
మహిళల భద్రతకై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మహిళల పై జరుగుతున్న అకృత్యాలకు మాత్రం అడ్డుకట్టవేయలేక పోతుంది. ఎక్కడో ఒక చోట ఏదోఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. అత్యంత దారుణమైన పైశాచిక దాడులు జరుగతూనే ఉన్నాయి. ఆ అఘాయిత్యాలు వినేందుకు జుగుప్సకరంగానూ, భయాన్ని రేకెత్తించేలా జరుగుతున్నాయి. అచ్చం అలాంటి భయానకమైన ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని 18 ఏళ్ల మహిళ జూన్ 6న కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఐతే సదరు మహిళ చెరుకు తోటలో శవమై కనిపించింది. దీంతో పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
ఆమెను హత్య చేయడానికి ముందు అత్యాచారం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులు ఆమెను హత్య చేసి గుర్తుపట్టకుండా ఉండేందుకు యాసిడ్ పోసి, ముక్కలుగా చేసి చెరుకుతోటలో పడేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడ్నిసంతోష్ వర్మగా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
(చదవండి: తండ్రి కళ్లేదుటే దారుణం... పక్షవాతంతో చెప్పలేని దీనస్థితి)
Comments
Please login to add a commentAdd a comment