
లక్నో: కొత్తగా పెళ్లై ఎన్నో ఆశలతో అత్తవారింటికి వెళ్లిన ఓ యువతిపై ఆమె భర్త, ఇద్దరు మరుదులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బుదాన్‌లో జరిగింది. కొత్వాలి సహస్వన్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి జరీఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మాన్‌పూర్‌లో నివాసముంటున్న వ్యక్తితో ఈనెల 22న వివాహమైంది.
పెళ్లి తతంగమంతా పూర్తయ్యాక అత్తింట్లోకి అడుగుపెట్టిన ఆమెకు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె భర్త, ఇద్దరు మరుదులు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తనను శారీరకంగా చిత్రహింసలకు గురి చేయడమే గాక చివరకు ఆమెను చంపాలనే ప్రయత‍్నం కూడా చేశారు. తన కూతురుపై అత్తింట్లో జరుగుతున్న ఆరాచకాల గురించి సమాచారం అందుకున్న బాధితురాలి తండ్రి పోలీసులతో వెళ్లి ఆమెను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి భర్తతో సహా నేరానికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment