స్కోడా కొత్త కారు.. వివరాలు | Skoda Superb Sportline Revealed And Details | Sakshi
Sakshi News home page

స్కోడా కొత్త కారు.. వివరాలు

Sep 1 2024 9:28 PM | Updated on Sep 1 2024 9:30 PM

Skoda Superb Sportline Revealed And Details

గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కోడా సూపర్బ్ కారును కంపెనీ సరికొత్త 'స్పోర్ట్‌లైన్' రూపంలో పరిచయం చేసింది. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న కారు కంటే కూడా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ కారు స్పోర్టియర్ డిజైన్ పొందుతుంది.

స్కోడా సూపర్బ్ స్పోర్ట్‌లైన్ మోడల్ రేడియేటర్ గ్రిల్ ఫ్రేమ్, విండో ఫ్రేమ్‌లు, వెనుకవైపు స్కోడా బ్యాడ్జింగ్‌తో సహా అన్ని క్రోమ్ ఎలిమెంట్‌లు బ్లాక్‌ కలర్ పొందుతుంటాయి. ఇందులో 18 ఇంచెస్ లేదా 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్లు, ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్‌లపై స్పోర్ట్‌లైన్ బ్యాడ్జింగ్‌ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

స్కోడా సూపర్బ్ స్పోర్ట్‌లైన్ మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పర్ఫామెన్స్ ఎలా ఉంటుందనేది లాంచ్ తరువాత తెలుస్తుంది. అయితే ఈ కారు దాని మునుపటి మోడల్ మాదిరిగా అదే పర్ఫామెన్స్ అందిస్తుందని భావిస్తున్నాము. ఈ కారు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement