ఆర్ధిక ఇబ్బందులు తాళలేక.. వ్యాపారవేత్త ఆత్మాహుతి | Businessman Found Charred To Death Inside His Skoda Car In Bengaluru, Watch Shocking Video Inside | Sakshi
Sakshi News home page

ఆర్ధిక ఇబ్బందులు తాళలేక.. వ్యాపారవేత్త ఆత్మాహుతి

Nov 17 2024 11:23 AM | Updated on Nov 17 2024 2:04 PM

Businessman Found Charred To Death Inside His Skoda Car In Bengaluru

బెంగళూరు: ఆర్థిక ఇబ్బందులు నిండు ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. ఓ వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు తాళలేక బతికుండగానే ఆత్మాహుతికి పాల్పడ్డాడు.

పోలీసుల వివరాల మేరకు.. ప్రదీప్ హోటల్ కన్సల్టెంట్ బిజినెస్‌ చేస్తున్నారు. అయితే వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ప్రదీప్‌ బతికుండగానే ఆత్మాహుతి చేసుకోవడంతో విషాదం చోటు చేసుకుంది.

బెంగళూరు నగర శివారు ప్రాంతమైన ముద్దీన్‌పాళ్యకు ప్రదీప్‌ తన స్కోడా కారులో వచ్చాడు. అనంతరం కారు సీట్లో ఉన్న ప్రదీప్‌ కారుకు నిప్పంటించాడు. అయితే కారు నుంచి మంటలు రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ప్రదీప్‌ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. అంనతరం బాధితుడి కుటుంబానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement