Bajaj Pulsar
-
బజాజ్ పల్సర్ ఎన్125
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో కొత్తగా ఎన్125 ప్రవేశపెట్టింది. 124.59 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ స్పార్క్, 2 వాల్వ్ ఇంజన్ పొందుపరిచారు. 8,500 ఆర్పీఎం వద్ద 12 పీఎస్ పవర్, 6,000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. ఎల్ఈడీ డిస్క్ బీటీ, ఎల్ఈడీ డిస్క్ వేరియంట్లలో లభిస్తుంది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.98,707 ఉంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ ఎల్సీడీ స్పీడోమీటర్, మోనోషాక్ సస్పెన్షన్, ఐఎస్జీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు జోడించారు. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.5 లీటర్లు. -
రూ.1.40 లక్షల కొత్త బైక్.. పూర్తి వివరాలు
బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ ఎన్160 పేరుతో మరో కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. కొత్త వేరియంట్ ఇప్పుడు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబీఎస్ మోడ్‌లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్).చూడటానికి స్టాండర్డ్ బజాజ్ పల్సర్ ఎన్160 మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులోని డిజిటల్ కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీని పొందుతుంది. కాబట్టి టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఇతర కనెక్టెడ్ ఫీచర్లను సులభంగా పొందవచ్చు. ఈ బైక్ ఇప్పుడు రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్ అనే మూడు రైడింగ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.కొత్త పల్సర్ ఎన్160 మోడల్ సాధారణ మోడల్ మాదిరిగానే 164.82 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 rpm వద్ద 16 హార్స్ పవర్, 6750 rpm వద్ద 14.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇంజిన్‌లో ఎటువంటి అప్డేట్ లేదు, కాబట్టి అదే పనితీరును అందిస్తుంది. -
బజాజ్ నుంచి అప్డేటెడ్ బైక్స్ విడుదల
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో దేశీయ విఫణిలో పల్సర్ NS160 & NS200 స్ట్రీట్ నేకెడ్ మోటార్‌సైకిళ్ల అప్డేట్ వెర్షన్స్ విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 1.35 లక్షలు, రూ. 1.47 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైకులు వాటి మునుపటి మోడల్స్ కంటే కూడా రూ. 10,000 (ఎన్ఎస్160), రూ. 7,000 (ఎన్ఎస్200) ఎక్కువ. ఈ రెండు బైకులు మునుపటి స్టాండర్డ్ టెలిస్కోపిక్ యూనిట్ స్థానంలో అప్‌సైడ్ ఫోర్క్‌ను పొందాయి, అంతే కాకుండా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: మీ మొబైల్‌పై ఎవరైనా నిఘా పెట్టారేమో.. ఇలా తెలుసుకోండి..!) డిజైన్ పరంగా కొంత అప్డేట్ పొందినప్పటికీ ఇంజిన్, పర్ఫామెన్స్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఎన్ఎస్160 అదే 160.3 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 17.2 హెచ్‌పీ పవర్ 14.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక ఎన్ఎస్200 బైక్ 199.5 సీసీ ఇంజిన్‌తో 24.5 హెచ్‌పీ పవర్ 18.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఫీచర్స్ పరంగా కూడా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. -
2022లో మోస్ట్ పాపులర్ కారు, బైక్.. మీకు తెలుసా?
భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ డ్రూమ్ “ఇండియా ఆటోమొబైల్ ఇకామర్స్ రిపోర్ట్ 2022” పేరుతో వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కార్ల విభాగంలో హ్యుందాయ్ క్రెటా, బైక్స్ విభాగంలో బజాజ్ పల్సర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలుగా గుర్తింపు పొందాయి. మన దేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా కీర్తి పొందగలిగింది. దేశంలో ప్రస్తుతం కొరియన్ కంపెనీ కార్ల హవా జోరుగా సాగుతోంది. 2022లో ఎక్కువ అమ్మకాలు పొందిన, ఎక్కువమంది కొనుగోలుదారుల మనసుదోచిన కారుగా క్రెటా నిలిచింది. ఆ తరువాత స్థానంలో మారుతి సుజుకి బ్రెజ్జా, ఇన్నోవా క్రిస్టా నిలిచాయి. 2022లో లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఎక్కువ ప్రజాదరణ పొందిన కారుగా గుర్తింపు పొందగా, తరువాత స్థానంలో జీప్ కంపాస్, బెంజ్ సీ క్లాస్, బీఎండబ్ల్యూ5 సిరీస్ చేరాయి. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ పల్సర్ ఎక్కువ ప్రజాదరణ పొందిన బైకుగా మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆ తరువాత స్థానాల్లో హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్, హోండా సీబీ షైన్ వంటివి నిలిచాయి. లగ్జరీ బైక్స్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్, హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750, కవాసాకీ నింజా జెడ్ఎక్స్-10ఆర్ వంటివి ఎక్కువ అమ్మకాలు పొందినట్లు నివేదికల ద్వారా తెలిసింది. -
2023 ఆటోకార్ అవార్డ్స్: సత్తా చాటిన కార్లు, బైకులు.. ఇవే!
ఇటీవల ఆటోకార్ అవార్డ్స్ 2023లో కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా సొంతం చేసుకోగా, బైక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని 'జాజ్ పల్సర్ ఎన్160' దక్కించుకుంది. మొత్తం 22 అవార్డులలో ఏ వాహనం ఏ అవార్డ్ దక్కించుకుందో ఇక్కడ చూడవచ్చు. మారుతి గ్రాండ్ విటారా అగ్ర గౌరవం అందుకోవడం మాత్రమే కాకుండా.. మిడ్‌సైజ్ ఎస్యువి ఆఫ్ ది ఇయర్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ 'ఆఫ్-రోడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'ను మారుతి సుజుకి బాలెనొ హ్యాచ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని కైవసం చేసుకున్నాయి. లగ్జరీ సెడాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్, ఎగ్జ్క్యూటివ్ ఇయర్ ఆఫ్ ది అవార్డు విజేతగా హ్యుందాయ్ టక్సన్, ఎంపివి ఆఫ్ ది ఇయర్‌గా ఇన్నోవా హైక్రాస్, లగ్జరీ ఎస్యువి ఆఫ్ ది ఇయర్ టైటిల్ విన్నర్‌గా ఆడి క్యూ3, గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ టాటా టియాగో ఈవి, ప్రీమియం బైక్ ఆఫ్ ది ఇయర్ విన్నర్ సుజుకి కటన, మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని టాటా మోటార్స్ సొంతం చేసుకున్నాయి. ఆటోకార్ అవార్డ్స్ 2023లో కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భగా మహీంద్రా కంపెనీ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' కూడా ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిశ్రమకు సంబంధించి, 2022 పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మహీంద్రా & మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ సొంతం చేసుకున్నారు -
బజాజ్ పల్సర్ 220ఎఫ్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
అమ్మకాల పరంగా భారతీయ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 'బజాజ్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో 'పల్సర్ 220ఎఫ్' విడుదల చేసింది. ఈ ఆధునిక బైక్ ధర రూ. 1,39,686 (ఎక్స్-షోరూమ్). బజాజ్ పల్సర్ మొదటిసారిగా తన 220ఎఫ్ బైకుని 2007లో విడుదల చేసి గొప్ప అమ్మకాలను పొందింది, ఆ తరువాత ఎన్250, ఎఫ్250 బైక్స్ విడుదల చేసి 220ఎఫ్ మోడల్ నిలిపివేసింది, అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మోడల్ రీ లాంచ్ చేసింది. ఈ బైక్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. కలర్ ఆప్సన్స్ కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ బ్లూ బ్లాక్, రెడ్ బ్లాక్ వంటి మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్‌లో విడుదల చేసింది. కంపెనీ తన బైకులను కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది. ఇంజిన్ & పర్ఫామెన్స్ బజాజ్ పల్సర్ 220ఎఫ్ 220 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి 20.9 బిహెచ్పి పవర్, 18.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిఉంటుంది. ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, సింగిల్ ఛానల్ ABS పొందుతుంది. అదే సమయంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ & వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంది. డిజైన్ దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ డిజైన్ పరంగా మునుపటి మోడల్ మాదిరిగా అనిపిస్తుంది. ఈ బైక్ భారీ ఫ్రంట్ ఫాసియా, స్ప్లిట్ సీటు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వంటి వాటితో పాటుఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ పొందుతుంది. -
ఆ బైక్ మోడళ్ల ధరలు పెంచిన బజాజ్.. ఎంతంటే?
బజాజ్ కంపెనీ తమ బైక్‌లలోని కొన్ని మోడళ్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపులో అత్యధికంగా డామినార్ 250 ధర రూ.6,400 పెరిగి రూ.1.75 లక్షలు కాగా, డామినార్ 400 ధర రూ.1,152 పెరిగి రూ.2.23 లక్షలకు చేరింది. వీటితో పాటు పల్సర్ సిరీస్ బైక్‌ల ధరలు కూడా పెరిగాయి. పల్సర్ N250 ధర రూ.1,299 పెరగగా, పల్సర్ NS200, RS200 ధరలు వరుసగా రూ.999, రూ.1,088 పెరిగాయి. పల్సర్ 125, 150, NS125, NS160 ధరలు కూడా పెరిగాయి. అవెంజర్ 220, అవెంజర్ 160 ధరలు కూడా రూ.1000 లోపు పెంచింది. ప్లాటినా 100 డ్రమ్ కమమ్యూటర్ ధర రూ.1,978 పెరిగి రూ. 63,130కు చేరగా, ప్లాటినా 110, CT100X ధర కూడా పెంచింది. చదవండి: Whatsapp: ఆ వాట్సాప్ వాడుతున్నారా! అయితే వెంటనే డెలీట్ చేయండి.. లేదంటే -
అమ్మకాల్లో దుమ్మురేపుతున్న బజాజ్ పల్సర్ 250
డెఫినేట్లీ మేల్ ట్యాగ్‌లైన్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పల్సర్ బైక్ రెండు దశాబ్ధాలు దాటినా చెక్కు చెదరని ఆదరణ పొందుతోంది. ఏ సెగ్మెంట్లో ఈ మోడల్ రిలీజ్ చేసినా.. అక్కడ తన సత్తా చూపుతోంది. ఆర్నెళ్ల కిందట 250 సీసీ సెగ్మెంట్లో పల్సర్ ఎన్ 250, పల్సర్ ఎఫ్ 250 బైకులను రిలీజ్ చేయగా అమ్మకాల్లో దుమ్మురేపాయి. కేవలం ఆర్నెళ్ల కాలంలోనే 10వేలకు పైగా బైకులు అమ్ముడైపోయినట్టు బజాజ్ తెలిపింది. గడిచిన ఆర్నెళ్ల కాలంలో 250 సీసీ రేంజ్లో బైకుల అమ్మకాలను పరిశీలిస్తే సుజూకి జిక్సర్ 250 సీసీ, కేటీఎం 250 డ్యూక్ , యమహా ఎఫ్‌జెడ్ 25లతో పోల్చితే బజాజ్ పల్సర్ ఎన్ 250, ఎఫ్ 250 బైకుల అమ్మకాలు ఎక్కువగా సాగినట్టు బజాజ్ తెలిపింది. 2021లో ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు వీటి ధర రూ.1.38 నుంచి రూ.1.40 లక్షలు ఉండగా ఇటీవల పెంచిన ధరలతో ప్రస్తుత ధర రూ.1.44 నుంచి రూ. 1.45 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. రేసింగ్ రెడ్, టెక్నో గ్రీన్, గ్లాసీ బ్లూ రంగుల్లో ఈ బైకు లభిస్తోంది. చదవండి: జిగేల్మనే అవిన్యా...ఈవీ! -
బజాజ్ పల్సర్ బైక్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్..!
ప్రముఖ టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో పలు బైక్‌ల ధరలను కాస్త పెంచింది. పల్సర్ మోడల్లోని Pulsar N250 , Pulsar F250 బైక్‌ల ధరలను పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా బజాజ్ పల్సర్ బైక్స్‌లో అత్యంత ఆదరణ పొందిన Pulsar 220F బైక్ ధరను కూడా పెంచింది. ఈ బైక్‌లను కొద్ది రోజుల క్రితమే బజాజ్ లాంచ్ చేసింది. పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..! పల్సర్ 220F ధరను బజాజ్ ఆటో రూ. 660కు పెంచింది. ఇప్పుడు దీని ధర రూ. 1.34 లక్షలుగా ఉండనుంది. మరోవైపు, కొత్త పల్సర్ F250 బైక్ స్వల్పంగా రూ. 915 పెంపును అందుకుంది. కాగా పల్సర్ F250 నేకెడ్ మోడల్ కొంచెం అధికంగా పెరిగింది. పల్సర్ F250 నేకెడ్ మోడల్‌పై రూ.1180 పెంచగా, ప్రస్తుత ధర రూ. 1.41 లక్షలకు చేరింది (ఎక్స్-షోరూమ్). ధరల పెంపు కొత్తేమి కాదు..! గత పన్నెండు నెలల వ్యవధిలో పల్సర్ మేకర్ బజాజ్ ఆటో తన ఉత్పత్తుల ధరలను అనేకసార్లు పెంచింది. గత ఏడాది బజాజ్ విడుదల చేసిన 2021 పల్సర్ 250 ధరలను కూడా పెంచింది. ఇక సంప్రదాయ బైక్‌లకు స్వస్తి పలుకుతూ... బజాజ్ ఆటో ఇప్పుడు తన ఈవీ ఉత్పత్తిని కూడా పెంచాలని యోచిస్తోంది. పూణే సమీపంలో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్ కోసం రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది . ఈ ప్లాంట్ నుంచి బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ ఒక ఏడాదికి 5 లక్షల ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కల్గి ఉంది. చదవండి: 111 ఏళ్ల తరువాత రోల్స్ రాయిస్ సంచలన నిర్ణయం..! -
కళ్లు చెదిరే లుక్స్‌తో సరికొత్త బజాజ్ పల్సర్..! లాంచ్ ఎప్పుడంటే..!
ప్రముఖ టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో మరో సరికొత్త పల్సర్ బైక్‌లను రేపు లాంచ్ చేయనుంది. బజాజ్ పల్సర్ 250, బజాజ్ పల్సర్ 250ఎఫ్ భారత మార్కెట్లలోకి బజాజ్ రిలీజ్ చేయనుంది. బైక్ సరికొత్త లుక్స్‌తో రానుంది. 2021 బజాజ్ పల్సర్ 250 ఇంజన్ విషయానికి వస్తే.. ఈ బైక్‌లో కొత్త 250 సిసి ఎయిర్/ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. 26 పిఎస్ సామర్థ్యంతో .. గరిష్టంగా 22ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు. 6-స్పీడ్ గేర్ ట్రాన్స్మిషన్ 2021 బజాజ్ పల్సర్ 250 సొంతం. చదవండి: స్కూటీ అమ్మకాల్లో టీవీఎస్ రికార్డ్ ! బజాజ్ పల్సర్ 250 స్ట్రీట్‌ఫైటర్ లుక్‌ను పొందగా, పల్సర్ 250ఎఫ్ సెమీ ఫెయిర్డ్ సెటప్ అమర్చారు. ఈ రెండు మోడళ్లలో ఒకే ఇంజిన్ సెటప్‌ను కల్గి ఉంది. కానీ ఎక్స్టీరియర్ డిజైన్ అండ్ స్టైలింగ్ పరంగా విభిన్నంగా ఉండనున్నాయి. ఈ బైక్‌లలో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి డిఆర్ఎల్ లు, ఇండికేటర్స్, స్ప్లిట్ సీట్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, బ్యాక్ మోనోషాక్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్‌ను కల్గి ఉంది. ధర విషయానికి వస్తే..! బజాజ్ పల్సర్ 250 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.35 లక్షలుగా ఉండనుంది. పల్సర్ 250ఎఫ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.45 లక్షలుగా ఉండనుంది. బజాజ్ డోమినార్ 250 సేల్స్‌పై చూపకుండా బజాజ్ ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రూ.342కే రూ.4 లక్షల బెనిఫిట్! -
మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్ బైక్ : ధర?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మార్కెట్లలోకి మరో కొత్త రైడర్ స్పోర్ట్స్ బైక్ ప్రవేశపెట్టింది. దీని ధర ₹77,500(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త టీవీఎస్ బైక్ 125 సీసీ సింగిల్ సిలిండర్ తో వచ్చింది. ఇది బజాజ్ పల్సర్ 125, ది హోండా సీబీ షైన్ ఎస్పీ బైక్‌లకు పోటీగా 2021 టీవీఎస్ రైడర్ నిలవనుంది. 2021 టీవీఎస్ రైడర్ బైక్ ఎల్ఈడీ డీఆర్ఎల్(డే టైమ్ రన్నింగ్ ల్యాప్స్), అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్, మోనో షాక్, ఎల్ఈడీ ల్యాంప్స్‌తో వచ్చింది. ఈ బైక్‌లో డిజిటల్ రివర్స్ డిస్ప్లే కూడా ఉంది. స్పోర్టీ లూక్‌తో 2021 టీవీఎస్ రైడర్ మరింత ఆకర్షణీయంగా ఉంది. రైడర్ టీవీఎస్ స్మార్ట్ క్సోనెక్ట్ వేరియెంట్ తో 5 అంగుళాల టిఎఫ్ టీ క్లస్టర్ తో వస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసీస్ట్ అందిస్తుంది. దీనిలో మరింత భద్రత కోసం సీబీబిఎస్ ఆప్షన్ ఇచ్చారు. మోటార్ సైకిల్ 124 సీసీ, సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 11.32 హెచ్‌పీ శక్తిని, 11.2 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫైవ్ స్పీడ్ సూపర్-స్లిక్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తిమంతమైనది. ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్స్ తో వచ్చిన ఇదే మొట్టమొదటి మోటార్ సైకిల్.(చదవండి: దేశంలో ఈ నగరాల మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవే!) -
బజాజ్ పల్సర్125కు పోటీగా టీవీఎస్ నుంచి అదిరిపోయే బైక్..!
ప్రముఖ బైక్‌ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మార్కెట్లలోకి మరో కొత్త బైక్‌ను రిలీజ్ చేయనుంది. కంపెనీ నుంచి రాబోయే బైక్‌ను టీవీఎస్ తన సోషల్‌మీడియా ఖాతాలో టీజ్ చేసింది.‘ 2021 టీవీఎస్ రైడర్’ బైక్‌ను ఈ నెల 16 న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ బైక్ 125 సీసీ ఇంజన్ సెగ్మెంట్లో రానుందని తెలుస్తోంది. బజాజ్ పల్సర్ 125, ది హోండా సీబీ షైన్ ఎస్పీ బైక్‌లకు 2021 టీవీఎస్ రైడర్ పోటీగా నిలవనుంది. చదవండి: కియా కా కమాల్... రికార్డు సృష్టిస్తోన్న ఆ మోడల్ కారు అమ్మకాలు టీజర్లో భాగంగా 2021 టీవీఎస్ రైడర్ బైక్‌కు ముందుభాగంలో ఎల్ఈడీ డీఆర్ఎల్(డే టైమ్ రన్నింగ్ ల్యాప్స్), అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్, మోనో షాక్, ఎల్ఈడీ ల్యాంప్స్‌తో రానున్నట్లు తెలుస్తోంది. బైక్‌కు డిజిటల్ రివర్స్ డిస్ప్లే కూడా రానుంది. స్పోర్టీ లూక్‌తో 2021 టీవీఎస్ రైడర్ మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. ఈ బైక్ ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ. 80,000 నుంచి 90,000 మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో ఉంచే అవకాశం ఉంది . చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 బైక్.. పల్సర్ 150 కంటే రేటు ఎక్కువ
బజాజ్ ఆటో ఇటీవల తన పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ ధరను భారీగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు జూలై 1, 2021 నుంచి అమల్లోకి వచ్చాయి. ఒక్కసారిగా ధరల భారీగా పెరగడంతో పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ బైక్, పల్సర్ 150 నియాన్ ఎబీఎస్ బైక్ కంటే ఖరీదైనదిగా మారింది. ప్రస్తుతం ఈ పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ మోటార్ సైకిల్ ధర ఇప్పుడు షోరూమ్ లలో రూ.99,296(ఎక్స్ షోరూమ్, ఫరీదాబాద్) ధరకు లభిస్తోంది. మునుపటి ధరలతో పోలిస్తే ఇప్పుడు దీని ధర రూ.4,416 పెరిగింది. ఖచ్చితంగా చెప్పాలంటే, ప్రస్తుతం పల్సర్ 150 నియాన్ ఎబీఎస్ బైక్ ధర రూ.98,259(ఎక్స్ షోరూమ్, ఫరీదాబాద్) కంటే పల్సర్ ఎన్ఎస్125 ధర రూ.1,037 ఎక్కువ. ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న 125 సీసీ మోటార్ సైకిళ్లలో ఎన్ఎస్ 125 ఒకటి. ఈ బైక్ సెమీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, స్ప్లిట్ స్టైల్డ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ ప్రస్తుతం సింగిల్ వేరియెంట్లో మాత్రమే లభ్యం అవుతోంది. వినియోగదారులకు బర్న్డ్ రెడ్, ప్యూటర్ గ్రే, ఆరెంజ్, సఫ్ ఫైర్ బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్ లు అందుబాటులో ఉన్నాయి. బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 బైక్ 124.45సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 11.6 హెచ్ పీ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ఐదు గేర్లు ఉన్నాయి. మోటార్ సైకిల్ సస్పెన్షన్ సిస్టమ్ లో సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్స్ ముందే ఉంటే, వెనుక రియర్ మోనోషాక్ ఉంది. -
సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో ఇవే టాప్
న్యూఢిల్లీ: 2020లో భారతదేశంలో మారుతి సుజుకి డిజైర్, బజాజ్ పల్సర్ సరోకొత్త రికార్డు సృష్టించాయి. గత ఏడాది సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి డిజైర్, అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా బజాజ్ పల్సర్ నిలిచినట్లు "ఆటోమొబైల్ ఇండస్ట్రీ ట్రెండ్ రిపోర్ట్ 2020" ప్రకారం ఆన్ లైన్ ప్రీ ఓన్డ్ ఆటోమొబైల్ సంస్థ డ్రూమ్ వెల్లడించింది. 2020లో సెకండ్ హ్యాండ్ కార్ల సగటు అమ్మకపు ధర రూ.8,38,827గా ఉంది. అలాగే మోటార్ సైకిళ్ల సగటు ధర రూ.47,869గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2020లో విక్రయించిన వాడిన కార్లు, మోటార్ సైకిళ్ల సగటు యాజమాన్యం వ్యవధి 5ఏళ్ల నుంచి 7ఏళ్లగా ఉంది. 2020లో విక్రయించిన మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లలో 34 శాతం పెట్రోల్ మోడల్స్, 65 శాతం డీజిల్ మోడల్స్, 1 శాతం పెట్రోల్ + సిఎన్జి మోడల్స్ ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న కార్లు మొత్తం కార్ల అమ్మకాల్లో 63 శాతం ఉండగా, మిగిలిన కార్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగి ఉన్నాయి. నివేదిక ప్రకారం.. తెలుపు, సిల్వర్, బూడిద రంగు గల వాటిని ఎక్కువగా కొనుగోలుదారులు ఇష్ట్టపడ్డారు. 2020లో విక్రయించిన మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లలో 36 శాతం భారతీయ కంపెనీలకు, 22 శాతం జపాన్ కంపెనీలకు, 18 శాతం జర్మన్ కంపెనీలకు, 12 శాతం దక్షిణ కొరియా కంపెనీలకు చెందినవని నివేదిక పేర్కొంది. చదవండి: బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
స్పీడ్ సీజన్
-
Bajaj Pulsar Festival Of Speed Season
-
రేపు సాక్షి ఎరీనావన్ యూత్‌ఫెస్ట్
సిద్ధమైన ఎల్బీ స్టేడియం సందడి చేయనున్న సినీ తారలు సాక్షి, హైదరాబాద్: తారల తళుక్కులు.. ఉత్తేజాన్ని నింపే బాలీవుడ్ ప్రముఖ సింగర్ల స్వరాలు.. కిక్కెక్కించే కామెడీ.. విద్యార్థుల సందడి.. వీటన్నింటికీ వేదిక కానుంది హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం. సాక్షి ఎరీనా వన్ యూత్ ఫెస్ట్ ఈనెల 21న ఈ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది. కేవలం విద్యకే పరిమితం కాకుండా విద్యార్థుల అభిరుచులకు పెద్దపీట వేస్తూ వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి సాక్షి మీడియా గ్రూప్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇండియా నంబర్ వన్ స్పోర్ట్స్ బైక్ బజాజ్ పల్సర్ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో గానం, మ్యూజిక్, కళ, ఆటలు తదితర అంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. గతనెల 22న మొదలైన ఈ పోటీల్లో వందల కళాశాలల నుంచి వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తుదిగా 225 కళాశాలలకు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. రేపు జరిగే ఫెస్ట్‌లో వీరందరికీ అవార్డులు ప్రదానం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే ఈ ఫెస్ట్‌లో అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సినీ దర్శకురాలు మంచు లక్ష్మి, విజ్ఞాన్ వర్సిటీ చైర్పర్సన్ ఎల్. రత్తయ్య, సుల్తాన్ ఉల్ ఉలూం కాలేజ్ గౌరవ సెక్రటరీ జాఫర్ జావీద్ తదితరులు ఫెస్ట్‌ను ప్రారంభించనున్నారు. వీరితోపాటు ప్రముఖ సింగర్స్ సెహగల్, రోల్ రిదా హుషారెక్కించనున్నారు. అలాగే సినీతారలు ఆదా శర్మ, డింపుల్ చొపాడే, రెజినా, సునీల్, మంచు మనోజ్, నాని, ఆది, ఆది పినిశెట్టి తదితరులు సందడి చేయనున్నారు. కాగా ఈ ఫెస్ట్‌కు విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంది. వీరంతా తమ కళాశాలకు చెందిన గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలి. ఎంట్రీ పాసుల కోసం సాక్షి ఎరీనా వన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మేరా ఈవెంట్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. మరిన్ని వివరాలకు 9505834448, 040-23256134కు కాల్ చేయవచ్చు. -
మార్క్‌ట్‌లోకి ’అడ్వెంచర్ సిరీస్’ పల్సర్బైక్స్
-
బండి కంటే బాదుడే
=వాహనదారుల నుంచి ఏటా రూ.90 కోట్లు దోపిడీ..! =హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో షోరూమ్ నిర్వాహకుల దందా =ఆర్టీఏ కనుసన్నల్లోనే అక్రమార్జన =ప్రేక్షక పాత్రలో రవాణా శాఖ అధికారులు సాక్షి, సిటీబ్యూరో : పండక్కి కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్న వాహనదారులను షోరూమ్‌ల ‘బాదుడు’ బెంబేలెత్తిస్తోంది. హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో ఒక్కో వాహనానికి సగటున రూ.5,000 చొప్పున చేస్తున్న వసూళ్లు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రవాణా శాఖ కనుసన్నల్లో, ఆర్టీఏ అధికార యంత్రాంగం అండదండలతోనే గ్రేటర్లో వాహన షోరూమ్‌ల నిర్వాహకులు యథేచ్ఛగా నిలువు దోపిడీ సాగిస్తున్నారు. గతంలో వాహనాల రిజిస్ట్రేషన్ల పేరిట సాగించిన దందాకు కొంతకాలంగా ‘హ్యాండ్లింగ్ చార్జీలు’ అనే ట్యాగ్ తగిలించి తమ దోపిడీ పర్వాన్ని కొత్తరూపంలో కొనసాగిస్తున్నారు. కొత్తబండి అంటేనే వినియోగదారులు హడలిపోయేలా బాదేస్తున్నారు. నగర వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ఉన్న షోరూమ్‌లు వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నా రవాణా శాఖకు పట్టకపోవడం గమనార్హం. దోపిడీ పర్వం ఇలా.... మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన రమేష్ దీపావళి సందర్భంగా కొత్తగా బజాజ్ పల్సర్ వాహనం కొనుగోలు చేసేందుకు సోమాజిగూడలోని ఒక షోరూమ్‌కు వెళ్లాడు. వాహనం ఖరీదు రూ. 73 వేలు. హ్యాండ్లింగ్ చార్జీలు, వాహనం ప్రాసెసింగ్ పేరుతో మరో రూ.5000 కలిపి మొత్తం రూ.78 వేలు చెల్లించవలసి వచ్చింది. కానీ అతనికి ఇచ్చిన ఇన్వాయిస్ కాపీలో హ్యాండ్లింగ్ చార్జీలు అనే పదం మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇదే విషయాన్ని అతను షోరూమ్ నిర్వాహకులను అడిగాడు. ‘ఆర్టీఏ ఖర్చుల’ కోసమే ఆ డబ్బులు తీసుకున్నట్లు వారు వెల్లడించడంతో ఆ వినియోగదారుడు అవాక్కయ్యాడు. ఇది ఒక్క రమేష్ అనుభవం మాత్రమే కాదు. నగరంలోని ఏ షోరూమ్‌కు వెళ్లినా... రూ.60 వేల బైక్ నుంచి రూ. లక్షల ఖరీదు చేసే కార్లు కొనుగోలు చేసినా హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. వాహనం తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏలో చెల్లించాలంటూ నిర్వాహకులు బాహటంగానే వినియోగదారుల జేబులకు చిల్లులు వేస్తున్నారు. ఆర్టీఏ ప్రేక్షకపాత్ర గ్రేటర్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, ఉప్పల్, అత్తాపూర్, మెహదీపట్నం, బహదూర్‌పురా, కర్మన్‌ఘాట్, మేడ్చెల్ ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రతి రోజు సగటున 600 కొత్త వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి. వీటిలో 400 ద్విచక్రవాహనాలు ఉంటే.. మిగతా 200 కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. గ్రేటర్లో 175 షోరూమ్‌ల ద్వారా ఈ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. మొదట వాహనం బుకింగ్ కోసం వెళ్లిన వినియోగదారుడికి నిర్వాహకులు వాహనం ఆన్‌రోడ్ ఖరీదు, జీవితకాల పన్ను వివరాలను మాత్రమే వెల్లడిస్తారు. మాట వరసకైనా హ్యాండ్లింగ్, ప్రాసెసింగ్ ఊసెత్తరు. కానీ వినియోగదారుడు వాహనం కొనుగోలు చేసేందుకు సిద్ధపడి డబ్బులు చెల్లించే సమయంలో ఠంచనుగా ఇవి తెర పైకి వస్తాయి. దాంతో మరో గత్యంతరం లేక వారు అడిగినంతా చెల్లించవలసి వస్తోంది. ద్విచక్రవాహనాలు, కార్లపై సగటున రూ.5000 వసూలు చేస్తుండగా, లగ్జరీ కార్లపై ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆఖరికి ఉపాధి కోసం ఆటోరిక్షాలు కొనుగోలు చేసే సాధారణ డ్రైవర్లను సైతం షోరూమ్‌లు వదలటం లేదు. బాహటంగానే ఈ వ్యవహారం జరుగుతున్నప్పటికీ రవాణా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. మరోవైపు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసే మోటారు వాహన ఇన్స్పెక్టర్లు, షోరూమ్‌లకు చెందిన బ్రోకర్లతో లోపాయకారీ ఒప్పందాలు కుదుర్చుకొని ఈ అక్రమ బాగోతానికి ఊతమిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా షోరూమ్‌ల దోపిడీ పర్వంలో ఆర్టీఏ సైతం భాగస్వామి కావడం వల్లనే ఈ అక్రమ వ్యాపారం నిర్నిరోధంగా సాగిపోతోందనే విమర్శలు బలంగా ఉన్నాయి.