వరల్డ్ ఫస్ట్ సీఎన్‌జీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా? | World First CNG Bike Bajaj Freedom 125 Launches in India | Sakshi
Sakshi News home page

వరల్డ్ ఫస్ట్ సీఎన్‌జీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Published Fri, Jul 5 2024 3:02 PM | Last Updated on Fri, Jul 5 2024 4:03 PM

World First CNG Bike Bajaj Freedom 125 Launches in India

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ ఫస్ట్ సీఎన్‌జీ బైక్ దేశీయ విఫణిలో లాంచ్ అయింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ప్రతిభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్థుంది. కంపెనీ ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 బైకులో 2 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్‌జీ ట్యాంక్, అదే పరిమాణంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటారు. పెట్రోల్, సీఎన్‌జీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే బైక్ మైలేజ్ 330 కిమీ వరకు ఉంటుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 9.5 Bhp పవర్, 6000 rpm వద్ద 9.7 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ డిజైన్.. మార్కెట్లోని ఇతర కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డర్ట్ బైక్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ పీస్ సీటు వంటివి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement