
ప్రతీకాత్మకచిత్రం
బెంగళూరు: ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో భార్య కళ్ల ముందే భర్త మృతి చెందిన ఘటన బేరికె పోలీస్‌స్టేన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు... హోసూరు సమీపంలోని వెంకటేశపురం గ్రామానికి చెందిన కార్మికుడు అంజినప్ప (25)కు గతనెల 5న సూళగిరి సమీపంలోని త్యాగరసనపల్లి గ్రామానికి చెందిన వెన్నెల (20)తో వివాహం జరిగింది.
ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో భార్యను తీసుకొని త్యాగరసనపల్లి గ్రామానికి వెళ్తుండగా బేరికె సూళగిరి రోడ్డులోని ఏ.శెట్టిపల్లి వద్ద ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అంజినప్ప ఘటన స్థలంలోనే మృతి చెందాడు. గాయపడిన వెన్నెలను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేరికె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: (పట్టుబడ్డ దొంగను స్టేషన్‌కి తరలిస్తుండగా..హఠాత్తుగా పోలీసుపై కత్తితో..)
Comments
Please login to add a commentAdd a comment