Skoda Car
-
రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!
కరోనా మహమ్మారి వ్యాపించిన తరువాత చాలామంది సొంతగా కారు ఉంటే బాగుంటుందని భావించారు. ఆ తరువాత కొంతమంది కార్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అయితే ఇందులో కొందరు రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేస్తే.. మరికొందరు రూ. 20 లక్షల లోపు ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేయడానికి మక్కువ చూపించారు. మనం ఈ కథనంలో రూ.15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు ఏవి? వాటి వివరాలు ఏమిటనే విషయాలను తెలుసుకుందాం.హోండా సిటీహోండా అంటే ముందుగా గుర్తొచ్చే కారు 'సిటీ'. ఈ కారు ప్రారంభ ధర రూ. 11.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 117 Bhp పవర్, 145 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. హోండా సిటీ 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్తో స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి వాటితో పాటు.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐసోఫిక్స్ యాంకర్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.స్కోడా స్లావియాస్కోడా స్లావియా ప్రారంభ ధర రూ.10.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 8 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్‌తో పాటు.. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ఫోక్స్వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్ కారు కూడా రూ.15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ మోడల్. ఈ కారు ప్రారంభ ధర రూ.10 .89 లక్షలు. ఇది కూడా రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులో 8 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు.. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.హ్యుందాయ్ వెర్నారూ. 11 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభిస్తున్న హ్యుందాయ్ వెర్నా కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. ఈ కారు కూడా క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి.. అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.ఇదీ చదవండి: భారత్‌లోని 5 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!మారుతి సుజుకి సియాజ్2014లో మొదటిసారి దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన మారుతి సుజుకి కంపెనీకి చెందిన 'సియాజ్' ఆ తరువాత కాలంలో అనేక అప్డేట్స్ పొందింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.9.40 లక్షల నుంచి రూ.12.30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. సియాజ్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5 లీటర్ కే15 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
2025లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే (ఫోటోలు)
-
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక.. వ్యాపారవేత్త ఆత్మాహుతి
బెంగళూరు: ఆర్థిక ఇబ్బందులు నిండు ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. ఓ వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు తాళలేక బతికుండగానే ఆత్మాహుతికి పాల్పడ్డాడు.పోలీసుల వివరాల మేరకు.. ప్రదీప్ హోటల్ కన్సల్టెంట్ బిజినెస్ చేస్తున్నారు. అయితే వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ప్రదీప్ బతికుండగానే ఆత్మాహుతి చేసుకోవడంతో విషాదం చోటు చేసుకుంది.బెంగళూరు నగర శివారు ప్రాంతమైన ముద్దీన్పాళ్యకు ప్రదీప్ తన స్కోడా కారులో వచ్చాడు. అనంతరం కారు సీట్లో ఉన్న ప్రదీప్ కారుకు నిప్పంటించాడు. అయితే కారు నుంచి మంటలు రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ప్రదీప్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. అంనతరం బాధితుడి కుటుంబానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. On Saturday afternoon,a 42 yr old businessman Mr Pradeep was charred to death inside his car at Muddinpalya in Bengaluru. Prima Facie suggests a case of death by suicide.Police have registered the case of Unnatural Death.. pic.twitter.com/JOCTeYLBif— Yasir Mushtaq (@path2shah) November 16, 2024 -
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: భారత్‌లో సురక్షితమైన కార్లు (ఫోటోలు)
-
స్కోడా కొత్త కారు 'కైలాక్' వచ్చేసింది: రూ.7.89 లక్షలు మాత్రమే
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా మరో కాంపాక్ట్ ఎస్‌యూవీని 'కైలాక్' (Kylaq) పేరుతో లాంచ్ చేసింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 7.89 లక్షలతో ప్రారంభమవుతుంది. ఈ కారు కోసం 2024 డిసెంబర్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభమవుతుంది.ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఇతర స్కోడా కార్ల కంటే కైలాక్ కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన ఈ ఎస్యూవీ డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, లెథెరెట్ అప్హోల్స్టరీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, సిక్స్-స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు, హెడ్‌రెస్ట్‌లు, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా కైలాక్ కారులో అందుబాటులో ఉన్నాయి. 189 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు బూట్ స్పేస్ 1265 లీటర్ల వరకు ఉంటుంది.స్కోడా కైలాక్ 1.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 114 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ కొత్త కారు మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, మారుతి ఫ్రాంక్స్, బ్రెజ్జా, టయోటా టైసర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
అధికారిక వెబ్సైట్లో మాయమైన స్కోడా సూపర్బ్.. కారణం ఏంటంటే?
Skoda Superb Discontinued: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) తన సూపర్బ్ (Superb) కారుని నిలిపివేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇది స్కోడా ఇండియా అధికారిక వెబ్సైట్లో మాయమైపోయింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఈ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్కోడా కంపెనీ ఈ కారుని నిలిపివేయడానికి గల కారణాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో మొదలైన బిఎస్ 6 ఫేజ్ 2 నిబంధనల కారణంగా ఈ సెడాన్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఉన్న కార్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరింత కొత్త డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లతో మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. భారతీయ మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి స్కోడా సూపర్బ్ అతి తక్కువ కాలంలోనే అత్యంత విజయవంతమైన మోడల్‌గా గుర్తింపు పొందింది. దాని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్శించాయి. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో మంచి అమ్మకాలతో సాగుతున్న ఈ మోడల్ బోల్డ్ గ్రిల్, సొగసైన హెడ్‌లైట్స్, షార్ప్ బాడీ లైన్స్, సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్ ప్రీమియం ఇంటీరియర్ మెటీరియల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది అత్యాధునిక డ్రైవింగ్ అనుభూతిని కూడా కల్పిస్తుంది. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. ఎలా అంటే?) ఇప్పటికే భారతీయ మార్కెట్లో స్కోడా స్లావియా, కుషాక్ వంటి కొత్త మోడల్స్ విడుదలయ్యాయి. ఇవి మార్కెట్లో ఉత్తమ అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. ఈ కార్లు ఆధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మంచి ఆదరణ పొందగలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్లు కంపెనీ అమ్మకాలను పెంచడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
భారత్‌లో విడుదలైన 2023 స్కోడా కొడియాక్ - ధర & వివరాలు
ఇప్పటికే భారతదేశంలో కొత్త బిఎస్6 ఫేస్-2 నిబంధనలు అమలులోకి వచ్చేసాయి. వాహన తయారీ సంస్థలన్నీ కూడా తప్పకుండా ఈ నియమాలను పాటించాలి. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలతో స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో ఓ కొత్త కారుని లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు ధర, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్: బిఎస్6 కొత్త నిబంధనల ప్రకారం, విడుదలైన స్కోడా కారు 'కొడియాక్' 7 సీటర్ SUV. ఈ కొత్త కారు ధర రూ. 37.99 లక్షలు. అంటే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 50,000 ఎక్కువ. అదే సమయంలో ఇందులోని స్పోర్ట్స్ లైన్ వేరియంట్ ధర రూ. 39.39 లక్షలు. ఇది కూడా దాని మునుపటి మోడల్ కంటే రూ. 90,000 ఎక్కువ కావడం గమనార్హం. బుకింగ్స్ విషయానికి వస్తే.. ఈ ఎస్యువి కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించిన కేవలం 24 గంటల్లో 1200 యూనిట్లు బుక్ అయ్యాయి. అయితే కంపెనీ ఈ కొత్త కారుని కేవలం 3000 యూనిట్లకు (ఇండియా) మాత్రమే పరిమితం చేసింది. డెలివరీల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇది భారతదేశానికి సికెడి మార్గం ద్వారా దిగుమతై ఔరంగాబాద్ ప్లాంట్ వద్ద అసెంబుల్ అవుతాయి. డిజైన్ & ఫీచర్స్: 2023 స్కోడా కొడియాక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా అనిపిస్తుంది, కానీ ఇందులో కొన్ని మార్పులు కూడా గమనించవచ్చు. ఈ ఎస్‌యువిలో రియర్ స్పాయిలర్ ఏరో డైనమిక్ పర్ఫామెన్స్ అనుమతించే రీవర్క్డ్ వెంట్స్ కలిగి ఉంది. అంతే కాకుండా ఆటోమాటిక్ డోర్ ఎడ్జ్ ప్రొటక్షన్ కూడా ఇందులో ఉంటుంది. (ఇదీ చదవండి: ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి) ఫీచర్స్ విషయానికి వస్తే, 8.0 ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగి ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇన్-బిల్ట్ నావిగేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, మంచి సౌండ్ సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఏసీ వెంట్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ స్కోడా కొడియాక్ అదే 2 లీటర్ టర్బో పెట్రోల్ కలిగి ఉంటుంది. కావున పనితీరులో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ 190 hp పవర్, 320 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే ఈ కారు కొత్త నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ పొందటం వల్ల మెరుగైన ఇంధన సామర్థ్యం అందిస్తుంది. (ఇదీ చదవండి: వాట్సాప్ ద్వారా రూ. 10 లక్షలు లోన్? ఒక్క హాయ్ మెసేజ్‌తో..) సేఫ్టీ ఫీచర్స్: స్కోడా కంపెనీ తన కొడియాక్ కారులో 9 ఎయిర్ బ్యాగులను అందించింది. ఇందులో బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, మల్టి కొలిజన్ బ్రేకింగ్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. -
భారత్‌లో స్కోడా కుషాక్ కొత్త ఎడిషన్ లాంచ్ - పూర్తి వివరాలు
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. స్లావియా, ఆక్టావియా అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న సంస్థ ఇప్పుడు కుషాక్ న్యూ ఎడిషన్ 'ఒనిక్స్' (Onyx) విడుదల చేసింది. దీని గురించి మరిన్ని ఈ కథనంలో చూసేద్దాం.. ధర: భారతీయ విఫణిలో విడుదలైన కుషాక్ ఒనిక్స్ ఎడిషన్ ధర రూ. 12.39 లక్షలు. ఇది దాని స్టాండర్డ్ బేస్ మోడల్ కంటే రూ. 80,000 ఎక్కువ. ఈ కొత్త వెర్షన్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న కుషాక్ యాక్టివ్, యాంబిషన్ ట్రిమ్‌ల మధ్యలో ఉంటుంది. ఎక్ట్సీరియర్ ఫీచర్స్: ఒనిక్స్ ఎడిషన్ చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. డోర్లపై స్టైలైజ్డ్ గ్రే గ్రాఫిక్స్, B-పిల్లర్‌పై 'ఓనిక్స్' బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఫ్రంట్ బంపర్‌పై ఫాక్స్ డిఫ్యూజర్, ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ సరౌండ్, సైడ్ ప్రొఫైల్‌లో 16 ఇంచెస్ స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్స్: లోపలి భాగంలో 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్, 6 స్పీకర్ ఆడియో సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, హెడ్రెస్ట్లపై ఒనిక్స్ బ్యాడ్జింగ్, బ్లాక్ అండ్ వైట్ ఇంటీరియర్ కలర్ థీమ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఎయిర్ ప్యూరిఫైయర్తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: ఇంజిన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ కుషాక్ మల్టిపుల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందినప్పటికీ ఒనిక్స్ ఎడిషన్ మాత్రం 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ మాత్రమే పొందుతుంది. ఇది 114 బీహెచ్‌పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జతచేయబడుతుంది. సేఫ్టీ ఫీచర్స్: భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన వాహనాల జాబితాలో ఒకటి కుషాక్. కావున ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, త్రీ పాయింట్ పాయింట్ సీట్‌బెల్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX ఎంకరేజ్ వంటివి ఉంటాయి. ప్రత్యర్థులు: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త ఒనిక్స్ ఎడిషన్ మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
కొత్త స్కోడా కారు, హై స్పీడ్‌లో వెళుతూ..
తిరువనంతపురం : మితిమీరిన అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. కేరళలోని తిరువనంతపురంకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడు తన కొత్త స్కోడా కారులో అతి వేగంగా వెళుతుండగా, అదుపు తప్పి ఓ ఆటోను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గత రాత్రి 10.45 గంటలకు చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కారు డోర్లు తెరిచి, అందులోని వారిని బయటకు తీశారు. కాగా కారుకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ మాత్రమే చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-కారు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. -
గంజాయి రవాణా ముఠా అరెస్ట్
118కిలోల గంజాయి, కారు స్వాధీనం సూర్యాపేట : ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న యువకుల ను సూర్యాపేట పోలీ సులు శనివారం స్థానిక అమ్మా గార్డెన్ వద్ద పట్టుకున్నారు. డీఎస్పీ ఎంఏ.రషీద్ నిందితుల వివరాలు వెల్లడించారు. చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు నుంచి గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్‌కు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఖమ్మం నుంచి అనుమానాస్పదంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేశారు. డిక్కీలో గంజాయి బ్యాగులు కనిపించాయి. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కరీంనగర్ జిల్లాలోని ఆత్మకూర్ గ్రామానికి చెందిన ముండ్ర కిరణ్‌కుమార్, కరీంనగర్‌కు చెందిన తొడేటి లోకేష్, మాచర్ల అఖిల్‌గా గుర్తించారు. కిరణ్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బోడుప్పల్లో నివాసముంటున్నాడు. ఇతను గతంలో కార్తీక్ అనే వ్యక్తితో కలిసి గంజాయి వ్యాపారం చేశాడని డీఎస్పీ తెలిపారు. ఒకరితో పొత్తు వద్దనుకుని సొంతంగా వ్యాపారం చేయాలనే నిర్ణయంతో కరీంనగర్ జిల్లాకు చెందిన తొడేటి లోకేశ్, మాచర్ల అఖిల్‌తో కలిసి అనకాపల్లి ప్రాంతానికి చెందిన కిరణ్‌కు పరిచయం ఉన్న అర్జున్‌తో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. కిరణ్ కొంత కాలంగా అనకాపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మల గ్రామానికి చెందిన సచిన్‌కు ఒక ప్యాకెట్ రూ.8 వేలకు అమ్మేవాడని వివరించారు కిరణ్‌కుమార్‌పై హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీసుస్టేషన్లో కేసు కూడా ఉన్నట్టు చెప్పారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 118 కిలోల గంజాయిని తహసీల్దార్ సమక్షంలో పంచనామా చేసినట్లు తెలిపారు. స్కొడాకారును సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజాయి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు.