Court ruling
-
సమస్య తొమ్మిది నెలలేనా?
ఇటీవలే ఓ వివాహిత 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు లేటైనా అబార్షన్ అవసరమవుతుంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడం, లైంగికదాడి, గృహహింస, జైలు వంటివి ఎన్నో దీనికి కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్‌ను నేరంగా పరిగణించడాన్ని నిలిపి వేయాలి. గర్భం వయసుపై పరిమితులు తొలగించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకునే విషయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం 2021లో ఒక తీర్పునిచ్చింది. పిండం వయసు గరిష్ఠంగా 24 వారా లున్నా పీడిత మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు వీలు కల్పించింది. వైకల్యమున్నప్పుడు మాత్రమే మెడికల్ బోర్డు సిఫారసుతో అబార్ష¯Œ కు అనుమతించే పాత చట్టం నుంచి వీరికి విముక్తిని ప్రసాదించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల ముందు అబార్షన్‌కు అనుమతించే విషయంపై అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ మార్పులు వచ్చాయి. అంతకుముందు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) యాక్ట్ (1971) ప్రకారం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్ఎంపీలు) గర్భం ధరించిన 20 వారాల వరకూ అబార్షన్ చేసేందుకు అనుమతులుండేవి. 2021 నాటి సవరణ తీర్పు తరువాత కూడా చాలామంది మహిళలు వైద్యులు అబార్షన్‌కు నిరాకరించిన సందర్భాల్లో... కోర్టు నిర్దేశించిన సమయం దాటినా అఅబార్షన్కు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలే ఓ వివాహిత మహిళ 26 వారాల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విచారణ తరువాత కోర్టు అందుకు నిరాకరించడం తెలిసిన విషయాలే. పాలిచ్చే సమయంలో కొంతకాలం రుతుస్రావం జరగదు. అయితే ఈ మహిళ పాలిచ్చే సమ యంలోనే గర్భం ధరించింది. ఇది సహజం అనుకోవడంతో గర్భం ధరించినట్లు గుర్తించలేకపోయింది. ఏడాది క్రితమే బిడ్డకు జన్మనిచ్చి పోస్ట్‌పార్టమ్ సైకోసిస్‌కు చికిత్స తీసుకుంటున్న ఈ మహిళ మరోసారి గర్భం ధరించడం గమనార్హం. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం అంతకుముందు పిటీషన్‌ను అనుమతిస్తూ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను ప్రక్రియ చేపట్టాలని నిర్దేశించింది. 2021 సవరణలకు ముందు అబార్షన్ కోసం కోర్టుకు ఎక్కిన కేసుల్లో అత్యధికం మానభంగం లేదా పిండాల వైకల్యం ఉన్నవారికి సంబంధించినవి. పైగా చాలావాటిల్లో గర్భం వయసు 20 వారాల కంటే ఎక్కువే. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు కొంచెం లేటైనా అబార్షన్ అనేది అవసరమవుతుంది. తొలినాళ్లలోనే అబార్షన్ చేసేందుకు వైద్యపరంగా అవకాశాల్లేకపోవడం వీటిల్లో ఒకటి. లైంగిక దాడి, గృహహింస, జైలు వంటివి ఇతర కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులు (భాగస్వామి సాయం లేక పోవడం, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగం వంటివి), శారీరక, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. మెనోపాజ్ లేదా లాక్టేషనల్ అమెనోరియా (పాలిచ్చే సమయంలో రుతుస్రావం నిలిచిపోవడం) కూడా అబార్షన్‌కు తగిన కారణాలని చెప్పాలి. అబార్షన్లకు సంబంధించి 2021 నాటి సుప్రీంకోర్టు సవరణ గర్భం తాలూకూ వయో పరిమితిని పెంచింది మినహా ఇతర మార్పులేవీ చేయలేదు. దీనివల్ల ప్రయోజనం కొద్దిమందికే. తల్లి ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి వస్తే ఓ ఆర్ఎంపీ ఏ దశలోనైనా గర్భాన్ని తొలగించేందుకు అవకాశం ఉండగా చాలామంది కేసుల భయంతో ఆ పని చేసేందుకు జంకు తున్నారు. ఫలితంగా మహిళలు గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. కోర్టులకు వెళ్లడం ఇష్టం లేని వారైతే గర్భాన్ని కొనసాగిస్తున్నారు లేదా ముతక పద్ధతులతో అబార్షన్ కు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. పలుమార్లు వైద్యపరీక్షల అవసరం ఉండటం కూడా ప్రతిబంధకంగా మారుతోంది. ఒకవేళ న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా న్యాయవాదుల ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుర్కోవడం కూడా ఒక సమస్య. గత వారం సుప్రీంకోర్టులోనూ ఇలాంటి స్థితి ఎదురు కావడం చెప్పుకోవాల్సిన అంశం. అబార్షన్ కోరిన మహిళ మానసిక పరిస్థితి బాగాలేదనీ, కౌన్సెలింగ్ తీసు కోవాలనీ పలుమార్లు న్యాయవాదులు సూచించారు. ఇంతటి కష్టా నికి, ఇబ్బందికి ఓర్చినా తుది ఫలితం అనుకూలంగా ఉంటుందన్న గ్యారెంటీ లేకపోవడం గమనార్హం. అయితే ఒక్క విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అబార్షన్‌కు సంబంధించి భారతీయ చట్టాలు కొంత ఉదారంగానే ఉన్నాయని చెప్పాలి. అయినా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, అబార్షన్‌లో అత్యుత్తమ విధానాల విషయంలో మాత్రం అంత గొప్పగా ఏమీ లేవన్నదీ సుస్పష్టం. గత ఏడాది ‘ఎక్స్’ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మధ్య జరిగిన ఒక కేసు విషయంలో వైద్యపరమైన చట్టాలను అవసరాలకు తగ్గట్టుగా అర్థ వివరణ తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు సూచించింది. ఆ కేసులో 24 వారాల వయసు గర్భంతో ఉన్న అవివాహిత మహిళకు అబార్షన్ చేయించుకునే హక్కు కల్పించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆ మహిళకు ఉన్న హక్కుల ఆధారంగా వైద్యపరమైన పరీక్షలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడం, ఎంటీపీ చట్టాలపై లక్ష్యాధారిత అర్థ వివరణ తీసు కోవడం గమనార్హం. మహిళల వాస్తవిక జీవన పరిస్థితులు, సామాజిక వాస్తవాలను అర్థం చేసుకుని మరీ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవాలి. అబార్షన్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్‌ను నేరంగా పరిగణించడాన్ని నిలిపివేయాలి. గర్భం వయసుపై పరిమితులు, ఇతర నియంత్రణలను కూడా తొలగించాలి. దీనివల్ల అందరికీ వివక్ష లేని అబార్షన్ సేవలు అందుతాయి. ఏ సమయంలోనైనా సురక్షితంగా గర్భాన్ని తొలగించేందుకు ఉన్న పద్ధతులను ఉపయోగించాలని కూడా ఈ మార్గదర్శకాలు సూచించాయి. అబార్షన్ పై అడ్డంకులు విధాన పరమైన అడ్డంకులుగా మారుతున్నాయనీ, ఏ రకమైన శాస్త్రీయ ఆధా రాలు లేనివిగా మారాయనీ కూడా అవి వ్యాఖ్యానించాయి. గత వారం జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్నల ముందు విచారణకు వచ్చిన కేసులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ తీర్పుతో విభేదించిన విషయం తెలిసిందే. ‘ఎక్స్’ కేసును ప్రస్తావించిన జస్టిస్ నాగరత్న గర్భం విషయంలో ఆ మహిళకు ఉన్న హక్కును గుర్తు చేశారు. మహిళ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ గర్భం అవాంఛితమైతే తొలగించుకునే హక్కు ఆ మహిళకు ఉందని స్పష్టం చేశారు. గర్భాన్ని కొనసాగించాలని కోరడం ఆ మహిళ ఆరో గ్యాన్ని పణంగా పెట్టడం అవుతుందనీ, ఇది ఆర్టికల్ 21, 15 (3)లను అతిక్రమించినట్లు అనీ వివరించారు. అయితే చివరకు ఈ మహిళకు ‘ఎక్స్’ మాదిరిగా అబార్షన్ చేయించుకునే అవకాశం కలగకపోవడం గమనార్హం. ‘ఎక్స్’ కేసులో అవాంఛిత గర్భం తాలూకూ ప్రభావాన్ని అర్థం చేసుకున్న కోర్టు... ఇంకో మహిళ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. అబార్షన్‌ను తొమ్మిది నెలల వ్యవహారా నికి పరిమితం చేసేసింది. అవాంఛిత గర్భం కారణంగా ఆ మహిళ కాన్పు తరువాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది గుర్తించకపోవడం దురదృష్టకరం. వాదనల సందర్భంగానూ న్యాయమూర్తులు, ప్రభుత్వం పలుమార్లు ఈ కేసుకు ఇతర కేసులకు మధ్య తేడాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. అబార్షన్‌కు గల కార ణాల విలువ ఒకరికి ఎక్కువ? ఇంకొరికి తక్కువగా ఉంటాయా? -వ్యాసకర్త బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ) బోధకులు -
న్యాయ పోరాటం! .. గ్రామంలో 144 సెక్షన్..
బరంపురం (ఒడిశా): యువతి తపస్విని దాస్, వైద్యుడు సుమిత్ సాహుల వివాహబంధం రోజురోజుకూ జటిలమవుతోంది. వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఒకే ఇంట్లో కొంతకాలం కలసిమెలసి జీవించారు. ఉన్నట్టుండి తపస్వినిని ఉన్నచోటనే ఉంచి సుమిత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్త రాక కోసం కొన్నాళ్ల పాటు వేచి చూసినా ఆమెకు నిరాశ తప్పలేదు. దీంతో మోసం చేశాడని భావించిన యువతి, బరంపురంలోని బ్రాహ్మనగర్ రెండో లైన్‌లోని భర్త ఇంటిని చేరుకుని ధర్నాకి దిగింది. తన భర్త తనకు కావాలని అభ్యర్థిస్తూ పెళ్లి బట్టలతో నిరసన చేపట్టింది. ఈ క్రమంలో ఆమెకి స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో బాధితురాలు కోర్టుని ఆశ్రయించి, తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇటీవల విచారణ చేపట్టిన బరంపురం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టు భార్యతో కలిసి ఉండాలని సుమిత్‌ని ఆదేశించింది. వారి వైవాహిక జీవితంలో వేరొకరు జోక్యం చేసుకోరాదని, భార్యాభర్తలిద్దరూ వేరేచోట ఒకే ఇంట్లో కలిసి ఉండాలని తీర్పు వెల్లడించింది. ఈ మేరకు సుమిత్ భార్యతో కలిసి ఉండేందుకు అంగీకరించాడు. చదవండి: (ప్రేమ పేరుతో తపస్విని వంచించిన డాక్టర్.. ఆపై..) గ్రామంలో 144 సెక్షన్.. మళ్లీ 6 రోజుల క్రితం భార్యని వదిలి సుమిత్ వెళ్లిపోవడంతో యువతి తన అత్తవారింటి ఎదుట మళ్లీ నిరసనకు దిగింది. తీవ్రమైన చలిలో వంటా వార్పు అక్కడే చేసుకుని, ఉంటున్న ఆమె పడుతున్న కష్టం చూసి, స్థానికులు చలించిపోయారు. మంగళవారం ఉదయం ఒక్కసారిగా సుమిత్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఇంటి ప్రధాన గేటు బద్దలు కొట్టి ఆ ఇంట్లో ఉన్న వారితో ఘర్షణకు దిగారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఆమె వెంట ఉంటామని హెచ్చరించారు. ఇరువర్గాల వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను సద్దుమణిగించారు. ప్రస్తుతం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో 144 సెక్షన్ విధించారు. -
ప్రేమ పేరుతో తపస్విని వంచించిన డాక్టర్.. ఆపై..
బరంపురం (ఒడిశా): కోర్టు తీర్పుతో తపస్విని దాస్, సుమిత్ సాహు జంట కలిసింది. వైద్యుడైన సుమిత్ ప్రేమ పేరుతో తపస్వినిని వంచించి, ఆపై కోర్టు సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి జరిగిన 7 నెలలకే భార్యని విడిచిపెట్టి సుమిత్ పరారయ్యాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం స్థానిక బ్రహ్మనగర్ రెండో లైన్‌లోని తన అత్త వారింటి ఎదుట ధర్నా చేపట్టింది. చదవండి: (వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..) బరంపురం ఎస్డీజేఎం కోర్టు నుంచి భార్య తపసిని దాస్‌తో కలిసి కారులో వెళ్తున్న సుమిత్ ఈ క్రమంలో బాధితురాలికి స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు అండగా నిలిచి, కోర్టులో కేసు వేయించారు. వీరి కేసు విచారణను శుక్రవారం చేపట్టిన బరంపురం ఎస్డీజేఎం(సబ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్) కోర్టు తపస్వినికి అనుకూలంగా తీర్పునిస్తూ భార్యతోనే భర్త కలిసి ఉండాలని తీర్పునిచ్చింది. అస్కా పట్టణంలో వేరే ఇంటిని అద్దెకు తీసుకుని నూతన దంపతులు జీవించాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలో వారిని ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నేతలు ఎవ్వరూ కలవరాదని కోర్టు కోరింది. చదవండి: (చున్నీతో ప్రియుడిని నడుముకు కట్టుకుని.. కాలువలో దూకి..) -
ఏపీ ఉన్నత మండలి కార్యాలయం స్వాధీనం
చాంబర్లను ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ ఉన్నత మండలి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కార్యాలయ భవనాలు, చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి చాంబర్లను తెలంగాణ ఉన్నత విద్యా మండలి గురువారం స్వాధీనం చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో ఏపీ ఉన్నత విద్యా మండలి మనుగడలో లేనందున తమ ఆధీనంలోకి తీసుకుంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొ.వెంకటాచలం, ప్రొ. మల్లేశ్, కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం తెలంగాణ విద్యామండలి కార్యాలయంలో సమావేశం అయ్యా రు. ఈ సందర్భంగా ఏపీ మండలి ఆధీనంలోని కార్లు, ఇతర ఆస్తులు తెలంగాణ మండ లి ఆధీనంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏపీ మండలి కొనసాగిన కార్యాలయాలు, భవనాలు, చాంబర్లు అన్నింటినీ పరిశీలించారు. ఇన్నాళ్లు ఏపీ మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి కూర్చున్న చాంబర్‌ను కూడా పరిశీలించారు. అనంతరం తెలంగాణ మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు, కార్యదర్శి అదే చాంబర్ నుంచి ఏపీ మండలికి సంబంధించిన అన్ని భవనాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఏపీ మండలిలో పనిచేసిన ఉద్యోగులందరితో సమావేశం అయ్యారు. కోర్టు తీర్పు ప్రకారం ఏపీ మండలి మనుగడలో లేనందున ఉద్యోగులంతా తెలంగాణ మండలి పరిధిలోనే పని చేయాలని ఆదేశించారు. ఇందుకు వారంతా అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. అయితే పాపిరెడ్డి ఏపీ మండలి చైర్మన్ చాంబర్‌లోని చైర్మన్ సీటులో కాకుండా సోఫాలో కూర్చుని మీడియాతో మాట్లాడడం గమనార్హం. ఈ విషయాన్ని లేవనెత్తగా.. ‘ఎలాగూ స్వాధీనం చేసుకున్నాం. పాత చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డికి మార్యదపూర్వకంగా ఓ మాట చెప్పి శుక్రవారం నుంచి ఆ సీట్లో కూర్చుంటా’ అని పాపిరెడ్డి పేర్కొన్నారు. అయితే అప్పటికే వేణుగోపాల్‌రెడ్డికి చెందిన అన్ని ఫైళ్లను సిబ్బంది బుధవారమే తరలించింది. అలాగే సాంకేతిక విద్యాభవన్లోని ప్రవేశాల కౌన్సెలింగ్ కార్యాలయాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. -
కోళ్లకు విషాదం.. కోట్లలో జూదం
అమలాపురం :కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నామన్న భయం లేదు. పోలీసులు హెచ్చరిస్తున్నారన్న వెరపు లేదు. రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో కోడి పందేలు నిర్వహించి తీరతామన్న వారు చివరకు అనుకున్నది సాధించారు. జిల్లాలో సంకారంతి పండుగ లో తొలిరోజైన బుధవారం యథేచ్ఛగా కోడి పందేలు నిర్వహించారు. ‘సంప్రదాయాన్ని గౌరవిస్తామనే’ రాజకీయ నాయకుల మాట బాగా నిర్వాహకులకు వంట బట్టినట్టుంది.. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పందేలు ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా మరిన్ని గ్రామాలకు విస్తరించాయి.జిల్లా అంతటా వందల చోట్ల నిర్వహించిన బరుల్లో కోడితలలు తెగిపడ్డాయి. పచ్చనోట్ల కట్టలు పెళ్లపెళలాడాయి. క్షణాల్లో లక్షల సొమ్ము చేతులు మారింది. తొలిరోజు జిల్లావ్యాప్తంగా ఇలా చేతులు మారిన మొత్తం రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. జిల్లాలో డెల్టా, మెట్ట, ఏజెన్సీ అనే తేడా లేదు, ఎక్కడ చూసినా పందేల సందడే. పందేలు జరిగే ప్రాంతాల్లో తిరణాళ్లను తలపిస్తున్నట్టు జనమే జనం. పందేల నిర్వహణకు కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉండడంతో అడ్డుకుని తీరుతామని పోలీసులు హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా పందేలు నిర్వహించే గ్రామాల్లో రాత్రంతా కాపలా కాసినా నిర్వాహకులు లెక్క చేయలేదు. ‘పచ్చ’ నాయకులపై నమ్మకంతో ఏర్పాట్లు యథావిధిగా కొనసాగించారు. అయితే ఉదయం పోలీసులు పందేలకు అంగీకరించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. పందేల నిర్వాహకుల్లో అలజడి నెలకొంది. హైదరాబాద్ స్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో అడ్డుకుని తీరతామన్న పోలీసులు పందేలు జరిగే ప్రాంతాలను వదిలి పోలీసు స్టేషన్లకే పరిమితమయ్యారు. ఉదయం పందేలు జరగకపోవడంతో మధ్యాహ్నం నుంచి బరులు పెంచి మరీ పందేలు నిర్వహించారు. కోనసీమలో పట్టపగ్గాల్లేని పందేలు కోనసీమలో పందేలు పట్టపగ్గాల్లేకుండా సాగాయి. అల్లవరం మం డలం గోడిలంకలో పందాలు జోరు గా సాగాయి. ఇక్కడ పందేలకు తొలుత రెండు బరులు ఏర్పాటు చేసి చేసినా ఉదయం జరగలేదనే వంకతో కొత్తగా మూడు బరులు వేసి, మొత్తం ఐదు చోట్ల పందేలు నిర్వహించారు. దీనితోపాటు ఇక్కడ 14 బోర్డులు పెట్టి గుండాటను, ఇతర జూదాలను యథేచ్ఛగా నిర్వహించారు. అక్కడ గుండాటలో కనీస పందెం రూ.500 గోడిలంకలో గుండాటలో రూ.500 తక్కువ కాయడానికి అంగీకరించలేదు. ఒక్కసారి ఆటకు రూ.ఐదు వేల వరకు పందెం కట్టడం గమనార్హం. కోడి పందేలు జరిగిన అనేకచోట్ల గుండాటలు, ఇతర జూదాలు ముమ్మరంగా జరిగాయి. ఐ.పోలవరం మండలం ఎదుర్లంకలో పందేలను ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆరంభించారు. ఇదే మండలం కేశనకుర్రులో పందేలు కోటి దాటినట్టు అంచనా. మలికిపురం మండలం మలికిపురం, గుడిమెళ్లంకలో పందేలు ముమ్మరంగా జరిగాయి. మామిడికుదురు మండలం మగటపల్లిలో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు అనుచరుల కనుసన్నల్లో పందేలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో తొలి రోజు పందెం రూ.కోటికి పైగా ఉండగా, రెండవ రోజు రూ.రెండు కోట్ల వరకు జరిగే అవకాశముందని అంచనా. ఇదే మండలంలో మేడపాడులో కూడా పందేలు జోరుగా సాగాయి. మెట్టలో రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలో తొలి రోజున రూ.75 లక్షల వరకు పందేలు కాశారు. పిఠాపురం వై ఎస్సార్ గార్డెన్స్‌లో పందేలను ఎమ్మె ల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ ప్రారంభిం చారు. దివాన్‌చెరువు నుంచి పా లచర్ల వెళ్లే దారిలో, కానవరం, తోకా డ, కల్వచర్ల, కిర్లంపూడి, వేళంకలో పందేలు జరిగాయి. రంపచోడవరం, తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజమండ్రి రూరల్, మండపేట, కాకినాడ రూరల్, రామచంద్రపురం నియోజకవర్గాల్లో సైతం పందేలు యథేచ్ఛగా సాగాయి. పందేలకు వ్యతిరేకంగా మగటపల్లిలో దీక్ష పందేల నిర్వహణకు వ్యతిరేకంగా మామిడికుదురు మండలం మగటపల్లికి చెందిన ముగ్గురు నిరాహారదీక్షకు దిగారు. సీనియర్ నాయకుడు బొలిశెట్టి భగవాన్‌తోపాటు మరో ఇద్దరు దీక్ష చేపట్టారు. పోలీసులు తక్షణం స్పందించి పందేలను అడ్డుకునేవరకూ దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు. పందేలను అడ్డుకుంటామని డీ ఎస్పీ ఎల్.అంకయ్య హామీ ఇవ్వడంతో విరమించారు.