
సాక్షి, బెంగళూరు: కుటుంబ గొడవలతో నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు ఉళ్లాల ఎంవీ లేఔట్‌లో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన మహేశ్వర(25)కు మూడు నెలల క్రితం కవన అనే యువతితో వివాహమైంది.
ఐదు రోజుల క్రితం మహాశ్వర తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై జ్ఞానభారతి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా కవన తరచూ భర్తతో గొడవపడేదని, ఆమె వేధింపులు తాళలేక మహేశ్వర ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
చదవండి: (విజయవాడలో ఉద్యోగాల వల)