
ప్రతీకాత్మక చిత్రం
క్రిష్ణగిరి(బెంగళూరు): సూళగిరి సమీపంలో పెళ్లి జరిగిన నాలుగు నెలలకే యువకుడు హత్యకు గురయ్యాడు. సూళగిరి తాలూకా ఏణుసోణ వద్ద బి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సుందరేష్ కొడుకు సంతోష్ (23). నల్లరాళ్లపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి గత నాలుగు నెలల క్రితం పెళ్లి జరిగింది. శనివారం రాత్రి కొత్తపల్లి సమీపంలోని ఓ మామిడి తోటలో ఎవరో ఇతన్ని కత్తితో పొడిచి చంపారు. హోసూరు డీఎస్పీ అరవింద్‌కుమార్, సూళగిరి పోలీసులు చేరుకొని పరిశీలించారు. శవాన్ని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని హంతకుల కోసం గాలింపు చేపట్టారు.
మరో ఘటనలో..
ఎస్‌ఐ స్కాంలో గోకాక్ ముఠా
బనశంకరి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎస్‌ఐ పరీక్షల కుంభకోణంలో కలబురిగి వారే కాకుండా బెళగావి ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నట్లు అదనపు ఏడీజీపీ అలోక్‌కుమార్ తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. బెళగావి జిల్లా గోకాక్ నగరంలో ఇలాంటి గ్యాంగ్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విజయపుర, బాగల్‌కోటే జిల్లాల్లోని కొందరూ భాగస్వాములైనట్లు తెలిసిందన్నారు. వీరి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారని చెప్పారు. గతంలో నియామకాల్లో గోకాక్ నుంచి ఏడుమంది ఎంపికయ్యారని, అప్పుడే అనుమానం వచ్చినప్పటకీ దర్యాప్తు జరగలేదన్నారు. ఇతర ఉద్యోగ నియామకాల్లో కూడా అక్రమాలు జరిగినట్లు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి: భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం.. రాత్రి ఇంటికి వచ్చి..
Comments
Please login to add a commentAdd a comment