skoda superb car
-
స్కోడా కొత్త కారు.. వివరాలు
గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కోడా సూపర్బ్ కారును కంపెనీ సరికొత్త 'స్పోర్ట్‌లైన్' రూపంలో పరిచయం చేసింది. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న కారు కంటే కూడా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ కారు స్పోర్టియర్ డిజైన్ పొందుతుంది.స్కోడా సూపర్బ్ స్పోర్ట్‌లైన్ మోడల్ రేడియేటర్ గ్రిల్ ఫ్రేమ్, విండో ఫ్రేమ్‌లు, వెనుకవైపు స్కోడా బ్యాడ్జింగ్‌తో సహా అన్ని క్రోమ్ ఎలిమెంట్లు బ్లాక్ కలర్ పొందుతుంటాయి. ఇందులో 18 ఇంచెస్ లేదా 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్లు, ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్లైట్లపై స్పోర్ట్‌లైన్ బ్యాడ్జింగ్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.స్కోడా సూపర్బ్ స్పోర్ట్‌లైన్ మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పర్ఫామెన్స్ ఎలా ఉంటుందనేది లాంచ్ తరువాత తెలుస్తుంది. అయితే ఈ కారు దాని మునుపటి మోడల్ మాదిరిగా అదే పర్ఫామెన్స్ అందిస్తుందని భావిస్తున్నాము. ఈ కారు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. -
అధికారిక వెబ్సైట్లో మాయమైన స్కోడా సూపర్బ్.. కారణం ఏంటంటే?
Skoda Superb Discontinued: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) తన సూపర్బ్ (Superb) కారుని నిలిపివేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇది స్కోడా ఇండియా అధికారిక వెబ్సైట్లో మాయమైపోయింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఈ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్కోడా కంపెనీ ఈ కారుని నిలిపివేయడానికి గల కారణాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో మొదలైన బిఎస్ 6 ఫేజ్ 2 నిబంధనల కారణంగా ఈ సెడాన్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఉన్న కార్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరింత కొత్త డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లతో మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. భారతీయ మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి స్కోడా సూపర్బ్ అతి తక్కువ కాలంలోనే అత్యంత విజయవంతమైన మోడల్‌గా గుర్తింపు పొందింది. దాని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్శించాయి. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో మంచి అమ్మకాలతో సాగుతున్న ఈ మోడల్ బోల్డ్ గ్రిల్, సొగసైన హెడ్‌లైట్స్, షార్ప్ బాడీ లైన్స్, సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్ ప్రీమియం ఇంటీరియర్ మెటీరియల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది అత్యాధునిక డ్రైవింగ్ అనుభూతిని కూడా కల్పిస్తుంది. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. ఎలా అంటే?) ఇప్పటికే భారతీయ మార్కెట్లో స్కోడా స్లావియా, కుషాక్ వంటి కొత్త మోడల్స్ విడుదలయ్యాయి. ఇవి మార్కెట్లో ఉత్తమ అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. ఈ కార్లు ఆధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మంచి ఆదరణ పొందగలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్లు కంపెనీ అమ్మకాలను పెంచడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
స్కోడా కార్లపై భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: కారును సొంతం చేసుకోవాలని కలలు కంటున్నవారికి సువర్ణావకాశం. డ్రీమ్ కార్‌ను సొంతం చేసుకునే సమయం ఇది. తొలకరి జల్లుల కంటే ముందే ప్రముఖ కార్ల కంపెనీ స్కోడా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. వివిధ లగ్జరీ మోడళ్ల కార్ల కొనుగోళ్లపై నగదు డిస్కౌంట్, లాయల్టీ బోనస్, క్యాష్‌బ్యాక్ , బై బ్యాక్ లాంటి అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. రాపిడ్, ఆక్టావియా, కొడియాక్ తదితర కార్లపై దాదాపు రూ.1. 75 వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అవకాశం మే 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నగదు లాభాలు, లాయల్టీ బోనస్ ఇతర ప్రయోజనాలు రాపిడ్ ( ఆంబిషన్ ఎంటీ డీజిల్, ఆంబిషన్ ఏటీ పెట్రోల్, స్టైల్ ఎంటీ ప్రెటోలు తప్ప) రూ. 50వేల వరకు డిస్కౌంట్ , దీంతోపాటు రూ .25వే లాయల్టీ బోనస్ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు ఆంబిషన్ ఎంటీ డీజిల్ ఆంబిషన్ ఏటీ, పెట్రోల్, స్టైల్ ఎంటీ ప్రెటోల్ మోడల్స్ పై రూ. 25వేల లాయల్టీ బోనస్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు రాపిడ్ మై 2018 రూ .1 లక్ష వరకు డిస్కౌంట్, దీంతోపాటు 10వేల రూపాయల మెయింటినెన్స్ ప్యాకేజీ కూడా లభ్యం. ఆక్టావియా రూ. 50వేల వరకు డిస్కౌంట్ (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) మరో రూ .50వేల లోయల్టీ బోనస్ సూపర్బ్ మై 2019 రూ .50వేల డిస్కౌంట్ వరకు (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) 3 సంవత్సరాల తర్వాత 57 శాతం బై బ్యాక్ ఆఫర్ సూపర్బ్ మై -2018 కారుపై రూ .1.75 లక్షల డిస్కౌంట్ కోడియాక్ రూ .50వేల డిస్కౌంట్ (ఎంపిక చేసుకున్న క్రెడిట్ కార్డులపై మాత్రమే) రూ .50వేల లోయల్టీ బోనస్. ఈ ఆఫర్లు భారతదేశం అంతటా వర్తిస్తాయి. -
కారు చోరీ కేసులో పోలీస్ అధికారి కుమారుడు అరెస్ట్
హైదరాబాద్ : ఖరీదైన వాహనం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు పోలీస్ అధికారి కుమారుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో నలుగురు అనుమానితుల్నికూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నిందితుడు ఎవరనే కోణంలో సాంకేతికంగా దర్యాప్తు సాగుతున్న డీఎస్పీ కుమారుడు రాహుల్ పై పోలీసులు దృష్టి సారించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.80లో నివసించే ఎన్వీవీ ప్రసాద్ గతేడాది మే 22న జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్‌కు వచ్చారు. తన స్కోడా సూపర్బ్ కారును హోటల్‌కు చెందిన వ్యాలెట్ పార్కింగ్‌లో ఉంచారు. కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన ఆయన కారు చోరీ అయిందని గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు కారు విలువ భారీగా ఉండటంతో దర్యాప్తు నిమిత్తం కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు హోటల్ ప్రధాన ద్వారం, ఇతర ప్రాంతాలతో పాటు పార్కింగ్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించారు. వీరిలో ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో పని చేస్తున్న ఓ డీఎస్పీ కుమారుడు కూడా ఉన్నారు. వాహనం రికవరీ కోసమూ ప్రయత్నిస్తున్నాంఅని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
పోలీసుల అదుపులో డీఎస్పీ కుమారుడు
ఖరీదైన వాహనం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు ఓ డీఎస్పీ కుమారుడితో సహా నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నిందితుడు ఎవరనే కోణంలో సాంకేతికంగా దర్యాప్తు చేస్తూ విచారిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.80లో నివసించే ఎన్వీవీ ప్రసాద్ గతేడాది మే 22న జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్‌కు వచ్చారు. తన స్కోడా సూపర్బ్ కారును హోటల్‌కు చెందిన వ్యాలెట్ పార్కింగ్‌లో ఉంచారు. కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన ఆయన కారు చోరీ అయిందని గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు కారు విలువ భారీగా ఉండటంతో దర్యాప్తు నిమిత్తం కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు హోటల్ ప్రధాన ద్వారం, ఇతర ప్రాంతాలతో పాటు పార్కింగ్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించారు. ప్రాథమికంగా నలుగురిని అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో పని చేస్తున్న ఓ డీఎస్పీ కుమారుడు కూడా ఉన్నారు. ‘ఆ నలుగురిలో అసలు నిందితుడు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నాం. దీనికోసం అనుమానితుల్ని విచారించడంతో పాటు ఫోన్ వ్యవహారాలకు సంబంధించి సాంకేతికంగానూ ముందుకు వెళ్తున్నాం. వాహనం రికవరీ కోసమూ ప్రయత్నిస్తున్నాం’ అని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.