Discontinued
-
‘చెక్క బెంచీలపై ప్రయాణం ఎన్నటికీ మరువలేం’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 1873 నుంచి అంటే గత 150 ఏళ్లుగా నడుస్తున్న ట్రామ్ సేవలకు త్వరలో స్వస్తి చెప్పనున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సవాళ్ల పరిష్కారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అయితే కేవలం ఒక ట్రామ్ సర్వీసును కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోల్‌కతాలో చారిత్రాత్మక రవాణా సర్వీసులను నిలిపివేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సులలో తాము సాగించిన ప్రయాణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ట్రామ్ బస్సుల శకం ముగిసిందని, అయితే ప్రయాణికులు ఎప్పటికీ చెక్క బెంచీలపై కూర్చుని ప్రయాణించడాన్ని మరచిపోరని పలువురు అంటున్నారు.తెలుపు, నీలి రంగుల ట్రామ్‌లు బెంగాలీల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. కోల్‌కతా నగరాన్నికున్న గుర్తింపులో ట్రామ్ బస్సులకు ప్రత్యేక స్థానం ఉంది. సోషల్ మీడియాలో ఒక యూజర్ భావోద్వేగానికి గురవుతూ ‘ఒక శకం ముగిసింది. కోల్‌కతాలో 150 ఏళ్ల ట్రామ్ వారసత్వం ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక అధ్యాయం ముగింపుతో, చరిత్రలోని ఒక ఘనమైన అధ్యాయానికి వీడ్కోలు పలుకుతున్నాం. రాబోయే తరాలు ట్రామ్‌ల గురించి ఫోటోలు, వీడియోలను చూసి మాత్రమే తెలుసుకోగలుగుతాయి’ అని రాశారు. మరొక యూజర్ ‘కోల్‌కతాలో 150 ఏళ్ల వారసత్వ రవాణా వ్యవస్థ ట్రామ్ బంద్ అవుతోంది. కోల్‌కతా వీధుల్లో దీనిని మిస్ అవుతున్నాం’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘కోల్‌కతాలోని పురాతన ట్రామ్ వ్యవస్థను నిలిపివేస్తున్నందుకు అభినందనలు. దానిని ఆధునీకరించడానికి బదులుగా, నిలిపివేస్తున్నారు. చరిత్రను చెరిపివేయగలిగినప్పుడు, దానిని ఇంకా ఎందుకు భద్రపరచాలి?" అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు పర్యావరణ అనుకూల రవాణా అవసరమా?’ అంటూ ఆవేదనతో ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఒక పోలీసు వీరమరణం -
ఇకపై ఈ మహీంద్రా కొత్త కారు కనిపించదు!.. ఎందుకంటే?
భారతీయ మార్కెట్లో ఒకప్పుడు ఉత్తమ అమ్మకాలు పొందిన 'మహీంద్రా మరాజో' ఉత్పత్తిని కంపెనీ త్వరలో నిలిపివేయనున్నట్లు సమాచారం. 2018లో మారుతి ఎర్టిగా, ఎక్స్ఎల్6, కియా కారెన్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా దేశీయ విఫణిలో అడుగుపెట్టిన మరాజో 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ఈ ఎమ్‌పీవీ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.90 లక్షల మధ్య ఉండేది.ప్రారంభంలో ఉత్తమ అమ్మకాలు పొందినప్పటికీ.. క్రమంగా ఇది ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందలేకపోయింది. గత ఐదు నెలలో ఈ కారు కేవలం 34 యూనిట్ల అమ్మకాలను మాత్రమే సాధించింది. ప్రస్తుతం ప్యాసింజర్ ఎమ్‌పీవీ మార్కెట్లో టయోటా, మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో కంపెనీ మరాజో కారును నిలిపివేయడానికి సంకల్పించింది.ప్రారంభం నుంచి జూన్ 2024 వరకు మహీంద్రా మరాజో సేల్స్ మొత్తం 44793 యూనిట్లు మాత్రమే. నెలకు సగటున కేవలం 640 యూనిట్ల మరాజో కార్లు మాత్రమే అమ్ముడైనట్లు కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. అమ్మకాలు తగ్గడమే కాకుండా.. బిఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ అవ్వలేదు. ఇది కూడా కంపెనీ మార్కెట్లో విజయం పొందకపోవడానికి కారణమనే తెలుస్తోంది. -
ఇకపై కావాలన్నా.. ఈ కారును కొనలేరు!.. ఎందుకంటే?
హ్యుందాయ్ ఇండియా తన లైనప్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కారును నిలిపివేసింది. 2019 నుంచి సుమారు ఐదేళ్లపాటు భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఈ కారు ఉత్పత్తి ఇప్పుడు నిలిచిపోయింది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన మొట్టమొదటి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుతం కోనా ఎలక్ట్రిక్ నిలిచిపోవడంతో.. ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు మాత్రమే అమ్మకానికి ఉంది.ప్రస్తుతం నిలిచిపోయిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ స్థానంలోకి 2025లో లాంచ్ కానున్న క్రెటా ఈవీ రానున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 25.30 లక్షలు (లాంచ్ సమయంలో.. ఎక్స్ షోరూమ్). ఇది 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ చార్జితో 452 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 100 కిలోవాట్ మోటారు 131 Bhp పవర్, 395 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
ఆ 4 ఐఫోన్లకు టాటా చెప్పేసిన యాపిల్..
Apple discontinues 4 iPhones: ఐఫోన్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను యాపిల్ (Apple) ప్రకటించింది. తాజాగా జరిగిన వండర్లస్ట్ ఈవెంట్లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series)ను లాంచ్ చేసింది. మరోవైపు పలు ఐఫోన్ మోడళ్లను భారతీయ మార్కెట్లో అధికారికంగా నిలిపేసింది. నిలిపేసిన ఐఫోన్లు ఇవే.. యాపిల్ నిలిపేసిన ఐఫోన్ మోడల్‌లలో ఐఫోన్ 12 (iPhone 12), ఐఫోన్ 13 మినీ, (iPhone 13 mini), ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max) ఉన్నాయి. గత ఏడాది రూ. 1,39,900 ధరతో విడుదలైన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్‌ను అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది. అలాగే గతేడాదిలోనే రూ. 1,29,900 ధరతో లాంచ్ చేసిన ఐఫోన్ 14 ప్రో మోడల్‌ను కూడా భారత మార్కెట్లో నిలిపివేసింది. (జాబ్ ఇంటర్వ్యూలో అరెస్టయిన యువతి.. ఈ కిలాడి మోసం గురించి తెలిస్తే అవాక్కవుతారు!) ఇక 2021లో రూ. 69,900లకు విడుదలైన ఆపిల్ ఐఫోన్ 13 మినీకి కూడా యాపిల్ వీడ్కోలు పలికింది. నిలిపివేసిన ఐఫోన్లలో మోడల్‌లలో ఐఫోన్ 12 కూడా ఉంది. 2020లో ఐఫోన్ 12 బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 59,900 ధరతో లాంచ్ అయింది. అయితే ఇప్పటికీ ఈ పాత ఐఫోన్ మోడల్‌లపై ఆసక్తి ఉన్నవారు అమెజాన్, ఫ్టిప్‌కార్ట్ వంటి థర్డ్-పార్టీ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆయా సంస్థలు తమ వద్ద స్టాక్ ఉన్నంత వరకూ వీటిని విక్రయిస్తాయి. ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఇవే.. కాగా యాపిల్ కొత్తగా ప్రకటించిన ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ 15 (iPhone 15) ప్రారంభ ధర రూ. 79,900. ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus) ధర రూ. 89,900. ఇక ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) ప్రారంభ ధర రూ. 1,34,900 కాగా, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ధర రూ. 1,59,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్లకు ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అధికారిక సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. -
అధికారిక వెబ్సైట్లో మాయమైన స్కోడా సూపర్బ్.. కారణం ఏంటంటే?
Skoda Superb Discontinued: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) తన సూపర్బ్ (Superb) కారుని నిలిపివేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇది స్కోడా ఇండియా అధికారిక వెబ్సైట్లో మాయమైపోయింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఈ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్కోడా కంపెనీ ఈ కారుని నిలిపివేయడానికి గల కారణాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో మొదలైన బిఎస్ 6 ఫేజ్ 2 నిబంధనల కారణంగా ఈ సెడాన్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఉన్న కార్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరింత కొత్త డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లతో మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. భారతీయ మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి స్కోడా సూపర్బ్ అతి తక్కువ కాలంలోనే అత్యంత విజయవంతమైన మోడల్‌గా గుర్తింపు పొందింది. దాని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్శించాయి. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో మంచి అమ్మకాలతో సాగుతున్న ఈ మోడల్ బోల్డ్ గ్రిల్, సొగసైన హెడ్‌లైట్స్, షార్ప్ బాడీ లైన్స్, సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్ ప్రీమియం ఇంటీరియర్ మెటీరియల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది అత్యాధునిక డ్రైవింగ్ అనుభూతిని కూడా కల్పిస్తుంది. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. ఎలా అంటే?) ఇప్పటికే భారతీయ మార్కెట్లో స్కోడా స్లావియా, కుషాక్ వంటి కొత్త మోడల్స్ విడుదలయ్యాయి. ఇవి మార్కెట్లో ఉత్తమ అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. ఈ కార్లు ఆధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మంచి ఆదరణ పొందగలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్లు కంపెనీ అమ్మకాలను పెంచడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఈ టయోటా కారు కావాలన్నా కొనలేరు - ఎందుకంటే?
ఇండియన్ మార్కెట్లో టయోటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తోంది. అయితే ఇప్పుడు 'FJ క్రూయిజర్ SUV'ని నిలిపివేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2006లో ప్రారంభమైన ఐకానిక్ ఎఫ్‌జే క్రూయిజర్ ఎట్టకేలకు మరుగునపడనుంది. 2022లో కూడా మిడిల్ ఈస్టర్న్ మార్కెట్లో అమ్ముడైన ఈ కారు గతంలో టయోటా 'ఫైనల్ ఎడిషన్' రూపంలో విడుదలైంది. ఇది కేవలం అప్పట్లో 1,000 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. ల్యాండ్ క్రూయిజర్ నుంచి ప్రేరణ పొందిన ఈ కారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్ రూపంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్యువి రెట్రో-థీమ్ స్టైలింగ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఉత్తర అమెరికా, జపాన్, మిడిల్ ఈస్ట్ వంటి అనేక దేశాల్లో విజయవంతంగా అమ్ముడైన ఈ కారు కనుమరుగు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: కొత్త మొబైల్ కొనాలకుంటున్నారా? వచ్చే నెల విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్, ఇవే!) టయోటా ఎఫ్‌జే క్రూయిజర్ ఫైనల్ ఎడిషన్ బేజ్ ఎక్స్టీరియర్ షేడ్‌లో ఉంటే.. మిర్రర్స్, గ్రిల్, బాడీ క్లాడింగ్ వంటివి బ్లాక్ షేడ్‌లో ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ మొత్తం కూడా ఆకర్షణీయంగా ఉంది. సీట్లు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో, సెంటర్ కన్సోల్ ఇరువైపులా కూడా అదే కలర్ పొందింది. టయోటా ఎఫ్‌జే క్రూయిజర్ ఫైనల్ ఎడిషన్ 4.0 లీటర్ వి6 ఇంజిన్ కలిగి 270 హెచ్‌పి పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్, క్రాల్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆఫ్-రోడ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!) ప్రస్తుతం టయోటా భారతదేశంలో ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, హైరిడర్, వెల్ఫైర్, హిలక్స్ పికప్, ల్యాండ్ క్రూయిజర్ 300 వంటి వాటిని విక్రయమిస్తూ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని మంచి అమ్మకాలను పొందటానికి కొత్త ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. -
వెబ్సైట్లో మాయమైన క్విడ్, ఇక కావాలన్నా కొనలేరు!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన 'రెనాల్ట్ క్విడ్' (Renault Kwid) ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్సైట్లో మాయమైంది. ఇటీవల అమలులోకి వచ్చిన రియల్ డ్రైవింగ్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ మోడల్ని నిలిపివేసింది. నివేదికల ప్రకారం.. క్విడ్ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నప్పటికీ కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని. ఈ హ్యాచ్‌బ్యాక్ ఏ విధమైన అప్డేట్ పొందినప్పటికీ ధరల పెరుగుదల పొందుతుంది. అప్పుడు అమ్మకాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే కంపెనీ ఈ 800cc వెర్షన్‌ను తొలగించింది. రెనాల్ట్ క్విడ్ 0.8 లీటర్ వెర్షన్ RXL, RXL(O) వేరియంట్లలో అందుబాటులో ఉంది. 800cc వేరియంట్ నిలిపివేయడంతో, రెనాల్ట్ ఇప్పుడు ఐదు వేరియంట్లలో 1.0 లీటర్ వెర్షన్‌ను మాత్రమే అందిస్తుంది. క్విడ్ 800 సీసీ వేరియంట్ త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 52 బిహెచ్పి పవర్, 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు) రెనాల్ట్ కంపెనీ కంటే ముందు మారుతి సుజుకి తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో 800ని నిలిపివేసింది. అంతే కాకుండా స్కోడా నుంచి ఆక్టావియా, హోండా జాజ్, 4వ తరం హోండా సిటీ ఉత్పత్తి కూడా నిలిపేయడం జరిగింది. నిజానికి కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల ఈ ఉత్పత్తులు నిలిచిపోయాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
‘మారుతీ ఆల్టో 800’ను ఇక కొనలేరు! ఎందుకంటే...
కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఆల్టో 800 కారును ఇకపై కొనలేరు. ఎందుకంటే తన ఎంట్రీ లెవల్ మోడల్ కారు ఆల్టో 800 ఉత్పత్తిని మారుతీ సుజుకీ నిలిపివేసింది. దీంతో మధ్యతరగతివారికి సైతం అందుబాటు ధరలో ఉంటూ అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతీ ఆల్టో 800 కారు కస్టమర్లకు దూరం కానుంది. (వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!) బీఎస్6 (BS6) ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఆల్టో 800ని అప్‌గ్రేడ్ చేయడం ఆర్థికంగా లాభదాయకం కాదని కంపెనీ భావిస్తోంది. దీంతో ఆ కార్ల ఉత్పత్తిని ఆపేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రోడ్డు ట్యాక్స్ పెరగడం, మెటీరియల్ ధర, ఇతర రకాల పన్నులు కూడా వాహనాల కొనుగోలు ఖర్చు పెరగడానికి కారణాలు. ఆల్టో 800 ఉత్పత్తిని నిలిపివేయడం వెనుక మరో కీలక అంశం ఆల్టో కె10కి డిమాండ్ పెరగడం. ఆల్టో 800 ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ తగ్గుముఖం పడుతోందని, ఈ విభాగంలో వాహనాల కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగిందని మారుతి సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) ఆల్టో 800 నిలిపివేత తర్వాత ఆల్టో K10 మారుతీ సుజుకీ ఎంట్రీ-లెవల్ మోడల్ కానుంది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి రూ 5.94 లక్షల మధ్య ఉంది. మారుతి సుజుకీ వెబ్సైట్ ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షల నుంచి రూ 5.13 లక్షల మధ్య ఉంది. 2000 సంవత్సరంలో లాంచ్ అయిన ఆల్టో 800 కారులో 796 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 2010 వరకు దాదాపు 18 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఆల్టో K10 భారత మార్కెట్లో విడుదలైంది . 2010 నుంచి ఇప్పటి వరకు 17 లక్షల ఆల్టో 800 కార్లను, 9.5 లక్షల ఆల్టో K10 కార్లను కంపెనీ విక్రయించింది. (విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్! గతి స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్) -
Honda: ఏప్రిల్ నుంచి ఈ కార్ల ఉత్పత్తి బంద్
గతంలో బిఎస్6 ఉద్గార నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత చాలా కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే 2023 ఏప్రిల్ 01నుంచి బిఎస్6 ఫేజ్-2 రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులలో కొన్నింటిని నిలిపివేయాలని నిర్చయించాయి. ఇందులో హోండా కంపెనీ కూడా ఉంది. నివేదికల ప్రకారం.. హోండా కంపెనీ ఏప్రిల్ ప్రారంభం నుంచి జాజ్, డబ్ల్యుఆర్-వి, నాల్గవ తరం సిటీ వంటి మోడల్స్ ఉత్పత్తిని నిలిపివేయనుంది. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ నిబంధనలు క్యాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్ల వంటి భాగాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. బిఎస్6 ఫేస్-2 నిబంధనలు కొంత కఠినంగా ఉంటాయి, కావున కంపెనీ ఉత్పత్తులు మరింత పటిష్టంగా తయారవుతాయి, తద్వారా ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ హోండా సిటీ ఐదవ తరం మోడల్, అమేజ్ వంటి వాటిని కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. వచ్చే నెల ప్రారంభం నుంచే తమ ఉత్పత్తుల ధరలు రూ. 12,000 వరకు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ఇదే బాటలో మరిన్ని కంపెనీలు ముందుకు సాగనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే ఈ ధరల పెరుగుదల వాహనాల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా? లేదా? అనేది త్వరలో తెలియాల్సి ఉంది. -
దెబ్బకు 17 కార్లు డిస్కంటిన్యూ: వచ్చేనెల నుంచే..
గతంలో బిఎస్6 ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన సందర్భంగా అనేక కార్ల ఉత్పత్తి నిలిపివేశారు. అయితే ఈ ఏడాది కూడా రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) ఉద్గార ప్రమాణాల కారణంగా 2023 ఏప్రిల్ 01 నుంచి ఏకంగా 17 కార్లు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ అనేది బిఎస్6 ఉద్గార ప్రమాణాల 2వ దశగా చెబుతున్నారు. ఇది వెహికల్ ఎగ్జాస్ట్‌ను నిశితంగా పరిశీలించి ఉద్గార నిబంధనలకు అనుగుణంగా క్యాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్ వంటి కీలక భాగాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. అంతే కాకుండా వాహనాల నుండి విడుదలయ్యే NOx వంటి కాలుష్య కారకాలను కొలుస్తుంది. వాహనంలో ఉపయోగించే సెమీకండక్టర్ కూడా క్రాంక్ షాఫ్ట్ పొజిషన్, థొరెటల్, ఎయిర్ ఇన్‌టేక్ ప్రెజర్, ఎగ్జాస్ట్, ఇంజిన్ ఉష్ణోగ్రత మొదలైన వాటి నుండి వచ్చే ఉద్గారాలను పర్యవేక్షించడానికి అప్‌గ్రేడ్ చేయాలి. కావున కంపెనీలు ఇంజిన్లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సంస్థ ఉత్పత్తుల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొత్త ఉద్గార నిబంధనలను ప్రవేశపెట్టడంతో, వాహనాల ఇంజిన్‌లో అనేక కొత్త మార్పులు చేయవలసి ఉంది, దీని కారణంగా వాహనాల ధరలు రూ.50,000 నుంచి రూ. 90,000 వరకు & ద్విచక్ర వాహనాల ధరలు రూ. 3,000 నుంచి రూ. 10,000 మధ్య పెరిగే సూచనలు ఉన్నాయి. (ఇదీ చదవండి: రూ. 1,299కే కొత్త ఇయర్‌ఫోన్స్.. ఒక్క ఛార్జ్‌తో 40 గంటలు) ఏప్రిల్ 01 నుంచి కనుమరుగయ్యే కార్ల జాబితాలో మహీంద్రా మొరాజో, ఆల్టురాస్ జి4, టాటా ఆల్ట్రోజ్ డీజిల్, మహీంద్రా KUV100, స్కోడా సూపర్బ్, ఆక్టేవియా, హ్యుందాయ్ ఐ20 డీజిల్, వెర్నా డీజిల్, రెనో క్విడ్800, నిస్సాన్ కిక్స్, మారుతి ఆల్టో800, ఇన్నోవా క్రిస్టా పెట్రోల్, హోండా జాజ్, అమేజ్ డీజిల్, డబ్ల్యుఆర్-వి, హోండా సిటీ 4వ తరం & 5వ తరం డీజిల్ మోడల్స్ ఉన్నాయి. -
మూతబడిన మరో స్టార్టప్.. షాప్‌ఎక్స్
న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేకపోవడంతో మరో స్టార్టప్ సంస్థ మూతబడింది. టెక్ దిగ్గజం నందన్ నీలేకని ఇన్వెస్ట్ చేసిన షాప్‌ఎక్స్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నాయి. అత్యంత స్వల్ప మార్జిన్ల వల్ల వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎడ్టెక్ స్టార్టప్‌లు క్రెజోడాట్ఫన్, సూపర్లెర్న్, ప్రోటాన్ తదితర స్టార్టప్‌లు మూతబడ్డాయి. కిరాణా స్టోర్స్, ఇతర చిన్న తరహా రిటైలర్లకు లాజిస్టిక్స్, కొనుగోళ్లపరమైన సహకారం అందించేందుకు 2014లో అమిత్ శర్మ, అపూర్వ జోయిస్ కలిసి షాప్‌ఎక్స్ ఏర్పాటు చేశారు. నందన్ నీలేకనితో పాటు ఫంగ్ స్ట్రాటెజిక్ హోల్డింగ్స్, రాజేశ్ రణావత్, కేవల్ నోరియా తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ 2020 నాటికి 60 మిలియన్ డాలర్లు సమీకరించింది. తీవ్రమైన పోటీతో తరచూ వ్యాపార వ్యూహాలను మార్చుకున్నప్పటికీ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. నిధుల కొరత కారణంగా తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైంది. -
పల్సర్ 135 ఎల్ఎస్ ఇక మనకు లేదు
సాక్షి, ముంబై: పలర్స్ బైక్ లవర్స్‌కు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో నిరాశను మిగిల్చింది. పల్సర్ 135 ఎల్ఎస్ బైక్‌ను ఇండియా మార్కెట్ నుంచి బజాజ్ ఆటో ఉపసంహరించుకుంది. ప్రముఖ డీలర్లు అందించిన సమాచారం ప్రకారం పల్సర్ సిరీస్‌లో అతి చిన్నదైన ఈ బైక్‌ను మార్కెట్‌నుంచి తొలగించింది. ఇటీవల ఈ బైక్‌కు డిమాండ్ పడిపోవడంతోపాటు. అప్డేటెడ్ వెర్షన్ లాంచింగ్ కారణంగా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ షాకింగ్ నిర్ణయంపై మార్కెట్ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ వార్తలకు బలాన్నిస్తూ బజాజ్ ఆటో తన అధికారిక వెబ్ సైట్ నుంచి పల్సర్ 135 ఎల్ఎస్ ను తొలగించింది. కాగా ఈ ఏడాది జనవరిలో తమ అన్ని ఉత్పత్తులను కాస్మొటిక్ మార్పులు , నూతన రంగుల జోడింపుతో అప్డేటెడ్ వెర్షన్లో పల్సర్ బైక్‌లను లాంచ్ చేసింది. కానీ, పల్సర్ శ్రేణిలోని అతి చిన్న మోడల్ పల్సర్ 135 ఈ 2018 రేంజ్ నుండి మిస్సయినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిన్న పల్సర్‌ను విదేశీ మార్కెట్ కోసం యథావిధిగా ఉత్పత్తి చేస్తుందట. బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్ ఇండియన్ మార్కెట్లో 4-వాల్వ్ టెక్నాలజీతో వచ్చిన మొదటి బైకు బజాజ్ పల్సర్ ఎల్ఎస్135. 4-వాల్వ్ టెక్నాలజీ , మెరుగైన మేలేజీ దీని ప్రధాన ఫీచర్లుగా ఉండేవి. కాగా 2017లో అపడేటెడ్ వెర్షన్ పల్సర్ 135 బైక్‌కు కమ్యూటర్ మోటార్ సైకిల్ లుక్ తీసుకొచ్చింది. 135సీసీ కెపాసిటి సింగిల్ సిలిండర్, పెట్రోల్ ఇంజన్ 13బిహెచ్పి పవర్. 11ఎన్ఎమ్ టార్క్, 5స్పీడ్ గేర్‌బాక్స్ లాంటి ఫీచర్లు ఇందులో జోడించింది. అయితే బజాజ్ ఆటో ఇటీవల అన్నిమోడళ్ళ బైక్‌లను ధరలను రూ.500నుంచి 2వేల దాకా ధరలు పెంచిన సంగతి తెలిసిందే. -
యూట్యూబ్‌లో ఆ ఫీచర్లు ఔట్
యూట్యూబ్ ఓ రెండు ఫీచర్లను సెప్టెంబర్ 20 నుంచి తన ప్లాట్‌ఫామ్‌పై తొలగిస్తోంది. వీడియో ఎడిటర్, ఫోటో స్లైడ్షోస్ టూల్స్ సెప్టెంబర్ 20తో రిటైర్ అయిపోతాయని యూట్యూబ్ తెలిపింది. అయితే అన్ని ఎడిటింగ్ ఫీచర్లను యూట్యూబ్ తీసివేయడం లేదు. ట్రిమింగ్, బ్లరింగ్, ఫిల్టర్స్ వంటి వాటిల్లో మెరుగుపరిచిన వాటిని వీడియో క్రియేటర్స్ వాడుకోవచ్చని యూట్యూబ్ చెప్పింది. ఈ ఫీచర్లను తొలగించడానికి ప్రధాన కారణం, వీటిని తక్కువగా వాడేలా చేసేందుకేనని కంపెనీ వివరించింది. వీటికి స్వస్తి పలికి, కొత్త టూల్స్‌ను అభివృద్ధి చేయడానికి, ఉన్నవాటికి మెరుగుపరడానికి చూస్తున్నామని గూగుగ్ ప్రొడక్ట్ ఫోరమ్ పేజ్ కమ్యూనిటీ మేనేజర్ మారిస్సా చెప్పారు. వీడియో ఎడిటర్ లేదా ఫోటో స్లైడ్‌షో సెక్షన్‌పై ప్రాజెక్టులు ఉన్న యూట్యూబ్ క్రియేటర్లు సెప్టెంబర్ 20 వరకు వీటిపై పైనలైజ్ చేసుకోవాలని, లేనిపక్షంలో వారు ప్రాజెక్టులు కోల్పోతారని చెప్పారు. వీడియో ఎడిటర్ లేదా ఫోటో స్లైడ్షోస్లతో ఇప్పటికే పబ్లిష్ అయిన వీడియోలు మాత్రం దీనికి ప్రభావితం కావు. ఒకవేళ ఆ వీడియోలను వీడియో ఎడిటర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే కష్టం. 720పీ రెజుల్యూషన్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. -
పింఛను ఆపేశారు
మీనానగరం (చాగల్లు), న్యూస్‌లైన్: ఈ నలుగులూ చాగల్లు మండలం మీనానగరంలో నివాసం ఉంటున్నారు. కుటుంబ పెద్ద అయిన పట్టపగలు సోమరాజు పుట్టుకతోనే వికలాంగుడు. అతనికి 65 శాతం వైకల్యం ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. అతడికి నాలుగేళ్ల క్రితం వెంకటలక్ష్మితో వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. వైకల్యం వల్ల ఏ పనీ చేయనిలేని స్థితిలో సోదరుడిపై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సోమరాజుకు వికలాంగుల కోటాలో రూ.500 పింఛను వచ్చేది. కుటుంబ పోషణకు చేయూతగా ఉండేది. రేషన్ కార్డు లేదన్న కారణంగా మూడేళ్ల క్రితం అతనికి పింఛను నిలిపివేశారు. కార్డు మంజూరు చేయూలంటూ రచ్చబండ సభల్లో పలుసార్లు దరఖాస్తు చేశామని, ఇప్పటికీ కార్డు ఇవ్వలేదని సోమరాజు, వెంకటలక్ష్మి దంపతులు వాపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయూలు, అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోరుుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకల్యంతో బాధపడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తన లాంటివారికి ప్రభుత్వ పథకాలు వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సోమరాజు కోరుతున్నారు.