భార్య గొంతు కోసిన ఉన్మాది భర్త | suicide attempted by newly married couple | Sakshi
Sakshi News home page

భార్య గొంతు కోసిన ఉన్మాది భర్త

Published Sun, Jul 3 2016 3:33 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

suicide attempted by newly married couple

-అనంతరం తాను గొంతుకోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ భర్త
-రక్తపుమడుగులో విలవిల్లాడుతూ ప్రణాలు విడిచిన భార్య
- చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భర్త
- మూడు గంటల పాటు తల్లి మృతదేహం వద్ద విలవిల్లాడుతూ కాలం వెళ్లదీసిన చిన్నారులు
కీసర:
జీవింతాతం అండగా ఉండాల్సిన భర్తే కాలయముడిగా మారి  కట్టుకున్న భార్యనే కత్తితో గొంతుకోసి హత్యచేయడంతోపాటు, తానుకుడా గొంతుకోసుకొని ఆత్మహాత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా , కీసర మండలం ,కుందన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. హృదయవిదారకమైన ఈసంఘటన వివరాల్లోకివెళ్లితే. వ రంగల్ జిల్లా కొడకండ్ల మండలం రామావరం గ్రామానికి చెందిన రజిని(26)ని అదే మండలం పోచారం గ్రామానికి చెందిన మద్దుల మహేష్(31) కు ఇచ్చి గత తొమ్మిదేళ్ల క్రితం ఇచ్చి వివాహంచేశారు.

 

కాగా వీరికి ఏడేళ్ల కుమారుడు సోమేష్(7), నాలుగేళ్ల కూతురు హిందు ఉన్నారు. కాగా గత రెండేళ్ల క్రితం బ్రతుకు దెరువు నిమిత్తం మహేష్, రజిని దంపతులు కీసర మండలం కుందన్‌పల్లి గ్రామానికి వలవ వచ్చి ఓ అద్దే ఇంట్టో నివాసం ఉంటున్నారు. మహేష్ స్థానికంగా ఉన్న గౌడకులస్థుల వద్ద పనికుదుర్చుకొని ప్రతినిత్యం తాటిచెట్లు ఎక్కి కల్లు తీసే పనిచే సేవాడు. కాగా గత కొన్ని రోజులుగా మహేష్, రజిని దంపతుల మధ్య కుటుంబకలహాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలోనే శనివారం రాత్రి మహేష్ భార్య రజినితో గొడవపడ్డాడు. కాగా గొడవ రాత్రి 1 గంట అయిన సద్దుమణగకపోవడంతో రజిని తన పిల్లలను తీసుకొని బయటకు ఇంటినుండి తాను బయటకు వెళ్తానని తెలపడంతో తీవ్ర ఆగ్రాహానికి గురైన మహేష్ తాటిచెట్లనుండి కల్లును గీసేందుకు ఉపయోుగించే పదునైన కత్తితో రజిని గొంతును ఒక్కసారిగా కోశాడు.

 

దీంతో రజిని తీవ్రంగా రక్తమొడుగుతూ అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం మహేష్‌కుడా అదే కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల గొడవతో నిద్రలోంచి లేచిన ఏడేళ్ల కుమారుడు సోమేష్ తండ్రి పదునైనా కత్తితో తల్లి రజిని గొంతు కోయడం కళ్లారా చూసి తీవ్రభయాందోళనకు గురయ్యాడు. ఇంతలో తండ్రికుడా గొంతుకోసుకోవడంతో ఇంకా తీవ్ర భయాంధోళనకు గురైన సోమేష్ అమ్మ ఫోన్ తీసుకొని నగరంలోని నాగోల్‌బండ్లగూడ వద్ద నివాసం ఉంటున్న అమ్మమ్మసోమలక్ష్మీకి ఫోన్ చేశారు. అర్థరాత్రి కావడం చేత 6, 7 సార్లు ఫోన్ చేసిన తరువాత అమ్మమ్మ ఫోన్ ఎత్తడంతో ఫోన్‌లో అమ్మమ్మ అమ్మను ... నాన్న కత్తితో గొంతుకోసి చంపేశాడు.

 

నాన్న కుడా గొంతు కోసుకున్నాడు. నాకు చాల భయంగా ఉందమ్మమ్మ తొందరగారా... అంటూ విలపిస్తూ తెలిపాడు. కాగా విషయం తెలుసుకున్న అమ్మమ్మ, మేనమామలు నగరం నుండి కుందన్‌పల్లి గ్రామానికి చెరుకునే వరకు సుమారు తెల్లవారుజాము 3 గంటల కూతుర సమయం అయింది. అప్పటి వర కు సుమారు మూడు గంటల పాటు సోమేష్ , నాలుగేళ్ల కూతురు హిందు లు ఇరువురు రక్తపుమండుగుల్లో పడివున్న తల్లిదండ్రుల వద్దనే కూర్చున్నారు. అమ్మమ్మ .. మేనమామలు వచ్చి తలుపు కొట్టిన తరువాతనే చిన్నారి సోమేష్ తలుపులు తెరవడంతో జరిగిన ఘోరం గ్రామస్తులకు సైతం తెలిసింది.

 

విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అనిల్‌కుమార్, ఎంపీటీసీసభ్యుడు మంచాల పెంటయ్యలు సమాచారాన్ని కీసర పోలీసులకు తెలిపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కొన ఊపిరితో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న మహేష్‌ను 108 వాహనంలో చికిత్సనిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా మహేష్ పరిస్థితి కుడా విషమంగా ఉందన్నారు. ఈమేరకు సంఘటనాస్థలంలోనే మృతిచెందిన రజిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధికి తరలించి ఈమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సి.ఐ గురువారెడ్డి తెలిపారు.


మిన్నంటిన రోధనలు:
కాగా కత్తితో అతి కిరాతంగా భార్యగొంతుకోసి హాత్యచేయడంతోపాటు తాను కుడా కత్తితో గొంతుకోసుకొని ఆత్మహాత్యయత్నానికి పాల్పడ్డాన్న విషయంతెలుసుకున్న మతురాళి బందువులు సంఘటనాస్థలానికి చేరుకొని జరిగిన ఘోరాన్ని చూసి విలపిస్తున్న తీరు, కన్నతల్లి మతిచెందడంతో అనాధలైన ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలు రోధనలను చూసి అక్కడి వచ్చిన గ్రామస్తులను సైతం కంటతడిపెట్టించింది. ఒకే గదిలోభయకరంగా రక్తపు మండుగులో మృతిచెందిన తల్లి రజిని, కొన ఊపిరి తో కోట్టుమిట్టాడుతున్న తండ్రి మహేష్‌ల వద్ద సుమారు మూడు గంటల పాటు చిన్నారులు ఉండటాన్ని తలచుకొని గ్రామస్తులు సైతం ఆవేదన వ్యక్తంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement