ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో దేశీయ విఫణిలో పల్సర్ NS160 & NS200 స్ట్రీట్ నేకెడ్ మోటార్‌సైకిళ్ల అప్‌డేట్ వెర్షన్స్ విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 1.35 లక్షలు, రూ. 1.47 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైకులు వాటి మునుపటి మోడల్స్ కంటే కూడా రూ. 10,000 (ఎన్ఎస్160), రూ. 7,000 (ఎన్ఎస్200) ఎక్కువ. ఈ రెండు బైకులు మునుపటి స్టాండర్డ్ టెలిస్కోపిక్ యూనిట్ స్థానంలో అప్సైడ్ ఫోర్క్‌ను పొందాయి, అంతే కాకుండా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది.
(ఇదీ చదవండి: మీ మొబైల్‌పై ఎవరైనా నిఘా పెట్టారేమో.. ఇలా తెలుసుకోండి..!)
డిజైన్ పరంగా కొంత అప్డేట్ పొందినప్పటికీ ఇంజిన్, పర్‌ఫామెన్స్‌లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఎన్ఎస్160 అదే 160.3 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 17.2 హెచ్‌పీ పవర్ 14.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక ఎన్ఎస్200 బైక్ 199.5 సీసీ ఇంజిన్‌తో 24.5 హెచ్‌పీ పవర్ 18.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఫీచర్స్ పరంగా కూడా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment