రోల్స్ రాయిస్ (Rolls Royce) కంపెనీ.. ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఘోస్ట్ సిరీస్ II' (Ghost Series II)ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్ దాని మునుపటి మోడల్‌లో అందుబాటులో లేని కొత్త ఇంటీరియర్ ఫినిషింగ్‌లు, ఫీచర్లను పొందిందని సంస్థ వెల్లడించింది.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్‌లో.. మూడు వెర్షన్స్ ఉన్నాయి. అవి ఘోస్ట్ సిరీస్ II, ఘోస్ట్ ఎక్స్‌టెండెడ్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II. వీటి ధరలు వరుసగా రూ. 8.95 కోట్లు, 10.19 కోట్లు,10.52 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు కోసం చెన్నై, న్యూఢిల్లీ షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II కారు 6.75 లీటర్, ట్విన్ టర్బోచార్జ్డ్ వీ12 ఇంజిన్‌ను పొందుతుంది, ఇది వరుసగా 600 హార్స్ పవర్, 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా అత్యద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఘోస్ట్ సిరీస్ II మెరుగైన రైడ్ స్టెబిలిటీ కోసం ప్లానార్ సస్పెన్షన్ సిస్టమ్, రోడ్డు పరిస్థితికి అనుగుణంగా సస్పెన్షన్లను అడ్జెస్ట్ చేయడానికి కెమెరాల సహాయంతో ఫ్లాగ్ బేరర్ సిస్టమ్ వంటి టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది. ఇది మెరుగైన ఆడియో సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీడియో స్ట్రీమింగ్ ఫంక్షన్‌లను కూడా పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment