brother in laws
-
దైవ దర్శనానికి వెళ్తూ.. బావ, బావమరుదులు మృత్యు ఒడికి
జగిత్యాల: దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది మృత్యు ఒడికి చేరారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమడ్ల మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన బొల్లకొండ ఆకాశ్(22), ఏంపేడు గ్రామానికి చెందిన మాడగోడి శ్రావణ్(30) బావ, బావమరిది. ఈ ఇద్దరు, ఆకాశ్ స్నేహితుడు రాకేశ్ శుక్రవారం అర్ధరాత్రి దాటాక కారులో వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి బయలుదేరారు. శంకరపట్నం మండలంలోని తాడికల్ శివారులోకి రాగానే ఎదురుగా కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆకాశ్, శ్రావణ్ అక్కడికక్కడే మృతిచెందారు. రాకేశ్‌కు తీవ్ర గాయాలవడంతో స్థానికులు 108 వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. హుజూరాబాద్ రూరల్ సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై లక్ష్మారెడ్డి ఘటనాస్థలికి చేరుకొని, పరిశీలించారు. ఆకాశ్ తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి: ఏకంగా మూడు పెళ్లిల్లు! చివరికి అత్తమామలను దారుణంగా.. -
బావను చంపిన బామ్మర్దులు
సాక్షి, ఆస్పరి(కర్నూలు): బావను సొంత బామ్మర్దులు హత్య చేసిన ఘటన వెంగళాయిదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉప్పర సుంకన్న (39) అదే గ్రామానికి చెందిన నారాయణమ్మను 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ పనులకు వెళ్తూ జీవనం చేసేవారు. కుటుంబ సమస్యలతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో వారం క్రితం నారాయణమ్మ పుట్టినింటికి వెళ్లింది. ఈ నెల 7న భార్యను పిలవడానికి సుంకన్న అత్తింటికి వెళ్లగా.. బామ్మర్దులు రామాంజనేయులు, రమేష్ దాడి చేశారు. ఆదోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత ఈనెల 10వ తేదీ బుధవారం రాత్రి సుంకన్న మళ్లీ భార్యను కాపురానికి పంపమని అత్తింటికి వెళ్లాడు. బామ్మర్దులు ఇద్దరూ.. సుంకన్నను మాట్లాడాలని పిలుచుకొని సుంకులమ్మ ఆలయం వెనుక ఉన్న మేకల బండ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి బండి గూటంతో కొడుతూ, కొడవలితో నరకడంతో సుంకన్న అక్కడక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడు వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు సీఐ ఈశ్వరయ్య గురువారం తెలిపారు. -
దారుణం: నవవధువుపై భర్త,మరుదుల సామూహిక లైంగిక దాడి
లక్నో: కొత్తగా పెళ్లై ఎన్నో ఆశలతో అత్తవారింటికి వెళ్లిన ఓ యువతిపై ఆమె భర్త, ఇద్దరు మరుదులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బుదాన్‌లో జరిగింది. కొత్వాలి సహస్వన్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి జరీఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మాన్‌పూర్‌లో నివాసముంటున్న వ్యక్తితో ఈనెల 22న వివాహమైంది. పెళ్లి తతంగమంతా పూర్తయ్యాక అత్తింట్లోకి అడుగుపెట్టిన ఆమెకు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె భర్త, ఇద్దరు మరుదులు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తనను శారీరకంగా చిత్రహింసలకు గురి చేయడమే గాక చివరకు ఆమెను చంపాలనే ప్రయత్నం కూడా చేశారు. తన కూతురుపై అత్తింట్లో జరుగుతున్న ఆరాచకాల గురించి సమాచారం అందుకున్న బాధితురాలి తండ్రి పోలీసులతో వెళ్లి ఆమెను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి భర్తతో సహా నేరానికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. చదవండి: నన్ను చంపుతున్నారు.. రక్షించండంటూ ఆర్తనాదాలు -
అక్కను కొడుతున్నాడని.. బావను చంపేశారు!
శ్రీకాకుళం, పోలాకి: అక్కను నిత్యం వేధిస్తున్నాడని, అక్రమ సంబంధాలు అంటగట్టి పది మందిలో కుటుంబ పరువుతీస్తున్నాడని బావపై ఇద్దరు బావమరుదులు కలిసి అంతమొందించిన ఘటన పోలాకి మండలం ఉర్జాంలో చోటుచేసుకుంది. ఈ నెల 12న జరిగిన ఈ వివాదానికి సంబంధించి మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జంక్షన్‌కు చెందిన దండాశి అప్పలనాయుడుకు, ఉర్జాం గ్రామానికి చెందిన జయలక్ష్మితో 2004లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. అప్పలనాయుడు తొలుత ఫొటోస్టూడియోలో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. తర్వాత వ్యసనాలకు బానిసగా మారి అనారోగ్యానికి గురయ్యాడు. ఏ పనికీ వెళ్లకుండా కొంతకాలంగా ఖాళీగానే ఉంటున్నాడు. ఇంటికి ఆదాయం లేదని, ఏదైనా పనికి వెళ్లాలని నిత్యం దంపతులిద్దరి మధ్య వివాదాలు జరిగేవి. మరోవైపు అప్పలనాయుడు భార్యపై అనుమానంతో తరచూ కొట్టేవాడు. ఈ విషయాన్ని జయలక్ష్మి కన్నవారైన ఉర్జాంలోని తన సోదరులు జలుమూరు అప్పన్న, రాంబాబులకు చెప్పి బాధపడేది. ఈ నెల 12న బావను ఉర్జాంలోని తమ ఇంటికి పిలిపించి బావ మరుదులిద్దరూ మందలించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇంతలోనే విశాఖపట్నం కేజీహెచ్‌లో అప్పలనాయుడు మృతిచెందాడని కుటుంబసభ్యులకు సమాచారం తెలియటంతో అప్పలనాయుడు తమ్ముడు లక్ష్మణరావుకు అనుమానం వచ్చింది. తన అన్నను బావమరుదులే కొట్టిచంపేశారని పోలాకి పోలీసులకు గురువారం ఫిర్యాదుచేశారు. అదే సమయంలో మృతుడి భార్య జయలక్ష్మి మాత్రం తన భర్త మామూలుగానే కిందపడితే దెబ్బలు తగిలాయని పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై నరసన్నపేట సీఐ మురళి దర్యాప్తు చేస్తున్నారు. 12న బావను మందలించే సమయంలో బావమరుదులు దాడిలో అప్పలనాయుడుకు తలపై బలంగా దెబ్బతగిలిందని, వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ తర్వాత పరిస్థితి విషమించటంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ ఈ నెల 19న అప్పలనాయుడు మృతిచెందినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి సీఐ మురళి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా హత్య కేసు నమోదుచేశామని, కేసు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే అప్పలనాయుడు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించడం లేదు. -
పెళ్లాం వద్దు.. మరదలే ముద్దు
సాక్షి, తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ ప్రబుద్ధుడికి భార్యను వదిలేసి.. మరదల్ని పెళ్లి చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది. దీంతో భార్యను హింసించడం మొదలుపెట్టాడు. చివరకు ఆమెను చంపేందుకు కూడా వెనుకాడలేదు. చివరకు విసిగిపోయిన ఆ భార్య.. అతనికి దేహశుద్ధి చేసి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. నులకపేటకు చెందిన షేక్ మరియమ్మకు ఐదేళ్ల కిందట ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన సైదాబాబుతో వివాహమైంది. భర్త చిత్రహింసలు పెడుతుంటంతో మరియమ్మ రెండేళ్ల కిందట నులకపేటలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. దీంతో ఇకపై బుద్ధిగా ఉంటానంటూ సైదా ఏడాది కిందట అత్తారింటికి వచ్చాడు. అప్పట్నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో అతని కన్ను మైనర్ అయిన మరదలిపై పడింది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి మరదలికి ఇచ్చాడు. స్పృహ కోల్పోగానే ఆమెను వివస్త్రను చేసి వీడియోలు, ఫొటోలు తీశాడు. అప్పట్నుంచి మరియమ్మను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ బాలికతో తనకు వివాహం చేయకపోతే వీడియోలు యూట్యూబ్‌లో పెడతానంటూ హెచ్చరించాడు. భయపడిన మరియమ్మ.. ఆ బాలికకు పెళ్లి చేసేందుకు గుట్టుచప్పుడు కాకుండా సంబంధాలు చూడటం ప్రారంభించింది. ఈ విషయం తెలిసుకున్న సైదా.. మరియమ్మను శనివారం గన్నవరం ఎయిర్‌పోర్టు వద్దకు తీసుకువెళ్లాడు. అటుగా కారు వస్తుండటం చూసి ఒక్కసారిగా ఆమెను రోడ్డు మీదకు నెట్టాడు. కారు ఢీకొనడంతో మరియమ్మకు చిన్నపాటి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు సైదాకు దేహశుద్ధి చేసి ఆమెను అక్కడ్నుంచి పంపించేశారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సైదా బెదిరింపులకు పాల్పడడంతో విసిగివేసారిన మరియమ్మ భర్తకు దేహశుద్ధి చేసి.. తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బావాబామ్మర్దుల మధ్య భూ వివాదం.. తుపాకీ కాల్పులు
తోటపల్లిగూడూరు(శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా): వరసకు బావామరుదులు.. చిన్నపాటి భూవివాదంలో ఘర్షణ పడ్డారు. అది కాల్పుల దాకా వెళ్లింది. పోలీసులు, బాధితుని కథనం మేరకు.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆములూరుకు చెందిన వేముల చలపతి, అదే గ్రామానికి చెందిన రంగినేని కిరణ్‌ల మధ్య కోడూరు పంచాయతీ పీడీకండ్రిగలోని నాలుగెకరాల భూమికి సంబంధించి వివాదం కోర్టులో నడుస్తోంది. చలపతి భార్య నీలమ్మకు స్వయానా సోదరుని కుమారుడే కిరణ్. వేముల చలపతి కుమారుడు రూప్‌కుమార్ బుధవారం పీడీ కండ్రిగలోని తమ పొలానికి వచ్చాడు. అదే సమయంలో ఆ పొలాల మీదుగా రంగినేని కిరణ్ రాగా రూప్‌కుమార్ అడ్డగించాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో రూప్‌కుమార్ తన వద్దనున్న రివాల్వర్‌ను బయటకు తీసి కిరణ్‌ను బెదిరించాడు. కిరణ్ వెనక్కు తగ్గకపోవడంతో రూప్‌కుమార్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ కిరణ్ ఎడమ మోచేతిలో దిగగా రెండో బుల్లెట్ గురితప్పింది. పక్క పొలంలో ఉన్న కిరణ్ బంధువు వెంకటనారాయణ అక్కడికి రావటంతో రూప్‌కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. బుల్లెట్ చేతికి తగలడంతో కిరణ్‌కు ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.