పల్సర్ 135 ఎల్‌ఎస్
సాక్షి, ముంబై: పలర్స్ బైక్ లవర్స్‌కు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో నిరాశను మిగిల్చింది. పల్సర్ 135 ఎల్‌ఎస్ బైక్‌ను ఇండియా మార్కెట్ నుంచి బజాజ్ ఆటో ఉపసంహరించుకుంది. ప్రముఖ డీలర్లు అందించిన సమాచారం ప్రకారం పల్సర్ సిరీస్‌లో అతి చిన్నదైన ఈ బైక్‌ను మార్కెట్‌నుంచి తొలగించింది. ఇటీవల ఈ బైక్‌కు డిమాండ్ పడిపోవడంతోపాటు. అప్‌డేటెడ్ వెర్షన్ లాంచింగ్ కారణంగా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ షాకింగ్ నిర్ణయంపై మార్కెట్ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక‍్తం చేశాయి.
మరోవైపు ఈ వార్తలకు బలాన్నిస్తూ బజాజ్ ఆటో తన అధికారిక వెబ్ సైట్ నుంచి పల్సర్ 135 ఎల్‌ఎస్ ను తొలగించింది. కాగా ఈ ఏడాది జనవరిలో తమ అన్ని ఉత్పత్తులను కాస్మొటిక్ మార్పులు , నూతన రంగుల జోడింపుతో అప్‌డేటెడ్ వెర్షన్‌లో పల్సర్ బైక్‌లను లాంచ్ చేసింది. కానీ, పల్సర్ శ్రేణిలోని అతి చిన్న మోడల్ పల్సర్ 135 ఈ 2018 రేంజ్ నుండి మిస్సయినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిన్న పల్సర్‌ను విదేశీ మార్కెట్ కోసం యథావిధిగా ఉత్పత్తి చేస్తుందట.
బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్
ఇండియన్ మార్కెట్లో 4-వాల్వ్ టెక్నాలజీతో వచ్చిన మొదటి బైకు బజాజ్ పల్సర్ ఎల్ఎస్135. 4-వాల్వ్ టెక్నాలజీ , మెరుగైన మేలేజీ దీని ప్రధాన ఫీచర్లుగా ఉండేవి. కాగా 2017లో అపడేటెడ్ వెర్షన్ పల్సర్ 135 బైక్‌కు కమ్యూటర్ మోటార్ సైకిల్ లుక్ తీసుకొచ్చింది. 135సీసీ కెపాసిటి సింగిల్ సిలిండర్, పెట్రోల్ ఇంజన్ 13బిహెచ్‍పి పవర్. 11ఎన్ఎమ్ టార్క్, 5స్పీడ్ గేర్‌బాక్స్ లాంటి ఫీచర్లు ఇందులో జోడించింది. అయితే బజాజ్ ఆటో ఇటీవల అన్నిమోడళ్ళ బైక్‌లను ధరలను రూ.500నుంచి 2వేల దాకా ధరలు పెంచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment