
ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన.. ఆడి (Audi) కంపెనీ రెండు కార్లను వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఇందులో ఏ8ఎల్, ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ ఉన్నాయి. ఈ రెండు కార్లు భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారానే వచ్చాయి. ఆడి ఏ8 ఎల్ భారతదేశంలో 2020లో లాంచ్ అయింది, ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ 2021 నుంచి అమ్మకానికి ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 1.63 కోట్లు, రూ. 1.13 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా).
నాల్గవ తరం ఆడి ఏ8 ఎల్ 2017 నుంచి గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే 2020లో భారతదేశానికి వచ్చింది. ఆ తరువాత 2022లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రూపంలో లాంచ్ అయింది. ఏ8 ఎల్ నాలుగు, ఐదు సీట్ల కాన్ఫిగరేషన్‌లలో.. సౌకర్యవంతమైన రియర్ సీటు పొందుతుంది. ఇందులోని 3.0 లీటర్ TFSI వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్.. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.
ఇక ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ విషయానికి వస్తే.. ఇది ఆగస్టు 2021లో ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది. ఇందులోని 2.9 లీటర్ ట్విన్ టర్బో వీ6 ఇంజిన్ 450 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ8 మాదిరిగానే ఇది కూడా వెబ్‌సైట్ నుంచి కనుమరుగైంది. కాగా కంపెనీ ఫిబ్రవరి 17న భారతదేశంలో RS Q8 ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: బుకింగ్స్‌లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment