కళ్లు చెదిరే లుక్స్‌తో సరికొత్త బజాజ్‌ పల్సర్‌..! లాంచ్‌ ఎప్పుడంటే..! | Bajaj Pulsar 250 India Launch Tomorrow | Sakshi
Sakshi News home page

Bajaj Pulsar 250: కళ్లు చెదిరే లుక్స్‌తో సరికొత్త బజాజ్‌ పల్సర్‌..! లాంచ్‌ ఎప్పుడంటే..!

Published Wed, Oct 27 2021 4:46 PM | Last Updated on Wed, Oct 27 2021 4:51 PM

Bajaj Pulsar 250 India Launch Tomorrow - Sakshi

ప్రముఖ టూవీలర్‌ దిగ్గజం బజాజ్‌ ఆటో మరో సరికొత్త పల్సర్‌ బైక్లను రేపు లాంచ్‌ చేయనుంది. బజాజ్‌ పల్సర్‌ 250, బజాజ్‌ పల్సర్‌ 250ఎఫ్‌ భారత మార్కెట్లలోకి బజాజ్‌ రిలీజ్‌ చేయనుంది. బైక్‌ సరికొత్త లుక్స్‌తో రానుంది. 2021 బజాజ్‌ పల్సర్‌ 250 ఇంజన్‌ విషయానికి వస్తే..  ఈ బైక్‌లో కొత్త 250 సిసి ఎయిర్/ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ అమర్చారు. 26 పి‌ఎస్ సామర్థ్యంతో .. గరిష్టంగా  22ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు. 6-స్పీడ్  గేర్ ట్రాన్స్‌మిషన్ 2021 బజాజ్‌ పల్సర్‌ 250 సొంతం.
చదవండి: స్కూటీ అమ్మకాల్లో టీవీఎస్‌ రికార్డ్‌ !

బజాజ్‌ పల్సర్ 250 స్ట్రీట్‌ఫైటర్ లుక్‌ను పొందగా, పల్సర్ 250ఎఫ్ సెమీ ఫెయిర్డ్ సెటప్‌ అమర్చారు. ఈ రెండు మోడళ్లలో ఒకే ఇంజిన్‌ సెటప్‌ను కల్గి ఉంది. కానీ ఎక్స్‌టీరియర్ డిజైన్ అండ్ స్టైలింగ్ పరంగా విభిన్నంగా ఉండనున్నాయి. ఈ బైక్లలో ఎల్‌ఈ‌డి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈ‌డి డి‌ఆర్‌ఎల్ లు, ఇండికేటర్స్, స్ప్లిట్ సీట్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, బ్యాక్ మోనోషాక్ సస్పెన్షన్‌, అల్లాయ్ వీల్స్‌ను కల్గి ఉంది.  

ధర విషయానికి వస్తే..!
బజాజ్‌ పల్సర్ 250 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.35 లక్షలుగా ఉండనుంది. పల్సర్ 250ఎఫ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.45 లక్షలుగా ఉండనుంది. బజాజ్‌ డోమినార్‌ 250 సేల్స్‌పై చూపకుండా బజాజ్‌ ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. 
చదవండి: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రూ.342కే రూ.4 లక్షల బెనిఫిట్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement