Skoda Superb Discontinued: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) తన సూపర్బ్ (Superb) కారుని నిలిపివేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇది స్కోడా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో మాయమైపోయింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఈ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్కోడా కంపెనీ ఈ కారుని నిలిపివేయడానికి గల కారణాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో మొదలైన బిఎస్ 6 ఫేజ్ 2 నిబంధనల కారణంగా ఈ సెడాన్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఉన్న కార్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరింత కొత్త డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.
భారతీయ మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి స్కోడా సూపర్బ్ అతి తక్కువ కాలంలోనే అత్యంత విజయవంతమైన మోడల్‌గా గుర్తింపు పొందింది. దాని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్శించాయి. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో మంచి అమ్మకాలతో సాగుతున్న ఈ మోడల్ బోల్డ్ గ్రిల్, సొగసైన హెడ్‌లైట్స్, షార్ప్ బాడీ లైన్స్, సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్ ప్రీమియం ఇంటీరియర్ మెటీరియల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది అత్యాధునిక డ్రైవింగ్ అనుభూతిని కూడా కల్పిస్తుంది. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.
(ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. ఎలా అంటే?)
ఇప్పటికే భారతీయ మార్కెట్లో స్కోడా స్లావియా, కుషాక్ వంటి కొత్త మోడల్స్ విడుదలయ్యాయి. ఇవి మార్కెట్లో ఉత్తమ అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. ఈ కార్లు ఆధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మంచి ఆదరణ పొందగలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్లు కంపెనీ అమ్మకాలను పెంచడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment