవర్లే సెయిల్, ఫియట్ లినియా, స్కోడా రాపిడ్‌లతో పోటీ పడాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. వచ్చే ఏడాది మొదట్లో మల్టీ పర్పస్ వెహికల్, మొబిలియోను అందుబాటులోకి తెస్తామని, మరో 3 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తామని కనయమ పేర్కొన్నారు. 1998లో హోండా సిటీ కారును కంపెనీ తొలిసారి భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటిదాకా 4.3 లక్షల కార్లను విక్రయించింది. హోండా మోడళ్లలో అత్యధికంగా అమ్ముడయ్యే కారు ఇదే. ప్రస్తుతం హోండా సిటీ పెట్రోల్ వేరియంట్లోనే లభిస్తోంది. ఇక కొత్త హోండా సిటీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లోనూ లభ్యమవుతాయి. టచ్‌స్క్రీన్ ఇంటర్ఫేస్, బ్లూటూత్ టెలిఫోనీ, రియర్ వ్యూ కెమెరా, కీలెస్ స్టార్ట్, సన్‌రూఫ్ వంటి ప్రత్యేకతలున్నాయి.