newly married
-
పోలీసులకు సెల్ఫీ వీడియో పంపి నవ దంపతుల ఆత్మహత్య
-
సోదరుడికి ప్రేమతో.. కంగనా కాస్ట్లీ గిఫ్ట్ అదిరిందిగా! (ఫోటోలు)
-
చదువు మాన్పించి పెళ్లి చేశారని.. నవ వధువు ఆత్మహత్య
భద్రాద్రి: చదువు మాన్పించి పెళ్లి చేశారనే మనస్తాపంతో నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన విషాదఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మంగయ్యబంజర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మంగయ్యబంజర్ గ్రామానికి చెందిన భూక్యా దేవకి(23) ఈ ఏడాది కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులకు వెళ్తానని పట్టుబట్టినా.. తల్లి ఆరోగ్యం బాగుండడం లేదనే సాకుతో కుటుంబసభ్యులు వివాహానికి ఒప్పించారు. ఇదే మండలంలోని దుబ్బతండాకు చెందిన గుగులోత్ బాలరాజుతో మార్చి 28న దేవకికి వివాహం జరిపించారు. కాగా, 16 రోజుల పండుగ నిమిత్తం నూతన వధూవరులను ఈనెల 12న మంగయ్యబంజర్ తీసుకొచ్చారు. 13వ తేదీ అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో దేవకి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను మొదట జూలూరుపాడు ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెంకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. తల్లి భూక్యా పద్మ ఫిర్యాదు మేరకు చండ్రుగొండ ఎస్సై మాచినేని రవి కేసు నమోదు చేశారు. -
భార్య కళ్ల ముందే దారుణం.. నవ వరుడు..
బెంగళూరు: ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో భార్య కళ్ల ముందే భర్త మృతి చెందిన ఘటన బేరికె పోలీస్‌స్టేన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు... హోసూరు సమీపంలోని వెంకటేశపురం గ్రామానికి చెందిన కార్మికుడు అంజినప్ప (25)కు గతనెల 5న సూళగిరి సమీపంలోని త్యాగరసనపల్లి గ్రామానికి చెందిన వెన్నెల (20)తో వివాహం జరిగింది. ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో భార్యను తీసుకొని త్యాగరసనపల్లి గ్రామానికి వెళ్తుండగా బేరికె సూళగిరి రోడ్డులోని ఏ.శెట్టిపల్లి వద్ద ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అంజినప్ప ఘటన స్థలంలోనే మృతి చెందాడు. గాయపడిన వెన్నెలను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేరికె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (పట్టుబడ్డ దొంగను స్టేషన్‌కి తరలిస్తుండగా..హఠాత్తుగా పోలీసుపై కత్తితో..) -
భార్య వేధింపులు తట్టుకోలేక.. నవ వరుడు ఆత్మహత్య!
సాక్షి, బెంగళూరు: కుటుంబ గొడవలతో నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు ఉళ్లాల ఎంవీ లేఔట్లో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన మహేశ్వర(25)కు మూడు నెలల క్రితం కవన అనే యువతితో వివాహమైంది. ఐదు రోజుల క్రితం మహాశ్వర తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై జ్ఞానభారతి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా కవన తరచూ భర్తతో గొడవపడేదని, ఆమె వేధింపులు తాళలేక మహేశ్వర ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చదవండి: (విజయవాడలో ఉద్యోగాల వల) -
పెళ్లయిన రెండు నెలలకే నవ దంపతులు మృతి..
ప్రకాశం: కోటి ఆశలతో ఏడు అడుగులు, వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన జంట వారి ఆశలు తీరకుండానే రోడ్డు ప్రమాదం కబళించింది. బాపట్ల జిల్లా జే పంగులూరు మండల పరిధిలోని రామకూరు గ్రామానికి చెందిన నవ దంపతులు మిన్నికంటి పవన్‌కుమార్ (30), మిన్నికంటి కళ్యాణి (25) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అందిన సమాచారం ప్రకారం రామకూరు గ్రామానికి చెందిన మిన్నికంటి సిద్దయ్య, పద్మావతికి కుమారుడు పవన్ కుమార్‌తో పాటు ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఆరేళ్ల క్రితమే వివాహం చేశారు. ఇంజినీరింగ్ చేసిన పవన్ కుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వల్ల ఇంటి వద్దే ఉండి పనిచేస్తున్నాడు. గత ఆగస్టు నెలలో పవన్ కుమార్‌కి నరసరావుపేట దగ్గరలోని వడ్లమూడి గ్రామానికి చెందిన కళ్యాణితో వివాహమైంది. వీరి పెళ్లిని తల్లిదండ్రులు ఎంతో వైభవంగా చేసి మురిసిపోయారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో దంపతులు ఇద్దరూ టూవీలర్‌పై బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఉన్న హోటల్లో పుల్కా తిని, అనంతరం టీ స్టాల్లో టీ తాగి తిరిగి టూవీలర్ పై రామకూర వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్నారు. వెనక నుంచి వచ్చిన ప్రైవేటు ట్రావెల్ బస్సు టూవీలర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, భార్య కళ్యాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. సెంటర్‌కు వెళ్లి టిఫిన్ చేసి వస్తామని చెప్పి వెళ్లిన కుమారుడు, కోడలు తిరిగి రాని లోకాలకు వెళ్లారని తెలిసే సరికి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దంపతుల మరణ వార్త వినగానే గ్రామం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. -
వరుడు నచ్చకపోయినా వివాహం.. పెళ్లయిన పదిరోజులకే..
తిరువొత్తియూరు (చెన్నై): వరుడు నచ్చకపోవడంతో వివాహమైన పది రోజులకు ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సేలం జిల్లా సంగ గిరి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మే రకు.. సేలం జిల్లా సంగగిరి సమీపంలోని దేవయూరు నల్లకినరు గ్రామానికి చెందిన పళనిస్వామి కుమారుడు జీవానందం (27) మొబైల్ ఫోన్ సర్వీస్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఇతనికి ఈరోడ్ జిల్లా కాడప్పనూర్ పంచాయతీ గుదిరైకాల్మేడుకు చెందిన కుప్పుస్వామి కుమా ర్తె విమలాదేవి (20)తో ఈ నెల 5వ తేదీన వివాహం జరిగింది. ఈ క్రమంలో భర్త ఇంట్లో ఉంటున్న విమలాదేవి బుధవారం రాత్రి హఠా త్తుగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవ పరీక్ష కోసం ఎడప్పాడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివాహమైన పది రోజులకే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై పోలీసులు జరిపిన విచారణలో వరుడు నచ్చకపోయినా తల్లిదండ్రులు నిర్బంధంగా విమలాదేవికి వివాహం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చదవండి: (ప్రేమకు నిరాకరించిందన్న కక్షతో నవ వధువు దారుణ హత్య) -
కాళ్ల పారాణి ఆరకముందే.. వరుడు దుర్మరణం, వధువుకు తీవ్ర గాయాలు
సాక్షి, యాదాద్రి: కాళ్ల పారాణి ఆరకముందే వరుడు దుర్మరణం చెందగా వధువుకు తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూర్ (ఎస్) గ్రామానికి చెందిన ముల్కలపెల్లి వీరభద్రం (26)కు పెన్‌పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన పేర్ల ప్రణీతతో ఈనెల 21న వివాహం జరిగింది. ఈ దంపతులు హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వివాహం అనంతరం విధుల్లో చేరేందుకు సోమవారం బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న బోర్డును ఢీ కొట్టి బైకు అదుపు తప్పడంతో కిందపడ్డారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరభద్రం మృతి చెందాడు. ప్రణీత చికిత్స పొందుతోంది. వీరభద్రం ఒక్కగానొక్క కొడుకు కావడం, పెళ్లైన 9రోజుల్లోనే మృతిచెందడంతో, ఆ తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆసుపత్రిలో వీరభద్రం చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సమాచారం అందిందని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. చదవండి: (పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసి..) -
కొత్త కాపురంలో విషాదం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
బెంగళూరు: కొత్త దంపతులు సినిమా చూసి ద్విచక్ర వాహనంలో వస్తుండగా వెనుక నుంచి వేగంగా లారీ ఢీకొనడంతో భార్య ఘటన స్థలంలోనే మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నగరంలోని బాణసవాడి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్దరాత్రి చోటుచేసుంది. బాణసవాడికి చెందిన శ్వేత (23) ఆనంద్ (28) దంపతులకు ఇటీవల వివాహం జరిగింది. కొత్త దంపతులు శనివారం రాత్రి సినిమా చూసి ఆనందంగా ఇంటికి బయలుదేరారు. కల్యాణనగర జంక్షన్ వద్ద లారీ స్కూటర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఘటన స్థలంలోనే శ్వేత మృతి చెందగా ఆనంద్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (నగల వ్యాపారికి హనీ ట్రాప్.. వద్దన్నా హోటల్‌కు.. యువతి ఎంట్రీ..) -
తాళికట్టి రోజు గడవక ముందే.. నవ్వును దూరం చేసి దుఃఖాన్ని మిగిల్చి
ఆ పెళ్లిని మృత్యువు వెక్కిరించింది. కలకాలం కలిసి ఉంటామని బాసలు చేసుకున్న కొత్త జంటను కర్కశంగా విడదీసింది. పసుపు కుంకుమలను రక్తంతో తుడిచేసింది. తాళి కట్టి ఒక్కరోజైనా గడవక ముందే వరుడి ప్రాణాలను మింగేసింది. పెళ్లి ఆనందంలో ఉన్న రెండు కుటుంబాలకు నవ్వును దూరం చేసి దుఖాన్ని మిగిల్చింది. శుక్రవారం రాత్రి సింహాచలంలో వివాహం చేసుకున్న జమ్మాన పవన్‌కుమార్ (20) శనివారం మధ్యాహ్నానికి అరిణాం అక్కివలస వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎచ్చెర్ల క్యాంపస్/ఎల్ఎన్ పేట: అరిణాం అక్కి వలస వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్ఎన్ పేట మండలం పెద్దకొల్లివలస గ్రామానికి చెందిన జమ్మా న పవన్‌కుమార్ మృతి చెందాడు. అతడి మేన మామ బలగ సోమేశ్వరరావు గాయపడ్డారు. పవన్ కుమార్ విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి శుక్రవారం రాత్రి సింహాచలంలో ఇదే మండలం శ్యామలాపురం ఆర్ఆర్ కాలనీకి చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం చేసుకున్న వీరు స్వగ్రామంలో వారం రోజులు ఉందామని సింహాచలం నుంచి శనివారం బయల్దేరారు. చదవండి: (పెళ్లయిన ఐదు రోజులకే.. మామ చేతిలో అల్లుడి దారుణ హత్య) పెళ్లి జనమంతా బస్సులో రాగా.. పవన్ మాత్రం తన మేనమామతో కలిసి బైక్‌పై బయల్దేరాడు. ఎచ్చెర్ల మండలం అరిణాం–అక్కివలస ప్రాంతానికి వచ్చే సరికి వీరి బండిని వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొంది. దీంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సోమేశ్వరరావుకు గా యాలయ్యాయి. వెనుక వస్తున్న మరో లారీ డ్రై వర్ 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరించారు. ఎ చ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. రెండు గ్రామాల్లో విషాదం పవన్ మృతి చెందాడన్న వార్త తెలిసి అతడి స్వ గ్రామం పెద్దకొల్లివలస పునరావస కాలనీలో ను, వధువు ఊరు శ్యామలాపురం ఆర్ఆర్ కాలనీలోను విషాదం అలముకుంది. ఒక్క రోజులో నే ఎంత ఘోరం జరిగిందని చర్చించుకున్నారు. -
నాలుగు నెలల క్రితం పెళ్లి.. అర్థరాత్రి మామిడి తోటలో..
క్రిష్ణగిరి(బెంగళూరు): సూళగిరి సమీపంలో పెళ్లి జరిగిన నాలుగు నెలలకే యువకుడు హత్యకు గురయ్యాడు. సూళగిరి తాలూకా ఏణుసోణ వద్ద బి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సుందరేష్ కొడుకు సంతోష్ (23). నల్లరాళ్లపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి గత నాలుగు నెలల క్రితం పెళ్లి జరిగింది. శనివారం రాత్రి కొత్తపల్లి సమీపంలోని ఓ మామిడి తోటలో ఎవరో ఇతన్ని కత్తితో పొడిచి చంపారు. హోసూరు డీఎస్పీ అరవింద్‌కుమార్, సూళగిరి పోలీసులు చేరుకొని పరిశీలించారు. శవాన్ని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని హంతకుల కోసం గాలింపు చేపట్టారు. మరో ఘటనలో.. ఎస్ఐ స్కాంలో గోకాక్ ముఠా బనశంకరి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎస్ఐ పరీక్షల కుంభకోణంలో కలబురిగి వారే కాకుండా బెళగావి ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నట్లు అదనపు ఏడీజీపీ అలోక్‌కుమార్ తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. బెళగావి జిల్లా గోకాక్ నగరంలో ఇలాంటి గ్యాంగ్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విజయపుర, బాగల్‌కోటే జిల్లాల్లోని కొందరూ భాగస్వాములైనట్లు తెలిసిందన్నారు. వీరి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారని చెప్పారు. గతంలో నియామకాల్లో గోకాక్ నుంచి ఏడుమంది ఎంపికయ్యారని, అప్పుడే అనుమానం వచ్చినప్పటకీ దర్యాప్తు జరగలేదన్నారు. ఇతర ఉద్యోగ నియామకాల్లో కూడా అక్రమాలు జరిగినట్లు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం.. రాత్రి ఇంటికి వచ్చి.. -
ఇక అత్తారింటి కుటుంబంలో పేరు నమోదు సులువే
సాక్షి, అమరావతి: కొత్తగా పెళ్లయ్యి అత్తారింటికి వెళ్లిన వారికి.. ఆ కుటుంబంలో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకునేందుకు గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ పేరు నమోదు సమయంలో సంబంధిత వ్యక్తి వేలిముద్రలు కూడా నమోదు చేసుకుంటారు. సచివాలయాల్లో నమోదయ్యే ఈ వివరాలను ఎంపీడీవో లేదంటే మున్సిపల్ కమిషనర్ ఆమోదం తెలిపిన తర్వాత ఆయా వ్యక్తులు సంబంధిత కుటుంబంలో సభ్యులుగా నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. వ లంటీర్లు ఆయా కుటుంబసభ్యులుగా పేరు నమోదు చేసిన అనంతరం రేషన్‌కార్డులో కొత్తగా పేరు నమోదు చేయించుకోవడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందడానికి వీలు కలుగుతుందని అధికారులు వెల్లడించారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ, వలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా, పట్టణాల్లో 70–100 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా వర్గీకరించి, ఒక్కొక్క క్లస్టర్‌కు ఒక్కొక్కరి చొప్పున వలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో కలిపి 1.65 కోట్ల కుటుంబాల్లో 4.67 కోట్ల మంది తమ పేర్లు నమోదుచేసుకోగా, ఆయా కుటుంబాల ను 2.65 లక్షల వలంటీరు క్లస్టర్లుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఈ వివరాల ప్రకారమే అర్హులను గుర్తిస్తోంది. -
దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే..
సాక్షి, లావేరు: కాళ్ల పారాణి ఆరలేదు. పెళ్లి సరదాలు తీరనే లేదు. ఇంతలోనే ఆ నవవధువు జీవితం తల్లకిందులైపోయింది. కలకాలం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. ఈ విషాదకర సంఘటన లావేరు మండలంలోని మురపాక గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పీబీనగర్ కాలనీలో గల వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఆదివారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన మురపాక గ్రామానికి చెందిన గొర్లె అప్పలనాయుడు(27) శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువ న మృతి చెందాడు. ఆయనకు భార్య అశ్విని, తల్లిదండ్రులు లక్ష్ము నాయుడు, సీతమ్మ, ఒక సోదరుడు ఉన్నారు. లావేరు పోలీసులు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. చదవండి: (ఆ పతంగి దారం అతని గొంతును కోసేసింది.. అదృష్టవశాత్తు భార్యకు..) పెళ్లయిన 19 రోజులకు.. లావేరు మండలంలోని మెట్టవలసకు చెందిన అశ్వినితో అప్పలనాయుడుకు ఈ నెల 8న వివాహం జరిగింది. అప్పలనాయుడు కంచిలి మండలంలోని సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శని, ఆదివారాలు సెల వు కావడంతో ఇంటికి వచ్చిన అప్పలనాయుడు సొంత పనిపై ఆదివారం రాత్రి ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలేం గ్రామానికి వెళ్లి తిరిగి మురపాక వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అనుకోని ఈ విషాదంతో భార్య అశ్విని, తల్లిదండ్రులు లక్ష్ము నాయుడు, సీతమ్మలు గుండెలవిసేలా రోదించారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు తేనెల మంగయ్యనాయుడు, బాలి శ్రీనివాసనాయుడు, పెయ్యల లక్ష్మణరావు, తేనెల సురేష్‌కుమార్, లండ కిరణ్‌కుమార్, జల్లేపల్లి జనార్ధన్ తదితరులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. చదవండి: (భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి.. మద్యం మత్తులో) -
ప్రేమించిపెళ్ళి చేసుకున్నా.. ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు
సాక్షి, బెంగళూరు(తుమకూరు): ప్రేమించిన యువతిని పెళ్ళి చేసుకున్న యువకుని సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. తన తల్లిదండ్రులు వద్దని హెచ్చరించడంతో మనోవేదనకు గురై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుణిగల్ పట్టణంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. కుణిగల్ తాలూకాలోని బొమ్మడిగెరెవాసి బీఎం హనుమంత (21) ఏడాది నుంచి మరో కులానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల ఇద్దరూ గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇది తెలిసి హనుమంత తల్లిదండ్రులు ఆ పెళ్లిని మరిచిపోవాలని మందలించారు. తల్లిదండ్రులను ఎదిరించలేక, ప్రేయసిని వదులుకోలేక జీవితంపై విరక్తి చెందాడు. ఈ నెల 17న కుణిగల్‌లోని జీకే బీఎంఎస్ కాలేజీ మైదానంలో డీజిల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. చుట్టు పక్కలున్నవారు వెంటనే అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం తరువాత బెంగళూరు విక్టోరియా ఆస్పత్రకి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (భోజనం చేయడానికి బైక్‌పై వెళ్తుండగా కంటైనర్..) -
న్యాయ పోరాటం! .. గ్రామంలో 144 సెక్షన్..
బరంపురం (ఒడిశా): యువతి తపస్విని దాస్, వైద్యుడు సుమిత్ సాహుల వివాహబంధం రోజురోజుకూ జటిలమవుతోంది. వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఒకే ఇంట్లో కొంతకాలం కలసిమెలసి జీవించారు. ఉన్నట్టుండి తపస్వినిని ఉన్నచోటనే ఉంచి సుమిత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్త రాక కోసం కొన్నాళ్ల పాటు వేచి చూసినా ఆమెకు నిరాశ తప్పలేదు. దీంతో మోసం చేశాడని భావించిన యువతి, బరంపురంలోని బ్రాహ్మనగర్ రెండో లైన్‌లోని భర్త ఇంటిని చేరుకుని ధర్నాకి దిగింది. తన భర్త తనకు కావాలని అభ్యర్థిస్తూ పెళ్లి బట్టలతో నిరసన చేపట్టింది. ఈ క్రమంలో ఆమెకి స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో బాధితురాలు కోర్టుని ఆశ్రయించి, తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇటీవల విచారణ చేపట్టిన బరంపురం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టు భార్యతో కలిసి ఉండాలని సుమిత్‌ని ఆదేశించింది. వారి వైవాహిక జీవితంలో వేరొకరు జోక్యం చేసుకోరాదని, భార్యాభర్తలిద్దరూ వేరేచోట ఒకే ఇంట్లో కలిసి ఉండాలని తీర్పు వెల్లడించింది. ఈ మేరకు సుమిత్ భార్యతో కలిసి ఉండేందుకు అంగీకరించాడు. చదవండి: (ప్రేమ పేరుతో తపస్విని వంచించిన డాక్టర్.. ఆపై..) గ్రామంలో 144 సెక్షన్.. మళ్లీ 6 రోజుల క్రితం భార్యని వదిలి సుమిత్ వెళ్లిపోవడంతో యువతి తన అత్తవారింటి ఎదుట మళ్లీ నిరసనకు దిగింది. తీవ్రమైన చలిలో వంటా వార్పు అక్కడే చేసుకుని, ఉంటున్న ఆమె పడుతున్న కష్టం చూసి, స్థానికులు చలించిపోయారు. మంగళవారం ఉదయం ఒక్కసారిగా సుమిత్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఇంటి ప్రధాన గేటు బద్దలు కొట్టి ఆ ఇంట్లో ఉన్న వారితో ఘర్షణకు దిగారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఆమె వెంట ఉంటామని హెచ్చరించారు. ఇరువర్గాల వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను సద్దుమణిగించారు. ప్రస్తుతం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో 144 సెక్షన్ విధించారు. -
ప్రేమ పేరుతో తపస్విని వంచించిన డాక్టర్.. ఆపై..
బరంపురం (ఒడిశా): కోర్టు తీర్పుతో తపస్విని దాస్, సుమిత్ సాహు జంట కలిసింది. వైద్యుడైన సుమిత్ ప్రేమ పేరుతో తపస్వినిని వంచించి, ఆపై కోర్టు సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి జరిగిన 7 నెలలకే భార్యని విడిచిపెట్టి సుమిత్ పరారయ్యాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం స్థానిక బ్రహ్మనగర్ రెండో లైన్‌లోని తన అత్త వారింటి ఎదుట ధర్నా చేపట్టింది. చదవండి: (వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..) బరంపురం ఎస్డీజేఎం కోర్టు నుంచి భార్య తపసిని దాస్‌తో కలిసి కారులో వెళ్తున్న సుమిత్ ఈ క్రమంలో బాధితురాలికి స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు అండగా నిలిచి, కోర్టులో కేసు వేయించారు. వీరి కేసు విచారణను శుక్రవారం చేపట్టిన బరంపురం ఎస్డీజేఎం(సబ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్) కోర్టు తపస్వినికి అనుకూలంగా తీర్పునిస్తూ భార్యతోనే భర్త కలిసి ఉండాలని తీర్పునిచ్చింది. అస్కా పట్టణంలో వేరే ఇంటిని అద్దెకు తీసుకుని నూతన దంపతులు జీవించాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలో వారిని ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నేతలు ఎవ్వరూ కలవరాదని కోర్టు కోరింది. చదవండి: (చున్నీతో ప్రియుడిని నడుముకు కట్టుకుని.. కాలువలో దూకి..) -
పెళ్లైన మరునాడే.. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో బుధవారం ఏడుగురు మృత్యువాతపడ్డారు. కీసర ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా.. సాగర్ హైవే సర్వీస్ రోడ్డులో ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని బోర్వెల్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శేరిలింగంపల్లి నేతాజీనగర్‌కు చెందిన నవదంపతులు బెంగళూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. పెళ్లైన మరునాడే.. సాక్షి, చందానగర్: నగరానికి చెందిన నవదంపతులు పెళ్లి అయిన మరునాడే రోడ్డు ప్రమాదానికి గురై విగతజీవులుగా మారారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్‌లో నివసించే పార్శి మురళీకృష్ణ, అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాసులు(38) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి చెన్నైకి చెందిన కనిమొళి(33)తో తిరుపతిలో ఆదివారం వివాహమైంది. సోమవారంరాత్రి 8.30 గంటల సమయంలో బెంగళూరు నుంచి ఐ 10 వాహనంలో నవదంపతులతోపాటు ఇద్దరు బంధువులు చెన్నైకి ప్రయాణమయ్యారు. చదవండి: క్రిప్టో కరెన్సీ’ చేతికి రాలేదని.. ‘స్వాతీ.. పిల్లలు జాగ్రత్త.. అర్థం చేసుకో’ బెంగళూరు నుంచి 120 కి.మీ. దూరంలో రాత్రి 12 గంటల సమయంలో కారును నడుపుతున్న శ్రీనివాసులు ఆగివున్న లారీని ఢీకొట్టడంతోఅతను అక్కడికక్కడే మృతి చెందాడు. కోమాలోకి వెళ్లిన కనిమొళి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వారితో ప్రయాణిస్తున్న నవవధువు సోదరి, శ్రీనివాసులు కోడలు తీవ్ర గాయాలపాలయ్యా రు. శ్రీనివాసులు మృతదేహాన్ని బుధవారం ఉద యం నేతాజీనగర్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆగి ఉన్న లారీని ఢీకొని... సాక్షి, కీసర: పేట్ బషీరాబాద్‌లోని శ్రీని అవెన్యూ గేట్–3లో నివసించే సుమంత్‌రెడ్డి (20) తన సోదరుడిని ఖమ్మంలోని నీట్ కోచింగ్ సెంటర్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు అల్వాల్‌కు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి(21), డ్రైవర్ శంకర్‌రెడ్డి(39)తో కలసి కారులో బుధవారం తెల్లవారుఝామున బయలుదేరారు. తిరుగుప్రయాణంలో ఉదయం 11.30 గంటల సమయంలో కీసర ఓఆర్ఆర్ ప్లాజాకు రెండు కిలోమీటర్ల దూరంలో కారు బ్రేక్‌డౌన్ అయింది. డ్రైవింగ్ చేస్తున్న సుమంత్‌రెడ్డి కారును అకస్మాత్తుగా ఎడమ వైపునకు మళ్లించగా, అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో సుమంత్‌రెడ్డి, శంకర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, పవన్‌కుమార్‌రెడ్డి (21)కి తీవ్రగాయాలయ్యాయి. కీసర పోలీసులు వచ్చి పవన్‌కుమార్‌రెడ్డిని ఈసీఐఎల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో పది నిమిషాలలోపు శామీర్‌పేట జంక్షన్ వద్ద రోడ్డు దిగి అల్వాల్‌కు చేరుకునే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. చదవండి: బస్ డ్రైవర్ నిర్లక్ష్యం..యువతి మృతి సాగర్ రహదారి సర్వీస్ రోడ్డుపై ప్రమాదానికి కారణమైన బోర్వెల్ వాహనం బోర్వెల్ లారీ ఢీకొని.. హస్తినాపురం: బోర్వెల్ వాహనం ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన విశాల్(21), నగరంలోని హబ్సిగూడకు చెందిన రోహిత్‌రెడ్డి (21), గౌతంరెడ్డిలు బీఎన్‌రెడ్డి నగర్లో నివసిస్తూ ఇబ్రహీంపట్నం సమీపంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. కాలేజీ వదిలిన వెంటనే వీరు స్కూటీపై నగరానికి బయలుదేరారు. సాగర్ రహదారి సమీపంలోని సర్వీస్ రోడ్డుపై సాగర్ కాంప్లెక్స్ వద్ద స్కూటీని, వెనుక నుంచి వేగంగా వచ్చిన బోర్వెల్ లారీ ఢీకొట్టడంతో విశాల్, రోహిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గౌతంరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. -
16 రోజుల కిందట వివాహం.. నవ వధువు చైతన్య ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: కాళ్ల పారాణి ఇంకా ఆరనేలేదు... ఈలోగా వరకట్న పిశాచి కాటువేసింది... నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనతో మండలం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. సంఘటనపై సౌత్ జోన్ డీఎస్పీ వై జెస్సీప్రశాంతి మాట్లాడుతూ రేపల్లె మండలం ఈదుపల్లి గ్రామానికి చెందిన పిట్టు సాంబశివారెడ్డి కుమార్తె చైతన్య(19)కు గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెం గ్రామానికి చెందిన కోటి సాంబిరెడ్డి, రామానుజమ్మల కుమారుడు గోపిరెడ్డితో 16 రోజుల కిందట వివాహం జరిగింది. గోపిరెడ్డి హైదరాబాదులో ఒక సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుండగా ప్రస్తుతం ఇంటివద్ద నుంచే(హోంటువర్క్) విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లయిన తరువాత నిద్రలు ముగించుకునే లోపు వధువు బంధువుల్లో ఒకరు మృత్యువాతకు గురయ్యారు. శాస్త్ర ప్రకారం శూతకం కావటంతో 16 రోజుల పండుగ నిమిత్తం రెండు రోజుల కిందట చైతన్య తల్లి ఆమెను దాసరిపాలెంలో వదిలి సోమవారం మధ్యాహ్నం వరకూ ఉండి రేపల్లె వెళ్లింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సమయంలో ఇంట్లోని వారంతా టీవీ చూస్తుండగా బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన చైతన్య ఎంతకీ రాలేదు. అనుమానంతో వెళ్లి చూడగా బాత్రూంలో కిటికీకి ఉరివేసుకుని కనిపించింది. వెంటనే చైతన్యను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెళ్లయిన నాటినుంచి భర్త, అత్తమామలు వేధించేవారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. నవ వధువు 16 రోజుల పండగకు ముందే ఆత్మహత్య చేసుకుందన్న సంఘటన తెలిసి మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందనేది పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. చదవండి: (తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య) -
దారుణం: నవవధువుపై భర్త,మరుదుల సామూహిక లైంగిక దాడి
లక్నో: కొత్తగా పెళ్లై ఎన్నో ఆశలతో అత్తవారింటికి వెళ్లిన ఓ యువతిపై ఆమె భర్త, ఇద్దరు మరుదులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బుదాన్‌లో జరిగింది. కొత్వాలి సహస్వన్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి జరీఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మాన్‌పూర్‌లో నివాసముంటున్న వ్యక్తితో ఈనెల 22న వివాహమైంది. పెళ్లి తతంగమంతా పూర్తయ్యాక అత్తింట్లోకి అడుగుపెట్టిన ఆమెకు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె భర్త, ఇద్దరు మరుదులు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తనను శారీరకంగా చిత్రహింసలకు గురి చేయడమే గాక చివరకు ఆమెను చంపాలనే ప్రయత్నం కూడా చేశారు. తన కూతురుపై అత్తింట్లో జరుగుతున్న ఆరాచకాల గురించి సమాచారం అందుకున్న బాధితురాలి తండ్రి పోలీసులతో వెళ్లి ఆమెను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి భర్తతో సహా నేరానికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. చదవండి: నన్ను చంపుతున్నారు.. రక్షించండంటూ ఆర్తనాదాలు -
పెళ్లైన 10 రోజులకే నవ వరుడికి పదేళ్ల జైలు శిక్ష
తిరువొత్తియూరు: ఏడేళ్ల బాలికను లైంగికంగా వేధించిన నవ వరుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. తిరుపత్తూరు జిల్లా నాట్రాంపల్లి సమీపంలో ఉన్న పుదుపేట ప్రాంతం పక్రి మఠం గ్రామానికి చెందిన యువకుడు విఘ్నేష్ (25). ఇతను 2018వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీ ఏడేళ్ల బాలికను లైంగికంగా వేధించాడు. ఈ సంఘటనపై కేసు విచారణ వేలూరు సత్‌వాచ్చారి శాంతిభద్రతలు కోర్టు ప్రాంగణంలో వున్న ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఈ కేసుకు విచారణ గురువారం రాగా న్యాయమూర్తి సెల్వం కేసును పరిశీలించి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను విఘ్నేష్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ముద్దాయి విఘ్నేష్‌కు పది రోజుల ముందే వివాహం కావడం గమనార్హం. చదవండి: చిన్నారిపై వృద్ధ జంట వికృత చేష్టలు.. ఊయలలో ఆడించి -
ఘనంగా పెళ్లి: మూడో రోజే మృత్యు ఒడిలోకి..
సాక్షి, దౌల్తాబాద్: (సిద్దిపేట)పెళ్లైన మూడురోజులకే కొత్త పెళ్లికొడుకు మృత్యుఒడికి చేరుకున్నాడు. చెరువులో పడిన తన అన్న కుమారుడిని రక్షించే యత్నంలో బురదలో ఇరుక్కొని కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన దౌల్తాబాద్ మండలంలోని అల్లాపూర్‌లో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మౌలాన్‌సాబ్, జహీరాబీ దంపతులు తమ ఐదుగురు కుమారులతో కలిసి హైదరాబాద్‌లో కూరగాయల వ్యాపారం చేస్తూ అక్కడే ఉంటున్నారు. చిన్న కుమారుడు యాసిన్ (23) వివాహం గురువారం నగరంలో ఘనంగా జరిపించారు. ఈ క్రమంలో స్వగ్రామంలో గ్రామస్తులకు, బంధువులకు ఆదివారం విందు ఏర్పాటు చేయాలని భావించి అందుకు సంబంధించిన ఏర్పా ట్లు చేశారు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కలిసి శనివారం మధ్యాహ్నం సమీపంలో ఉన్న చెరువుకు వెళ్లి సరదాగా గడపసాగారు. అంతలోనే యాసిన్ అన్న కుమారుడు సమీర్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. దీంతో వెంటనే యాసిన్ అతడిని కాపాడే యత్నం చేశాడు. ఈక్రమంలో చెరువులోని గుంతలో ఇరుక్కుపోయాడు. గట్టున ఉన్న కొందరు సమీర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికి గ్రామస్తులు అక్కడికి చేరుకొని యాసిన్‌ను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న కొత్తపెళ్లి కొడుకును చికిత్స నిమిత్తం బాలంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అనంతరం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడు సమీర్ క్షేమంగా ఉన్నాడు. మృతుడి తండ్రి మొగులాన్‌సాబ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చిన్నారిపై మృగాడి పైశాచికం.. తండ్రి ఆత్మహత్య రాసలీలల కేసు: వీడియో రిలీజ్ చేసిన బాధిత యువతి -
నవ వరుడి మృతి.. పది రోజుల క్రితమే పెళ్లి..
సాక్షి, కొండపాక(గజ్వేల్): ట్రాక్టర్ అదుపు తప్పి బావిలో పడిన యువకుడు మృతి చెందిన సంఘటన కొండపాక మండలం లకుడారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దేవి ధర్మయ్య – యాదవ్వల రెండో కుమారుడు దేవి విక్రం (27) దినచర్యలో భాగంగా గురువారం సొంత ట్రాక్టరును గ్రామ శివారులో ఓ రైతు పొలం దున్నుడానికి వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణంలో అడవి పందులు అడ్డంగా రావడంతో తప్పించబోయిన క్రమంలో ట్రాక్టరు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయిందని తెలిపారు. దీంతో డ్రైవింగ్ చేస్తున్న దేవివిక్రం బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పది రోజుల క్రితమే పెళ్లి.. లకుడారం గ్రామానికి చెందిన దేవి విక్రం తండ్రి ధర్మయ్య గత రెండేళ్ల కిందట మృతి చెండదంటో తల్లి యాదవ్వకు సేవ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విక్రంకు పది రోజుల కిందట మర్కుక్ మండలంలోని ధామర కుంటకు చెందిన భవితతో వివాహం జరిగింది. దీంతో గ్రామంలో విశాధచ్చాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ కందూరి కనుకవ్వ–ఐలయ్య కోరారు. ఈ విషయమై మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు కుకునూరుపల్లి పోలీసులు తెలిపారు. -
నవ వరుడు అనుమానస్పద మృతి
-
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
ఇరగవరం : పెళ్లైన నాలుగునెలలకే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇరగవరం శివారు గొల్లగుంటపాలెంలో సోమవారం జరిగింది. ఇరగవరం ఎస్ఐ వి.ఎస్.వి.భద్రరావు కథనం ప్రకారం.. గొల్లగుంట పాలేనికి చెందిన గాయత్రి (20)కి అదే ఊరుకు చెందిన వేండ్ర చంద్రరావుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లైంది. చంద్రరావు పెళ్లి ముందు నాలుగేళ్లు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆషాఢం మాసం కావడంతో గాయత్రి పుట్టింటికి వెళ్లింది. పెళ్లైన తర్వాత గత నెలలో చంద్రరావు మళ్లీ గల్ఫ్ వెళ్లడంతో మనస్థాపానికి గురైన గాయత్రి ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. పొలం పనులకు వెళ్లి వచ్చిన గాయత్రి తల్లి నాగమణి కూతురు అపస్మారక స్థితిలో ఉండడంతో ఇరుగుపొరుగువారి సాయంతో తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై తహసీల్దార్ జి.మమ్మీ, పెనుగొండ సీఐ సి.హెచ్.రామారావు విచారణ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లయిన నెల రోజులకే వరుడి మృతి
కేకేనగర్(చెన్నై): తిరుచ్చి మురుక్కుపట్టిపాళెం సమీపంలో రైలు పట్టాలపై శుక్రవారం గుర్తు తెలియని శవం కనపడింది. తిరుచ్చి రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి పంపారు. మృతుడి ప్యాంట్‌జేబులో ఉన్న ఓటర్ఐడీ ఆధారంగావిచారణ జరిపిన పోలీసులకు అతడు కన్యాకుమారి జిల్లా విలవన్‌కోడు తాలూకాకు చెందిన జగన్‌బాబు (31) అని తెలిసింది. పోలీసుల విచారణలో అతడు కొన్ని సంవత్సరాలుగా సింగపూరులో పనిచేసి గత జనవరిలో సొంత ఊరికి వచ్చినట్లు అదే ఊరికి చెందిన అజిత (25)ను జూన్‌లో 8వ తేదీ వివాహం చేసుకున్నట్టు తెలిసింది. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న అజితను చూడడానికి జగన్‌బాబు చెన్నైకు రైల్లో బయలుదేరినట్లు తెలిసింది. శుక్రవారం బోగీలో రద్దీ ఎక్కువగా ఉండడం వలన ఫుట్‌బోర్డుపై నిలబడి ఉన్న జగన్‌బాబు మురుక్కుపట్టి వద్ద కాలు జారి కింద పడి మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకుని అతని భార్య, బంధువులు తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి వచ్చి జగన్‌బాబు మృతదేహంపై పడి భోరున విలపించారు. వివాహం జరిగిన నెల రోజులకే జగన్‌బాబు మృతి చెందిన సంఘటన అతని కుటుంబంలో శోకాన్ని మిగిల్చింది.