బరంపురం (ఒడిశా): కోర్టు తీర్పుతో తపస్విని దాస్, సుమిత్ సాహు జంట కలిసింది. వైద్యుడైన సుమిత్ ప్రేమ పేరుతో తపస్వినిని వంచించి, ఆపై కోర్టు సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి జరిగిన 7 నెలలకే భార్యని విడిచిపెట్టి సుమిత్ పరారయ్యాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం స్థానిక బ్రహ్మనగర్ రెండో లైన్‌లోని తన అత్త వారింటి ఎదుట ధర్నా చేపట్టింది.
చదవండి: (వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..)
బరంపురం ఎస్‌డీజేఎం కోర్టు నుంచి భార్య తపసిని దాస్‌తో కలిసి కారులో వెళ్తున్న సుమిత్
ఈ క్రమంలో బాధితురాలికి స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు అండగా నిలిచి, కోర్టులో కేసు వేయించారు. వీరి కేసు విచారణను శుక్రవారం చేపట్టిన బరంపురం ఎస్‌డీజేఎం(సబ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్) కోర్టు తపస్వినికి అనుకూలంగా తీర్పునిస్తూ భార్యతోనే భర్త కలిసి ఉండాలని తీర్పునిచ్చింది. అస్కా పట్టణంలో వేరే ఇంటిని అద్దెకు తీసుకుని నూతన దంపతులు జీవించాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలో వారిని ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నేతలు ఎవ్వరూ కలవరాదని కోర్టు కోరింది.
చదవండి: (చున్నీతో ప్రియుడిని నడుముకు కట్టుకుని.. కాలువలో దూకి..)
Comments
Please login to add a commentAdd a comment