హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో కొత్తగా ఎన్125 ప్రవేశపెట్టింది. 124.59 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ స్పార్క్, 2 వాల్వ్ ఇంజన్ పొందుపరిచారు. 8,500 ఆర్‌పీఎం వద్ద 12 పీఎస్ పవర్, 6,000 ఆర్‌పీఎం వద్ద 11 ఎన్‌ఎం టార్క్ అందిస్తుంది.
ఎల్‌ఈడీ డిస్క్ బీటీ, ఎల్‌ఈడీ డిస్క్ వేరియంట్లలో లభిస్తుంది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.98,707 ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ ఎల్‌సీడీ స్పీడోమీటర్, మోనోషాక్ సస్పెన్షన్, ఐఎస్‌జీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్, యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు జోడించారు. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.5 లీటర్లు.
Comments
Please login to add a commentAdd a comment